గోగులపాటి కృష్ణమోహన్

My photo
కవి, రచయిత, జర్నలిస్టు.

Friday, 27 November 2015

నీలకంఠ గారి కమనీయ రత్నాలు

నీలకంఠ రావు, ఆదిలాబాద్.


*******************

****************

********************

********************

*******************

******************

********************

*******************

*************

**********************

****************

****************

******************

*****************

*******************

******************

*****************

*****************

*********************

*******************

*************************

*********************
********************
**********************

************
ఆ"వె"
వేలి ఉంగరమ్ము వెలది కడియమాయె, కడియమయ్యె మెడకు కంఠమాల, కంఠమాల జారి కటిసూత్ర మయ్యెను,  చెలియ విరహమందు చిక్కినపుడు.
****************************

452 నీలకంఠ ఆదిలాబాద్
అమృతమ్ము సేవింప నందరు సిద్ధమే,
కాలకూటము నాప కాన రారు.
పంచశరుని వింటి బానిసలందరు,
మదనాగ్ని నెవ్వరు అదుమగలరు?
మిన్నేరు తలనాప సన్నద్దు లెవ్వరు?
ముంతెడు నీటినే మోయలేరు.
చలికొండ నెవరైన కలకాలముందురా ?
చన్నీటి స్నానాలె సైపలేరు.

శుభములందరికిచ్చెడు సుందరుండు,
పిలచినంతనె రక్షింప బలుకువాడు,
పుష్పఫలతోయదమ్ముల పూజ చాలు
ఇంక నేమియువలదునా శంకరునకు
***************************

452 నీలకంఠ.ఆదిలాబాద్.
ఆ"వె"
అలుకగలిగెనేని,అదుముడి,గదుముడి
మౌనముద్ర వద్దు ఙ్ఞానులార
ఒక్క పలుకుబలుక చిక్కదా సమయము
స్పందనొకటి బలే సుందరమ్ము.
***********************

452-నీలకంఠ-ఆదిలాబాద్.
మనసునందు గలదు-మధురమైన జవరాలు
అలుక బూనెగాన-పలుకబోదు.
కనుల ఎరుపు బోదు-మనసున దయరాదు
అలుకదీర్చుటెట్లొ -తెలియ రాదు.
*************************

452-నీలకంఠ-ఆదిలాబాద్.
ఆముక్త మాల్యద సంస్కృతంలో కాకుండా తెలుగులోనే ఎందుకు రాస్తున్నారు నాధా అంటే రాయల వారెమన్నారు పద్యరూపంలోస?? ఆ"వె"
అల్లనల్లనెగిరి-పల్లవములమేసి
కూయు కోయిలమ్మ-కూతవోలె
వీణ రవము వోలె వీనుల విందైన
పలుకులున్న భాష-తెలుగు భాష
************************

452-నీలకంఠ-ఆదిలాబాద్.
ఆ"వె"
వేయి మంది కవుల వేదికనేర్పర్చి
మంచిజేసి  చూపె మనరవీంద్ర,
వేయి కన్నులున్న వేల్పుల రాజయ్యె,
రాయల మరపించి రాణమీరె.
**********************

452-నీలకంఠ ఆదిలాబాద్.
శీర్షిక: నా అర్దాంగి ( శ్రీమతి.శోభ)

నాదు సుతుల తల్లి నా కంటి  జాబిల్లి
నపపసంత శోభ నాదు శోభ
పుడమికున్న ఓర్పు పూజలందున నేర్పు
పుణికి పుచ్చుకున్న పుణ్య వనిత.

