సహస్రకవి సమ్మేళనం
గ్రూపు 1 కవితలు
కవిసమ్మేళనం: Sahasra kavi sammelanam 18-11-2015 రోజు పోస్టు అయిన కవితలు కొన్ని. గ్రూప్ 1 వారి తెలుగులో టైప్ చేసి పంపినవి.
ఇమేజస్ తరువాత పంపుతాను.
ఈ వేళటికి ఇవి చదువుకొండి.
ధన్యవాదాలు
మేక రవీంద్ర
[11/22, 8:13 PM] కవిసమ్మేళనం: అంబల్ల జనార్దన్, sk-490
బి - 204, ధీరజ్ కిరణ్, చించోలి బందర్ రోడ్, ఇన్ఫంట్జీసస్ స్కూల్ దగ్గర
మాలాడ్ (పశ్చిమ), ముంబయి-400 064.
దూరవాణి : (022) 2875 1550, సంచారవాణి: 099875 33225 / 096197 33225
E-Mail :sujamba8@gmail.com and janamba9@yahoo.com
వెన్నెముక
కుటుంబంలోస్త్రీ …
ఉద్యోగం, ఇంటిపని, వంటపని వంటి
అడ్డమైన చాకిరి చేస్తూ కూడా
కనీస వేతనానికి నోచుకోని అష్టావధాని
ఇద్దరి కూతురుగా ఒకరి భార్యగా,
మెట్టినింటి కోడలిగా పిల్లల తల్లిగా
బహు పాత్రల్లో అవలీలగా జీవిస్తూ
నవరసాలు పలికించే నటసామ్రాజ్ఞి
భర్త కాలికి ముల్లు గుచ్చుకున్నా
తన ఒంటికి కత్తి గాటు పడ్డంతSK-490
కలత చెంది కకావికలయ్యే సున్నిత మనస్విని
ఒంట్లో సత్తువ లేకున్నా భర్త మేనును,
మనసును అలరించే పుత్తడిబొమ్మ
తాను పస్తులుండైనా పిల్లల కడుపునింపే కారుణ్యమూర్తి
వరుసగా కురుస్తున్న కుటుంబ ఆటుపోట్ల అలలను
తట్టుకుంటూ గుంబనంగా కాపురంచేసే కల్లోల కడలి
నిటారుగా విశాలమై కుటుంబ గౌరవాన్ని కాపాడే గొడుగు
అవసరమైతే వంగి, చేబదుల్లతో పబ్బం గడిపే జాణ
అటు అత్తా మామలను,ఇటు భర్తా పిల్లలను
సమన్వయ పరుస్తూ వారిని మెప్పించే అపర చాణక్య
దారం లేకపోతే పూల ’దండ’ కాలేదు
వెన్నెముక లేకుంటే శరీరం ఉండదుయ
స్త్రీలేని కుటుంబం సంపూర్ణం కాదు
అది మనుగడ సాగించలేదు
--అంబల్ల జనార్దన్,
[11/22, 8:13 PM] కవిసమ్మేళనం: Sk17
రామానుజం సుజాత కరీంనగర్.
"మా రాజు "
అతడు,
ప్రపంచాన్ని నడిపించే సృష్టికి
మూలాధారుడు
అతడు,
ప్రకృతి లోని ఋతు గమనానికి
అనుసంధానుడు
అతడే,
మానవ మనుగడకు
చిరునామా ధారుడు
అతడు,
రాజ్యాలు లేని మహరాజు
కిరీటం లేని మా రాజు
అతడు,
ఏ చదువు సంధ్యా లేని
జ్ఞాన సంపన్నుడు.
కానీ
అతడు
వట్టి కాళ్ల నడుస్తడు
గంజి నీళ్లు తథాగతుడు
ముతక బట్టలే వేస్తాడు.
ఆ సామి
కోడి కూతకే లేస్తడు
హలాన్నే పడతాడు
నేలను చదును చేసి
దుక్కి దున్ని
సేద్యమే చేస్తాడు
విత్తిన మూలానికి
గాలై, నీరై
ఫలాన్నిచ్చే పంటకు
ప్రాణమౌతడు.
అతడు
భూమిని నమ్ముకున్న
పుడమి బిడ్డడు
మట్టి పొరల చీల్చి
మెతుకు బంగారం పండిస్తడు
ఆరుగాలం శ్రమించి
కుప్పలు కుప్పలు సిరుల
గుమ్మరిస్తడు
ఆ రైతు రాజు సుసంపన్నుడే
ఆకలి తీర్చే అన్నదాతే ఒకనాడు.
కాలానికి ఏ మాయరోగమొచ్చిందో ఏమో
అతివృష్టి, అనావృష్టి, మనిషి సృష్టి
మా రాజును పగబట్టి
నెర్రెలు బారిన నేలపై కొనఊపిరులనుంచింది
ఆ తండ్రి ఇప్పుడు
ఆధునికత ముందు
దళారుల ముందు
పాలకుల ముందు
ధీనంగా చేతులు జోడించి,
దిక్కెవరు లేరంటూ
గుండె పగిలిన మా రాజు
ఉరి కొయ్యల వేలాడితే?!
రైతు లేని లోకానికి
నువ్వెందుకు నేనెందుకు
రాజ్యాధికారులెందుకు!?
అంతా శూన్యమయ్యేదాక చూస్తారా
రండి చలనం లోకి
పాలకులారా!
ప్రజలారా!
రైతు పక్షాన నిలబడదాం
అన్నదాతను కాపాడుకుందాం.......
Sk17
రామానుజం సుజాత కరీంనగర్.
[11/22, 8:13 PM] కవిసమ్మేళనం: పేరు:దివాకరశాస్త్రి
సహస్రకవులసంఖ్య;-79
ఊరు:వికారాబాదు
తేది:18-11-15
----శీర్శిక:-ఏముంది...?
ఏముంది
అసలేముంది...
మంచికి సహవాసం కరువాయె..
చెడుముసుగునుకప్పకొని మాయాబజారులో మునిగిపలోయె..
నీతివంతులెందరు
అవనీతితో
క్రమ్ముకొనంగా.,!
ఆరోగ్యజీవనమా...! ఆమడదూరంలొ విషతుల్యఅనుబంధ
ఆహారం తాండవమాడగా.,! పరమానందమందించు కాషాయమపు
స్వాములెందరెందరో.,! తులసివనములొ
పెరిగిన
గంజాయికలుపుమొక్కలు
విరివిగా వికసించిరే ...!
ఓటుహక్కుకు
విలువగట్టి
మద్యంమత్తులో తులతూగుతూ ...!
వదరబోతు
మూఢుడుడికే
పట్టంకట్టిన
ప్రజలుండగా... !
నైతికవిలువల
ఇతిహాసాలను
తాతలవయసుల
వారులదని
విదేశీ సంస్క్రతినే..!
మెచ్చుకోలంటు చిందులు వేయించే వెఱ్ఱివాళ్ళుండగా...! అహింసమార్గమే
అవధానపరిచినా .,!
హింసావాదంతో
బకాసురుల బంధువులా., దోచేసుకొనుచున్నారుగా...!ఏముందో
ఏమో.....,,.--------?
$k 79
దివాకరశాస్త్రి
వికారాబాద్🌱రంగారెడ్డిజిల్లా
[11/22, 8:13 PM] కవిసమ్మేళనం: సహస్ర కవిసమ్మేళనం
వేదిక:వాట్సాప్
తేది:18-11-2015
sk:70
పోతగాని కవి
శీర్షిక:
మా నాయనమ్మ!
ఆ కనులు చీకటి వెలుగుల జీవయాత్రలో అలసిపోయాక
సుతిమెత్తని స్పర్శతో రూపాలను దీపాలుగా వెలిగించుకుంటోంది
ఆమె చేతులు దివ్యచక్షువులు!
ఆ చెవుల్లో నిశ్శబ్దం గువ్వపిల్లై గూడుకట్టుకున్నాక
గుండె లోపలి తీయని ఊసుల్ని ప్రతిధ్వనులుగా చప్పరిస్తోంది
ఆమె చర్మం అపురూప శ్రవణేంద్రియం!
ఆ నాలుక బోసినోటి చిగుళ్ళమధ్య చిక్కుబడ్డాక
మాటల్ని మూటగట్టి మౌనాన్ని
రుచి చూచుకుంటోంది
ఆమె హృదయభాష ఎవరికీ అర్థంకాని అరుదైన చిత్రలిపి!
