గోగులపాటి కృష్ణమోహన్

My photo
కవి, రచయిత, జర్నలిస్టు.

Wednesday, 18 November 2015

సంజీవునిమాట సత్యమూట



SK 509
ఐలేని సంజీవరెడ్డి
భువనగిరి

చప్పట్లు మెప్పులే చాలు ఈ కవులకు
బాగుంది అంటెనే పొంగిపోదురు
కల్మషము లేనిది కవి హృదయమేనురా
సంజీవునిమాట సత్యమూట

తాను నిద్రకాచి తనయులను లాలించి
తాను పస్తులుండి బిడ్డలకు వడ్డించి
తల్లి త్యాగమే తనయులకు రక్షరా
సంజీవునిమాట సత్యమూట

హితము కోరెవాడె రచయుత కావాలి
నవసమాజ నిర్మాత రచయుతేరా
రాజుకన్నా కీర్తి రచయుతకు కలుగురా
సంజీవునిమాట సత్యమూట

మారిన కాలంతో మారాలి సోదరా
మార్గమింతకన్న లేదు మనకు
అభివృద్ది లేకుంటె అంతమైపోమా
సంజీవుని మాట సత్యమూట

ఆలు బిడ్డల కన్న అన్న దమ్ములకన్న
తల్లి చెల్లికన్న తండ్రికన్న
స్మార్టు ఫోను నీకు తెగ మక్కువాయెరా
సంజీవుని మాట సత్యమూట

రామనామము మించి రమ్యమైనది లేదు
రామభక్తి కన్న ముక్తి లేదు
రామ నామమంటే మరుజన్మ లేదురా సంజీవుని మాట సత్యమూట

కూడు, గూడు, గుడ్డ లేనప్పుడెవరికి
కులము గుర్తురాదు గుణము తప్ప
ఆ మూడు సమకూర అన్ని గుర్తువచ్చు
సంజీవుని మాట సత్యమూట

బుద్దు వీర కృష్ణ గుంపులో ఉండగా
గుంపు వెలుగు వారి గుణముచేత
సూర్య చందృలచేత జగతి వెలుగొందదా
సంజీవునిమాట సత్యమూట

సెల్లుఫోను చూడ చిన్నగనే ఉండును
ఆఫ్షన్లు చూస్తే అదిరిపోవు
సెల్లు లేని నరుని సిల్లీగా చూసేరు
సంజీవునిమాట సత్యమూట

కవులు కవులు కలసిన కవితలే వచ్చు
సమయమేదైన చక్కగాను
మలయజాముల క్రింద సువాసనే వచ్చు
సంజీవునిమాట సత్యమూట

ఆత్మ తృప్తి కన్న అధికమేదిలేదు
అరటిపండు కన్న మేలు లేదు
మంచి స్నేహితులకన్న హితులెవరు లేరయా
సంజీవునిమాట సత్యమూట

రాగిసంకటైన రాజ బోజ్యమైన
తింటె అరిగిన వాడె శ్రీమంతుడు
ఆరోగ్యమును మించి అధికమేదియు లేదు
సంజీవునిమాట సత్యమూట

కొండవలస నేడు అన్ని విడిచి పోయె
తెలుగు చిత్రసీమ చిన్నబోయె
హాస్య చక్రవర్తి అమరుడైపోయెరా
సంజీవునిమాట సత్యమూట

ఐతె ఓకె అంటు అమరుడైపోయెరా
కొండవలస జగతి వీడెనేడు
అమరేంద్రునికి తన నవ్వులు పంచగా
సంజీవునిమాట సత్యమూట

రాలి బూడిదయ్యావా రాజయ్య కోడలా
పాపమూ గృహహింస తాళలేక
చిన్నారులు కూడా చిద్రమయ్యిరి కదా
సంజీవునిమాట సత్యమూట

వందలాది కవులు వేలాది కవితలు
వాట్సప్ వేదికై సాగుచుండ
అధ్బుత దృశ్యము ఆవిష్కృతము కదా
సంజీవునిమాట సత్యమూట

పద్యరచనమే ప్రాణమని తలిచేటి
కవులార
స్వాగతం సహస్ర సమ్మేళనమునకు
వాట్పపే వేదికై సాగాలి మనమంతా
సంజీవునిమాట సత్యమూట

ఆరోగ్య కార్డులు అమలు కాకపోయె
ఇచ్చినహామీలకు దిక్కులేకపోయె
సాగుతుంది నౌకరి సతమతమవుతూ
సంజీవునిమాట సత్యమూట

తల్లి త్యాగములేక తనయుడెవడూ లేడు
భువిపైన ప్రతిజీవి తల్లివరమే
త్రిమూర్తులకైన స్త్రీమూర్తె జీవము
సంజీవునిమాట సత్యమూట

శిష్యుడే గురువయ్యె చిత్రమే మరి యిది
తెలుగు బాషను తెగ నేర్చెనితడు
అభ్యాసము తోడ అభివృద్ది కలుగురా
సంజీవునిమాట సత్యమూట

విలువలేనిచోట వినరెవరు నీ మాట
మంచి చెప్పినకూడ కించపరుచు
చెవిటివాని ముందు శంఖమూదిన వృధా
సంజీవునిమాట సత్యమూట

రావిచెట్టుకాడ రాత్రుళ్ళు కూర్చోని
ముచ్చట్లు పెట్టింది గుర్తుకొస్తుంది
మళ్ళెప్పుడొస్తాయి ఆనాటి రోజులు
అడుగుతున్న కృష్ణ ఆన్సరివ్వు

ఆత్మ విశ్వాసము కంటే అధికమేదియు లేదు
నమ్మకము తోడనే నవ్య పధము
అబ్యాసముంటేనే అభివృద్ది సాధ్యము
సంజీవునిమాట సత్యమూట

కందిపప్పు చూడ రెండు వందలాయె
మినపపప్పు దాని చెంతచేరె
పప్పుదినుసులు నేడు పసిడి తీరాయెరా
సంజీవునిమాట సత్యమూట

4 comments:

  1. సంజీవ రెడ్డి సార్ బాగున్నయ్ పద్యాలు.!

    ReplyDelete
  2. సంజీవ రెడ్డి సార్ బాగున్నయ్ పద్యాలు.!

    ReplyDelete
  3. లింగారెడ్డి గారికి దన్యవాదాలు

    ReplyDelete
  4. లింగారెడ్డి గారికి దన్యవాదాలు

    ReplyDelete