గోగులపాటి కృష్ణమోహన్

My photo
కవి, రచయిత, జర్నలిస్టు.

Sunday, 22 November 2015

దేశపతి కృష్ణమూర్తి గేయాలు


దేశపతి కృష్ణమూర్తి, మెదక్ జిల్లా.

దేశపతి కృష్ణమూర్తి
🙏617
@27
#################
   LORD(లోక నాయకుడు )
                    🙏
God's nature is His good nature 
Almighty dwells in well not veil
Meadows , doves, fountains and groves
Bowing clouds , nearing the gleaming rainbow 
His melodious murmuring in the running lake
Who embraces in mountain mist, 
Soul stirring breeze soothes inert heart 
Fears and tears flee in the new dusk 
Fresh hopes are in His lap
Omniscient succors in defy
Omnipresent recasts in eventual talent, 
Oh ! My soul never parry utmost hope
Just Cherish  His exhilarating Reverence

నా ఆంగ్ల కవిత భావావేశం 🍅తెలుగు లో 
భగవాన్ ! 
నీ ప్రకృతి తెలుపు నీ దివ్యమైన తనము 
నీ నివాసం పరదా లేని స్వచ్చత లో 
నీ దర్శనం మైదాన , పావురాల, సెలయేరుల , తోటల సౌందర్య ము లో 
కదులుతున్న మేఘం , చేతి అందునా అన్నట్లు ఉన్న రంగురంగుల ఇంద్రధనుస్సు సోయగం లో 
స్వామీ ! మీ గుసగుస ధ్వని కదిలే నీటి ప్రవాహం లో 
మీరు మమ్ము ప్రేమ తో పొగ మంచు తో ఆశీర్వదించి పిల్ల గాలు ల  తో  మనసు ను రంజింప చేస్తారు 
నిన్నటి సూర్యుడి రూపం లో నేడు మరల  కరుణించి భయం - బాధ తొలగించి , మీ ప్రేమ ఒడి లో మేము ఎప్పుడూ ఓడిపోని ఆశలు రేకెత్తించి సవాలక్ష సమస్యల నుండి కాపాడి , తెలివిని పెంచి పోషిస్తూ ఉంటావు . 
ఓ మాయదారి మనసా ! 
నమ్మకం వీడక 
నడత చెడకుండా దైవ మార్గము లో పయనించి న 
దైవం నీ రక్షణ చేయు సదా ! 🌹🌹🌹🙏🌹🌹🌹

🌹యతుక్రుపాలేశ మాత్రేన 
ముకో భవతి పండిత : 
వేద శాస్త్ర స్వరూపాo తాo
వాణి o వీణా కరం భజే 🌸
మౌనం చేవ లేనితనము  కాదు 
అది గోడకు వేలాడే AK47
లాంటిది 
అవసరం వస్తే పేలుతుoది 
మౌనం అవసరం 
ఎన్నడు మాట ను జాగర్తగా వాడాలి 
ఎందుకో తెలుసా 
అది తూటా లాంటిది 
🌑🌕దేశపతి 🌕🌑🌹
Life is a knife 
Which cuts our birthday cake some times others birth too
we need attitude 
Which keeps us on  altitude 
man is not a machine
who eats nuts but has  not as a tool
H(ear)t has  an ear 
He(art ) has art 
Who uses above is said to HEart ful person 
If not a two legged beast 
🌑🌕🌑🌕🌑🌹 దేశపతి 