ఆకలితో చీకటితో పోరాడి వెలుగుల వాసన పసిగట్టిన ఆమె నాసిక
ముఖవాట పడక ముందుకు దూసుకు పొమ్మని చెప్పే సూచిక!
ఆ నడుము బతుకు బరువుకు
నిలువుగా వంగిన చంద్రవంకైనాక
దేహపు గుడిసెకు నిబ్బరాన్ని నిట్టాడిగా నిలుపుకుంటోంది
ఆమె చేతికర్ర కళ్ళున్న కాంచనగంగ!
అనేకానేక హేమంతాలు విసిరిన
చలికత్తుల వేటుకు తట్టుకొని
ముడుతలు పడిన ఆమె శరీరం
లెక్కకు మించిన అనుభవాల దొంతర్లలో
మిణుగురు వెలుగుల నక్షత్రరాసుల్నిదాచుకున్న
అందమైన పాలపుంత!
ఆమె త్యాగి ,ఆ జీవితం మాకు పరిచిన తివాచీ
ఆమె యోగి,ఆమెకు సుఖధుఃఖాలు ఏకరీతి!
యేడాది కొక్కసారైనా చేరువయ్యే పక్షుల్ని చూచి
ఆ చెట్టు నిలువెల్లా పులకించి
అశృశిశిరమౌతుంటే
ఎన్నెన్ని అనురాగ మేఘాలు ఆప్యాయతల ముసుర్లై అలముకునేవో
ఇప్పుడు ఆ ఒక్కచెట్టే వనమై విస్తరించి
అడవిగా శిథిలమై మిగిలిపోయింది
నిజంగా వృద్ధాప్యం ఎంత దయలేని దండనో!
వాలే ఈగల్ని కూడా తోలని సహనం అలవడిందామెకు!
నిజానికి నూరు వర్షాలు కురిసి
ఆ సరోవరం ఎప్పుడో నిండి పొర్లిపోయింది
కరువుకాటకాల్ని అనుభవాల చేటలతో చెరిగిపోసిన ఆమె,అరుదైన జ్ఞాపకాల పుట్ట!
కోరుకున్న జీవితాన్ని గడిపిందోలేదో
చేరుకునే ఎత్తైన తావుకోసం వెదుకులాట మొదలెట్టింది
మమ్మల్ని దూసేరు తీగలతో అల్లిన శిబ్బుల్ని చేసి
బయటకు ఒంపేసుకున్న గంజిలా తను చల్లబడుతోంది
ఇకపై కూడా ఆకలని అర్థించకుండానే
ఆ గంజికూడా మా కడుపులోకే...!
SK-70
పోతగాని సత్యనారాయణ
ZPSS Bheemavaram
Yerrupalem-md
Khammam-dt,Telangana-st
Cell:9441083763
సహస్ర కవిసమ్మేళనం
[11/22, 8:13 PM] కవిసమ్మేళనం: సహస్రకవి ID No: 12
తేదీ : 18.11.2015
రచన : సోమవరపు రఘుబాబు
నివాసం: హైదరాబాద్
కవిత సంఖ్య : 5
-----------------------------------------
కవిత శీర్షిక : జ్ఞాపకం
-----------------------------------------
జ్ఞాపకం పగలని శూలం లాంటిది
కాలం కరిగినా పదును తగ్గదు
జ్ఞాపకం మాయని
గాయం లాంటిది
కాయం కమిలినా
మాయం అవదు..!
వార్ధక్యపు రెక్కల లెక్కలతో
నేను ఎదిగి పోతున్నపుడు
జ్ఞాపకం నా బాల్యపు ఊసులను
గువ్వలా ఒదిగి
గుత్తులుగా చేతికి అందిస్తుంది..!
ఆకాశమంత ఏకాంతంలోకి
నేను ఒదిగి పోతున్నపుడు
జ్ఞాపకం నా గుండెను
పెనంలా మరిగించి
శతఘ్నిలా పేలుస్తుంది ..!
ఆశ నిరాశల హోరులో
నేను కొట్టుకు పోతున్నపుడు
జ్ఞాపకం నా జీవితపు నావను
తెరచాపై ఎగసి
లంగరై రక్షిస్తుంది..!!
-----------------------------------------
--సోమవరపు రఘుబాబు
(హైదరాబాద్)
ID Number : SK12
[11/22, 8:13 PM] కవిసమ్మేళనం: id no.sk 62
తేదీ: 18/11/15
రచన: నరేందర్ నేత వనం
నివాసం:హైదరాబాద్
శీర్షిక: కంచె
అదిగో అక్కడే
ఆ హిమాలయ కాశ్మీరంలో
దూదిపర్వతాల సమీరంలో
నేలరాలిన నెత్తుటి రోజాలు
నన్ను నిలదీస్తున్నాయి
అశువులు బాసిన అమరుల త్యాగాలు
బంధూక్ పట్టిన సైనికుల
మేరా భారత్ నినాదాలు
దాయదుల కుట్రలు
ఉన్మాదుల రక్కసి క్రీడలు
తుపాకీ చప్పుళ్లు
మరఫిరంగుల మోతలు
జాతికోసం జవాన్ల పోరాటం
బతకడం కోసం అమాయకుల ఆరాటం
నా కాశ్మీరం ఇలా రగులుతూనే ఉంది
కానీ ఇక్కడ మరో పోరాటం
కాదు కాదు ఉన్మాదం
మతోన్మాదం, కుటిలకుల బంధనాలు
పట్టి పీడిస్తున్నాయి
మనిషిని మమతను వేరు చేసి
వేధిస్తున్నాయి
సబ్ మాలిక్ ఏక్ ను
సమాధి చేస్తున్నాయి
హిందూ ముస్లిం భాయీ భాయీ
ఔర్ సిక్కు ఇసాయి
అరె జర సోచో భాయ్ ఎక్కడ అది
అరె ఏడ దాక్కుందది
ఏది కనిపించడం లేదే
పేరుకు నాలుగు మంచి సూక్తులు
పలకపై రాసేసి మనం
పరదాలేసుకుని కూర్చున్నాం
దూరం దూరం అంటూ
మనసులోనే "మాదిగోడ"లు కట్టుకున్నాం
మల్లెల్లాంటి మనషులను"మాల"గా
కుండపై ప్రేమను
చేసేవారిపై"కుమ్మరిం"చక
బట్టనిచ్చిన "నేత"ను
సేదతీర్చిన "గీత"ను
యాదిమరచి"యాదవు"లను
శూరత్వమంటూ "శూదృలను"
"వడ్రంగి"పిట్టలా తొలిచేస్తున్నాము
అంతా అంటే అంటుకుంటే
మరి కాలే నీ కట్టెను ఎవరంటుకోవాలయా
కులవృత్తులపై ఎందుకీ కుంచితత్వం
"మనీ"షిగా బతుకుతున్నావు
మతం కులమంటూ
కుతంత్రాలు చేస్తున్నావు
నీ నికృష్ట జీవనాన్ని
ప్రతి నిత్యం
నాతో పాటు మరొకరు గమనిస్తున్నారు
మనసుల మధ్య కట్టుకున్న
తెరలను ఒక్కసారి తీసి చూడు
అక్కడ ఆ కాశ్మీరానికది రక్ష
ఇక్కడ నీవు విధించుకున్న శిక్ష
అక్కడ తీస్తే తప్పు
ఇక్కడ తీస్తే కనువిప్పు
కాలంతో పాటు మారాలోయ్
గుండెలోతుల్లో ఉన్న కంచెను తొలగించాలోయ్
----------------------------
నరేందర్ నేత వనం
sk 62
[11/22, 8:13 PM] కవిసమ్మేళనం: 🙏🙏🙏
పేరు:- దివాకరశాస్త్రి
సహస్రకవి:-79
ఊరు:-వికారాబాదు
శీర్శిక:-మానవత్వం మన జపం
మానవత్వమెరగని మనుషులెందుల...! జాతివైరమంటు
జీవనమేల..!
తెలివితేటలిచ్చినా కలుపుమొక్కలాగపెరిగెదవా...!
