పద్మజాభిరామ వినుర గౌతమా
M. Rama buddhudu, Hyderabad.
"మరా,మరా-రామ,రామ"
మరా,మరా, యని మీరు పలికి
రామ,రామ,యని మాతో పలికించి
మోక్ష మార్గానికి
అతి సూక్ష్మమార్గం కనిపెట్టిన
యోగీ,తపస్వీ,ఆదికవీ,వాల్మీకి మహర్షీ
అందుకోండి నా సహ(జ)కవుల వందనాలు
మా సహస్ర కవుల అభినందనాలు
"ఏ విధి గీసిన గీత ఫలితమో"-1
ఏ విధి గీసిన గీత ఫలితమో
మీ అపురూప సన్నిధి వదలి
"వినువీధిలో "(విమానంలో)
ఈ వింత దేశానికి విచిత్రంగా
ఎగిరి వచ్చాను,వచ్చింతరువాత
వగచిన ఏమి ఫలము,మీ వలపులు,ఆముద్దుల పిలుపులూ
ఎంత దూరమో అర్ధమయ్యే లోపునే, అంతా అయిపోయింది
అందనంత దూరం చేరింది
సంతోషమో సంకటమో
ఏమీ తెలియటంలేదు
సర్దుకుపోవటమే సమాధానమయ్యింది
మీ ముద్దుమాటలను
మురిపాల మూటల్లో కట్టి
మోసుకుంటూ, కాలాన్ని
దాటుతున్నాను,రోజు రోజునూ
లెక్కబెడుతూ,రాబోయే ఆరోజు
కోసం ఎదురు చూస్తున్నా,
అంతకంటే ఏంచేయగలను
ఇంతకంటె ఏం రాయగలను
M.Rama buddhudu,SK-336.
"పిచ్చివాన్నే"-2
మిత్రమా!
మనం విడిపోయిన ఆరోజు
కడపటి వీడ్కోలుప పలికినపుడు
మనిద్దరి మధ్యరాలిన
ఆ కన్నీటిబిందువులు
నీకు గుర్తున్నాయో లేదో?
కానీ!
అనుక్షణం అవి నన్ను
వెంటాడి వేధిస్తున్నాయి
స్నేహమనే తెల్లని గులాబీపై
చల్లగా కురిసిన
ఆ హిమబిందువులకు
ఖరీదు లేదనుకున్నా
కాలం మారిపోయి"పన్నెండేళ్ళకు"
పరవశంతో మళ్లీ నిన్నుకలిసినపుడు
వాడిపోయిన మన గులాబీపై
ఆవిరైన ఆ బిందువుల మరకలను
చూసి,మురికి పట్టిన మనస్నేహం
మరెన్నటికీ శుభ్రం కాదని తెలిసి
హ్రుదయ భారంతో వెనుతిరిగి
వచ్చాను
క్రుళ్లి క్రుళ్లి చచ్చాను
అయినా మిత్రమా!
ఎందుకో?
ఆ బిందువులు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి
ఇప్పటికీ అలా వేధిస్తూనే ఉన్నాయి
ఇపుడు చెప్పు
నేను ఖచ్ఛితంగా
"పిచ్చివాన్నే" కదూ?
రామ బుద్దుడు
Sk.no. 336. కవిత సంఖ్య-4
"చైతన్యం"
మానవత్వం మంట కలిసినచోట
నైతిక విలువల వలువలూడ్చేచోట
నన్ను నిలబెట్టి
నా చైతన్యాన్ని
సమాధి చేసుకోమంటున్నారు
నేను
మనిషినై కూడా!
మానవతావిలువల
మహత్తు తెలిసికూడా
నా చైతన్యాన్ని నరికేసుకుంటూ
నా ఉత్సాహాన్ని ఉరితీసుకుంటూ
బ్రతుకలేను
చావో,బ్రతుకో
ఆవిలువల పోరాటం కోసమే
బ్రతుకుతా
లేకపోతే చస్తా
కానీ నన్ను నేను
సమాధి చేసుకుంటూ
స్వార్ధపు పునాదులమీద
నా జీవిత సౌధాలను
నిర్మించుకోలేను
నా కోసమే నేను
బ్రతుకలేను
"కొండ" " వలస" పోయాడంటారు
"ఐతే ఒ.కె"
ఆ డైలాగు రూపాన
అందరి గుండెల్లో
అతనుండలేదా?