తెలుగు 🌹వెలుగు 
- - - - - : : : : : - - - - - 
తేనె లోని మాదుర్య o 
చెరకు లోని తీయదనం కలగలిసిన తెలుగు పదం 
నన్నయ రమ్యమైన పద్యం 
పోతన భక్తి  పొత్తము తెలుగే 
తిక్కన చిక్కని తెలుగు పాకం 
ఎర్రన భారతo తెలుగు రథం 
మొల్ల సీతా పతి జిలుగు 
శ్రీ నాధుడే వండే కాశీ బాండo 
మర్రి పిన వీర గారే తెనుగు 
అష్ట దిక్కు ల అష్ట దిగ్గజాల యశo తెలుగే 
అల్లసాని వెలిగే ఆంద్ర పితామహు డై
న oదితిమ్మ న అల్లే పారిజాతతోరణం 
ధూర్జటి శివ పూజ తెలుగు పుష్పం 
తెనాలి రాముడు తెలుగు వికటకవి 
గిరిజ కళ్యాణ o లో పింగళి హారతి 
చేమకూర చేవ తెలుగు జిలుగు 
తీయగారాజు కీర్తన క్షేత్రయ పదాలు తెలుగు తల్లికి పసుపుకు o కు మ లు 
మన వేమన ఆట వెలది - మతి పెంచే సుమతి పద్యం 
సుభాషితం - చాటువు తెలుగే 
ఆవధానము మన కే చెల్లు 
జాణ జానపదము జిలేబి 
తెలుగు వీణ అన్న దాశరథి 
సి : నా : రె : ఎక్కే జ్ఞాన పీఠంన 
తెలుగు అన్నమయ్య కవిత కు  దేవుడే దాసుడు 
రామదాసు కీర్తి 
జంధ్యాల సుమo
శ్రీ శ్రీ ఖడ్గం 
కాళోజీ జీవన గీతం 
గజల్ - హైకూ - పాట - పద్యం - కైత - తెలుగు మిఠాయి లు 
ఏ దేశ మేగినా పొగడరా నీ తెలుగు తల్లి బాసర మాత ను 
🌸🌸🌸🌸దేశపతి కృష్ణ మూర్తి 🌸🌸🌸🌸

🌹నిజమైన ప్రేమ అంటే 🌹
ప్రియమైన 
వ్యక్తి 
వస్తారని 
ఆశ తో 
ఎదురు 
చూస్తూ 
రా గా నె 
తన్మయత్వం లో 
కనీసం 
ఆహ్వానించ
 పోవడం 
ప్రియమైన 
వ్యక్తి 
వెళుతూ ఉంటే 
విరహ బాధ లో 
వీడ్కోలు 
చెప్పక
పోవటమే 
నిజమైన ప్రేమ 🌹
దేశపతి 
🌴🍀మనిషి ఒక నిషే 😂
చెట్టు ను చంపి 
కాగితం 
చేసి 
కాగితం మీద 
పొయెట్రీ  
SAVE TREES
(Every year 7lakh trees are cut to make pencils )
🌹దేశపతి 🌹617 $k

నగరం ఒక సాగరం 
- - - - - - - - - : : : : : - - - - - - - 
అది నవనవలాడు సుమo
కాదు ఒక ధూళి పుష్పం 
రంగురంగుల ప్రపంచ o 
జిలుగుల సాయంత్రం 
రోడ్దు పైన జీవ జీవనం 
బజారే బతుకు వనం 
కూటి కోసం కూలి కోసం 
తల్లి ని ఆలి ని పల్లె లో వదిలి 
చలిలో మూసిన దుకాణం ముందే శేష వస్త్రాల తల్పాల 
కాంక్రీట్ జీవాలు 
కొందరికి కార్ల లో సరదాలు 
ట్రేఫిక్ జామ్ లో 
మాట్లాడే శవం 
అడుక్కు o టు o ది 
విదిలించుకుని కొందరు 
విదిల్చిన వారెందరో 
తాగి పారేసిన బీడీ లా 
సగం కాలిన జీవ కళేబరాలు 
సిగ్గు ను ముగ్గులా 
పరిచే నిరిపేద అమాయకo
చార్మినార్ సాక్షి గా 
మైనర్ ల పై రౌడీల జోరు 
ఆకాశం ముద్దాడే మేడలు 
పాతాళాo లో గుడిసెలు 
మోరిలో ఘోరి లో 
మనకు నైబర్లు 
కాక పోతే పందుల పన్నీర్ వాసన 
ఓటు వారసులు 
సీసాల ప్రజాస్వామ్య విజేత 
గ్రేటర్ బతుకు 
ఇమ్లిబను బెంచీ నడుగు 
మూసీ దగ్గర మాసిన మొఖానికి రూపాయ ఆరాట పోరాటం 