బుద్ధినివికసింపజేయ
హద్దుగనున్నకులమతాలనక
తెలుపురంగులో సకలరంగులు
హిందుధర్మమేసుందరధర్మం
ఋషులవచనమే
జీవనసారం
స్ఫూర్తిప్రదాతలే
మనుగడకాధారం
స్వార్దంనిరాధారమైతే నిస్వార్ధమేపరమేశ్వరుడే
సాగనంపాలి అశాంతిశక్తులన్ పసిహృదయాలను
పొట్జనపెట్టిన పిశాచాలను పాతాళం తొక్కగా
మానవతేజస్సు
మేల్కొల్పుదాం ...!
ముష్కరచేష్టలు చెండాడి
నిత్యనూతనంగా
స్ఫూర్తినింపుకొని
భారతాంబ కీర్తిని
విశ్వాంతరాళంలో
విహరిద్దాం....!
ఎస్కె79
దివాకరశాస్త్రి
వికారాబాదు
[11/22, 8:13 PM] కవిసమ్మేళనం: మనసు
ఎమ్. మల్లేశం
శంకర్ పల్లి
sk916
పల్లవి॥ మనసుకు హాయిని గొల్పి మదిలో చింతలు రేపి
మౌనమే నీ భాషగ కలిగిన ఓ మూగ మనసా
నీవెంత చిత్రమైనదానవు……
చరణం॥౧ కమ్మటికలలతొ కవ్విస్తావు
కనురెప్పపాటులో కల్లోల పరుస్తావు
కంటికి కనిపించేదంతా కావాలంటావు
కోరింది దక్కకపోతే కోపంగా చూస్తావు
మనసా నీవెంత చిత్రమైనదానవు
చరణం॥౨ ఆశలపందిరిలా అల్లుకుపోతావు
వింతల లోకంలో విహరింపజేస్తావు
ఊహల పల్లకిలో ఊరేగిస్తావు
ఉన్నదంతా ఊడ్చుకుపోయాక
ఉసూరుమనిస్తావు
మనసా నీవెంత చిత్రమైనదానవు
చరణం॥౩ మందహాసంతో మైమరిపిస్తావు
ముసిముసి నవ్వులతో మురిపిస్తావు
ముందువెనకా లేకుండా అంతా నేనే అంటావు
అంతా ఆవిరి అయ్యాక ఇంకేముందంటావు
మనసా నీవెంత చిత్రమైనదానవు
చరణం॥౪ బందాల పేరుతో బందీని చేస్తావు
బందం బలపడ్డాక భారంగా చూస్తావు
బతుకుబండిని లాగించేస్తావు
మూడునాళ్ళ ముచ్చట అంటూ ముగించేస్తావు
మనసా నీవెంత చిత్రమైనదానవు
చరణం॥౫ సంఘర్షణలతో సతమతమౌతావు
కష్టనష్టాలలో కారుణ్యమౌతావు
విలుప్తవిలువలకు జీవమౌతుంటావు
మానవత్వమై ఉప్పొంగే ఓ
మనసా నీవెంత చిత్రమైనదానవు………………………………………
[11/22, 8:13 PM] కవిసమ్మేళనం: సహస్ర కవిసమ్మేళనం కొరకు
SK.16 కవి పేరు-జ్వలిత
కవిత శీర్షిక-ప్రశ్న
ఊరు-ఖమ్మం, తెలంగాణ
***ప్రశ్న***
ప్రశ్న పంచదార చిలక అయితదా
ప్రశ్నల కొండమిరపకాయ కారముంటది
ప్రశ్న ప్రజాస్వామ్య లక్షణం కదా
హక్కుల రెక్కల కత్తిరింపులు జరుగుతున్నపుడు
ప్రశ్న ప్రభంజనం కావాలి
కుట్రలు చరిత్రకు నెత్తుటి మరకలు రచిస్తున్నపుడు
ప్రశ్న రక్షణాయుధం అవ్వాలి
ప్రశ్నకు ప్రశ్న సమాధానమయిందంటే
ప్రశ్న ఆభరణమై లాలూచి పడ్డట్టే
నేరానికి వావి వరసలు లేనట్టె
ప్రశ్నకూవుండకూడదు
పాపం ప్రశ్నే కదా ఎందరు సారికలను రక్తచారికలుగా మార్చింది
పసిపాపలను నిద్దరలోనే ఉద్దరించడం
ఉపపాండవులకు జరిపిన బంధు ద్రోహం పాతదే
ప్రశ్నకు సమాధానం యిచ్చినా యివ్వకున్నా
ప్రశ్నకు అందరం మద్దతివ్వాలి
ఏ ప్రశ్న మనది కాదని వదిలేస్తామో
అదే ప్రశ్న నీ ఉనికిని ప్రశ్నిస్తుంది
అదే నీ అస్తిత్వాన్ని దెబ్బగొడుతుంది
ప్రశ్న లేని మనిషికి లక్ష్యం ఏముంటది
స్వార్ధం ప్రశ్నల మింగుతున్నపుడు
భవిత బూడిద కుప్పలయి ప్రశ్నిస్తాయి మనని
ప్రశ్నను పట్టించుకోక పోతె
అది ప్రశ్నించకుండా మట్టు పెట్టడం ఖాయం
**********
SK-16. కవి పేరు-జ్వలిత
కవిత పేరు-ప్రశ్న
ఊరు-ఖమ్మం. తెలంగాణ
ఫోన్-9989198943
time 6-30AM
[11/22, 8:13 PM] కవిసమ్మేళనం: శీర్షికః జయగీతిక
రచనః చిన్ని కృష్ణ
Sk78
మండే యెండలల్లో
నల్లటి కోయిలసల్లని సెట్టై పాడుతున్నట్లు
పన్నెండు చరణాల ప్రాణం
పల్లవై నిలువెల్లా పారుతున్నాట్లు
ఆ
సందు మలుపు తిరగంగానే
గుండెలోకి ప్రాణం తిరిగొస్తుంది!
గుప్పెడంత ఆశ చిగురేస్తుంది!!
యాసంగి మోడుల్లో
వసంతం పురుడొసుకున్నాట్లు
పూలపాన్పులను పరచి
మధుపాత్రలను కూర్చినట్లు
ఆ
సందు మలుపు తిరగంగానే
అడవిమల్లెల వాసన గుప్పుమంటుంది!
ఆకాశం ఆశల పందిరవుతుంది!!
అమవస నిశిలో
ఆకసానికి కాటుకద్దినట్లు
సుక్కల యెలుగులో సినీవాలి
సుట్టూరా పరుసుకున్నట్లు
ఆ
సందు మలుపు తిరగంగానే
సల్లగాలులు సెమటసుక్కలతో
నెయ్యమొందుతుంటాయి!!
మనుసు సెలిమెలొ
ఊసులగలగలలు ఇనిపిస్తుంటాయి!!
సుక్కలన్ని వొక్కటై
సూరీడై మొలిసినట్లు
సుట్టూరా సీకటి ని
సూరులోకి సెక్కినట్లు
ఆ
సందు మలుపు తిరగంగానే
మనసు మబ్బుల్ల
కొత్త పొద్దు పొడుసుకొస్తుంది
కన్లముందు
వుగాది పర్సుకుంటుంది!!
[11/22, 8:13 PM] కవిసమ్మేళనం: పద్యప్రసూనాలు
మున్నూరురాజు
sk894
సీ॥ సారస్వతములోని సౌగంధ మధువును
ఆస్వాదన జేయ నాశ గలిగి
సహితస్యభావమే సాహిత్యముగ నెంచి
పెంచిపోషించుటే మంచిదనుచు
వాజ్ఞ్మయరూపాన వర్ధిల్లినటువంటి
విజ్ఞాన గ్రంథాల విలువదెలిసి
పరిఢవిల్లిన తెల్గుభాష సోయగముల
భావ వీచికలందుపొందుపరచి
గీ॥ వినిన కొలదింక మనసుకు యింపుగొలిపి
భాష గలద్య్య భువిలోన వాసినొందె
వేరె దేశాన గలదయ్య వెదికిజూడ
అందుకోవమ్మ తెలుగమ్మ వందనాలు.
