ఓం - ఓం
జి.ఓబులపతి, కదిరి
నా తెలుగు
అవని అంచులు దాటి వెలిగింది తెలుగు
కవుల ఎదలోతులను కదిపింది తెలుగు
ఆడవారి ఆటపాటలలో పాటైంది తెలుగు
పల్లె పల్లె న జానపదమై పలికింది తెలుగు
భజనబృందాలలో సంకీర్తనమైంది తెలుగు
అమ్మ ఆలనలో జోలపాటైంది తెలుగు
చిన్నారుల చిక్కుముడులలో పొడుపు కథైంది తెలుగు
పెద్దల పోలికలలో సామెతైంది తెలుగు
నేటి సామాజిక మాధ్యమాలలో సంచలనమైంది తెలుగు.
ఓం
స.క. 707
గుడిసి ఓబులపతి
కదిరి
భారతరాజ్యంగము ఆమోదము పొందిన రోజును పురష్కరించుకొని
ఒక చిరుప్రయత్నం
తప్పులను మన్నించగలరు
భారతరాజ్యంగము
అంబేద్కర్ అధ్యక్షతన
అందముగా అమరె భారతరాజ్యంగము
అవనిలో అతిపెద్ద గ్రంధము భారతరాజ్యంగము
అణగారిన ప్రజల ఆశా దీపం భారతరాజ్యంగము
అందరి హక్కులు విధులను వివరించె భారతరాజ్యంగము
అన్యాయాన్ని ఆక్రమాలను నిలువరించె భారతరాజ్యంగము
అంటరానితనమును అణచడానికి అవతరించె భారతరాజ్యంగము
అతివల ఆత్మరక్షణ కవచము భారతరాజ్యంగము
ఆర్థిక అసమానతలు నిర్మూలించె భారతరాజ్యంగము
అవినీతికి అడ్డుకట్ట వేసె భారతరాజ్యంగము
అక్రమ సంపాదన తగదనె భారతరాజ్యంగము
అందరికీ స్వేచ్చనిచ్చె భారతరాజ్యంగము
అర్ష సంప్రదాయాలను అతిక్రమించె భారతరాజ్యంగము
ఆశయాల సాధనా పొత్తము భారతరాజ్యంగము
అంతర్జాతీయ మోదముపొందె భారతరాజ్యంగము
నరకాసురుడు చెలరేగె
నరులకు ఈతి బాధలు కలిగె
ఆపై లోకాన చీకట్లు ఆవరించె
సత్యభామ విజృంభించె
అసురుని సంహరించె
ఇలలో వెలుగులు ప్రసరిల్లె
జనుల మోములో నవ్వులు చిగురించె
టపాసుల ధ్వనులు కర్ణబేరులను స్పృసించె
వెలుగు వెలుగు వెలుగు
దివ్య దీపాల వెలుగు
తొలగు తొలగు తొలగు
కారు చీకట్లు తొలగు
కలుగు కలుగు కలుగు
సకల శుభములు కలుగు
జయము జయము జయము
సకల జనులకు విజయము
శుభము శుభము శుభము
సర్వ లోకమునకు శుభము
శీర్షిక .చెట్లు
చెట్లు చెట్లు చెట్లు ఎంతో మంచి చెట్లు
నీరు నిచ్చే చెట్లు
నీడ నిచ్చే చెట్లు
బ్రతుకు నిచ్చే చెట్లు
ప్రాణవాయువిచ్చే చెట్లు
చెట్లు చెట్లు ఎంతో మంచి చెట్లు
