భారత్ భాషా భూషణ్, కవితిలక "డా. తిరునగరి" గారు మన సహస్ర కవిసమ్మేళనం ను అభినందిస్తూ అందించిన కవితా మాళిక....
🌺 "సహస్ర" కు చందనాలు 🌺
కవిలోకానికి ఆశాదీపం
" వాట్సప్" అంతర్జాలం
వారి సాహితీ దిధీస కు తార్కాణం
సహస్ర కవిసమ్మేళన సంరంభం
ప్రాచీన కవితపై వాట్సప్ కు గౌరవం
ఆధునికతకు రెండు చేతులా వాట్సప్ ఆహ్వానం.
అందుకే వాట్సప్ వేదిక
పాత, కొత్తల మేలు కలయిక
పద్యమైనా, గేయమైనా వచనమైనా, పదమైనా
రసరమ్యంగా ఉండాలన్నది...
కదిలేది కదిలించేది కావాలన్నది...
వాట్సప్ సదాశయం.. వాట్సప్ సాహిత్య లక్ష్యము .
" లోకాన్ని విడిచి వెళ్ళేలోగా ఈ లోకాన్ని ఎంతో కొంత సుందరంగా మార్చాలన్నది నా ఉద్దేశ్యం అన్నాడు శివరామ కారంత్"
లోకానికి నీవు రాసేది ఏదైనా మేలు చేకూర్చాలన్నది కవి ప్రవరకు వాట్సప్ మెస్సేజ్.
సహస్ర కవిసమ్మేళనంలో పాలుపంచుకునే
కవులకు అభివాదం, కవయిత్రులకు నా అభివందనం...
ఇంతటి బృహత్తర సాహిత్య యజ్ఞాన్ని నిర్వహిస్తున్న వాట్సప్ నిర్వాహక మండలికి అభినందనలు
సహస్ర కవి సమ్మేళన మేళనకు సహస్ర వందనాలు.
మీ
భారత్ భాషా భూషణ్, కవితిలక.
డా. తిరునగరి
(మొబైల్ అనువాదం గోగులపాటి కృష్ణమోహన్, హైదరాబాదు, sk326)
No comments:
Post a Comment