పైడి సూత్రమైతి పసుపు కుంకుమలైతి
కురుల యందు ముడువ విరుల నైతి
చేతి గాజులైతి చెవికమ్మలైతిని
ప్రతిగ నామె నాదు ప్రాణమయ్యె.
*************************

SK452, నీలకంఠ, టీచర్స్ కాలనీ ఆదిలాబాదు.
9440037012

శీర్షక: ఒంటరితనం (ఆసిఫాబాదులో)
సీస పద్యం.1
గతిలేకనేగదా గంటెచేతను బట్టి-వంటజేసికొనెడు వగపు గల్గె-గతిలేకనే గదా మతిమాలి బట్టల-నుతుకుకోవలసిన-నుసురు దగిలె-గతిలేకనే గదా-అతివకు దూరమై-ఒంటినై మంచాన నొరగ వలసె-గతిలేకనే గదా-సుతులను విడనాడి-ఏకాకినైపోయి-యేడ్వవలసె--
గతులు రాసెడువాడేల-కాకబూని,బతుకునంతయు గతుకుల-బొంతజేసె. చదువులమ్మ నీవైన-గదుమరాదె,భార్య శాసింప విననట్టి-భర్త గలడె.
***********************************

SK452
నీలకంఠ
టీచర్స్ కాలనీ ఆదిలాబాదు.
9440037012
శీర్షిక: అమ్మ! సీసపద్యం. 3

బ్రహ్మదేవునికెంత బహుముఖ ప్రజ్ఞయో-మగువ తనువులిట్లు మలిచినాడు-నటనమాడెడునట్టి కటి భాగమును  గర్భ శిశువున కూయల జేసినాడు-చిరుత ప్రాయమునున్న చిన్నితనయులకు కూర్చుండ నడుమును దీర్చినాడు-పసివాడు గ్రోలంగ పాలిండ్ల లోపల గోరువెచ్చని పాలు గూర్చినాడు

కంఠమున మార్దవమ్మును గలుగజేసి-దేహమున సుకుమారత పోహళించి-అమ్మ అణువణువందును కమ్మదనము-కలుగ జేసినతనికి నే కరము మోడ్తు.
*************************************

S K-452 నీలకంఠ,ఆదిలాబాదు.
9440037012
శీర్షిక: రైతు ఆవేదన
కంటినుండి వెడలు కన్నీటి ధారలు
స్రుక్కు చెంపలయందు సుడులు గట్టి,
మెడచుట్టు నిలుచుండి మెల్లగా నొరుగుచు
ఎదదాకి కిందికి యెగసిజారి,
నడుమున వేలాడు ముడుతలందున దాగి
కటినుండి బయలెల్లి కాళ్లు కడిగి,
పుడమిని దడుపగా పులకించెను మొలక
గంగమ్మ తల్లిరో గాంచుమింక,

శివుని జడలను వదలుమో చిన్నతల్లి,
నేలనురుగెత్తి పారుమో పాలపెల్లి,
రైతు విలపింప రాణించు రాజ్యమేది,
దేశసౌభాగ్య దాతయే దేవి యతఁడు.
***************************

S K-452 నీలకంఠ,ఆదిలాబాదు.
9440037012
శీర్షిక:
ఉవిద దేహమంత నవనీతమున జేసి,
మనసునట్లుజేయ మరచె ధాత
లోహము మగవాని దేహమందున జేర్చి,
మంచి వెన్ననెంచి మనసుజేసె.

మనసు దోచుకున్న మధురంపు జవరాలు,
అలుక బూనినపుడు పలుకబోదు.
కనుల ఎరుపుబోదు మనసున దయరాదు,
అలుకదీర్చుటెటులొ తెలియరాదు.
**************************

స.క.సం.452,నీలకంఠ-ఆదిలాబాద్.
శీర్షిక: వినాయక ప్రార్ధన.
ఆదిపరాశక్తి అమ్మయై లాలించి
జోలపాటలు పాడ జోగెనెవడు,
ఆదిదేవుండతి అనురాగ వశమున
చంకనెత్తుకొనంగ గారాము సల్పెనెవడు,
షణ్ముఖసేనాని చక్కని తమ్ముడై
చేదోడుగానుండ చెలగెనెవడు,
ఎలుక వాహసమున ఎల్ల లోకములను
అవలీలగా దిరిగి అలరెనెవడు,