తిండి నిచ్చే చెట్లు
గూడు నిచ్చే చెట్లు
వాన నిచ్చే చెట్లు
కలప నిచ్చే చెట్లు
చెట్లు చెట్లు ఎంతో మంచి చెట్లు
పండ్ల నిచ్చే చెట్లు
పూల నిచ్చే చెట్లు
గాలి నిచ్చే చెట్లు
కల్మషాన్ని పారదోలె చెట్లు
చెట్లు చెట్లు ఎంతో మంచి చెట్లు
దానగుణం నేర్పే చెట్లు
దాతవుకమ్మనె చెట్లు
బ్రతుకు తెరువు నేర్పే చెట్లు
పుడమికి బలమే చెట్లు
చెట్లు చెట్లు ఎంతో మంచి చెట్లు
శీర్షిక ; నా తెలుగు వెలుగు
ప్రాఙ్నన్నయ యుగంబున
పరిఢవిల్లిన నాతెలుగు
నన్నయ యుగంబున
నవిష్ఠమైనది నాతెలుగు
శివ కవి యుగంబున
శివచరిత్రలు తెలిపె నాతెలుగు
తిక్కన యుగంబున
తేటతెనుగు కావ్యంబయె నాతెలుగు
ఎర్రన యుగంబున
హరి వంశంబు తెలిపె నాతెలుగు
శ్రీనాథ యుగంబున
శృంగార నైషధమై అలరె నాతెలుగు
రాయల యుగంబున
రసిక ప్రబంధమై వెలిగె నాతెలుగు
దక్షిణాంధ్ర యుగంబున
యక్షగానము చేసే నాతెలుగు
క్షీణ యుగంబున
నిజముగా క్షీణత పొందలేదు నాతెలుగు
ఆధునిక యుగంబున
అభినవ సాహిత్యమై హంగులు తీరినది నాతెలుగు
నేటి సాంకేతిక యుగంబున
వాట్సాప్ వేదికగా వేల కవితల వెలుగైనది నాతెలుగు
కలుపు కలుపు కలుపు
వేల కవులను కలుపు
రాయి రాయి రాయి
మంచి కవితలు రాయి
కోరు కోరు కోరు
సమాజ హితము కోరు
పలుకు పలుకు పలుకు
సత్య వాక్కు పలుకు
నడుచు నడుచు నడుచు
మంచి నడత నడుచు
పెంచు పెంచు పెంచు
జ్ఞాన సంపద పెంచు
తుంచు తుంచు తుంచు
అవినీతి మార్గాన్ని తుంచు
కూల్చు కూల్చు కూల్చు
అన్యాయాన్ని కూల్చు
వద్దు వద్దు వద్దు
హేళన మాటలు వద్దు
ముద్దు ముద్దు ముద్దు
తెలుగు భాష ముద్దు
బాలలము బాలలము :-
బాలలము బాలలము
లేలేత కుసుమములము
భావి భారత ఆశా రత్నాలము
బాపూజీ బాటలో పయనించే
భావి మేధావులము
చాచా నెహ్రూ ఆభిమానించే
శాంతి కపోతాలము
కల్లా కపటము ఎరుగని
కమ్మని పిల్లలము
పుస్తకాలతో కుస్తీ పట్టే
పిల్ల వస్తాదులము
తల్లిదండ్రుల కాంక్షలలో
ఆశా జ్యోతులము
విశ్వకళా ప్రపంచంలో
విహరించే విహంగాలము
బాలలము బాలలము
భావి భారత పౌరులము
స.క.707
జి.ఓబులపతి కదిరి.