నిర్మాణ నిర్మూలన నిర్వేద సారము 
డబ్బే జల్సా 
జబ్బుతో వలస 
యవ్వన ఎరుపు తో వలపుల సాగు 
నిరుద్యోగం @విద్యనగర్ 
సోకుల కూ(కట్ )పల్లి 
Tankబండ్ బజ్జీ కాలుష్యం 
సందుల్లో మాదక మా ర కమ్ 
కారులో ఊరేగే శునకాలు 
నే తి మిఠాయి  రెడ్డి దుకాణం 
నీ తి మాటు మాయం కణo 
దిల్ లేని దిల్సుఖునగరo
భాగ్య వంతు లాదేన 
భాగ్యనగరం
 🙏ఒకనిరుద్యోగ  మిత్రుడి మరణం కదలికే ఈ కవిత - 😂దేశపతి 

దేశపతి 617 🌑🌓🌔🌕
- -- - : : : : : : : : : : : : : : - - -
అంశం 🌴ఓటమి 
విజయ o ఒక విలాసం 
అపజయం ఎప్పడూ అనాధే 
సమస్య సo ద్రమై తే 
విశ్వాస నావ తో ఆవలి గట్టున చేరి సo బర పడాలి 
ఏడిస్తే ఎప్పుడూ ఎవ్వరూ   
ఎత్తుకోరు 
అందరికి ఏడుపులు ఉన్నాయ్ 
మన నేటి ప్రయత్నం రేపటి ప్రమోదము 
అలసత్వం తడిసిన అగ్గిపుల్ల 
అది రేపటి సూర్యుడి లా వెలుగు నివ్వదు 
ఓటమి అందరికీ చెదే 
ఓటమి అంటే ఒక ప్రయత్న o వృధా 
బతుకే నిరర్ధ కమ్ కాదు 
ఓటమి అవమాన భారము ఎత్తు 
గెలుపు ఊరేగింపు ఎత్తున 
కన్నీటి కి ఓటమి 
మంట ఆ ర దు 
కర్తవ్యం సాగదు 
చంద్రుడి కి అమావాస్య 
సూర్యుడి కి రాత్రి 
అమాస లో వాసముండడు చందమామ 
రాత్రి ని దాటి రవి
 ఉదయము నిజం 
కష్టం నిశ్చలo కాదు 
చందురు ని  తాకిన మనిషి 
సమస్య దాట లేడా ?


పశ్చిమ బెంగాల్ లో 
పుట్టిన భారత బె బ్బులి 
పరమ హ o స మానస పుత్రుడు 
నరేంద్రుడే వివేకానందు డై
వివేక విజ్ఞాన వేదాంత రవిగా
భారత కీర్తి 
" చికాగో " లో
 చిరస్మ ర నీయo చేసి
మూడు రంగుల జెండా 
పవిత్రత 
నాలుగు దిక్కుల చాటి 
ప్రపంచ గురువై
భారతదేశం సo స్కారం సదాచరము లకు గుడి గా 
సభ్యత - జ్ఞాన ము 
నేర్పే బడి గా 
అనురాగం - అహింసా - ఆప్యాయత - అధ్యాత్మిక త 
నేర్పు మాతృ ఒడి గా 
జాతిని తన వివేక జ్యోతి తో 
వెలిగించి 
యువతను కదిలించి 
జాడ్యం ను విదిలించి 
ఆధునికత భారత వని లో 
సమాజ సాధక సాధువు కు 
అమెరిక మోకరిల్లే 
బుద్ధుడు నడిచి న నేల 
మీకు శిరస్సు వంచి
నమస్కారము చేస్తు o ది 
యువత ! 
విదేశీ సo స్కృ తి వీడి 
వివేక పథం ఆచరించి తే 
అదే వివేకనందులకు నివాళి


Deshapati 🌹617
కవితా 9
 అంశం : : విరిగిన నిచ్చెన 
జీవితం జల్లెడ లో పోసిన నీరు లాంటిది 
మనిషి అలోచన గూళ్ల లో ఆశల గుడ్లు పెట్టే పక్షి 
మదిలోని కలవరం -
 కలవరి oతలు - కన్నీటి అలలు ఎప్పుడూ అగవు 
పసిఫిక్ కంటే లోతు మన మనస్సే 
ఏ కొలమానం నకు లొంగదు 
శ్వాస నిశ్వాస ల మద్యన బతుకు బండి 
దారి తెలియక లోయలోకి 
ప్రపంచం ఒక వేదిక 
అందరు పాత్రధారులు 
నిద్ర పట్టని ఆలోచన లతో తల దిండు బరువెక్కి o ది 
బంగారు మంచం కొ నగలము
కంగారు లేని
 నిద్ర ను కాదు గా ? 
మమత ఉన్న దేవుడే 
మరపు నిచ్చే 
మరో మంచి ఉదయం ఆశిస్తూ
మరల పడక మీదికి చేరాను  


🌽దేశపతి*(10)🌴 617
ఉరి లేని ఊరు ఉందా ?
*********************
మట్టి ని నమ్మిన నీవు 
దుక్కి దున్నే 
భూమి పుత్రుడి వి 
నేల సేవ చేసే వెల లేని చేతులు నీవి 
పెట్టుబడి కోసం 
పెట్టు సలాం 
అందరి కడుపు నింపే నీవు 
కన్నీళ్ళ తో బాంక్ ముందు 
పడి గాపులు 
నమ్మిన దేవుడే 
వాన కురిపించడు 
వేసిన విత్తు చిగురిo చదు 
ఎర్రలు బారిన భూమి వెఱ్ఱి గా కనపడి 
కాసుల పంట కాదు 
కలుపుల చేను 
సూర్యుడి చూపుకి వాడిన 
పంట 
పెట్టుబడి చెమట తో పోయే నాడు 
           నేడు మళ్లీ 
కష్టాల కడలి లో 
మరో తుఫాన్ 
మొక్క చెదిరి 
గింజ రాలి 
తడిసిన ధాన్యం 
నీళ్ల లో పడవ లా 
తెలియా డే 
అప్పులు తిప్పలు 
బతుకు సేద్యం 
కనిపెంచిన కొడుకు 
కాలేజీ ఫీజు 
ఎదిగిన బిడ్డ కు 
కళ్యాణo ఏ రోజూ ?
ముసలి తల్లి కి 
మందులు రివాజు 
పైసా లేక 
పని లేక 
నమ్మేవారు లేక 
అవసరం తీరక 
ముఖం లేక 
అతుకుల బతుకే భారమై 
సoసారము సాగరమై 
దారి లేక 
తేరు లేక 
వరి వేసిన నీవే 
ఉరి వేసుకున్నవు 
(🌴🙏ఋతువు లు మారిన బతుకులు మారక అసువులు బాసిన మృత రైతులకు అంకితం 🌽😂)


