గోగులపాటి కృష్ణమోహన్

My photo
కవి, రచయిత, జర్నలిస్టు.

Saturday, 21 November 2015

పర్యావరణ ప్రియుడు " పాత్ధసారధి నాయిడు "


          పార్థసారథి నాయుడు దగ్గుపాటి, చిత్తూరు
                             94409 95046
                     .......................................
*అయుత కవితా యజ్ఞము*
సహస్ర కవి - 0412
దగ్గుపాటి పార్థసారథి నాయుడు
+91 9440995046
dpsnaidu@gmail.com

డిప్యూటి ఫారెస్టు రేంజి ఆఫీసరు (రి)
చిత్తూరు
కవిత శీర్షిక సంఖ్య - 32
తేది : 14 - 02 - 2016

               శీర్షిక పేరు
      " స్వఛ్ఛ భారతము "   (ఆటవెలదుల తోట - శతకము)            
ఓమ్ అరణ్యంతే పృథ్విస్త్యో నమస్తు
          *****
ప్రకృతి సహము సుందరము ఊపిరియును
జీవజాలములకు జీవగర్ర
ప్రకృతి స్వచ్ఛము పరబ్రహ్మస్వరూపము
స్వచ్ఛ భారతమ్ము సర్వమున్ను.
                  2
మనసు పరిసరాలు మతి శరీరము యిల్లు
ఐదు సహజ స్వచ్ఛమమరు తోడ
స్వస్థత పెరుగునిల స్వర్గము దలపించు
స్వచ్ఛ భారతమ్ము సాధనమగు.
                3
అవని అమ్మకగు మహావిశ్వరూపము
అమ్మ బుల్లిరూపమగును భువికి
ఇద్దరమ్మలెనయయిన ప్రేమ మూర్తులు
స్వచ్ఛ భారతమ్ము సర్వ హితము.
                  4
పుడమినమరి యుండు కడవోని ప్రకృతి
పంచభూతములతొ నంచితముగ
జీవముద్భవించె చెలువమ్ములనొంద
స్వచ్ఛ భారతమ్ము వలయు దెలియ.
                  5
జీవముద్భవించి వైవిధ్యమైయొప్పి   వృక్ష జంతు జాల వివిధములతొ
పరిమిళితమయుంది పర్యావరణమంత
స్వచ్ఛ భారతమ్ము వలయు దెలియ.
                  6
ప్రకృతి కూడియుండు పర్యావరణమంత
గతులు దప్ప బ్రతక గాదు భువిన
చివరికంతమగును జీవము భూమ్మీద
స్వచ్ఛ భారతమ్ము వలయు దెలియ.
                  7
కల్మషములు లేని కరుణామయ ప్రకృతి
బ్రతుకు వనరులున్న భాగ్య సీమ
వనరులూడ్చ రాదు వాడుకో మితముగ
స్వచ్ఛ భారతమ్ము సాధ్యమునకు.
               8
 ప్రకృతి కలుషితమవ పర్యావరణమిల
చెడును సంతులనము క్షీణమొందు  
బుుతుల కాలధర్మమతలా కుతలమౌ
స్వచ్ఛ భారతమెటు సాధ్య మగును?
                 9
కృత్రిమములు భువికి కీడులనెంచును
పరిసరాలు నిండు పంకిలాలు
పంకిలములు పెరుగ భ్రష్టమౌ  వనరులు
స్వచ్ఛ భారతమ్ము వలయు దెలియ.
                 10
మంచి జరుగునెపుడు మనసు మంచిగనుండి
కాయమందులకు సహాయమివ్వ
మనసు వాక్కు కాయ మన్వితమొందగ
స్వచ్ఛ భారతమ్ము సాధ్యమగును.
                  11
 పుడమి తమ గృహమని పూజనములు జేసి
ఇల్లు వోలె నిర్వహించ వలయు
తల్లి కాళ్ళదన్నితగలేయ కాలేవు
స్వచ్ఛ భారతమ్ము వలయు దెిలియ.
                 12
వాస్తవములు తెలియు వరకిట జెప్పెద
పుడమి మీద జనులు స్ఫురణ నొంద
జరుగుతున్న పగిదులెరుగ జేయదలతు
స్వచ్ఛ భారతమ్ము సాధ్యమునకు.
                  13
పొగడజాలనెవరినెగవేసుక రాను
ఉన్నదున్నటులె విన్నవింతు
తరతమమను భావమరమరికలు లేక
స్వచ్ఛ భారతమ్ము సాధ్య మునకు.
                 14
ఉన్న అడవులన్ని అడుగంట ఊడిచి
వేళ్ళతోడ లోడి వెళ్ళబెరికి
అవక తవక జేయు అవినీతి పనులతో
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                   15  
అడవులన్ని యేట హద్దు పద్దులు లేక  
