గోగులపాటి కృష్ణమోహన్

My photo
కవి, రచయిత, జర్నలిస్టు.

Thursday, 19 November 2015

ఒంటరిగానే ఉన్నా


గోగులపాటి కృష్ణమోహన్, హైదరాబాద్.
శీర్షిక :  ఏకాకి జీవితం

ఏంటో అందరు ఉన్నా ఒంటరిగానే ఉన్నా...

బాల్యంలో అమ్న నాన్నలు క్రెచ్ ల్లో పెంచారు.
పెద్దయ్యాక చదువుల పేరుతో హాస్టల్లో ఉంచారు.
ఏంటో అందరు ఉన్నా ఒంటరిగానే ఉన్నా...

పెద్దచదువుల మోజులో నగరానికి చేరాను.
ఉద్యోగాల వేటలో విదేశం వెళ్ళాను.
ఏంటో అందరు ఉన్నా ఒంటరిగానే ఉన్నా...

సంపాదన పేరుతో ఇద్దరం ఉద్యోగాలు.
వారాంతం సెలవుల్లో ఇతరత్రా పనులు.
ఏంటో అందరు ఉన్నా ఒంటరిగానే ఉన్నా..

3 comments: