గోగులపాటి కృష్ణమోహన్

My photo
కవి, రచయిత, జర్నలిస్టు.

Wednesday, 18 November 2015

సహస్రకవిసమ్మేళనం

ముఖ్య గమనిక:-
దయచేసి క్రింద పేర్కొన్న వార్తను మీకు తెలిసిన విలేఖరి ద్వారా దిన పత్రికలలో వేసి సహస్ర కవి సమ్మేళనం అనే బృహత్తర కార్యక్రమ విజయాన్ని పలువురికి తెలియజేసేలా మీ వంతు సహాయ సహకారాలు అందించగలరని మనవి.
---------------------------------------------
    వినూత్న రీతిలో వాట్సప్ వేదికగా తెలుగులో సహస్ర కవి సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.  1000 కి పైగా సహస్ర కవులు పాల్గొని తమ కవితలను వాట్సప్ లో పోస్ట్ చేశారు.
 ఒకే రోజు అంటే నవంబర్ 18వ తేదీ బుధవారం ఉదయం 00.01 గంటల నుండి రాత్రి 12.00 గంటలవరకు వాట్సప్ వేదికగా నిర్వహించిన సహస్ర కవి సమ్మేళనం రోజును  తెలుగు కవితా వైభవం మనోల్లాసం అధ్యక్షులు శ్రీ మేక రవీంద్ర (హైదరాబాద్) గారు గణపతి శ్లోకంతో ప్రారంభించారు. 
‘ప్రపంచములో వివిధ ప్రాంతాలలో ( పట్టణ , గ్రామీణ ) నివసిస్తున్న తెలుగు కవులందరూ వాట్సప్ లేదా ఎస్ ఎం ఎస్ ద్వారా +91 9177059331 కు వారి పేరు, చిరునామా పంపి రిజిస్ట్రేషన్ చేసుకొన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతికవికి ‘సహస్ర కవి సంఖ్య SkNo’ కేటాయించారు.  వాట్సప్ ఎకౌంట్ లేని వారు కూడా జి మెయిల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని వారి కవితలను పంపారని రవీంద్ర చెప్పారు.
 ‘వాట్సప్’ లో జరిగే సహస్ర కవి సమ్మేళనంలో ప్రతి రోజు కవులు తమతమ కవితలను పోస్టు చేసుకోవడానికి వారి అభిప్రాయాలను పంచుకోవడానికి మంచివేదికని సమన్వయకర్త కృష్ణమోహన్  తమ అభిప్రాయం వ్యక్తపరిచారు.
అంతే కాకుండా సహస్ర కవిసమ్మేళనంలో పోస్ట్ చేసిన కవితలను ఒక సంకలనం రూపంలో తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కృష్ణమోహన్ తెలిపారు. ఈ కార్యక్రమం లో పాల్గొని విజయవంతం చేసిన  సహస్ర కవులందరికి వారు హృదయపూర్వక దన్యవాదాలు తెలిపారు.

ఇట్లు
గోగులపాటి కృష్ణమోహన్
సమన్వయకర్త,
సహస్రకవుల సమ్మేళనం
9700007653

No comments:

Post a Comment