దుష్ట జనుల చేత దురితముగను
 కాల్చబడుతునుండ కాపాడుటలులేక
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                 16
గత ఇరువదియైదు  కాలవత్సరముల    
నాటినట్లు జెప్పు కోట్ల మొక్క
లందు లక్షకొకటి లభ్యమవదునేల
స్వచ్ఛ భారతమెటు  సాధ్య మగును?
              17
ఇజము గాదు నేను నిజము జెప్పునదంత
నిలువ గలను ఎట్టి విలువకైన
చర్యలేవి లేవు పిర్యాదు లెన్నివ్వ
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
               18  
స్వచ్ఛమందు దైవ సంస్థితముండును
స్వచ్ఛమందునుండు వైభవమ్ము
కల్మషముల చోట కారాడు దేవుడు
స్వచ్ఛ భారతమ్ము సాధ్యమవదు.
                19
బరువగునని యెంచి బండరాయిగనున్న
ప్రగతి జూడనెట్టులగును భువిన?
బండరాయిగూడ బరువును మోయును
స్వచ్ఛ భారతమ్ము వలయు దెలియ
                  20
కాళ్ళుచేతులిరిచి కీళ్ళను దొలగించి
మేళ్ళుజేతు మేము మీకటనెడి
అర్థ రహితమైన వ్యర్థ సంక్షేమాల
స్వచ్ఛ భారతమెటు  సాధ్యమగును?
                    21
ఇచ్చవచ్చినట్లు ఎచ్చటంటెనచట
పరిసరాల నిండ భ్రష్ట రీతి
చెత్త పారవేయ చేటగు చివరకు
స్వచ్ఛ భారతమెటు సాధ్య మగును?
               22
చెత్తనూడ్చవచ్చు చీపురు కట్లతో
చిత్తములను నున్న చెత్త విడక
జగతినుద్ధరింప జరుగదెపుడునూ
స్వచ్ఛ భారతమెటు  సాధ్య మగును?
                    23
పాలు పెరుగు నెయ్యి పప్పులు నూనెలు
ఉర్వినందలి పలు ఉరువులెల్ల
తెలుసు కొనగ లేక కలితీలవుతండ
స్వచ్ఛభారతమెటు సాధ్య మగును?
                  24
ప్రభుత యేది యైన భ్రష్టములే దప్ప
చక్కగొక్కడైన చనుట లేదు
క్రిందనుండి పైకి అందరూ దొంగలే
స్వచ్ఛ భారతమెటు సాధ్య మగును?
                  25
పైసలందకుండ పనులేవి జరుగవు
ఒక్కటైన మచ్చుకొక్కటైన
ఎమ్ము ఆర్పి లేని వెలయాలయాలతో
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                  26      
రైతు పతనమునకు  వాతావరణ మార్పు
శాపమగుచు నుంది సకల దశల
నాశ హేతువైన నాబర్ద పనులతో
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును
                27
దుండగులధికార్ల అండతోనడవుల
నొదలకుండ దోచి ఊడ్చుతుండ్రు
అడవులందు దోపిడాటలె ఎటుజూడ
స్వఛ్ఛ భారతమెటు సాధ్యమగును?
                  28
స్మగ్లరడవి యందు మారి రాళ్ళగరుమ  
పరిగి ఖాకి దుస్తు పరుగులిడగ
చేతుపాకులన్ని సిగ్గుతో తలవంచె
స్వఛ్ఛ  భారతమెటు సాధ్యమగును?
                  29
ఉక్కు పదము మోపి తొక్కేము స్మగ్లర్ల
మారు మోగు డాబు మాటలివ్వి
ప్రజల మభ్య పెడుతు పదివత్సరాలుగా
స్వఛ్ఛ భారతమెటు సాధ్యమగును?
                  30
ఊపిరినెగబీల్వ ఉదరముబ్బునెగాని
పొట్ట నిండదెపుడు బువ్వ లేక
మాట గారడీల ఫలితమేముండును
స్వచ్ఛ భారతమ్ము సాధ్యమెటుల?
                  31
భ్రమల కల్పన వాక్య వమనముల తోడెప్డు
స్వఛ్ఛ భారతమును  బడయ గాదు
ఆచరించ వలయు గోచరమొందుచూ
స్వఛ్ఛ భారతమ్ము సాధ్య మునకు.
                  32
అడవి యాజమాన్యమదియొక భ్రష్టము
కాటు వేయు భువికి చేటుదెచ్చు
అవకతవక ఒక్క అటవి శాఖయె గాదు
స్వఛ్ఛ భారతమెటు సాధ్యమగును?
                  33
అడవి దోచిపెట్టనతి సమర్థులయిన
వారు మటుకె అందు వాటమైన
స్థానములలొ అటవి శాఖ యందుందురు
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                  34
అడవి ఖనిజములకాలవాలము నిజము
అడవి యందు ఖనిజమూడ్చి వేసి
సహజ వనములెల్ల జంపి దోచుచునుండ
స్వచ్ఛ భారతమెటు సాధ్య మగును?
                 35
సహజ వనము యిల్లు సర్వజాలములకు
అటవిధానమందునరయ దెలియు
పడుపు సొమ్ముల కొరడవుల పడకేయ
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                  36
ఖనిజ దోపిడులకు కళ్ళె మేయాల్సిన
ప్రభుత పెద్దలంత పనివహించి
దొడ్డి దారి పనుల దోహద పడుతుండ
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                  37
"స్వచ్ఛ భారతం"టు పచ్చని మొక్కల
మిషనుల దొలిచేసి మిసిమి జేసి
శుభ్ర పరచితిమని సొమ్ముజే కొంటుండ
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                  38
అటవి చట్టమమలు అపహాస్యమైపోయె
దుండగులకు మంచి అండ పెరిగె
నేతలునధికార్లు   నీతులు విడిచిరి
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                  39
నిధుల వరదలు అవినీతి ఉప్పెనదెచ్చె
కర్ర కట్టలేవి కానరావు
ఉన్నకట్టలున్ను భిన్నమై పోయెను స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                  40
నేర స్మృతిన ఇట్టి పేరు గలద?
నేరములను తప్పుదారి పట్టిస్తుండ
స్వచ్ఛ భారతమెటు సాధ్య మగును?
                  41
నేతలునధికార్లు  నేరస్తులనుబెంచి
పోషియించ నెంచి పూర్తి గాను
ముడుపు కొరకు అడవులూడిచి దోయ
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                    42
నేర పరిది తెలియనీయ కుండుటకే
స్మగ్లరులధికార్లు సంఘటీంచి
అడవులన్ని కాల్చి బూడిద జేసేరు
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                43
హద్దు పద్దు లేక అవని భారతమంత
వెలను గట్టలేని విలువలన్ని
పరిహసించి దాట పగలు రాత్రి యనక
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                  44
అడవినందొకపుడు అల్లంత దూరాన
ఖాకి దుస్తు గనిన గగ్గురు పడి
పరువులెత్తువారు తరుముతున్నరు నేడు
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                  45
అడవినందు బయట అడుగు వారలు  లేరు
పరవదోలి మరియు ఎరలు వేసి
విషము బెట్టి చంపి వేటాడ వలలతో
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                  46
జైలు ఖైదిల వలె "జూ"లు జాలములకే
వన్య మృగములన్ని బంధితమయి
చిప్ప కూడు దింటు జీవచ్ఛవములయె
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                  47
సహజసిద్ధ ముగనె ఇహమున పుట్టుచు
జీవజాలములిల చేవనొందు
రక్ష సేయ చెట్ల ప్రకృతి పుట్టువముల
స్వచ్ఛ భారతమ్ము సాధ్యమగును
                  48
నాటు చెట్టులనుట నాటకమైపోయె
దొంగలంత  జేరి దోచుకొనుచు
ఉన్న మొక్కలనును ఊడ్చివేస్తున్నారు
స్వచ్ఛ భారతమ్ము సాధ్యమగును.
                  49
చెట్టు నాటమనుట చట్ట బధ్ధమె తప్ప  
పాటి సేయ గాదు మాట వరకె
నాటి నట్లు జూపి కోట్లు దోస్తున్నారు
స్వచ్ఛ భారతమెటు సాధ్య మగును.
                  50
 మొక్కలందరున్ను పుడమినాటగ కాదు