పశు కాపరి
పాలుదాగెడి చిన్నారి ప్రాయమందు
కలముబట్టెడి చేతిలో హలము బట్టె
పసులగాయుటకే నీదు ప్రాయమంత
యింతలోపల జీవితమింకిపోయె
…………………………………………………………………………………………………
[11/22, 8:13 PM] కవిసమ్మేళనం: $k79
దివాకరశాస్త్రి
వికారాబాదు
సీ:-
నీదినాదనిభావనలతోటిదైవనా
మంబులొక్కటినితారుమారుచేసి
మతతత్వకులతత్వమౌఢ్యాలునెలకొల్పి
సమసమాజముసుగుస్వార్ధమయ్యె
వృక్షాలనీడలోరాక్షససహవాసి
నూహించిపెరిగిరినూతనంగ
సంఘాలునేర్పడిసంఘద్రోహిలుగాను
దేశపుఐక్యతదెబ్బతీయ
మంచిచెడులనెంచితెలిసిమసలకుండ
మానవీయవిలువలనుమంటకలిపి
దేశసంస్కృతీసంపదతెంచిరయ్య
విశ్వరూపహరహరుడవిశ్వతేజ..!
sk79
దివాకరశాస్త్రి
వికారాబాదు.
[11/22, 8:13 PM] కవిసమ్మేళనం: SK No : 19
Name : నాగవెల్లి ప్రసాద్
Place : కరీంనగర్.
.....................…........................
శీర్షిక : అన్నదాతల ఆర్తనాదం
మట్టిని పిసికి,
విత్తులు నాటి,
నీరు పారించి,
మందులు చల్లి,
కోతలు కోసి,
గింజలు తీసి,
బజార్లో అమ్మితే....
అది అన్నమై మన కంచంలో చేరి....
మన కడుపులు నింపింది.
రైతన్న ఐదు వేళ్ళు మట్టిలోకే వెళ్తేనే
మన ఐదు వేళ్ళు కంచంలోకి వెళ్తున్నాయి.
అలాంటి రైతన్న
నేడు చెట్లకి వేలాడుతున్నాడు....
రసం పీల్చే పురుగుల మందు త్రాగి
పురుగుల్లా చనిపోతున్నాడు....
హలం పట్టిన చేతులతో..
హాలాహలాన్ని అందుకుంటున్నాడు..
ఏదేదో చేస్తామని ప్రగల్బాలు పలికిన
నేతన్నలారా.....
రైతన్నలను ఆదుకోలేరా..!
అన్నదాతల ఆర్తనాదాలను తీర్చలేరా...!!
...................................
SK No : 19
Name : నాగవెల్లి ప్రసాద్
Place : కరీంనగర్.
[11/22, 8:13 PM] కవిసమ్మేళనం: భారతాంబ
ఎ. రంగాచారి
పరిగి
sk905
సీ॥ సాహితీ విలసిత సత్కథా రచనలో
క్షణమైననాగని కలమునిమ్ము
పతితపావనమైన ఫలితమ్ము జూపునీ
చరణాల పుట్టిన జలమునిమ్ము
మానవమానముల్ మహిసమానమ్ముగా
తలపోయగలనాత్మ బలమునివ్వు
అజ్ఞానము హరించి విజ్ఞాన సుజ్ఞాన
ఫలములు పండించు పొలమునివ్వు
తేగీ. ॥ దైవభక్తిని మాకబ్బు దారిజూపి
గతము మరిపించు సుజనుల వెతలు దీర్చి
సౌఖ్యసంపత్తిసద్భక్తిశక్తినిమ్ము
శుభమునొసగుచు మాకింక అభయమిమ్ము
ఊహలపల్లకీలోనుండి
ఆలోచనల పొరల్లోంచి
అంతర్మదనంలో ఉద్భవించి
చైతన్యపు వీచికలోంచి
సజీవంగా నిత్యనూతనంగా నిరంతర ఝరియై
సత్ సాహిత్య పరిమళాలను పంచి
నవ్య జగతికి నాంది పలుకు
…………………………………………………………………………………………………
[11/22, 8:13 PM] కవిసమ్మేళనం: Sk21: పూదత్తు కృష్ణమోహన్ , జడ్చర్ల
సైకాలజిస్ట్ తేది : 18. 11. 2015
సహస్ర కవిసమ్మేళనం: వాట్సప్ వేదిక
శీర్షిక : సమయపాలనం
'కల' వరమైనా 'కలవర' మైనా
'లక్ష్యం' భక్షమైనా, ఆ లక్ష్యం 'నిర్లక్ష్య'మైనా
సం'కల్పం' వి'కల్ప'మైనా , పరిపూర్ణమైనా
సమస్యలు 'సునామీ'లైనా
తలవంచి 'సలాం' చేసినా
బౌలరేసిన 'బంతి' వికెట్లను గిరాటేసినా
అదే 'బంతి' 'లబోదిబో'మని కేకలేస్తూ
బౌండరీ ఆవల పడినా
'సమయానిదే' సామర్థ్యమంతా
'సమయపాలనదే' ఘనతంతా
'సమయం' 'సమయమే'
'సంయమనంతో '
ప్రణాళికలతో
'సమయం' 'పని' పెట్టాలి
'పని' ఏదయినా దాని 'పని' పట్టాలి
'ఆ పని' పూర్తయ్యేదాకా
'ఆపని' పరిశ్రమతో పరాక్రమించాలి
పరాజయం 'పనిబట్టి'
విజయ కేతనం ఎగరేయాలి
Sk 21: పూదత్తు కృష్ణమోహన్ , జడ్చర్ల
[11/22, 8:13 PM] కవిసమ్మేళనం: సహస్ర కవి సమ్మేళనము
SK66 పార్వతీ పతి,
సంగారెడ్డి,మెదక్ జిల్లా.
9441688048
శీర్షిక:- అమ్మకు జేజే..
అ,ఆ లకు జేజే.
తెలుసా ఓ యువతా ఇది తెలుగుభాషా వత్సరం
తెలుసా ఓమనసా ఇది మాతృభాషా ఉత్సవం
నేటి నుండి మనమంతా ఒక ప్రతిన బూనుదాము
మాతృభాషా వికాసానికి శ్రద్ధతొ అంకితమవుదాము//తె//
తెలుగంటే అమ్మ పలుకనీ
అది ఎంతో అమరమైనదని
యుగయుగాల మన తెలుగు వెలుగును భావి తరాల కందిద్దా!
అమ్మకు జేజే చెబుదాము
అ,ఆ లకు జేజే చెబుదాము.
అమ్మ బువ్వ తిందాము,
నానమ్మ కథలను విందాము
అమ్మ లేనివాడనాధ అయితే,
అమ్మ భాష నేర్వనోడు ఆగం కాడా!
మాతృభాషను మూలకు నెడితే మనమే మూలకు వెళతాము,
తల్లి భాషను తిరస్కరిస్తే
తలవంపులతో తల్లడిల్లుతాం
తెలుగే పెన్నిధి మనకందరకు నిజాయితీగా ఔనందాం
మాతృభాషకూ పట్టంకట్టి
ప్రగతి పథంలో పయనిద్దాం //అమ్మకు//
[11/22, 8:13 PM] కవిసమ్మేళనం: ID NO: SK54 తేది: 18-11-2015
రచన: పిన్నంశెట్టి కిషన
నివాస స్థలం: హైదరాబాదు
కావితా సంఖ్య: 2
శీర్షిక: కాటగలిసిన వూర
కాటగలిసిన వూరు
నాలుగేండ్లు వలసపక్షినై పోయివచ్చేసరికి
నేపుట్టిపెరిగిన వూరొకటి కాటగలిసిపోయిందిక్కడే
ఇక్కడ నా మూలాలుండేవి, ఆనవాల్లుండేవి, జ్జాపకాలుండేవి
చిన్నప్పుడు నా చేయిపట్టుకుని
నాన్నలా నడిపించుకుని వెళ్ళిన మట్టితోవ
కనుమరుగయింది
నాలుగులైన్ల నల్లని డాంబర్ రోడ్ పింజర
తొవ్వనిమింగేసి
నాలుగురోడ్ల కూడలిలో సుట్టసుట్టుకుని పడుకుంది
దానిమీంచి ఏదిక్కుకు పోవాల్నో దిక్కుతోస్తలేదు
నావూరికి నేను దారివెదుక్కునే దుస్తితి!
బాటెంబటి వింజామరలై పచ్చనిగాలుల్ని విసిరే
పైర్ల జాగల ఫ్లాట్లు వెలిసినవి.
జిట్టరేగుపండ్ల చెల్కలు,
తలపై జొన్నకంకుల ఫించాలు ధరించిన జొన్నచేండ్లు
తాతమీసాలు వేసుకున్న మక్కచేండ్లూ
ఓ పురాజ్ఞాపకం.