🌹దేశపతి - 617
కవిత @11
అంశం : - - కల్లోలిత హృదయం 
- - - - - - - - 🌑🌕🌑- - - - - -

నేను మహిళ ను 
మనసున్న మనిషిని 
నేను పుట్టక ముందే ఉన్న 
ఆంక్షల బందీ ని 
ఆడది అంటే ఆడేది కాదు 
అన్నింటిని భరించేది 
అగ్నిలో రగిలేది 
నాగరికత నేర్పే ఇస్త్రీ 
అణగారిన అనాగరిక  బతుకే  స్త్రీ 
నన్ను కన్న వారు కన్నీళ్ళు 
పెట్టుకుని 
నేను పెరుగుతున్న కొద్ది 
కంచె వేసారు 
నవ్వు తే తప్పు 
నడిస్తే తప్పు 
మాట తప్పు 
బయట కెళ్లి తే ముప్పు 
కాలేజ్ లో కామ చూపులు 
రోడ్డు మీద రోత కూతలు 
ఆటో వాడి అదో చూపు 
ఆఫీసు లో అవే తిప్పలు 
సర్వ పరీక్షల అనంతరం 
కళ్యాణ సూత్రాల సూత్రం 
కట్టుకున్న వాడు రాస్తాడు 
కొత్త రాజ్యాంగం 
అందరిలో నేనున్న 
నేను నేనుగా వo టరి 
ఆలస్యం నకు అనుమాన మానం 
అన్ని వింటూ - తనను భరిస్తూన్న 
రక్తం ఉన్న యంత్రం నేను 
ఆసక్తి లేని జీవం నేను 
సరదా లేని బతుకు 
సంతోషం వెతుకు
బిడ్డల తల్లినై న 
నాకు తప్పదు 
విష చూపుల కత్తుల వంతెన 
నా రూపం కూడ నాకు శత్రువే
ఆకాశము లో సగం మేము 
అగచాట్ల లో మేము  
దేవుడా ! రక్షించు
 మా ఆ డ బిడ్డలను 
కరుణించి కాపాడు 
నీవు అర్ధ " నారి " శ్వరుడి వి కదా ! ! ! 


దేశపతి 🌹
గంగ ను శిరము న నిలిపి గిరిజ రేడు _ 
కాశి పురమున మనుజుల కరుణ చేయ _ 
అర్థనారిశ్వ రుడు నిల్చే హరుడు గాను _ 
అన్నపూర్ణ గరిట పట్టే ఆమ్మ గాను 
దేశపతి 🌕🌑🌕
సర్వ శాస్త్ర ము ల  
మయము జ్ఞాన మాత , 
బాసర తల్లి ఆసర మాకు విద్య , 
నేర్ప గ మతి ఉన్నతి గన్ నిలుప అక్షర , 
మీ య వమ్మ మా జ్ఞాన ప్రభ జ్వలించ
🌹🌹🌹🌹🌹🌹

దేశపతి 617
వివేకానంద స్వామి 
SNO-12🙏

యువజ నాల నెపుడు నుత్సాహ పరచెడు
దివ్య చరిత గన్న భవ్య మూర్తి
దేశ ఖ్యాతి బెంచె దిగ్దిశ లందున
ధర్మ రక్షకుండు ధరణి వెలసె

దేశపతి 🌹617
S.NO@13
మెదక్ జిల్లా చిటుకుల చాముO డే శ్వరి మాత 🙏
🌸🌸🌸🌸🌸🌸🌸
బగళ ను,  ప్రత్యOగి ర ను న్ *
మిగులుగ  వారాహిని,తమ మేనున చాముం *
డి,  గరిమను , జోగుళాOబ ను *
నగుమోమున  దాల్చితి వొకొ ! నా టే శ్వరి వై ! 

దేశపతి 617
@15
                 🎈స్నేహం 🎈
స్నేహానికి లేదు శల్యo
ఇద్దరి మధ్యనఅది  అమూల్యo 
రెండు గుండెల ఒకే చప్పుడు 

నిత్యం ఒక సత్యం 
రెండవ వారికి అనునిత్యం 
ఎద లోతు లోటూ చూపే కృత్యo 
వీలు - హోదా - కతీతంగా 
నడిచే ఒక స్నేహ పయనం 
ఏరా - నన్ను మరిచి పోయావు 
అనే మాట మృతి లో నే 
స్నేహ వీణ కు నిజాయితీ ఒక త oత్రి
మెలుకువ లో మరువలేని 
నిద్ర లో కలవరిoచి
 " కల " వరించి 
నీ నీడ గా 
మధుర జాడగ జ్వలించి
మనసు వంతెన దాటి 
తలపుల వల్మీకము నుండి  
తన హితుడి సన్ని హితం కై 
ఎదురు చూసే ఒక మధురానుభుతి స్నేహం 