మునిమాపునొచ్చినా(లేటుగా)
మూడొందల చిత్రాల్లో
మునకలేశావంట
ఎపుడొచ్చామనికాదు
ఎంత చేశామనేదే ముఖ్యం
స్వర్గానికి "వలస" వెళ్ళిన
కొండవలసా
రంభ,మేనకలతో,జాగ్రత్త
"ఐతే ఒ.కె" అంటే
అటూ,ఇటూ వెళ్లలేక
అక్కడుండలేక మళ్ళీ వస్తానంటే
మే"మైతే ఒ.కె"
"అనుబంధం" కవిత 5
బంధం అనుబంధం
"అన్నా" అనకున్నా అలాసాగే
అనురాగ బంధం
అనుపమాన బంధం
"అన్నీ"అనుకునే బంధం
"అన్నా"అనుకునే బంధం
"చెల్లీ"అనకున్నా "చెల్లే" బంధం
ఈ "చెల్లే" ఆ బంధం
అదే అందరి జీవితాలకందం
సుదీర జీవిత పయనంలో
సుగంధాల పరిమళం
పుట్టిన రోజుల్లో పురివిప్పే ఆనందం
తట్టిన ఎదలలొ తళుకుమనే
అనుబంధం
నిండు నూరేళ్ళు నీ ఓర్పుతో
"పండు" సంసారం కడు నేర్పుతో
కలకాలం జీవించు యశస్సుతో
మనసారా దీవిస్తా ఆశీస్సులతో
"అమ్మా అమ్మా "
అమ్మా అమ్మా
నేనిక్కడున్నానే,నేనిక్కడున్నానే
నిలువెత్తు నీ కొడుకును
నీ కంటికి దూరంగా
నా బ్రతుకు భారంగా
ఇక్కడున్నానే,ఇక్కడున్నానే
బహుదూరపు దేశంలో
బ్రతుకుతెరువు పాశంలో
నీ కోసం కలవరిస్తూ
ప్రతి క్షణం పలవరిస్తూ
కానరాని కన్నీరతో
కనిపెంచిన నేరంగా
నేనిక్కడున్నానే,నేనిక్కడున్నానే
నీవు పోసిన లాలలను
నీవు పాడిన జోలలను
నాకోసం నీవు పడిన బాధలను
అంతులేని నీకరుణ గాథలను
ఒక్కొక్కటీ గుర్తుకు తెచ్చుకుంటూ
ప్రతి ఒక్కటీ నా గుండెల్లో
గుచ్చుకుంటూ
నీ బ్రతుకంతా చీకటి నింపిన
నా బ్రతుకు హీనత్వం
ఏమని చెప్పను?
ఎలా చెప్పను?
ఇదిగో క్షమించున
ఇలాగే దీవించు
నేనిక్కడున్నానే
"బోయవాని"
బోయవాని చేతిలోని బాణం
కలంగా మారి
కవులందరకూ బలం చేకూరిన
వైనం
చిత్రమయా నీ చరితం
భరత ధాత్రి చేసుకున్న పుణ్యఫలం
వర్ణ,వర్గ భేదాల భారతమా
గమనించూ! గతచరితం
ఆనాడే ఆదికవిగ గుర్తించిరి వాల్మీకిని
ఆ కావ్యమే మన సంస్క్రతి ప్రాణమై నిలిచింది
ఈ ఘటనతో చెప్పదలచె
దేవుడు మనకొక్కటే
కులంవద్దు,మతంవద్దు
నడకొక్కటె నరుడికి ముఖ్యమని
అదితప్పితె "నరుడే" వానరుడని
అమ్మ ఙ్ఞాపకాలలో
(కృష్ణమోహన్ మాతృమూర్తి)
ఆమె చిన్నికళ్లలో చిద్విలాసమైన"జ్యోతి "
ఆమె నగుమోములొ చెరగని "నవ్యా"నందం
ఆమె ఆదరణలో "అఖిలా"
నందం
అన్ని ఆనందాల ఆమె పయనం
దివ్యధామాల"క్రిష్ణా"నందం
అమ్మ స్మృతిలో అరమోడ్పుకనులతో
ఈ బుద్ధానందం
" పండుగ దీపావళి "
కాలుష్యం గురించి కథలు చెప్పను
సౌండ్ పొల్యూషన్ గురించి పొయట్రీ చెప్పను