అతడు విఘ్నాల దొలగించు ఆదిమూర్తి,
శుభములీయంగ ముందుండు సుందరుండు,
కవితలల్లెడు ఘనకీర్తి కలుగజేసి,
కరుణ మమ్మేలుమో బొజ్జ గణపతయ్య
*****************************

స.క.సం.452-నీలకంఠ-ఆదిలాబాద్.
{పుష్కరాలు.}

పాప భీతిలేక పాడు పనులు జేసి,
మనసునందొకింత మార్పులేక,
పుష్కరాల మునుగ పుణ్యంబు వచ్చునా?
ఎరుకలేని మాటలెవడు జెప్పె,

సాటి మనిషికింత సాయమ్ముజేయగా,
బాధ కలిగినపుడు ఆదుకొనగ,
పరుల మేలుగోరి పరమేశుఁ వేడగా
తీర్థ స్నానమపుడె సార్థకమ్ము.
**********************

452-నీలకంఠ-ఆదిలాబాద్.
శీర్షిక: ముసలివాని వగపు.
కం"
యవ్వనము తరిగిపోయెను
కొవ్వు పెరిగిపోవ పొట్ట గుండ్రగ నయ్యెన్
ఒవ్వని వారైరందరు
నవ్వుల పాలైతి బతుకు నాటకమయ్యెన్.

జుట్టూడి పోయెనక్కట
కట్టె కరమలంకరించె, కనుచూపుడిగెన్,
తిట్టెడివారే మిగిలిరి
నట్టేట ముంచి విడిచిరి, నమ్మినహారున్.

ఓయీ మిత్రమ! వినుమిది
కాయము శాశ్వితముగాదు గనుమీ నిజమున్
దోయిలి యొగ్గుదు పరిపరి
సాయి భజనజేయుమయ్య సాయము పచ్చున్.

గురుదేవా! కరుణించుము
బరువైపోయెను మనమ్ము బాధలతోడన్,
తరుణోపాయము జూపుము
శరణంబు జొచ్చితి తండ్రి శిరిడీ నాథా!
****************************

452-నీలకంఠ

పండితుడను గాను. పసిబాలుడను నేను,
ముద్దుమాటలివియె పెద్దలార!
తప్పులున్నయెడల తల్లిదండ్రుల వోలె
ముద్దుబెట్టుకొనుడు ముదముమీర.

శౌరి ముఖమునుండి శుభములనీయంగ
ఉద్భవించె గీత అద్భతముగ
బాధలన్నిదీర్చి భవబంధములబాపి
ఉన్నతులను జేసి ఉద్ధరింప.

ఆద్యుడైనవాడు ఆత్మస్వరూపుండు,
వేదవాక్కులందు వెలసినాడు.
సత్యమైనవాడు, సచ్చిదానందుడు,
చింతనంబుజేయ-చిక్కుతాడు.
***********************

452-Neelaknta-Adilabad.
శీర్షిక: అన్నా!
అన్నీఉన్నానడుమే
సున్నా,పల్వరుసమిన్నచుక్కలకన్నా,
అన్నాతి రూపుఁనెన్నగ
పున్నమి చంద్రుని తళుకుల పొలుపేమన్నా?
********************************

452-నీలకంఠ-ఆదిలాబాద్.
శీర్షక: బ్రాంతి.
జలతారు మేఘాల చరియించు జాబిల్లి
నేలకు దిగి ముందు నిలచినట్లు,
సురగంగ జలకాల శుచియైన రాయంచ
కనుల ముందు నిలచి కదిలినట్లు,
మధుర కూజితమల సుధజిమ్ముకోయిల
తరుశాఖలను దాగి చీరినట్లు,
ఆకాశ వీదిలో అలరు తటిల్లత
పంచజేరి పలకరించినట్లు,

చెలియ తలపులు కదలాడి చిత్తమందు,
భ్రాంతి కలిగించి ధ్యానమ్ము భంగపరచు.
మందభాగ్యుడ నాకెట్లు మంచి గల్గు,
పాడు మనసేలనో సాయి పట్టుదప్పు.
****************************
452-నీలకంఠ-ఆదిలాబాద్.
శీర్షక: మగువ మాట
కవులకేల పిచ్చి కవనమున బొగడ,
అందమందు ముందు అతివలంటు,
మానయనములందు మగవారిదే గెల్పు,
అందమందు వలపు చందమందు.