వ్యవసితమ్ములైంగికభావన న విధము లేక
మొక్కనాట పిదప మొక్కవోకుండాలి
స్వచ్ఛ భారతమ్ము సాధ్యమునకు.
                  51
ఎర్ర చందనమ్ము ఎక్కువ నాళ్ళిక
దోప్డి జరుగ బోదు దోయిడయ్యి
అడుగు అంటి పోయి అంతరించి పోయేను
స్వచ్ఛ భారతమ్ము వలయు దెలియ.
                 52
అమలు గాని చట్ట మక్రమార్కులపాలు
భ్రష్ట రీతులికను ప్రబలజేయు
ఇతరులెవ్వరిన్ని బ్రతకనీయక జంపు
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును
                  53
హక్కులెన్నొయున్నదక్కవు జనులకు
అమలు పరుచు వారె అక్రములవ
పర్యవేక్షణ నిఘ తుర్యమై పోయెను స్వచ్ఛ భారతమెటు సాధ్య మగును?
                  54
ప్రాణమిచ్చు చెట్లు ప్రకృతిచ్చినవరాలు
చెట్లు అంతరించ జీవముడుగు
ఉర్వికంత చెట్లు ఊపిరి తిత్తులు
స్వచ్ఛ భారతమును బ్రతుకనిచ్చు
                  55
 వనము రక్ష యంటు వనసంరక్షణ సమితులంటు బెట్టి రమితముగను
భూటకాలవన్ని నాటకాలయములు
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                  56
వన సమితుల పేర వ్రణములు జేసిరి
అడవులెల్ల కూల్చి అడగ దోచి
లక్షలాది కోట్లు భక్షించి పంచుక
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                 56
క్రింద నుండి పైకి అందరూ దొంగలై
కలిసి తింటు ఉన్నరలసి పోక
చర్యలుండవెపుడు పిర్యాదు లెనిజేయ
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                 58
పచ్చనడవులంత పథకాల కాటున కాసు అంత విడక నాశ మయ్యె
మిగిలి యున్నదియును మింగేయుచున్నారు
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                  59
తరతరాల తరులు ఉరివిన గనరావు
పలుపరిశ్రమలకు పంప బడియె
అయ్యె నేలమట్టమవినీతులవాత
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?  
                  60
రోడ్ల ప్రక్క చెట్ల రూపము గనదాయె
నాటి నట్టి చెట్లు నాశమయ్యె
చెట్లు నరుక జేయు శిరసులు నరకాలి
స్వచ్ఛ భారతమ్ము సాధ్యమునకు.
                  61  
అటవి సంపదలన్ని గుటకాయమవ్వుచూ
అక్రమముగ దేశ హద్దులున్ను
దాటి భ్రష్ట విధుల తరలుతున్నవి జూడు
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                  62
ప్రకృతి కాపు సేయ పర్యావరణముండు
సువ్యవసితమయి అవ్యయముగ
సహజ సంపదలను చంపిన చత్తురు
స్వచ్ఛ భారతమున వలయు దెలియ.
                  63
ఎర్ర చందనమూడ్చి ఎల్లలు దాటిస్తు
పట్టుకొంటిమనుట పగటి డ్రామ
ఎర్ర చందనమికయెంతొ లేదిప్డు
స్వచ్ఛ భారతమున వాస్తవమిది.
                  64
ఎల్లలిలను దాటు దెరచందనమె గాదు
అడవి సొత్తులెన్నొ అరుదైనవెన్నియో
ఒకటిదాపునింకొ ఒకటి దాటుచునుండు
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                  65
కర్ర కట్టె మూలికలు ఎన్నొ ఖనిజాలు
అక్రమముగ దాటునడవి గూల్చి
ఎర్రచందనమొకటేయన కపటము
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                  66
కొయ్యకోత మిషనులెయ్యెడ జూసినా కోట్ల కొలది విలువ కొయ్యలుండు
అటవి చట్టమమలు నపహాస్యమును జేసి
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                  67