అన్నిటినీ గురించి అరచి (సౌండ్ పొల్యూషన్) చెప్పను
చెప్పేదొకటే
నలుగురితో ఆనందం
పదుగురితో సంతోషం
మిఠాయలతో తియ్యని దీపావళి
పిండి వంటలతో కమ్మని దీపావళి
వేయి వెలుగులతో వెచ్చని దీపావళి
కొత్త అల్లుళ్ళ కోరిక దీపావళి
చిచ్చర పిడుగుల చిందుల దీపావళి
బోసినవ్వుల(వ్రుద్ధుల)భద్రత దీపావళి
తల్లిదండ్రుల బాధ్యత దీపావళి
అందరి నవ్వుల అల్లరి దీపావళి
ఇదే కావాలి మనందరకూ
ఎందుకంటే
ఎన్ని చెప్పినా
ఏదీ ఆగదు
ఎవరు చెప్పినా
పండుగ ఆగదు
ఆగని ఆనందం అందుకుందాం
అందరి సంతోషం పంచుకుందాం
"అందరి దీపావళి"
నిరుపేద దీపావళి రూపాయల్లో
పేదవాడి దీపావళి పదుల్లో
మధ్య(తరగతి)వాడి దీపావళి వందల్లో
పెద్ద తరగతి వాడి దీపావళి వేలల్లో
తరగని సంపదున్నవాడికి లక్షల్లో
చీకటిని చీల్చడానికి, వెలుగులు
నింపడానికి
ఇన్ని పాట్లు పడుతున్నా
చీకటెప్పుడూ పారి పోలేదు
వెలుగెప్పుడూ వెంట పడలేదు
చీకటి వెలుగులు సహజమనుకుంటే
ఆకలి దప్పులూ సహజమే కదా
అందుకే
పదులైనా(రూపాయలు)
పేదవారికి పంచుదాం
ఆ పసినవ్వులను మన ఇంట్లో
"దీపాలుగా" వెలిగిద్దాం
అదే "అందరి దీపావళి"
అదే అసలయిన దీపావళి..
"నా కవిత "
బాల్య చపలత్వం బ్రద్ధలయి
సుందర స్వప్నంబు చిధ్రమై
అథః పాతాళమున ఆశదాగి
అసందర్భ జివనగతిలో వేగి వేసారి
కఠిన కాళ రాత్రుల మౌన ఘోషలకు
తెగిన హ్ర్రదయ తంత్రుల రక్త భాషలకు
అక్షర రూపమిచ్చి
అదే నా కవితంటే
వ్వధా జీవన గతులపై
అవస్థలతో,కువ్యవస్థలో
కుహనా సంస్కృతిలో
కుచించుకు పోయింది
"నా కవిత "
ఇంకెక్కడుంది దాని ఘనత..
"వేదనా తరంగం"
నా కళ్లు నీ కళ్లు
కన్నీటి పొరలతో మసకలు కమ్మినపుడు
మన ఇద్దరి శరీరాలు దూరమై
రెండు హ్రుదయాలు భారమై
అప్పటి ఆ క్షణాలు ఘోరమై
కాలమంతా దుఖభరితమై
వదలలేక,వదలలేక
నిను వదలి కదలి వచ్చిన
ఆ రోజున నీ వ్యధా భరిత
మోములోని వేదనా తరంగం
నా గుండెను ప్రతిక్షణం గ్రుచ్చుతూ
మన విరహాన్ని గుర్తు చేస్తున్నది
మళ్ళీ మన యిద్దరి కలయిక కోసం
అణువణువూ కళ్లు చేసి
అహరహమూ ఆశ నింపి
అలాగే ఎదురు చూపుతో
ఎగసి పడుతున్న దుఖాన్ని
ఎదలో అదిమిపట్టి
నిన్ను నా ఎదలో దాచుకునే
ఆ క్షణం కోసం
మనం ప్రేమపొదలో ఒదిగే
ఆ క్షణం కోసమే కలలు కంటూ
కఠినమైన ఈ కాలాన్ని కన్నీటితో
ఈదుతున్నా
కాలవేగాన్ని కరుణ గేయాలతో
కరిగిస్తున్నా
లేటు గురించి మాటలేల నాపాట్ల