వర్షము కురిసెనేని అవనిపై
హర్షము జనులకు ఆత్మలో
వర్షము కురవనిచో పుడమిపై
వర్షింతురు జనులు కనులతో
శీర్షిక . భయం :-
చంటి పిల్లలకు బూచోడంటే భయం
అమ్మ వాడికి పట్టిస్తుందేమో అని
బడి పిల్లలకు గురువంటే భయం
చదవకపోతే కొడతాడని
ఆడపిల్లలకు పోకిరిలంటే భయం
ర్యాగింగ్ చేస్తారని
పడుచుపిల్లకు పెళ్ళంటే భయం
తల్లిదండ్రులను వదలాల్సి వస్తుందని
భార్యకు భర్తంటే భయం
తన మాట చెల్లదని
భర్తకు భార్యంటే భయం
అహంకారానికి అడ్డం అని
భక్తునికి దేవుడంటే భయం
తప్పు చేస్తే శిక్షస్తాడని
దేవునికి భక్తుడంటే భయం
విపరీతమైన కోరికలు కోరతాడని
ధనవంతునికి దొంగంటే భయం
తన సంపాదన దోచుకెలతాడని
దొంగకు పోలీసంటే భయం
జైల్లొ హింసిస్తారని
పోలీసుకు పై అధికారంటే భయం
మారుమూలకు బదిలీ చేస్తారని
ప్రభుత్వానికి ప్రజలంటే భయం
వచ్చే ఎన్నికలలో దింపేస్తారని
ప్రజలకు ప్రభుత్వమంటే భయం
అనవసర పన్నులు కట్టాలని
భయం భయం భయం
ప్రతి మనిషి కి ఏదో భయం
కులం రంగును పులిమినారు పాఠశాలలకు
కులం వారిగా విడదీసనారు విద్యార్థులను
తమిళనాట గురువులకు తగని కార్యం
తమిళు లకు తగిన బుద్ధి చెప్పు శ్రీ పతి
వాయి లేని పొట్టి చీమలు వరుస కట్టె
నోరు గల గట్టి నరుడు వరుస తప్పె
వింత నరుల చెత్త బుద్ధులు
నరుల నడత చక్కదిద్దు శ్రీ పతి
తన బిడ్డ తనకు ముద్దు
పరుల బిడ్డ తనకు పొందు
పాడు బుద్ధులు పాడు నడతలు
నరుల నడతను చక్కదిద్దు శ్రీ పతి
తల్లిదండ్రులను కావడిలో మోసె శ్రవణుడు
తల్లిదండ్రులను ఆశ్రమంలో పెట్టె ఆధునికుడు
తల్లిదండ్రుల ఆత్మక్షోభ తనయులకు కీడు
తప్పు చేసెడి తనయులను తన్నుట ముద్దు శ్రీ పతి
జి.ఓబులపతి, కదిరి
నా తెలుగు
అవని అంచులు దాటి వెలిగింది తెలుగు
కవుల ఎదలోతులను కదిపింది తెలుగు
ఆడవారి ఆటపాటలలో పాటైంది తెలుగు
పల్లె పల్లె న జానపదమై పలికింది తెలుగు
భజనబృందాలలో సంకీర్తనమైంది తెలుగు
అమ్మ ఆలనలో జోలపాటైంది తెలుగు
చిన్నారుల చిక్కుముడులలో పొడుపు కథైంది తెలుగు
పెద్దల పోలికలలో సామెతైంది తెలుగు
నేటి సామాజిక మాధ్యమాలలో సంచలనమైంది తెలుగు.
ఓం
స.క. 707
గుడిసి ఓబులపతి
కదిరి
భారతరాజ్యంగము ఆమోదము పొందిన రోజును పురష్కరించుకొని
ఒక చిరుప్రయత్నం
తప్పులను మన్నించగలరు
భారతరాజ్యంగము
అంబేద్కర్ అధ్యక్షతన
అందముగా అమరె భారతరాజ్యంగము
అవనిలో అతిపెద్ద గ్రంధము భారతరాజ్యంగము
అణగారిన ప్రజల ఆశా దీపం భారతరాజ్యంగము
అందరి హక్కులు విధులను వివరించె భారతరాజ్యంగము
అన్యాయాన్ని ఆక్రమాలను నిలువరించె భారతరాజ్యంగము
అంటరానితనమును అణచడానికి అవతరించె భారతరాజ్యంగము
అతివల ఆత్మరక్షణ కవచము భారతరాజ్యంగము
ఆర్థిక అసమానతలు నిర్మూలించె భారతరాజ్యంగము
అవినీతికి అడ్డుకట్ట వేసె భారతరాజ్యంగము
అక్రమ సంపాదన తగదనె భారతరాజ్యంగము
అందరికీ స్వేచ్చనిచ్చె భారతరాజ్యంగము