జాడ దెలియకుంది ఎక్కడుందో "వాల్ట"
చట్ట రచన జేసి చంపినారు
ఈత జేసి నక్కవాత  బెట్టినయట్లు
స్వచ్ఛ భారతమెటు సాధ్య     మగును?
                   68
కార్ఖనముల యందు కర్రయే ఇందన
మవుచు అటవి చట్ట మపహాస్య మైపోయె
ప్రకతి భక్ష్య మయ్యె రాక్షస భ్రష్టాల
స్వచ్ఛ భారతమెటు సాధ్య మగును?
                  69
అక్రమ అనుమతుల అటవి సొత్తులు అన్ని
తరల రాత్రి పగలు దారి దాటి
"చెక్కు పోస్టు" సిగ్గువడక పోయె
స్వచ్ఛ భారతమెటు సాధ్య మగును?
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                  70
అటవి కోర్టు కేసులవినీతి మయమయ్యె
ప్రాథమికము నుండి పైవరకును
శల్య సారథులును శండుల తోడను
 స్వచ్ఛ భారతమెటు సాధ్యమ              గును?
                  71
అడుగడుగున నిరత మవినీతి నడుచుండ
"అనిశ" వారలున్ను అందు జేరి
ఒకటి బడితి మంటు  ప్రకటించు కొందురు
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                 72
ఆటవియేతరములకడవి యాహుతి యయ్యె
అటవి రక్షిత చట్ట మడుగడుగున
భక్షితమయి దోచె పర్యావరణమును
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                  73
నీతివంతుడెపుడు నీది మాది యనక
విషయమేది యైననెప్పుడైన
మంచి గోరి ధర్మ మార్గాల నేనడు
స్వచ్ఛ భారతమ్ము సాధ్యమునకు.
                  74
సహజముగ ప్రకృతిన శతసహస్రములైన
మొక్కలెన్నొ భువిన మొలిచి యెదుగు.
నాట వలయు ననుట భూటకమైపోయె
స్వచ్ఛ భారతమ్ము వలయు దెలియ.
                  75
మొక్కనాటి తిరిగి ముఖము జూపించక
లెక్క దోచి తినెడి కుక్క మతుల
నాటమనెడి వాళ్ళ నాలుక చీరిన
స్వచ్ఛ భారతమ్ము సాధ్యమగును.
                  76
ఏధన మన వృధ్ధి  ఏధమానమడవి
మనిషి పనుల సాయమెనయ కుండ
ఎదుగ గల యడవిన ఎన్ని వినాశాలొ
స్వచ్ఛ భారతమ్ము సాధ్య మెటుల?
                  77
చెట్లు నరుక కఠిన శిక్షల చట్టము
వచ్చె ననుచు ముదము బడయ వలదు
ప్రకర షండు చేత బ్రహ్మాస్త్రము పగిది
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                  78
ఇచ్చువాడు దేవుడెచ్చటైననుగాని
దేవుడనగ వెలుగు దివి జగతికి
ప్రకృతి యందునుండు పరమాత్మఎప్పుడూ
స్వచ్ఛ భారతమ్ము వలయు దెలియ.
                  79
వెలుగునిచ్చు భవుడు విశ్వేశ్వరుడతడు
వెలుగు లెంతొ కలుగు తెలుసు కొన్న
దివము వెలుగు దైవ మవనికి జగతికి
స్వచ్ఛ భారతమ్ము వలయు దెలియ.
                  80
దేవుడిచ్చువాడు దివ్యసంస్థిత మతి
సర్వములను యిచ్చు శాశ్వతుండు
ఆది మద్యమంత మనునది లేకుండ
స్వచ్ఛ భారతమ్ము వలయు
 దెలియ.
                  81
విశ్వమందు వేల్పు విస్ఫోటనములతో
చీకటులను జీల్చి సృష్టి నొందె
శూన్యమదియె చీకటన్యపదార్థము
స్వచ్ఛ భారతమ్ముపలయు దెలియ.
                  82
దేవుడిచ్చినదియె దివ్య ప్రసాదము
ప్రకృతి నెపుడు నెవరు పాడు గొనక సుఖము సంత సములు చూడ్కొన బ్రతకాలి
స్నచ్ఛ భారతమ్ము సాధ్యమునకు
                   83
అరయ వస్తువులిల పరమాత్మ రూపాలు
వ్యర్థములెవి వసుధ యందు లేవు
చేర్చి యుంచ దగిన స్థితులను బొందిన
స్వచ్ఛ భారతమ్ము వలయు దెలియ.
                  84
వ్యర్థములని కాల్చనవనికి కీడగు
గాలి మట్టి చెడును గాడ్పు పెరుగు