శంకమూదినట్లు స్వరమాధుర్యము.
వక్షమెంతొ ముద్దు, బారెడంత
కఠినమైన కండ కాయమందుననున్న
వెన్నవంటి హృదయమున్న వారు.

నాట్యమాడు నెమలి నయగారమునుజూడ,
పోరుజేయు కోడి పుంజు జూడ,
దుప్పిజూడ, జూలుదులుపు సింగము జూఢ,
ఆడజీవులందు అందముంద?
సత్యభామ సంధించే శరాలు ఇలా ఉంటాయేమో

కొంగు నడుము చుట్టు కుదురుగా బిగియించి,
పెదవి పంటనొక్కి వింటినెత్తి,
సత్యభామ వేయు శరలాఘవము జూచి,
మరల సోలెనేమొ మాధవుండు.
 ************************

452-నీల ఆదిలాబాదు,

శీర్షక: ఓ సాయీ!
నీదు గడప ముందునిలుచుంటినోసాయి
వట్టి చేతుల నను బంపబోకు
అడుగ వచ్చినాను అత్యాశపరుడను
జోలె నింపి బంపు జోగిరాయ.

తిట్టినా తమదయ కొట్టినా తమదయ
కసరి వెళ్లుమన్న కదలబోను
నిన్ను మరచి నేను నిలువ జాలగలేను
దీనబంధు నీవె దిక్కు నాకు.
*********************

452-Neelakanta-Adilabad.
శీర్షక: నేస్తం
చీకటున్న చోట చిరుదీపమును నేను.
వెలుగు వచ్చినపుడు వెళ్లి పోదు.
కష్టకాలమందు కాపాడ వస్తాను
సుఖములందు మిమ్ము చూడరాను.
***************************

452-నీలకంఠ-ఆదిలాబాద్.
 శీర్షిక: ఙ్ఞానోదయం.
భార్య రత్నమాల భ్రాంతిలో పడిపోయి
జపతపముల మరచె చదువు మరచె
అన్ని మరచిపోయి అతివతోడబలికె
లాలసమున జిక్కి తులసిదాసు.
*************************

మదన రాజ్యమునకు మహరాణిగాజేసి
సేవజేతు చెలియ చేయి కలుపు.
కాలహరణ మేల కామినీ దయజూపు
విరహమోపలేను వేగరమ్ము.

మోహమందు జిక్కి మురియు పతిని మార్చ
రాణమీర బల్కె రత్నమాల
యవ్వనమున మెరయు అందచందములన్ని
శాశ్వితములుగావు సమసిపోవు

తోలుతిత్తులగును బలిసిన చనుగవ
భారమోప లేక వంగు నడుము.
మూడు పదులు దాటి ముసలితనము రాగ
అందముండ బోదు అంతరించు.

మగువ దేహమంత మాంసపు ముద్దలే
మురియుటేల యిట్టి ముద్దలన్న
ప్రాణముండు వరకె వాటి సొంపుల జిగి
ఎండమావి సుఖము ఎరుగు మోయి.

విన్నవింతునోయి వినవోయి ప్రియసఖా!
రామవిభుని పైన ప్రేమ నింపు
లోకపావనంబు సకలపాపహరమ్ము
రామ విభుని చరిత రాయవోయి.

భార్య మాటలు విని భ్రాంతిని ఛేదించి
రామచరితమానసమును రాసె.
మంచి మార్గమందు మగలను నడిపించు
పుణ్య పనితలున్న పుడమి మనది.