దేశపతి 🌄🙏617
@16
::::::::::::::::::::::::::::::::::::::::::::
         అంశం - రసగుల్లలు 
ఉల్లిగడ్డ : 
కోసేటప్పుడు కన్నీరు 
బజ్జి వేస్తే నోట్లో నీరు ఊరు 


నిచ్చేన : - 

ఎక్కే వాడు ఎక్కు 
దిగేవాడు దిగు 
తాను మాత్రం కదలదు 

మరుపు : - 

కొన్ని సార్లు ముదo 
కొన్ని సార్లు ఖేదo 

అప్పు : - 
తీసుకున్నప్పుడు దేవుడు 
అడి గి నప్పుడు దయ్యం (కయ్యాo )

మనసు : - 

సున్నిత మైతే కన్నీరు 
ఘనిభ విస్తే    శిల 


పెద్దలు : - 
పేరుకే పెద్దలు 
పాపo దగ్గుతూ మూలుగుతూ మూలకు 

శవ పేటిక : - 

చేసే వాడు వాడడు 
తెచ్చే వాడు వాదుకోడు 
వాడుకునే వాడు  దానిని చూడడు 
🌸Go(O )D Morning 🍎


దేశపతి 🌹617
@18
          
                 *TV*
#################
TV
నీవు 
నాడు నలుపు తెలుపు తో 
సాదా సీదా 
టేబుల్ పై బద్ధకo గా ముసలి దానిలా ఉండే దానివి 

నేడు fair and lovely మాకు చూపి చూపి 
నీవు రంగురంగుల రాణి 
వైతివి 
సోకులు నేర్చిన నీవు 
లావు తగ్గి గోడ నెక్కినావు బల్లిలా 
 Sun చీకటి లో ఉండడు 
కాని Samsung మోగు సదా 
Sony నీ మారుపేరు
 Idiot box 
ఎవ్వరూ తిప్పుకోరు నీ నుండి లుక్సు 
పది అవతారా ల భగవంతుడు 
అన్ని అవతారాల నీ వేవరు ? నీ POGO ను పిల్లలు వదలరు 
నీ Ego soaps లేనిదే మహిళలు బతకరు 
ఈ కలి లో భక్తి చాన్నాళ్ళ భక్తులు ఎవ్వరూ ? 
క్రికెట్ ఆటలు  college కి తాళాలు 
అత్తా కోడళ్ళ సీరియల్స్ 
కుటుంబ ము లో ముళ్ళు 
జనం గుండే లో భూతు జబ్బర్దస్తి 
వార్తలు పార్టీల జండాల మోతలు 
పొదుపు వస్త్రాల షో లో 
కళా మందిర్ ప్రకటనలు 
ఆధునికత  జోరులో 
జారుడు బండ పై సమాజo 
ఇన్నీ చేసి  TV జనాన్ని 
Sit down అని షో show చేస్తుంది 

దేశపతి 🌹617
@19
     
రసగుల్లాలు  - Part : : 2
**********************
తాళి : - 
అందరు ముట్టి 
ఒక్కరు కట్టేది 

ఖర్చు : - 
అదుపు మదుపు 
లేక పోతే ఆర్థిక కుదుపు 

జీతం : - 
జీవితం ను నిర్ణయిన్చేది 

చీపురు : - 
ఇల్లు ను తడిమి 
మూల నక్కేది 

పుస్తకం : - 

పదాల ను తెలిపేది 
పండితుల ను నిలిపేది 

మంగలి షాప్ : - 
జుట్టు పోవు 
చదివిoపు  అదనం 

పెళ్ళి : - 

కాని వారికి అదో కల 
ఐన వారికి   అదో  కల్ల 

ఇంజెక్షన్ : - 
తీసుకుంటే నొప్పి 
తీసుకోక పోతే మరో నొప్పి 

JOB: - 
J   ust 
O   bey 
B   oss 

సుకుమారి : - 
అరటి పండు కొరికి తే 
పన్ను ఊడింది 

మన  ఏడుపు తల్లిదండ్రుల కు సంతోషం : - 
మనo పుట్టి నప్పుడు 



దేశపతి 🌾617
@20
<><><><><><><><><><>
🌺పూల విన్న పాలు 🌹

ఓ ప్రభూ ! ! ! 