గురించి తెలియలేరా ఇంటిలోన
ఆలి,అమ్మల కథ మీరెరుగరా
అసలు టైము లేదు వారి పరిచర్యలే కదా ముఖ్యం
మధ్య,మధ్యన మాయమవుతా
మీ మాటల మధ్యలో ఎంటరవుతా
ఏమిసేతురా క్రిష్ణా వీర,సంజీవ,రామన్నకు,వివరించు
నా బాధ రామ,రామ అన్న తొలగలేదు బాధ సాయిరామ అన్న
తరగలేదు బాధలగాథ
"హే ప్రియా"
నీ సన్నిధిలో కూర్చొని
అద్భుతమైన నీ సౌందర్య రసాస్వాదనలో మునిగినపుడు
నీ అనంత సౌందర్య కిరణాలు
ఈ నిరుపేద చీకటి హ్రుదయాన్ని
తాకినప్పుడు
అనిర్వచనీయ అనుభుతాత్మకత
అలలా ఆవరించి
తణువు పులకితమై
అణువణువూ ఆనంద విహంగమవుతుంది
మ్రుధువైన నీ పెదాలనుండి
వెలువడిన
అర్థ రహిత శబ్ధ తరంగాలైనా
సరే
నాకు అనంతకోటి సంగీత సరాగాలై
వీణుల విందు చేస్తాయి
నీ ఆరాధకుడనైనందుకు
ఈ జన్మ ధన్యమయింది
మరుజన్మ ఉంటే
నీ ప్రియ సఖుడనవుతా
ఆ సహచర్యంలో,సాన్నిహిత్యంలో
సకల చరా చర స్రుష్ఠినీ సున్నితంగా
త్రోసిపుచ్చు
"నీవే,నీవే,నీవే"
నీవెక్కడని గట్టిగా అరచాను
"మౌనమే"సమాధానం
నీవు లేవని బిగ్గరగా అరచాను
అదే "మౌనం" సమాధానం
నీవిదిగో అని రెట్టింపుతో అరుస్తున్నా
మళ్లీ "మౌనమే"
ఇపుడు నాకు స్పష్టంగా తెలిసింది
"మౌనమే" (మౌనులే)
"మహితాత్మ" యని
ఎందుకంటే?
పరిణామం నాకే పరిమితమని
అపరిణామ,అపరిమిత,
అనిర్వచ,అవ్యక్త,అగమ్యగోచర
"అనంత హేతువు "
" నీవే,నీవే,నీవే"
"ఓ కవితా,కవితా"
నా తల్లి (కూతురు)అడిగింది ఓ కవిత
అక్షరాలతో అవనినంత పరచి
"అభిఙ్ఞ"ను ఆహ్లాద పరచాలని
చూశా
అఘాతమున దాగిన
ఒక్కో అక్షరం
ఒయ్యారమొలికిస్తూ
ఓ కవితగా మారితే
ఆ కవితను నా ఘనతగా చెప్పాలని చూశా
ఎంతకూ రాని ఆకవితను
ఏమి?ఏమి? అని అడిగా
"రాను,రాను" అని చెబుతూ
మారాం చేస్తున్న ఆ కవితకు
"రాం,రాం" చెబుతూ
సెలవు తీసుకుంటున్నా
"బుద్ధిగా"
నా కొలువు(పని)చేసుకుంటున్నా
"భగవంతుడా"
బాలల మోములో దాగున్న "భగవంతుడా"?
నీవక్కడ ఎందుకు చిక్కావో
నాకు తెలుసు
ఎందుకంటే?
అక్కడ మా కుట్రలు,కుతంత్రాలు
చెల్లవు
అక్కడ మా కక్షలు,కార్పణ్యాలు
చెల్లవు
చెల్లేదొకటే
ఆట,పాట,మాట
ముద్దు మురిపాల బాలల చూస్తే
అన్ని (చిత్త) వ్రుత్తులూ ఆగి పోతాయి
వారి ముందు
ఎంత పెద్దలయినా పిల్లలవుతారు
అన్నీ మరచి ఆ లోకంలో "బొమ్మలవుతారు"
అందుకే
నీవక్కడే దాక్కో
మమ్మల్నిలాగే లాక్కో
ఈ"స్రుష్ఠి" చిత్రం అదే కదా!
నీ "స్రుజన"కర్థం అదే కదా!