స.క.సం.452,నీలకంఠ-ఆదిలాబాద్.
శీర్షిక: ఊర్మిళ
కం-
ధార్మికుడైన పతిన్గని,
కూర్మినెపుడు బాయకుండ కుదురుగనుండన్,
కార్ముకము హస్తమందిడి,
ఊర్మిళ విన్నపము జేసెనుద్వేగముగన్.

ఆ.వె.
కన్నులార్పకుండ అన్న రాముని సేవ
చేసెనన్న ఘనత చెన్నుమీర,
నీదు నిద్రనంత నా దేహమునజేర్చి,
జాగరిల్లుమెపుడు జగము మెచ్చ.

పుస్తెగట్టునపుడు మునివేళ్లు తాకగా
మనసు పులకరింత మరచిపోను.
పాదములకెరుపగు పారాణిజెడకుండ
నీవు వచ్చువరకు నిదురపోదు.

శిరమునుంచినట్టి జిలకర బెల్లము,
కురులగూర్చినట్టి విరులదండ,
మైనలంకరించు మైదాకు పూతలు
వాడకుండు నీవు వచ్చువరకు.

కలలోన నీదు కమనీయమగు రూపు
గాంచుచుందునెపుడు వాంఛితముగ
యోగ నిద్ర నీ వియోగము మరపింప
విరతినొంది నేను వేచి యుందు.

పవ్వళించియుందు పదునాలుగేడులు
తావిగోలుపోని పూవువోలె
దివ్యమైన నీదు దేహ  పరిమళంపు
గాలి సోకగానె మేలుకొందు.
మిత్రులు సి.విజయ్ కుమార్ గారికి అంకితం


అయుత కవితా యఙ్ఞం

తెలవారక ముందరనే
ఇలు ముందర చితుకులేసి, ఇంపుగ మంటల్
వెలిగించి, తాత మనమలు
చలిమంటలు కాగునట్టి సంస్కృతి బోయెన్.

అట్టలు,కాగితములు,మసి
బట్టలు,ప్లాస్టిక్కురేకు, వాసన డబ్బల్,
గుట్టలుగా దొరకునిపుడు
చిట్టి పుడక లేవి మంట జేయగ నయ్యో!


మోహము వదలిన వాడును
దేహపు తత్వము నెరింగి తిరిగెడు వాడున్
దేహీయనబోడెప్పుడుస
సోహమ్మను మాట బల్కు శుభములు గలుగన్. అయుత


కవితా యఙ్ఞం

చల్లని చలికి వణంకుతు
అల్లము ఘుమఘుమల చాయ నాస్వాదింపన్
ఉల్లము ఝల్లనిపించద
కల్లైపోద చలి బాధ కాదంటారా ?


శీర్షిక: భగ్నప్రేమికుడు.
ఆ'వె'
ఎందుకో తెలియదు ఎదలోన కదలాడు
తీయనైన బాధ మోయులేను.
నీదు ఙ్ఞాపకాలె నిలచి కలచెనేమొ
నన్నువిడచి వెళ్లినందుకేమొ.

తలపులందు నీవె కలలలోనను నీవె
ఎచట తరచి జూడ నచటనీవె.
బిచ్చగాళ్లు నన్ను బిచ్చగాడుగ జూడ
పిచ్చివాళ్లు నాకు పిచ్చియనిరి.

నిన్నుతలచి తలచి నీరసపడిపోతి
కఠిన హృదయురాల కరుగవేల.
కంటనీరు రాక కనురెప్పలోనాగె
నీదు వీథి పెద్దనిదుర బోదు.


శీర్షిక: శివహరి పుత్రా!
అయ్యప్ప సామి శరణము,
చయ్యన అరుదెంచి మాకు సాయముగావే,
జియ్యయి గర్వము నాశము
జెయ్యన్ వేడెదనునిన్ను శివహరి పుత్రా!