వూరితలాపున పెద్దదిక్కోలె పెద్దగుట్టుండేది
జారుడుబండపై జారిన జ్ఞాపకాల్ని
ముక్కలుగానరికి లారీలకెత్తుతుండ్రు
భూమాత వక్షస్ధలిని పేల్చి పెకలిస్తుండ్రు
గుట్ట ఆవసంలో గూళ్ళుకట్టుకున్న
పక్షులు, జీవులు ఏ పరాయిపంచన జేరినవి
మిఠాయి పొట్లాన్ని చిటారుకొమ్మన కట్టుకుని దీపస్తంబాల్లా ఇరువైపులానిలబడి తలలూపుతూ
స్వాగతంపల్కే చెలులుచెట్లను చిద్రంజేసిండ్రు
దారినపోయే దాహర్తుల దూపతీర్చ నేనున్నానని
నీటిస్తన్యాన్ని అందించే అమ్మచెరువు
బోర్లేసిన తపుకై ఎతచెప్పుకుంటుంది
కట్టపైకూర్చుని కవితలల్లుకున్నచోట శిథిలచెదలవేటు
పాడువడ్డ పాడి, కబేళాలకు తరలుతున్న పశుసంపద
ప్యాకెట్లలో పాలు - సీసాల్లో నీళ్ళు అమ్ముతున్న వైనం
నడుస్తున్నకొద్ది పాదాల్లోదిగబడుతున్న నాగరికతముండ్లు
ఆరుబయట ఆటలాడుకునే బాల్యం
సినిమాహాల్లో ఈలలై మోగుతున్నది.
యవ్వనం.. సిటీలో షికార్లయి తిరుగుతున్నది,
బార్లలో బీరుసీసలై దొర్లుతున్నది.
సాయంకాలం అరుగులమీద కూర్చుని వచ్చిపోయేవాళ్ళని
వావివరుసల పలకరింపుల్తో పులకరింపజేసే ఆప్యాయతలు
టీవి ముందర బాసింపట్టేసుక్కూర్చున్నవి.
పురిపోసలు ఉరితాడ్లయి
మొ గ్గాలసప్పుడు ఆగిన శాలోల్లవాడోలె
వూరు మూగవోయింది.
వృత్తుల్తోపాటు వూరూ ధ్వంసమైంది.
కాటగలిసింది ఊరా!
కాటగలిసింది మనిషా!!
-పిన్నంశెట్టి కిషన్. ఇన్స్పెక్టర్, లీగల్ మెట్రాలజీ(తూనికలు-కొలతలు) శాఖ, నిజామాబాద్
[11/22, 8:13 PM] కవిసమ్మేళనం: SK no: 09
name: Mahender
place: karimnagar
date: 18/11/2015
శీర్షిక: సీతాకోక చిలుక
-------------------------------------------
అవనిలోన అందమంటే
నీవేగా ఓ చిలుకా....
ఆ రెక్కల్లోన ఎన్ని రంగులో
హరివిల్లయినా నీలోని రంగుల్ని చూపునా....?
ఆ రంగుల్లోన ఎన్ని కాంతులో
ఆ జాబిలియైనా నీలా ఆకర్షించునా...?
ఎన్ని పూజల్ని చేసిందో ఈ పూవు
నిన్నే ఆకర్షించే అందమెక్కడిది
ఎన్ని ఋతువుల్ని దాటావో నీవు
ప్రతీ ఋతువు నీకు వసంతమేగా
అలలు అలలుగా
నీవలా సాగుతుంటే
నిను కన్న ప్రకృతికి
కనుల పండుగేగా.....
తెరలు తెరలుగా
నీ రెక్కల్ని ఊపుతుంటే
నిను చూసే సకల జీవాలకి
చక్కని దృశ్యమేగా...
నిను తాకాలని గాలి
నీవు వాలాలని పూవు
నిను చూడాలని నేను
ఎంతగా ఎదురు చూస్తామో
ఒకరికొకరం పోటీగా.....
SK no: 09
name: Mahender
[11/22, 8:13 PM] కవిసమ్మేళనం: sk-83
ఇరువింటి వెంకటేశ్వర శర్మ
మహబూబ్ నగర్.
"మకుటంలేని మహారాజు"
ఎవరి ఎజెండాలో లేని వాణ్ణి
ఏ జెండాకు పట్టని వాణ్ణి
గాయాలెన్ని ఐనా
ఖరీదై న ముసుగులో
ఇంటినీ ఒంటినీ దాచుకొని
వర్తమానంలో
అడుగులేస్తున్న వాణ్ణి
నా జీవిత విచిత్ర కథా
పుస్తకంలో వెలిసిన
రంగులద్దు కుంటూ చిరిగిన పుటలను సవరించుకుంటూ చరణాలు లేని పల్లవిని అలుపెరుగక పాడుకుంటూ
కాలంతో పాటు పరుగులు
తీస్తున్నవాణ్ణి
నేనంటే ఎవరికీ జాలిలేదు
ఒక్క కాలానికి తప్ప
మళ్ళీ మళ్ళీ పండుగై
పలుకరిస్తుంది,వసంతం
చిలకరిస్తుంది
పండగలకూ,పబ్బాలకు
పెళ్ళిళ్ళకూ,పేరంటాలకూ
చేసిన అప్పుల కుప్పను
గుండె గదిలో ఓ మూలకు
నెట్టి ప్ర శంసా చూపుల్లో
మెచ్చుకోలు మాటల్లో
ఆనందాన్ని వెతుక్కొనే వాణ్ణి,
పదిమందికి పప్పన్నం
పెట్టాలన్నా పది సార్లు
ఆలోచించడం అలవాటు
చేసుకున్న వాణ్ణి
అధికారం ప్ర కటించే
ప్ర తి పథకానికి నా జేబొక
అక్షయ పాత్ర ప్ర తి బరువునూ బాధ్యతగా
మోస్తూ పెద్దరికాన్ని
ఒలకబోస్తున్న వాణ్ణి
సమస్యల చిల్లులెన్ని ఉన్నా
నిండు కుండలా కనిపించే
సగటు జీవిని
మధ్య తరగతి సామ్రాజ్యానికి
మకుటంలేని మహారాజును.
[11/22, 8:13 PM] కవిసమ్మేళనం: సహస్ర కవిసమ్మేళనం
వేదిక:వాట్సాప్
తేది:18-11-2015
sk:64
నిర్మలారాణి తోట
శీర్షిక: బతికే ఉన్నావా..??
....................................... నిర్మల
కొండల గుండెలను తొలిచి ఆకు పచ్చని వలువలన్నీ ఒలిచి
అక్కడా కారు చీకటి తారు రహదారులను మెలితిప్పే స్వేదాలతో
ఆకాశపు ఎత్తుల్ని గేలి చేస్తూ ఆకాశ హర్మ్యాలను పైకెత్తిన కండరాలతో
మనుషులమేనా మనం?
గుండెలను మారుస్తూ పాలపుంతల్ని చేధిస్తూ యంత్రాల్లో శ్వాసకు జన్మనిస్తూ
దిగంతాల్లో రెక్కలిప్పుకు విహరిస్తూ చుక్కల్ని చుట్టి వస్తూ వెక్కిరిస్తూ
రిక్త హస్తాలతో అంకురించిన లేలేత జీవాన్ని దిక్కుల వరకూ విస్తరిస్తూ
మనుషులమేనా మనం?
ఏదో ఒక చైతన్యం వెలిగించిన జీవనపు కాగడా చేత పట్టుకొని
కన్నుమిన్ను కానని కండకావరంతో విర్రవీగుతూ
ఎల్లలు లేని ప్రపంచాన్ని కళ్ళు మూసుకుని పుతుకుతూ వెతుకుతూ
రెండో సృష్టి ఆవిష్కరించి గబ్బిలాల్లా తలకిందులు వేలాడుతున్న దుర్వాసులమేమో కదా..!
పీల్చే గాలిని,తాగే నీటినీ కొనుక్కునే దురావస్థలో
నింగికి నేలకూ నడుమ నీ తలకు నువ్వే కొరివి పెడుతూ
నీకు నువ్వే కరువైన ఎడారి ఎండమావుల్లో
నువ్వింకా బతికే ఉన్నాననుకుంటున్నావా..??
మీట నొక్కే వేలు తప్ప మాట నీది కాదు
మూట కట్టే రాళ్ళు తప్ప మనసు నీది కాదు
పెదాలపై చిలికించే ప్లాస్టిక్ నవ్వు తప్ప విచ్చుకునే స్పందన నీది కాదు
పరదాలపై చూపించే ప్రతిబింబాలు తప్ప వెలిగే ముఖమూ నీది కాదు
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అని ఇంకా శవాల గుట్టల్ని చూసి మురిసిపోతున్నావా?