"మూడు నామములు "
మూడు నామముల ముచ్చటతో
ఏడు కొండలనెక్కి
ఎంత కష్ఠము పడితి
మూడు క్షణములు కూడ
ముందుంచలేదు
ముచ్చట పారలేదు
మురిపము తీరలేదు
ఎన్ని మారులు వచ్చిన
ఏమి సుఖము
ఒక్క క్షణము కూడ మ్రొక్కనీరు
ఒకింత సుఖము దక్కనీరు
"రెండు చరణాలు "
ఆనంద డోలికల తేలుచూ
అన్నమయ్య పాడగ
అంత బాగ వింటివే
ఇంతలోనేమయ్యె
వింత వెంకయ్య
నా పాట వినిపింప
గొంతు సరిచేస్తే
లోగొంతున ఏదో
గొణుగుతున్నావు
సక్కంగ చెప్పలేక
సణుగుతున్నావు
మోమాటమేలయ్య
మొదటనే చెప్పయ్య
మొండివాడను గాను
మోటువాడను గాను
మొరనాలకింపమని
మొత్తుకుంటున్నా
మెత్తగా వింటేను
నీ"రెండు చరణాల"
హత్తుకొని
"రెండు చరణాలు "
వినిపిస్తా
ఆభరణాలు అర్పింప
అంత వాడను కాను
అద్భుత గానాల వినిపింప
అన్నమయ్యను కాను
అసలు సిసలైన మొద్దును
అన్నెమెరుగని నీ "బుద్ధు"ను
"స్నేహ దాహం"
ఓ మ్రుధు మధుర సుందర సున్నిత
పుష్పమా
సంస్కారపు ప్రణయోల అద్భుత
విహంగమా
వికటించిన విభుని లీలావినోద
విధి వంచిత విచిత్ర చక్ర బంధిత
సుగంధమా
హద్దులెరుగని అమర ప్రేమిత శోభిత శశాంకమా
హ్రుదయ శోధిత మనః పీడిత విఫల తపః ఫలితమా
పరిహసించే శాపమా
పల్లవించిన శోకమా
హ్రదయ ఘోషా,మౌన భాషా,
స్వేచ్ఛా పిపాస
దుఖః బాధిత దురంతమా
ప్రళయ శిథిలపు ప్రకోపమా
వింతగొలిపే విన్నపమా
భ్రాంతి చెందిన భరతమా
శాంతి కోరే చంద్రమా
చంద్ర కాలపు చలువమా
పురుష కోరల,పరుషపారల
విషపు వర్షల హ్రదయ గాయపు
రుధిర ధారలప్రళయ కాలపు
విళయ ఘోషల
వింత దాడుల కెదురు నిలచి
బీడు వారిన క్షేత్రమా
మోడువారిన ప్రియతమా
మోడువారిన మొదలు నరికిన
నేస్తమా
ఆశలూరే భవిత కోరే భ్రాతమా
మందగించిన మసక మబ్బులు
మరుని తలపున వలపు మెరుపులై
వసంతపు వర్షలై
సంతోష స్వోత్కర్షలై
మోడు చివురై చివురు మొగ్గై
మొగ్గ పుష్పమై పుష్పంబు
ఫలమై
ఫల వ్రుక్షమై వ్రుక్ష శాఖలై
శాఖోప శాఖలుగా
శాంతి సౌఖ్యాలు వెదజల్లుతూ
శశిరేఖలుదయించి
చంద్రహాసం చేయనీ
నా స్నేహ దాహం తీరనీ
"రైతన్న"
గాలిలో దీపంలా నీవు
ఎగతాళికి ప్రతి రూపంగా
నీ బ్రతుకు
చస్తున్నావెందుకని నేనడుగను
చావొద్దని కూడా నే చెప్పను
ఎందుకంటే?
నీచావుకు కారణాలు మాకుతెలుసు
చావొద్దని నేను చెబితే
నీవు నిండుగా బ్రతుకడానికి
భరోసా నేనివ్వలేను
అప్పుల కుంపటిమీద
కూర్చున్న వాడికే
అర్థమవుతుంది ఆ నరకం
అప్పుచేయక నీ బ్రతుకు లేదు
అప్పుచేస్తే నీ బ్రతుకే కాదు
చావైనా చెబుతుందా పరిష్కారం
చస్తే నమస్కారం చేస్తారు
తప్ప
పురష్కారాలెవరూ (డబ్బు)ఇవ్వరు
కడుపు "నింపుతున్న "క్రుషీవలునికే
కడుపు "నిండుకున్న"వైనం
ఎందరు చూసినా ఎవరు
చూపిస్తారు పరిష్కారం
ముద్దాయిల లిష్టు చదువుతా
బడుద్ధాయిల పేర్లు చెబుతా
ఏమిలాభం
ఎవరూ స్పందించని వైనం
వానలివ్వని వరుణుడా?
వరదలిచ్చే దేవుడా?
నకిలీ విత్తనాల నరుడా?
మధ్యదళారీ మలినుడా?