శీర్షిక: తుమ్మెద.
సీ"
తుహిన తుంపరలందు త్రుళ్లి జలకమాడె
సుమబాల తనువెంత సుందరమ్ము.
సందె వెలుగులందు చక్కగా వికసించె
విరిబాల సొగసైన విరి దళములు
తలచినంతనెజాలు తనువెల్ల పులకించు
పూబాల వెదజల్లు పుష్పరజను
ఎంత గ్రోలిన నేమి సంతృప్తియేలేదు
ననబాల దాచిన తేనెధార

మాయదారి తుమ్మెదతన మనసునందు,
దాచినట్టి యీ మోసపు తలపులన్ని,
తెలిసికొనలేక తనలోని తేనెలిచ్చె
నమ్మరాదిట్టి తుంటరి తుమ్మెదలను.


🍺 మధువనంగ సాఖి, మధురంపు జవరాలు,-
కొంత సరసమాడి సంతసించు,-
మరులుగొన్నయెడల మైమరపించేసి,
కీలు బొమ్మజేసి కీడుజేయు.


శీర్షిక:చదువుల తల్లికి జేజే
కం-
చదువుల తల్లికి జేజే,
పదములకిదె వందనమ్ము పదసంపదకై,
యెదయందున యెల్లప్పుడు
పదిలముగానిలచి మంచి పలుకులనిమ్మా!

వాణీ! పల్లవ పాణీ!
వీణా రాగముల బాడి విరించి మనమున్
యేణాక్షీ! గెలచి హృదయ
రాణీయై వెలసినావు రమణీయముగా!

సరళములగు పదసంపద,
సరసములై వెలయు భావసంపదలీయన్,
సరసీరుహ వాసిని, బా
సర పీఠనిలయ ! మదంబ ! సరగున రావే!


వినాయక ప్రార్ధన.
ఆదిపరాశక్తి అమ్మయై లాలించి
జోలపాటలు పాడ జోగెనెవడు,
ఆదిదేవుండతి అనురాగ వశమున
ముద్దుచేయు నపుడు మురిసెనెవడు,
షణ్ముఖసేనాని చక్కని తమ్ముడై
చేదోడుగానుండ చెలగెనెవడు,
ఎలుక వాహసమున ఎల్ల లోకములను
అవలీలగా చుట్టి అలరెనెవడు,

అతడు విఘ్నాల దొలగించు ఆదిమూర్తి,
శుభములీయంగ ముందుండు సుందరుండు,
కవితలల్లెడు ఘనకీర్తి కలుగజేసి,
కరుణ మమ్మేలుమో బొజ్జ గణపతయ్య


ఆయుత కవితా యజ్ఙం
తేది:28.12.2015
కవిత సంఖ్య :1
కవి పేరు: నీలకంఠ, ఆదిలాబాద్
కవితా శీర్షిక: చంద్రశేఖరన్న అయుతచండీయాగం
అంశం: చండీయాగం

కవిత: ఆ'వె'
చంద్రశేఖరన్న శంఖనాదము జేసి,
దేశప్రజల కొరకు దీక్షబూని,
చక్కనైన నిష్ఠఁ చండి యాగము జేసె
విస్మయమును జెంద విశ్వమంత.

సర్వ జనావళి సుఖమును
శర్వుని వలె గోరితీవు, చక్కని నేతా
సర్వఙ్ఞా నీ యాగము
పర్వముగా ముగిసె నీకు వందనమిదిగో!

వానలు దండిగ గురియను
ఆనక పంటలను జూడనానందముతో
చానలు దీవెనలీయగ
మానెలు జాలవు కొలువగ మడిలో పంటన్

ప్రకృతి పరవశింపగ యీ
సుకృతము నొనరించినట్టి సూర్యుడ వీవే
ప్రకృతము నీ ఘన కీర్తులు
అకృత్రిమమై వెలుగుగాక ఆకసమంతై..


1.మానమేమిలేని మంచి మనిషి.