పుడమి లోన జేర్చ పుత్తడి ఫలమిచ్చు
స్వచ్ఛ భారతమున వరములిచ్చు.
                  85
సంపదలను కాల్చి సమ్మెలాందోళన్ల
పైశునములనాడ నాశమిచ్చు
తమదు చితిని తామె తగలెట్టు కొన్నట్టు
స్వచ్ఛ భారతమును చావ జేయు.
                  86
ప్రజల సొత్తులైన ప్రైవేటు వైనవూ
భువిని తొలయజేసి పొంది నవియె
ఆకసమ్ము నుండి దూకినవవిగాదు స్వచ్ఛ భారతమ్ము వలయు దెలియ.
                 87
సాయములను సకల సౌకర్యములనిచ్చు
వస్తు వాహనములు ఆస్తులిలను
కాల్చ మనెడి నేత  గాంధేయుడైమెచ్చె
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                  88
బస్సు రైలు ప్రజల పయన సుఖాల్నిచ్చి  
గమ్య మరుగ జేయు రమ్యముగను  ఆలు బిడ్డ బంధువులందరి గాపాడు
స్వచ్ఛ భారతమున వలయు దెలియ.
                89
బాధ్యత నెరుగనివి బండ హక్కులగును
విధులు ధర్మము విడి వీధులెక్కి
గొంతు చించు కొనుచు  కూల్చుట కాల్చుట
స్వచ్ఛ భారతమున వలదు హాని.
                 90
రాజకీయమొక్క రాజాహి పుట్టువ
రెండు నోళ్ళ నిండ నుండి విషము
గక్కు  కలుషితముల గాల్చును భువినంత
స్వచ్ఛ భారతమును జంపి యేలు
                   91
రెచ్చగొట్టి కుతుల రేపెడి వాళ్ళనూ
రాజకీయ దుష్ట రాక్షసులను
పీచమడచ వలయు పిదపెవరైననూ
స్వచ్ఛ భారతమ్ము సాధ్యమునకు.
                     92
అవకతవకలు విన అగుపించవేవియూ
జగతి సవ్య మొందు ప్రగతి పనులు  విధము దెలియ రావు వృద్ధి సమృద్ధులు
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                  93 శాంత్యహింసల దరి సహనముల వెనుక
నేరములకు బలము చేరు చుండ
కుహన శాంతి కాము కుల పిశాచాలతో
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                  94
కొలువు లేక చదువరులెవరైననుగాని
ఏళ్ళ తరబడి బ్రతుకీడ్చ గలరు
పదవి లేక పిచ్చి పట్టు నేతలకిల
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                95
ఎన్నికగుట కొరకు ఎన్నెన్నొపన్నాలు
రాజకీయ తంత్ర రణము నందు
వ్రణములె మిగులునిల ప్రజలకు
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                  96
రాజకీయములకు రాబందులవినీతి పరులె యవసరమ్ము ప్రజలకన్న
ప్రజలనండి వోట్లు బడయ వలయునన్న
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                   97
సక్రమైన పాలనక్రమములనెరిగి
విధుల నిర్వహించు విధము నేగు    పాలనాధికార్ల పనిచేయ నడ్డిన
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                  98
ప్రథమ సాధనమగు ప్రజల స్వామ్యముననె
ప్రభువ నడువ జేయు విభవమునకు
వోటు పౌర హక్కు జూటాడ బడుచుండ
స్వచ్ఛ  భారతమెటు సాధ్యమగును?
                  99
మగువ మధువు ధనము మదమదికారము
ఇవ్వి యైదె రాజ కీయమయ్యె
నేతలునధికార్లు నీతులు వీడిన
స్వచ్ఛ భారతమెటు సాధ్య మగును?
                  100
ఎదుట అవకతవకలెన్నొ జరుగుచుండ
తమకు యేమి యంటు గమియకుండ
నివురు గప్పి పోయ్న నిప్పులా జనులుండ
స్వచ్ఛ భారతమెటు సాధ్యమగును?
                 101
ధర్మమన్న విధి సదాచరణమె కర్మ
విధుల సక్రమముగ ముదము తోడ బాధ్యత నెరిగి జన ప్రాభవమొన జేయ
స్వచ్ఛ భారతమ్ము సాధ్యమగును.