నిన్ను నువ్వెప్పుడో సమాధి చేసుకున్నావ్
సమాధిపై అందమైన ఘోరీ కట్టుకొని
దానిపై చల్లుతున్న పువ్వుల్నీ, అందుతున్న పూజల్నీ
చూసి మురిసిపోతున్నావని లోనున్న శవం కుళ్ళి కృశించి
కంపు ముక్కు పుటాలు అదరగొట్టేదాక అర్ధం కాదా..!
ఈ జగత్తంతా మరో గమ్మత్తైన ఈజిప్టు పిరమిడుగా మారిపోతే
మరో గ్రహాంతర వాసులంతా తరలి వస్తారేమో వింత చూడడానికి..!
Nirmalarani thota
SK no.64
karimnagar.
cell: 7659990597
[11/22, 8:13 PM] కవిసమ్మేళనం: SK-4..
Harishkumar..
Shadnagar...
కాలమా నీ దారెటు?
***
శతవత్సరాలపైబడినది
చిరునవ్వులు మాకు దూరమై ...
మానవత్వపు జాడలసలే
కన్పించుట మానె,...
పగల నడుమ విలువలు కరువై
ప్రతీకార వాంఛల నడుమ ....
మమతలు మసియవుతున్న భయము...
కళ్ళవెంట గోచరిస్తున్నది,
సాటి మనుజుల కీర్తినొంద
సేయవలసిన కృషిని మరచి
దుష్టశక్తులు సహింపకుండె
దాష్టీకం సలుపవట్టె,
ఉమ్మడి కుటుంబాలు మచ్చుకు
లేక,సంబంధాలు కరువై
తల్లిబిడ్డలను యెడవాపుట
ప్రథమ కర్తవ్యమయ్యె,
వెలుగు నీడలు సామాన్యము
ఇది జనులు గ్రహింపలేరని
చీకటి తోడయింది వీరికి
వెలుగు మరిచిరి దానితో,
స్వార్థపరుల దాహాలకే
నైవేద్యాలందించు వరకు
మనుషుల ఆకలి కానరాదు
మనుగడిక ఉండదు,
సమాజాన్ని మార్చగోరి
జీవితాలను త్యాగమిచ్చిన
మహాత్ములిపుడున్న,వారిని
ఏమిసేతురో జనులు మరి,....???
SK-4..
Harishkumar...
[11/22, 8:13 PM] కవిసమ్మేళనం: SK-4
Harishkumar..
Shadnagar..
ఆకలి కేక
***
కలలు కల్లలాయె,
కడుపు మంట మిగిలిపాయె
పొద్దు గూకుతున్నది,
పక్షి గూటికిజేరుతున్నది
కరెంటుబల్బు లేదాయె,
ఎక్క వెలుగే దిక్కాయె,
కలలు కల్లలాయె,
కడుపు మంట మిగిలిపాయె.
పోయిలపిల్లి లేవనంది,
కడుపు రగిలిపోతుంది
గంజినీరు కరువైంది,
కుండనీరు దిక్కైనది,
కలలు కల్లలాయె,
కడుపు మంట మిగిలిపాయె.
పట్టెడన్నంబెట్టలేక,
ఆలుబిడ్డల ఉసురుబోసుక
దేవుడయ్యా ఎందుకయ్యా ఇంతనీచపు జన్మనిస్తివి,
కలలు కల్లలాయె,
కడుపు మంట మిగిలిపాయె.
పండగొస్తే అందరింట్లా
అదిరిపోయే వంటలెట్లా?
ఆబగాసూసే బిడ్డకెట్లా
చూపనయ్యా నాముఖమునిట్లా
కలలు కల్లలాయె,
కడుపు మంట మిగిలిపాయె.
పెట్టనేర్చిన సేతులేమో
సాచి బిచ్చమెత్తననే
నట్టింట్లా లేమితనం బజారునకీడ్చననె
కలలు కల్లలాయె,
కడుపు మంట మిగిలిపాయె.
ముసలితల్లి రోగానబడితే
రక్తమమ్మి ఋణందీర్చుకుంటి
నాకో మాయదారి రోగమొస్తే ఆలిపుస్తేలమ్మవచ్చే ,
కలలు కల్లలాయె,
కడుపు మంట మిగిలిపాయె.
భారమైన బ్రతుకుతోటి
వేగలేక విసుగుబుట్టి
తనువు చాలిద్దామనుకుంటే
చావు నన్ను వెక్కిరించే
కలలు కల్లలాయె,
కడుపు మంట మిగిలిపాయె...
SK-4...
Harishkumar...
[11/22, 8:13 PM] కవిసమ్మేళనం: Sk. 193. SK. SHAMSHEER AHMED . ONGOLE.
సహస్ర కవి సమ్మేళనం
కవిత పేరు,--మిథ్యామూర్తిమత్వం!!
భూమ్మీద ఏభవంతీనిలవదు
తవ్వి పునాదుల్లో బందీ చేస్తేతప్ప!!
కాళ్ళసలానవు మనిషికి
సమాజపునేల మీద!!!
కులమతాల ఇనుప సంకెళ్ళను వేసుకుంటే తప్ప!!!
నిజాలు నిముషం బ్రతకలేవిచ్చట!!
వాటిని ఇజాల భేషజాలుగామార్చి
భేతాళ మంత్ర కథల్లో కూర్చితే తప్ప!!!
గాలిమేడలకు గాలే పునాది
ఊహల మర్రికి ఊడలేరెక్కలు
అబధ్దాలకు పుకార్లే ఊపిరి
ఆకాశంలో దేవళం లేదు మసీదూలేదు
చర్చీ లేదు!!!!!!
పాపం! మనిషి----
ఏమీలేని ఆకాశపు ఉరికొయ్యకు తననుతాను
ఉరేసుకుని వేలాడుతున్నాడు!!!
ఆకాశం చావదు
అవనీ అశువులు వీడదు!!
ఈరెంటిమధ్య మారణ హోమంలో మరణాతీత హింసలో కలికాలం జ్వలిస్తూ చరిస్తోంది!!
మనల్ని అమలానంద దగ్ధ మూర్తుల్ని చేస్తూ!!
అంతానికి --అనంతానికి మధ్య మిథ్యా మూర్తుల్ని చేస్తూ!!???
[11/22, 8:13 PM] కవిసమ్మేళనం: నిత్యం అనునిత్యం సరికోత్త జగత్తు
వికసించే ప్రగతికి విగ్నానమే విత్తు!
అనుక్షణం మారును ఆలోచనల అంచు
మరుక్షణమే నీవు ఆ మార్పు గ్రహించు!!
విలువల మాటుగా వికాసమే బాటగా..
సమభావన చాటగా పాటుపడవా ధీటుగా...
పారే సెలయేరుకు ఊరనేది ఉంటుందా..?
ఏగిరే ఆపక్షి ఏ ప్రాతమో తను చెబుతుందా..?
వీచే గాలికి వివక్షతనేది ఉందా..?
పాపాయి నవ్వుకు భాషనేది ఉందా..?
కళలకు కులముందా...?
మట్టికి మతముందా...?
ఏంత వెతికినా దోరకవు అది ప్రక్రుతి తీరు.
వింత పోకడలను విడిచి ఇపుడైనా మారు.
వీచే గాలి ప్రతివాని మేలు కోరింది!
పారే సెలయేరు అందరూ నీవారంది!
పంచభూతలకే లేని పంతం మనకెందుకు?
ప్రతిభంధకాలు ఏందుకు....
ప్రగతిదారిలో నీవు సాగవోయి ముందుకు!
Sk:80
Name: rajiv reddy
[11/22, 8:13 PM] కవిసమ్మేళనం: S.K 31. D.SYAMALA .shadnagar.
సహసస్ర కవి సమ్మేళనం,,
కవిత పేరు -గిల్ట్ ఆఫ్ ఎమోష.న్""
మృత్యువు మనుష్యులను అంతరిక్షంలో శాశ్వతంగా కూర్చోబెట్టడం తెలుసా?
మృత్యువు మనుష్యులను తారలుగా మార్చడం మీకుతెలుసా?
మరణం వెంట మహాశూన్యం
ఉంటుందని మీకు తెలుసా?
