గోగులపాటి కృష్ణమోహన్

My photo
కవి, రచయిత, జర్నలిస్టు.

Wednesday, 18 November 2015

సహస్ర కవి సమ్మేళనము - వాట్సప్ వేదిక

SK 326
గోగులపాటి కృష్ణమోహన్,
సూరారం కాలని, హైదరాబాదు.

సహస్ర కలములు కదలియాడెడు వేళ
కవిసమ్మేళనం కనులార వీక్షించ
వాట్సప్ వేదికై వర్దిల్లనున్నది
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

సహస్రకవులకు స్వాగతంబిదే
నవ శకానికి నాంది పలుకంగ
వాట్సప్ వేదికై విజయమ్ము కాంక్షించ
నవ్యాఖిలమ్ములో జ్యోతికృష్ణా

అదిగదిగోపద్దెనిమిది
అదిగో వచ్చేస్తుందీ అందర మొకటై
ఇదిగో కవిసంఖ్యిదిగో
ఇదిగో వేయై నదనగ నిక కదలండో!!
............................
గుడిపల్లి వీరారెడ్డి Sk no 305
....................................

యాగము తల పెట్టె నొకడు
వేగమె తా పంచెనొకడు యజ్ఞఫలంబే
భోగము రాసిన వారిది
వేగమె చేరగ సహస్రం వేసెదమడుగుల్
.....................
గుడిపల్లి వీరారెడ్డి ( SK 305 )
.......................


SK79
దివాకర శాస్త్రి
వికారాబాద్

 సాహితీవనమునసాహిత్యగోష్టులు
వేలకవులచేత ఆలపించ
సమసమాజహితముసాధింపచేయగ
పూనుకొనిరినేడుపుడమిమెచ్చ

SK79
దివాకర శాస్త్రి
వికారాబాద్

వేదికమనకికవాట్సాప్
కాదనకుండకదిలించుకరములటైపింగ్
పద్దెనిమిదితారీఖున
సాధించాలికసహస్రసమ్మేళనమున్...!

No comments:

Post a Comment