అర్ష సంప్రదాయాలను అతిక్రమించె భారతరాజ్యంగము
ఆశయాల సాధనా పొత్తము భారతరాజ్యంగము
అంతర్జాతీయ మోదముపొందె భారతరాజ్యంగము
నరకాసురుడు చెలరేగె
నరులకు ఈతి బాధలు కలిగె
ఆపై లోకాన చీకట్లు ఆవరించె
సత్యభామ విజృంభించె
అసురుని సంహరించె
ఇలలో వెలుగులు ప్రసరిల్లె
జనుల మోములో నవ్వులు చిగురించె
టపాసుల ధ్వనులు కర్ణబేరులను స్పృసించె
వెలుగు వెలుగు వెలుగు
దివ్య దీపాల వెలుగు
తొలగు తొలగు తొలగు
కారు చీకట్లు తొలగు
కలుగు కలుగు కలుగు
సకల శుభములు కలుగు
జయము జయము జయము
సకల జనులకు విజయము
శుభము శుభము శుభము
సర్వ లోకమునకు శుభము
శీర్షిక .చెట్లు
చెట్లు చెట్లు చెట్లు ఎంతో మంచి చెట్లు
నీరు నిచ్చే చెట్లు
నీడ నిచ్చే చెట్లు
బ్రతుకు నిచ్చే చెట్లు
ప్రాణవాయువిచ్చే చెట్లు
చెట్లు చెట్లు ఎంతో మంచి చెట్లు
తిండి నిచ్చే చెట్లు
గూడు నిచ్చే చెట్లు
వాన నిచ్చే చెట్లు
కలప నిచ్చే చెట్లు
చెట్లు చెట్లు ఎంతో మంచి చెట్లు
పండ్ల నిచ్చే చెట్లు
పూల నిచ్చే చెట్లు
గాలి నిచ్చే చెట్లు
కల్మషాన్ని పారదోలె చెట్లు
చెట్లు చెట్లు ఎంతో మంచి చెట్లు
దానగుణం నేర్పే చెట్లు
దాతవుకమ్మనె చెట్లు
బ్రతుకు తెరువు నేర్పే చెట్లు
పుడమికి బలమే చెట్లు
చెట్లు చెట్లు ఎంతో మంచి చెట్లు
శీర్షిక ; నా తెలుగు వెలుగు
ప్రాఙ్నన్నయ యుగంబున
పరిఢవిల్లిన నాతెలుగు
నన్నయ యుగంబున
నవిష్ఠమైనది నాతెలుగు
శివ కవి యుగంబున
శివచరిత్రలు తెలిపె నాతెలుగు
తిక్కన యుగంబున
తేటతెనుగు కావ్యంబయె నాతెలుగు
ఎర్రన యుగంబున
హరి వంశంబు తెలిపె నాతెలుగు
శ్రీనాథ యుగంబున
శృంగార నైషధమై అలరె నాతెలుగు
రాయల యుగంబున
రసిక ప్రబంధమై వెలిగె నాతెలుగు
దక్షిణాంధ్ర యుగంబున
యక్షగానము చేసే నాతెలుగు
క్షీణ యుగంబున
నిజముగా క్షీణత పొందలేదు నాతెలుగు
ఆధునిక యుగంబున
అభినవ సాహిత్యమై హంగులు తీరినది నాతెలుగు
నేటి సాంకేతిక యుగంబున
వాట్సాప్ వేదికగా వేల కవితల వెలుగైనది నాతెలుగు
కలుపు కలుపు కలుపు
వేల కవులను కలుపు
రాయి రాయి రాయి
మంచి కవితలు రాయి
కోరు కోరు కోరు
సమాజ హితము కోరు
పలుకు పలుకు పలుకు
సత్య వాక్కు పలుకు
నడుచు నడుచు నడుచు
మంచి నడత నడుచు
పెంచు పెంచు పెంచు
జ్ఞాన సంపద పెంచు
తుంచు తుంచు తుంచు
అవినీతి మార్గాన్ని తుంచు
కూల్చు కూల్చు కూల్చు
అన్యాయాన్ని కూల్చు
వద్దు వద్దు వద్దు
హేళన మాటలు వద్దు
ముద్దు ముద్దు ముద్దు
తెలుగు భాష ముద్దు
బాలలము బాలలము :-
బాలలము బాలలము
లేలేత కుసుమములము
భావి భారత ఆశా రత్నాలము
బాపూజీ బాటలో పయనించే
భావి మేధావులము
చాచా నెహ్రూ ఆభిమానించే
శాంతి కపోతాలము
కల్లా కపటము ఎరుగని
కమ్మని పిల్లలము
పుస్తకాలతో కుస్తీ పట్టే
పిల్ల వస్తాదులము
తల్లిదండ్రుల కాంక్షలలో
ఆశా జ్యోతులము
విశ్వకళా ప్రపంచంలో
విహరించే విహంగాలము
బాలలము బాలలము
భావి భారత పౌరులము
స.క.707
జి.ఓబులపతి కదిరి.