ఆవెంటనే అది ఒక గొప్ప ప్రేరణతో భర్తీ అవడం మొదలౌతుందనీ తెలుసా?
అందుకే!! అందుకే!!!!
నా కనురె
ప్పల్ని దోసిళ్ళుగా మార్చాను
ఆకాశం నుంచికురిసే వెన్నెల వర్షాన్ని ఒడిసిపట్టుకుని తాగాను!!
అయినా ఈ గుండెగొంతుక దాహంతీరదు!!
మల్లెపూలతోపాటువేడిగాలులూ తప్పవు!
దారితప్పి వాకిట్లోకి వచ్చిన వసంతం
చైత్ర మాసంలో ఎండ కాస్తుంటే ఎంజాయ్ చెయ్యం!!
చల్లని మంచు కావాలని కోరుకుంటాం!!
కార్తీకమాసంలో మంచుపడుతుంటే ఆస్వాదించం!!
వెచ్చని ఎండ కోసం పరుగెడతాం!!
అందులోంచి బయటకొచ్చి
మనం ఉన్న పరిస్థితుల్ని
మనచుట్టూ ఉన్న వాస్తవాల్ని
ప్రేమించడమే జీవితం!!?
ఆత్మీయపరిమళాల్నితనివితీరాఆస్వాదించాలి!!
స్వేదబిందువుల్ని
అద్దుకొని పరవశించాలి!!
అందుకే!! జీవితమంటే!!
ఆనందమా! విషాదమా!భవమా అనుభవమా!!
అన్ని భావాలూదాటిపోయిన వేదాంతమా!!
వెలుగు ఎక్కువైతే మిగిలేది
చీకటేనట!,?
కళ్ళుమాటాడిన తర్వాత పెగలిన పెదవులు చిగురుటాకుల చినుకుల్లా తాకి నాలో--- నా లోలో--- అన్వేషించిన భావన.,,!!!!!
నేనూఒక మిణుగురునై చప్పున వెలిగి తారల చెంత చేరాలని నాలో!!! నా లోలో "" ఎమోషన్ ఆఫ్ గిల్ట్ """!!
[11/22, 8:13 PM] కవిసమ్మేళనం: **బతుకు పూల సోగడ**
----------------S k 8
మద్దికుంట గ్రామము
మానాకొండూరు మండలం
కరీంనగర్ జిల్లా
తెలంగాణ 505 505
సెల్ 9949247591
***కూకట్ల తిరుపతి***
---------------
పడావు పానసరంగ పన్న జాగల
పలగ్గొట్టుకొని పుట్టిన గునుగుపువ్వు కోక
బూదావర మొలకు యెన్నెల తున్క చుట్టినట్టు !
గుట్టంత చెట్టయి
గుమ్మంత గుబురు యిగుర్ల తంగేడు తుట్టెలు
యిరగ బూసిన పస్పు రాశుల కల్లాలే !
గుడిసెల పెయ్యికి వొత్తుగ
నరాలయి పాకిన కట్ల తీగెల
నిరసన పువ్వుల నింగి శికెల ముడుసుకుంటది
ఆయిటి పొరుపు పదునల
ఏనుకొన్న యెండిపోయిన దుంపలు
కుద్దుగ మొండాల కండ్లకద్దుకొన్న వుద్దరాసులు
సిమ్మసీకటి సుట్టుకొన్న జాడల
యెతల కతల లోతులెతికి
ఎరుపెక్కిన కండ్ల పొదల మందారాలు
ఎడ్లు పండుకొని పగ్గాలు మేసినట్టు
పెంటబొందల పెనేసిన పానం
కట్రౌతు కుప్పల కావలిచ్చుకొన్న కనికరం
పందిరిని పైడి ముడిసిన పావురం
ఎనుగులను ఎదలకద్దుకొన్న తాగెం
ముత్తైదువుల పస్పు కుంకుమ బరిణెలు
గురత్తపు పుట్క గుమ్మడి యెదల
ముద్దులొలుకు ముద్ద గౌరమ్మలు
నెనరు పండిచ్చు గోరంటలు
మతిమంతుల్లా చేమంతులు
ముచ్చెట వెట్టు ముద్ద బంతులు
తెల్లారే తలిగనే మురిపెంగ తొంగి చూస్తయి
తాంబాలం తనువుల వొదిగి యెదిగి
బతుకు పండిచ్చుకోవాలనీ
ఉవ్విళ్ళూరుతూ వుప్పొంగుతయి
సబండ చప్పట్లు బలపడంగ
ఎట్టి కొట్టాల ముంగట
కట్ట నిట్టూరాల కలవోసుకున్న తండ్లాట
ఒక్కేసి పువ్వేసి రాశి వడవోసి
నిలువులెత్తు నిరసన రూపులెత్తి
నింగినంటిన బతుకు పూల జాతర
సొట్టువోయిన బత్కుల సేతవడుతది
కూకుండి కూసేటి కూకేటి పాములు
రక్తం పిండేటి రక్త పింజరలు
మన్నునూ వొదలనీ మన్నేరు గుంజల
పటతోపం అడుగంటంగనే!
సద్దుల సత్తు ముద్దలు సాయారానికత్తయి
సిబ్బుల్ల వాయినాలు సంబుర పడ్తయి.
[11/22, 8:13 PM] కవిసమ్మేళనం: SK267
Kunta Gangareddy
Bheemgal.mdl,
Nizamabad dist,
TS.
State President
TIKP(SERP)Union
"అమ్మ.. అనిర్వచనీయం.."
***
కనిపించె ప్రత్యక్ష దైవం అమ్మ ను నిర్వచించాలంటె..
"అ" అంటె అనురాగం, ఆత్మీయత
"మ" అంటె మమకారం, మాతృత్వం అని నిర్వచించాలనిపించింది..
కారణం,
మన ఆరోగ్యం కోసం అమ్మ వారానికి 3రొజులు పస్తులున్నపుడు-
అనురాగానికి,ఆత్మీయతకు మరొ రుపు కనిపిస్తె,
పురిటి నొప్పులను సైతం పుణ్యఫలితంగా భావించి మనకు జన్మనిచ్చినపుడు మాతృత్వానికి అంతరార్థం గోచరిస్తుంది..
లేగ దూడ క్షీరాస్వాదనకై ఆవు ఎదను విదల్చి కొడుతున్నపుడు భాధను లెక్కచేయకుండా తన బిడ్డ క్షుద్భాదను తీరుస్తూ తన బిడ్డ తోకను నాలుకతో ప్రేమగా నిమిరే సుందర దృశ్యం అమ్మతనంలొ కమ్మదనాన్ని చూపుతుంది..
మన సృష్టికి మూలమైన అమ్మ
అనురాగం,ఆత్మీయత,మమకారం,మాతృత్వం ఇవన్నీ
అమ్మ ప్రేమకు ఆనవాలె తప్ప, అసలైన నిర్వచనం కాదనిపించింది..
అందుకే..
అమ్మకు అసలైన నిర్వచనం కేవలం మన "అమ్మ"మాత్రమే
అని చెప్పాలనిపించింది..
SK267
Kunta Gangareddy
[11/22, 8:13 PM] కవిసమ్మేళనం: Sk943
ముద్దు ప్రణవ శాస్త్రి
ఉదయాన్నే లేచేటి కల్లాపి చల్లేటి చెల్లెలేరి నేడు పల్లెలోన
కల్లాపి నీళ్ళని కొళాయి పైపు ప్రెస్సరు క్రింద కోట్కపాయే
రంగు ముగ్గులు వేసే వారొక్కరూలేక
ప్లాస్టీకు స్టిక్కరు వెక్కిరించే
అమ్మలక్కలు గూడి ముచ్చటించాలంటే
TV సీరియల్ వాళ్ళ విడువదేమి
పొద్దుపోయే పూట పోరగాల్ల ఆట
Candy Crush Game కింద నలుగవట్టే
ఊరిగాద్దే మీద ముచ్చటించే వారు
WhatsApp group లో వాదులాడే
చంక కింద చేర్చి చందమామను చూస్తూ
తాత చెప్పిన కథలు POGO ఛానలు పోగు చేసే
వారంకు ఒకరోజు వచ్చేటి మామయ్య
SKYPE కూర్చుండి హాయి చెప్పే
అమ్మమ్మ చెప్పేటి తెలియని విషయాలు
Google అమ్మమ్మ గుట్కె విప్పే
అక్కయ్య పెళ్ళికి వచ్చేటి చుట్టాలు
Facebook లోన LIKE కొట్టే
చల్లటి సమయాన వేసేటి బజ్జీలు
పార్సల్ల రూపంలో ఇంటికొచ్చే
కొళాయి నీళ్ళకు బిందె పట్టే అత్తా
మినరలూ నల్లాను విప్పి తిప్పే
సద్ది బువ్వలోని ఆవకాయ బద్దను
బిర్యానీ ముక్కలు పిస్కి పట్టే
శరబతు,లస్సీలు అమ్బల్లు జావలను
కొకకోల మామ ఈడ్చి తన్నే
వేలు అంచును పట్టి వీధులు తిప్పే నాన్న
బైకు పై ,కారుపై కలిసి తిప్పే
పెన్ను పేపరు పట్టె చేతి రాతలన్ని
KEY BOARD చాటునా కీచుమనేను
ఇంత మార్పు వచ్చి ప్రేమలన్నవి చచ్చి
వందేల్ల ఆయువు అర్ధమయనే
Sk943
ముద్దు ప్రణవ శాస్త్రీ
[11/22, 8:13 PM] కవిసమ్మేళనం: Sk17
రామానుజం సుజాత కరీంనగర్.