మాజన్మ నీ వర ప్రసాదం 
సున్నిత సుగంధ 
మా శరీరాలు 
ఇంద్రధనస్సు ఈర్ష్య పడు 
మా వరవర్ణ సౌరభాలు 
కడుపులో అమృత తేనె మకరందాలు 
వన్నె ల చిన్నల సోయగాలు 
దైవ శిరస్సును
 అధిరోహిo చు  
అపురూప పుణ్య ఫలము 

స్వామి ! ! ! 
ఎందుకయ్యా మాకు 
శ్రీ ఘ) మరణాలు 
ఉదయం పూసిన మేము 
సాయంత్రం నేల పాలు 
🌸పాపి చిరాయువు 🌸
🌹దేశపతి - 617
@21

💔చేరని ప్రేమ తీరం 💔
" " " " " " " " " " " " " " " " " 
కనుల మూసిన నీవే 
కనులు తెరిచిన నీవే 
కలత నిదుర లో నీవే 

మనసు మాట వినదు 
కుదురు లేక 
కునుకు రాక 
గుండె లయ 
నీ తలపుల మునక లో
 తడి సిపోయే 
సన్నని తుo ప ర చల్ల గాలిలో 
నీ కై అలోచన వాన 
పక్షుల సంధ్యా పయన రవళీ 
లో నీ పట్టీల చప్పుడు 
పూల వనాలల్లో నీ ప్రేమ సుమ వాసన 
చిత్తం చిత్రము గ మారే 
లయ తప్పే జీవన తాళం 
మనసు ఒక వ)ణ o 
వయసు కోరు నీ పాణిగ్రహణం 
మరువలేని ప్రణయం 
మరపు రాక ప్రళయం 
అగాధ లోతుల్లో నీ రాక ఆశ  
ఈ ఆశా నిరాశ ల మద్యన 
నలుగు ఈ ప్రేమ పి పాసి 
ఆరైన పోదు బతుకు దీపం 

దేశపతి 🌾617
@22

ఆత్మ విశ్వాస 😃
%%%%%%%%%%%%%%
ఒక అలోచన నాటితే ఒక కార్యం సిద్ధిస్తుoది 
ఉత్తమ అలవాటే వ్యక్తిత్వo ను పూయిస్తుoది 
అశవాది విమాన ఏక్కుదామంటే 
నిరాశా వాది పేరచుటూ గురించి ఆలోచిస్తూ ఉంటాడు 

కృషి తలుపు తెరిస్తే నే 
విజయాల కు దారి 
కుo భ వృష్టి కూ డా 
బోర్లిన్చిన కుండ ను 
నిం ప నట్లు 
విశ్వాస రహితుడు 
విశ్వం న గెలవడు 
జేబు ఖాళీ కన్నా 
మెదడు ఖాళీ ఉండడం 
చెరుపు 
పారిపోయే వాడు గెలవడు 
గెలిచే వాడు పారి పోడు 
మనిషి కలమైతే 
విశ్వాసo సిరా 
జీవితం తెల్ల కాగితం 
నీవు నీకు ప్రియమైనది పొందాలంటే 
శ్వాస ఉన్నంత వరకు 
విశ్వాసం విడకు
తూటాలు లేని తుపాకీ ఎందుకు ? 

దేశపతి 🌸617
@23
🌹🌺🌻🌼🌾🍀🌿🌾
తెలంగాణ 🌹బతుకమ్మ 
🌻🌻🌻🌻🌻🌻🌻
తెలంగాణ తల్లి ఓ బతుకమ్మ 
పల్లె లోగిల్లో నీవు కోలువమ్మ 
పది జిల్లాల పండుగ నీ వమ్మ 

సుమ కుసుమాల తో సుహాసిని ల మురిపెం 
వీధి వీధి లొ పట్టు చీరల జిలుగు పాట 

ఆటా పాట ల రమ్య వలయాల నేత్ర పర్వం 
పదం లో పదం 
పాదం లో పాదం 
కలుపుతూ సాగిపోయే 
పల్లె పదాలు 
కొడవలి తొ గడ్డి కోసిన చేతులు 
కోలాటం లో చప్పట్లు గా వినిపిస్తూ 
పొద్దుగాల నాట్లలోని 
బురుద కాళ్ళు సాయంత్రం పసుపు తో నర్తిస్థు 
అమ్మమ్మ ల బొట్టు సాయంత్ర రవిలా నుదుట న శోభిస్తాయి 
కన్నె ల పట్టు పరికిణీ సోయగాల మూట 
కన్న వారి ఇంటికి తెచ్చు కొత్త  పెళ్ళి  కూతురు సిగ్గు ల 
సింగారం 
ముగ్గు బుట్ట తలల అవ్వ ల 
పాట అందరి నోట 
గుడి ముందు బతుకమ్మ ఆట 
గుడిలోని శివయ్య కు హారతి సందె పూట 
ఆకాశం లో పెరుగు మబ్బులు 
మహిళ ఇంద్రధనుస్సు నేల పై 
వర్ణ వస్త్రాల తో సమ్మోహనత్వం 
అనురాగ - అనుభూతి - అనుభవాల పాట 
అందరి నోట 
చెరువు అలల పై బతుకమ్మ 
కొలువు 
సందె కాడ సద్దులు,
సుద్దుల పం పి ణి 
పలకరింపులు : పరవశం : పండుగ సంబరాల మధ్యన 
ముతైదువ ల మట్టేల చప్పుడు ఇంటికి దారి తీస్తాయి 
(ఈనాడు జిల్లా సంచిక ప్రచురణ )

దేశపతి 🙏617
@24    పద్యం 
********************
కలము కనును కవిత , కవితలు కదలిoచు _ 
మనము జనిత మంచి మాట , మరల _ 
కార్య రూపు దాల్చి ఘనకార్యములు ను _ 
చేయు భూమి నందు శక్తి కవిత
దేశపతి 🙏617
@25

పద్యం - - జగన్మాత
- - - - - : : 🙏: : - - - - - 

 నానా దిక్కులు  నీవే ! 

నేనే దిక్కును దివాణ మే గతి లేకే 

నానా యాతన లొo దు చు b

నీ నామమె  ది క్కను కొని నిను చేరితి నే ! 

🌹దేశపతి - 617
@26
: : : : : : : : : : : : : : : : : : : : : : 
📚గ్రంధాలయం 📖
- - - - - - - - - - - - - - - - - - - - 
అది సరస్వతి దేవాలయం 
సకల సారస్వత మౌన గురువుల సమ్మేళనం 
సాహిత్య - శాస్త్ర - విజ్ఞాన - కళల జ్ఞాన ధామము 
పుస్తక భండాగారం 
మస్తక వృద్ది కర్మాగారం 
నిత్య జ్ఞాన దాహాన్ని చలివేన్ద్రము 
అక్షరాల జ్ఞానo వికసించి 
విద్యా: వినయ : విషయ పరిజ్ఞాన పరిషత్ 
సాన పెట్టు విధ్యార్తి భవిష్యత్ 
చేయుదురు గ్రంధ పఠన ము 
పడ దోయు తిమిర కుడ్యం 
వెలిగించే దీపం 
కలిగించు ఆలోచన లోచనము 
తల వంచి చదివిన వాడిని 
చేయు ! 
తల ఏత్తుకునే స్థాయి కి 
పుస్తకం నకు సమస్క్రతి 
గ్రంధాలయం సరస్వతి నిలయం 
📘📙📔📒📚📚📕📗


No comments:

Post a Comment