.......................................
...........కొనసాగించబడుతుంది


  శీర్షిక :  మొక్కల  ''నాటకాలు'' ఇకనైనా  ఆపండి @ మానవుని మనుగడ కోసం  మొక్కలను అడవులను  పర్యావరణాన్ని కాపాడండి.
అవినీతిని ఎదిరించండి.
ప్రశ్నించండి  నిలదీయండి.
( సహస్ర కవిత-5  కు  మార్పుతో పునః సమర్పణ)
......................................
మొక్కలు  మానవత కోసం
ప్రకృతి ధర్మంగా
ప్రసాదితమైన వరములు

సహజంగా వాటికంతట  అవే
మొలిచి పునరుత్పత్తి చెంది విస్తరంచి వ్యాపిస్తు న్న
భగవత్ ప్రసాదాలు

ప్రాణి కి అవయవాల్లా
శరీరం పై వెంట్రుకల్లా
నోటిలోపల పల్ళ లా
వేళ్ల కు పెరిగే గోళ్ళు లా

"అడవు"లేవీ మానవ నిర్మితాలు కావు  అవి జీవంకోసం ఏర్పడిన సహజ ఉధ్భవములు. బృహత్తర
సంకీర్ణ పర్యావరణ వ్యవస్థ లు.

అడవులలో మొక్కలు
నాటడం అంటే
'డేగ'కు  వేట
'చేప'కు  ఈత
'కోయిల' కు  కూత
'నెమలి' కి  నాట్యం
నేర్పడం వంటి
నిరర్థక  కార్య క్రమం

 అడవులలో మొక్కలు నాటే పథకాలు అన్నీ అవినీతి కోసం నేతలు అధికారులతో కలసి
 పాలకులేర్పరచు కొన్న పచ్చి పగటి వ్యభిచార  భ్రష్టాచారాలు

అడవులలోను
పొలం గట్లు మీద
పోరంబోకు నేలల్లో
బంజరు భూముల్లో
రహదారుల ప్రక్కన
గుడులు గోపురాల మీద
బంజరు భూములు
మొండి గోడల మద్య
ఏ పథకం లో
ఏ ప్రోగ్రాం లో
ఎవరు మొక్కలు నాటారు
ఎంత నిధులు వెచ్చించారు
ఏ "వరల్డ్ బ్యాంకు" నిధులిచ్చింది
ఏ" నాబార్డు" ముందు కొచ్చిం ది
గమనించండి
మొక్కలు సహజంగా
వాటికంతట అవే మొలిచి
ఎదిగి ఫలాలని స్తు న్నాయి.
పర్యావరణాని కి
పట్టు కొమ్మలై మనలను అవి
కాపాడు తున్నాయి

ఇప్పటి వరకు
దశాబ్దాలుగా వివిధ
పథకాలు ప్రో గ్రాముల్లో
లక్ఝల కోట్ల ప్రజా ధనంతో
నాటి నట్లు చెబుతున్న
మొక్కల లో కోటికొక్కటైన
బతికిందా? ఉన్నదా ?

నాటిన మొక్కల లెక్కలు
చెప్ప గలరా ?
నాటినవాటి వాటి స్థలాల
ఆచూకీ అయినా
చూప గలరా?

మొక్కలు నాటే పేరుతో
ఉన్న మొక్కల ను అడవులను
తొ ల గిం చేస్తు న్నారు.
అడవులను నాశనం
చేసేస్తున్నారు

"స్వఛ్ఛ భారత్" పేరుతో
పచ్చధనాన్ని తునిమేస్తున్నారు
"పడుపు" సంపాదనలు
చేసు కొంటున్నారు.
లక్ఝల కోట్లు దోచే శారు
ఇంకా దోస్తూనే ఉన్నారు

 పూన కం పట్టిన పిశాచాల్లా
దోచి దోచీ ఏం బావుకుంటారు
పుట్టి మునక తో
మీరూ గల్లంతు కాక
మిగలరని తెలియగలరు

ఇకనైనా
"ఈ"  నాటకాలు ఆపండి
భ్రష్టాచారాలు మానండి
సహజ వనాలను కాపాడండి
ప్రజలు ప్రాణాలతో
ఉండ నివ్వండి

మానవతా మహనీయులారా
మనలను మనం
కాపాడు కొందాం
 కలసి పోరాడుదాం
ముందుకు రండి.
(చదవండి  "వృక్ఝ విలాప ము")
....................................
ఎస్ కే  0412
పార్థసారథి నాయుడు దగ్గుపాటి
చిత్తూరు
9 4 4 0 9 9 5 0 4 6
.....................................
ప్రభుత్వాలు చేస్తున్న పర్యావరణ  నాశన అవినీతి కార్యక్రమాలతో  మరెన్నో  తుఫానులు  సునామీలు  కరువులు  వరదలు  భూకంపాలు  ప్రకృతి ప్రకోపాలు.
''''''''''''''''''''''''''''''''''''''''''''''

ఎస్ కే  0412
పార్థసారథి నాయుడు దగ్గుపాటి
చిత్తూరు
9440995046
...................
శీర్షిక : త్రాష్టక క భ్రష్టాచారులను తరిమి తరిమీ కొడదాం.
సహస్ర కవిత -1
( కొంతమార్పుతో)
--------------------
రావణుడిది రాజ్యమైన రఘురామునిదైన
జనులకే కీడు గాని జరిగినట్టు లేదు నాడు

రాజులు నీతికి నిలబడి  అడవులపాలైనారు
 పలు కష్టాలూ పడినారు  

"వోటు" అవసరం లేకున్నా
కఠిక నిష్ట తో
పాలించినారు

పాలకులే నేడు దొంగలు
ప్రజాస్వామ్యం ముసుగేసుకొని
ప్రజలను మభ్యపెట్టి
రాజ్యమేలుతున్న పాశవికులు

సహజవనరులనూడ్చి భువినెడారిగ జేసి
ప్రకృతిని వికటింజేసి
ప్రజల నెత్తిన
పిడుగులేసి పరిమారిస్తున్న
రాక్ఝసులు

అవినీతి పడుపు కూటికి అధికారులు నేతలు ఒక్కటై
పథకాలేసు కొని మరీ
ప్రజల రక్తము పీలుస్తున్నారు

హిట్లరేలినట్టి గట్టి నిష్టాగరిష్ట రాజ్యమే శరణ్యం
త్రాష్టక భ్రష్టాచారులను
తరిమి
కొట్టడ మే పరిష్కారం.
.......................................
ఎస్ కే  0 4 1 2
పార్థసారథి నాయుడు దగ్గుపాటి
చిత్తూరు-5 1 7 0 0 2 ఆం ప్ర.
మాజీ వాయు సైనికుడు
డిప్యూటీ ఫారెస్ట్ రేంజి ఆఫీసరు(రి)
రచయిత,  పర్యావరణ ప్రచారకులు
9 4 4 0 9 9 5 0 4 6
--------------------

ఎస్ కే  0 4 1 2
పార్థసారథి నాయుడు దగ్గుపాటి
చిత్తూరు
94409 95046
---------------------
శీర్షిక :
"హీరో"యిజం @ "విల" నిజం
సహస్ర  కవిత -3
తేది : 18 -11-2015
....................................

"హీరో"యిజం "ఇజం"
"విల"నిజం   "నిజం"

ఒక "సినిమా" చూసి
వేలకొద్దీ విలనులు
తయారౌతున్నారు
కానీ
వే ల కొ ల ది
సినిమాలు చూసినా
ఒక్క హీరో కూడా
తయారు కావడం లేదు

తెరపైని
"హీరో" కూ డా
నిజం కాదు
భూటకాని కెందుకింత
 వెర్రి అభిమానం
"విలనిజం" అని తెలిసీ ఎందుకని
ఇంత వింత
 అనుసరణీయం
.......................................
ఎస్ కే  0412
పార్థసారథి నాయుడు దగ్గుపాటి
చిత్తూరు
94409 95046
-----------------------


ఎస్కే 04 1 2
పార్థసారథి నాయుడు దగ్గుపాటీ
..................................
శీర్షిక :    వింత దౌర్భాగ్యం
సహస్ర కవిత
18 .11. 2015
.................................
స్వదేశీ  పాలన అంతా విదేశీ విఫణి పాలు
ప్రజాస్వామ్యం ముసుగులో రాబందుల ఏలు
స్వదేశీయుల ఏలికలో విదేశీ వస్తు బహిష్కరణ కోసం
 ఉద్దె మా లు చేయాల్సిన వింత దౌర్భాగ్యం
---------------------
ఎస్ కే  0412
పార్థసారథి నాయుడు దగ్గుపాటి
చిత్తూరు.
94409 95046

1 comment:

  1. పర్యావరణ ప్రియులకు వీనుల విందైన కవిత.మీ అదర్శము అభినందనీయము

    ReplyDelete