"మా రాజు "
అతడు,
ప్రపంచాన్ని నడిపించే సృష్టికి
మూలాధారుడు
అతడు,
ప్రకృతి లోని ఋతు గమనానికి
అనుసంధానుడు
అతడే,
మానవ మనుగడకు
చిరునామా ధారుడు
అతడు,
రాజ్యాలు లేని మహరాజు
కిరీటం లేని మా రాజు
అతడు,
ఏ చదువు సంధ్యా లేని
జ్ఞాన సంపన్నుడు.
కానీ
అతడు
వట్టి కాళ్ల నడుస్తడు
గంజి నీళ్లు తథాగతుడు
ముతక బట్టలే వేస్తాడు.
ఆ సామి
కోడి కూతకే లేస్తడు
హలాన్నే పడతాడు
నేలను చదును చేసి
దుక్కి దున్ని
సేద్యమే చేస్తాడు
విత్తిన మూలానికి
గాలై, నీరై
ఫలాన్నిచ్చే పంటకు
ప్రాణమౌతడు.
అతడు
భూమిని నమ్ముకున్న
పుడమి బిడ్డడు
మట్టి పొరల చీల్చి
మెతుకు బంగారం పండిస్తడు
ఆరుగాలం శ్రమించి
కుప్పలు కుప్పలు సిరుల
గుమ్మరిస్తడు
ఆ రైతు రాజు సుసంపన్నుడే
ఆకలి తీర్చే అన్నదాతే ఒకనాడు.
కాలానికి ఏ మాయరోగమొచ్చిందో ఏమో
అతివృష్టి, అనావృష్టి, మనిషి సృష్టి
మా రాజును పగబట్టి
నెర్రెలు బారిన నేలపై కొనఊపిరులనుంచింది
ఆ తండ్రి ఇప్పుడు
ఆధునికత ముందు
దళారుల ముందు
పాలకుల ముందు
ధీనంగా చేతులు జోడించి,
దిక్కెవరు లేరంటూ
గుండె పగిలిన మా రాజు
ఉరి కొయ్యల వేలాడితే?!
రైతు లేని లోకానికి
నువ్వెందుకు నేనెందుకు
రాజ్యాధికారులెందుకు!?
అంతా శూన్యమయ్యేదాక చూస్తారా
రండి చలనం లోకి
పాలకులారా!
ప్రజలారా!
రైతు పక్షాన నిలబడదాం
అన్నదాతను కాపాడుకుందాం.......
Sk17
రామానుజం సుజాత కరీంనగర్.
[11/22, 8:13 PM] కవిసమ్మేళనం: SK267,
Kunta.Gangareddy
Bheemgal
Nizamabad.dist,
TS..
State President
TIKP(SERP)Union
యాది..
***
నెస్తమా.. మన 'స్నేహం' అనే 'పుష్పం' నీ "పలకరింపు" అనే 'పరిమలం' కోల్పోయి చాలా క్షణాలయ్యంది..
ఆ 'సువాసను' ఆస్వాదించే భాగ్యం నా "చెవులకు" ఎపుడు కల్పిస్తావు?
కవిసమ్మేళనం: ఎస్. కె. 32
విలాసాగరం రవీందర్
కరీంనగర్
శీర్షిక:
అమ్మ పలుకు శిలువే..?
--------------
నేనొక అమ్మ బొమ్మను గీస్తాను
ఆత్మీయతనంతా రంగరిస్తూ
వాడొస్తాడు తుడిపేస్తూ
ఒక నిర్జీవ
ఈజిప్టు మమ్మీని మోసుకొస్తూ
నాన్న ప్రతిరూపాన్ని చిత్రిస్తాను నేను ప్రేమాభిమానాల కుంచెతో
డాడీ అంటూ దుమ్ములో కలిపేస్తాడు వాడు రూపాయల కట్టల్ని లెక్కిస్తూ
"అ అమ్మ, ఆ ఆవు , ఇ ఇల్లు" అంటూ
అక్షర దీపాలను వెలిగిస్తుంటాను నేను
విశాలమైన మా వూరి బడి లో
"ఏ ఫర్ ఆపిల్ , బీ ఫర్ బాల్ ,
సీ ఫర్ క్యాట్" అంటూ అందమైన రంగుల బొమ్మలతో అలరిస్తూ
నవ్వుల బాల్యపు పువ్వులను చిదిమేస్తూ
పట్టణ ఇరుకిరుకు అపార్టమెంటు పెట్టె
ఈ-టెక్కు స్కూలు నుండి
'వానమ్మా వానమ్మా
ఒక్క సారన్న రావమ్మ' అంటూ
పిల్లలకు ప్రకృతి పాఠాల్ని బోధిస్తుంటాను నేను పాటల రూపంలో
'రేన్ రేన్ గో అవే' అంటూ
గోడకు తగిలించిన బుల్లి తెరలో
కదిలే బొమ్మలను కంటినిండా చూపిస్తూ
విష సంస్కృతిని నూరిపోస్తాడు వాడు
పచ్చ నోట్ల పాముల్ని లాలిస్తూ
ప్రాచీన భాషా హోదాను తగిలించి
ప్రపంచ సభలను నిర్వహించి
భాషా ఋణం తీర్చుకుంటాయి ప్రభుత్వాలు
'భాషా బోధకుల'తో దశాబ్దాలుగా
నిర్లజ్జగా వెట్టి చాకిరి చేయిస్తూనే
కేజీలకొద్దీ పీజీల వరకూ ఆంగ్లమాధ్యమాల్లో
ఏలినవారే చదువుల్ని జోకిస్తారు
ఓట్ల పంట దిగుబడికి
మరోవైపు స్మార్ట్ కిడ్స్ జెన్నెస్ట్
ఐఐటి తోకల పేర్లతో జనాల జేబులకు
చిల్లులు పడుతూ నే వుంటాయి
టీచర్లను అర్థాకలితో చంపేస్తూ,
కార్పోరేటు కరుణను ఒలకబోస్తూ
ఇంకోవైపు క్రమబద్ధీకరణ పేరుతో
మాతృభాషా పాఠశాలలు
పురావస్తు శాలలకు తరలించబడుతుంటాయి నిరుద్యోగం, పేదరికం
నెత్తీనోరు బాదుకుంటున్నా...
భాషా వ్యాపారంలో పోటీ తట్టుకోలేక
కళ్ళు తేలేస్తుంది అమ్మ భాష
శిలువ వేయబడుతున్న క్రీస్తులాగా...!
- విలాసాగరం రవీందర్
కరీంనగర్
9440932934
ఎస్. కే. 32
పై కవితలపై మీ అభిప్రాయాలను తెలియజేయగలరు
ReplyDeleteపై కవితలపై మీ అభిప్రాయాలను తెలియజేయగలరు
ReplyDeleteమీ కవితలు బ్లాగ్ లో చాలా బావున్నాయి. చదవాలనిపిస్తోంది. మీ శ్రమకు అభినందనలు. కవితలు రిపీటయ్యాయి. చిన్న లోపం. - మాకినీడి సూర్య భాస్కర్, ఎస్. కె - 192, కాకినాడ, 9491 50 4045
ReplyDelete