వర్షము కురిసెనేని అవనిపై
హర్షము జనులకు ఆత్మలో
వర్షము కురవనిచో పుడమిపై
వర్షింతురు జనులు కనులతో
శీర్షిక . భయం :-
చంటి పిల్లలకు బూచోడంటే భయం
అమ్మ వాడికి పట్టిస్తుందేమో అని
బడి పిల్లలకు గురువంటే భయం
చదవకపోతే కొడతాడని
ఆడపిల్లలకు పోకిరిలంటే భయం
ర్యాగింగ్ చేస్తారని
పడుచుపిల్లకు పెళ్ళంటే భయం
తల్లిదండ్రులను వదలాల్సి వస్తుందని
భార్యకు భర్తంటే భయం
తన మాట చెల్లదని
భర్తకు భార్యంటే భయం
అహంకారానికి అడ్డం అని
భక్తునికి దేవుడంటే భయం
తప్పు చేస్తే శిక్షస్తాడని
దేవునికి భక్తుడంటే భయం
విపరీతమైన కోరికలు కోరతాడని
ధనవంతునికి దొంగంటే భయం
తన సంపాదన దోచుకెలతాడని
దొంగకు పోలీసంటే భయం
జైల్లొ హింసిస్తారని
పోలీసుకు పై అధికారంటే భయం
మారుమూలకు బదిలీ చేస్తారని
ప్రభుత్వానికి ప్రజలంటే భయం
వచ్చే ఎన్నికలలో దింపేస్తారని
ప్రజలకు ప్రభుత్వమంటే భయం
అనవసర పన్నులు కట్టాలని
భయం భయం భయం
ప్రతి మనిషి కి ఏదో భయం
కులం రంగును పులిమినారు పాఠశాలలకు
కులం వారిగా విడదీసనారు విద్యార్థులను
తమిళనాట గురువులకు తగని కార్యం
తమిళు లకు తగిన బుద్ధి చెప్పు శ్రీ పతి
వాయి లేని పొట్టి చీమలు వరుస కట్టె
నోరు గల గట్టి నరుడు వరుస తప్పె
వింత నరుల చెత్త బుద్ధులు
నరుల నడత చక్కదిద్దు శ్రీ పతి
తన బిడ్డ తనకు ముద్దు
పరుల బిడ్డ తనకు పొందు
పాడు బుద్ధులు పాడు నడతలు
నరుల నడతను చక్కదిద్దు శ్రీ పతి
తల్లిదండ్రులను కావడిలో మోసె శ్రవణుడు
తల్లిదండ్రులను ఆశ్రమంలో పెట్టె ఆధునికుడు
తల్లిదండ్రుల ఆత్మక్షోభ తనయులకు కీడు
తప్పు చేసెడి తనయులను తన్నుట ముద్దు శ్రీ పతి
No comments:
Post a Comment