కనికరం లేని బ్యాంకరా?
కసాయి ప్రభుత్వమా?
ఒక్కటి మాత్రం నిజం
నీవొక్కడివే చస్తున్నావనుకుంటున్నాం మేము
నిన్ను చంపుకుంటే
మమ్మల్ని మేం చంపుకున్నట్టే
మమ్మల్ని మేం చంపుకుంటే
మన సమాజం చచ్చినట్లే
చచ్చిన ఈ సమాజాన్ని లేపటం
ఎవరివల్లా కాదు
అందుకే నీవు ముందు వెళ్లు
మేమందరం నీ వెనకే చస్తాం
ఇవ్వాళా?రేపా?
నేనైతే చెప్పలేను
కానీ ఖచ్చితంగా
చావు మాత్రం"గ్యారంటీ"
"కడుపు కోత"
ఆరు కాన్పుల కష్టము
అవలీలగా భరియించి
అందరాడపిల్లలకు అమ్మనయ్యాను
కళ్లలోన బెట్టి కన్నెల చేశాను
అయ్యచేతిలొ బెట్టి అత్తనయ్యాను
అల్లుడంటే కొడుకని మురిసి పొయ్యాను
పిల్ల బ్రతుకును గూర్చి మరచి పోయాను
అంతలోనే కూసె "అపశకున పక్షి"
"ఆరళ్ల" బాధతో నాతల్లి క్రుళ్లింది
క్రుళ్లు,క్రుళ్లున వళ్లు క్రుసియించి
పోయింది
కూతురూ బ్రతుకంతా క్రుంగిపోయింది
చిట్టితల్లీ మనసు చితికి పోయింది
బ్రతుకంటే భయముతో చిన్నబోయింది
ఏమి చెప్పుదు నేను "ఏడుకొండలవాడ"
ఏడుపే బ్రతుకాయ
ఎన్నెలే(వెన్నెల) కరువాయె
మింగ మెతుకులు బోవు
ఉన్న బ్రతుకులు కావు
కన్న కడుపుకోత
కరుణతో తీర్చయ్య
కన్నబిడ్డ రాత
కాసింత తీర్చయ్య
"నిజంగా "
నిజంగా సిగ్గులేదు మాకు
నిజం!
నిజంగానే సిగ్గు లేదు మాకు
మతమే మా మనుగడకు
ప్రాణం అనుకుంటున్నాము
కులమే మా ప్రగతికి
బలమనుకుంటున్నాము
తర తరాల తగాదాల
రక్తపుటేరుల్లో స్నానము చేసిన
పునీతము కాలేదు
పుచ్చి పోతోంది ఇంకా
పుణ్యభూమి యని పులకిస్తూ
పొంగి పోయే పిచ్చివాళ్లమే మేము
ధన్య భూమియని ధ్యానించే
దగా కోరులం మేము
పవక్తలు,పండితులు
మహర్షులు, మహాపురుషులు
సంస్కర్తలు,సహనశీలురు
సమస్తం మా ఆస్తిగా
పుస్తకాల పుటలలో బంధించాం
అందుకే
బహిరంగంగా భజాయిస్తున్నాం
మతతత్వపు ఢంకా
మతపు పిడికిలిలో
మారణాయుధం సంధించాం
తల్లి లేదు, పిల్లలేదు
మంచిలేదు,చెడులేదు
అంతా మాకు సమానమే
విచక్షణారహితంగా
విల్లునెక్కుపెట్టి
వీధి,వీధిలో వదిలాం
వధా,వధా,వ్యధా వ్యధా
ఇదే కదా మా పరిపూర్ణ గాథ
మాకెందుకిక బాధ
ఇదే మావినోదం
ఇదే మా విహారం
ఇది మాకు ఆహారం
కావాలి మరి అహరహం
సిగ్గులు వదిలేశాం
మతాల పెగ్గులు బిగించాం
ఉన్మత్త మత్తులో తేలుతున్నాం
విచిత్ర జగత్తులో
విర్రవీగుతున్నాం
ఆగదు మా మారణ యఙ్ఞం
తీరదు మా దారుణ త్రుష్ణం
తడి ఆరని రక్తపు బట్టలు
మాకిష్టం
అందుకే
ఇలా మళ్ళీ, మళ్లీ తడుపుకుంటున్నాం
మా కాలాన్నిలా గడుపుకుంటున్నాం
మీ అభిప్రాయాలు తెలియజేయండి
ReplyDelete