వరదదెబ్బపలన పాడాయె ఊరంత
ప్రాణమిత్రునింట పడతి ఆగవలసె,
పరులు నిందలేయ వలదనె పతి, యను
మానమేమి లేని మంచి మనిషి.

సమస్యా పూరణం:      ఆ'వె'

పంచకావ్యములను పరికించనేలేదు,
శబ్ద కోశములను చదువలేదు.
ప్రజలు మెచ్చగాను పద్యాలనల్లెద
పండితుడనుగాను పామరుడను.


సమస్య:1 సత్యహరిశ్చంద్రుడే యసత్యము బలికెన్

నిత్యము దైవారాధన,
మృత్యువు దరిజేరియున్న మీరడు హద్దుల్
సత్యము నిపుడే బల్కుము,
సత్యహరిశ్చంద్రుడే యసత్యము బలికెన్.


సమస్య: 2.ఆకుల దినగానె మేక 'అంబా 'యనియెన్.

ఏకాకియై యడవిలో
మేకొక్కటి జాలిగొల్ప 'మే మే'యనగా,
ఆ కాళి దయతోనిచ్చిన
ఆకుల దినగానె మేక 'అంబా 'యనియెన్.

సమస్య: 3.పట్టపగలు చందమామ పైకగుపించెన్.

పుట్టములనార బెట్టగ
గట్టున చంద్రాస్య జూచి గమ్మున బలికెన్
గుట్టైన మాట జెప్పద,
పట్టపగలు చందమామ పైకగుపించెన్.

శీర్షిక: తుమ్మెద.
సీ"
తుహిన తుంపరలందు త్రుళ్లి జలకమాడె
సుమబాల తనువెంత సుందరమ్ము.
సందె వెలుగులందు చక్కగా వికసించె
విరిబాల సొగసైన విరి దళములు
తలచినంతనెజాలు తనువెల్ల పులకించు
పూబాల వెదజల్లు పుష్పరజను
ఎంత గ్రోలిన నేమి సంతృప్తియేలేదు
ననబాల దాచిన తేనెధార

మాయదారి తుమ్మెదతన మనసునందు,
దాచినట్టి యీ మోసపు తలపులన్ని,
తెలిసికొనలేక తనలోని తేనెలిచ్చె
నమ్మరాదిట్టి తుంటరి తుమ్మెదలను.

సమస్య: సినిమాలను చూడవచ్చె శివసతి యిలకున్.
కం.
తనువుఁ మరచి శివుడాడన్,
ఘనమగు రుద్రాక్షమాల కంఠము వీడన్,
చనిదెమ్మన, సుందరహా
సిని, మాలను జూడవచ్చె శివసతి యిలకున్

పబ్బమురళి గారి పద్యాల జోరును,
పరుగులెత్తు యతని ప్రతిభ తీరు,
వర్ణనమ్ముజేయ వాక్కులే సరిపోవు
అందెవేసినాడు ఛందమందు.


సమస్య.
ఒక్కరితో నలువురాడ ఓర్వంగలమా!
(బ్రహ్మతో చదరంగమాడుతు)
చక్కని తల్లి సరస్వతి
నిక్కము బల్కె తన నాథునిగెలిచి"నీనల్
దిక్కుల తలలన నలుగురు
ఒక్కరితో నలువురాడ ఓర్వంగలమా!


సమస్య.
ఒక్కరితో నలువురాడ ఓర్వంగలమా!
(బాల భారతం)
ఒక్కడు భీముండొకదిశ
తక్కిన పాండవులొకదిశ తాడును లాగన్
అక్కసుతో భీముండనె
ఒక్కరితో నలువురాడ ఓర్వంగలమా!


సమస్య.
ఒక్కరితో నలువురాడ ఓర్వంగలమా!
(బాల రామాయణం)
ఓక్కడు తండ్రి దశరథుడు
చక్కని తనయులు  నలువురు చర్చలుజెయన్
స్రుక్కిన దశరథుండసె
ఒక్కరితో నలువురాడ ఓర్వంగలమా!

1 comment: