కవయుత్రి శ్రీమతి ఇందిరా వెల్ది, ACTO, హైదరాబాదు.
కల్వకుంట్ల చెఋవులోనా గురిగింజ గుమ్మడి,
వికసించె చందురూడూ గురిగింజ గుమ్మడి,
బక్కపల్చ దేహంవాడూ గురిగింజ గుమ్మడి,
బాగా పెద్దని ముక్కువాడూ గురిగింజ గుమ్మడి,
గులాబి రంగు గుడ్డనుబట్టా గురిగింజ గుమ్మడి,
వీధి వీధి తిరిగినాడూ గురిగింజ గుమ్మడి,
నిరహార దీక్ష చేసినాడూ గురిగింజ గుమ్మడి,
నిమ్మరసం తాగినాడూ గురిగింజ గుమ్మడి,
సోనియమ్మ శాంతిచెందీ గురిగింజ గుమ్మడి,
తెలంగాణా ప్రకటన చేసే గురిగింజ గుమ్మడి,
అదివిని ఆంధ్ర లోనా గురిగింజ గుమ్మడి,
అల్లర్లెన్నో చెలరేగే గురిగింజ గుమ్మడి,
శాంతి చేయగ సోనియమ్మ గురిగింజ గుమ్మడి,
ఇచ్చిన ప్రకటన రద్దు చేసే గురిగంజ గుమ్మడి,
కథ మొదటికి వచ్చెననీ గురిగంజ గుమ్మడి,
కల్వకుంట్ల వగచినాడూ గురిగింజ గుమ్మడి,
శ్రీకాంతు పొల్లగాడూ గురిగింజ గుమ్మడి
ఆత్మహత్య చేసుకొనే గురిగింజ గుమ్మడి,
వాని బాటన మిగతా పోరలు గురిగంజ గుమ్మడి అనుసరించి పోయినారూ గురిగంజ గుమ్మడి,
తెలంగాణా పౌరులంతా గురిగింజ గుమ్మడి.
తిరగబడుట మేలనుకొనిరి గురిగింజ గుమ్మడి, నాయకులంత ఏకమయ్యి గురిగింజ గుమ్మడి,
మిలియన్ మార్చి నిర్వహించే గురిగింజ గుమ్మడి, ఊరువాడా ఏకమయ్యే గురిగింజ గుమ్మడి,
సోనియమ్మ రెండవ సారీ గురిగింజ గుమ్మడి,
తెలంగాణ ప్రకటన చేసే గురిగంజ గుమ్మడి,
తెలుగుతల్లి బిడ్డలు ఇద్దరు గురిగంజ గుమ్మడి,
వేరు కుంపటి పెట్టినారు గురిగింజ గుమ్మడి,
అన్న ఇంటికి తమ్ముడు వచ్చె గురిగంజ గుమ్మడి, తమ్ముని ఇంటికి అన్నబోయే గురిగింజ గుమ్మడి,
పోటాపోటిగ అభివృద్ధి సాగగ గురిగింజ గుమ్మడి,
ప్రజలెల్ల. సల్లంగుండ్రి గురిగింజ గుమ్మడి .
ఇది కడారి దశరథ్ గారి ప్రేరణతో ఇందిరా వెల్ది334.
బ్రహ్మదేపుని పత్ని భారతీదేవి, ఒక కన్ను గద్యమై, మరియొకటి పద్యమై అలరారుచుండగా,
పలుకుతేనెలు ఒలక, మానవుల నాల్కల పై బీజాక్షరములను పొదిగించు వాగ్ధేవివీవు,
అల్పులకు అనంత విజ్ఞానాన్నిచ్చు శారదవువీవు,
నీకు నచ్చిన చోట, నీవు మెచ్చిన చోట
అత్తను తోడ్కెల్లె ఆది దేవతవీవు,
ధవళ వస్త్రములతో, నిర్మల చిత్తముతో,
హంస వాహనమెక్కి అవనికి వేగిరముగ రావె వేదజనని,
సత్కార్యములు చేయ సద్బుద్ధిని ఇచ్చి
శాంతిని చేకూర్చు సనక సనందనుల తల్లి......
ఇందిర వెల్ది sk no.334,
ధన్యవాదాలు మల్లేశం గారు మీ పద్యము ఉత్ప్రేరకంగా మారింది.
వాల్మీకిదే కులం?, వ్యాసుడిదే కులం?,
విభీషణుడిదే కులం?, ప్రహ్లాదుడిదే కులం?,
మట్టి కుండలో పుట్టిన ద్రోణుడిదే కులం?,
కర్ణుడిదేకులం?, ఈనాటి కలాం దే కులం?
గుణం వలన వారు ఘనకీర్తి పొందిరి,
కులం వలన కాదురా క్రూరబుద్ధి,
అందుకే కులమన్న వాడి నాలుక కుళ్ళ బొడుస్త,
మతమన్న వాడి నాలుక మళ్ళీ మళ్ళీ చీలుస్త.
ఇందిరా వెల్ది sk no.334.
మా ఊరి చెరువు, మా పాలిట కల్పతరువు, తొలగించును ఈతికరువు,
కలిగించును బ్రతుకు తెరువు,
చాకలి ముత్తయ్యకు పాటలు నేర్పించిన చెరువు,
గొల్ల మల్లయ్య గేదెల తళతళ మెరిపించిన చెరువు,
బతుకమ్మకు కలువ కమలాలను కానుకలిచ్చిన చెఋవు,
మంచినీటికొచ్చే కన్యల మనసును దోచిన చెఋవు,
మా ఊరిని అన్నపూర్ణ గ మార్చిన చెఋవు,
కుమ్మరి రంగయ్య గిర్కకు మట్టినిచ్చిన చెఋవు,
గౌండ్ల పుల్లయ్య కలుకు రుచి తెచిన చెఋవు,
అందుకే చెఋవు మా పరువు, బ్రతుకుతెరువు.
ఇందిరా వెలిది S.K.No.334.
Note: కులవృత్తులు గామాలకు పట్టు కొమ్మలు.
ఇందిరా వెల్ది
ఏ సి టి ఓ,
అతివలం మేము
అతివలం మేము .... ఆత్మ విశ్వాసానికి ప్రతీకలం మేము
ఆటపాటల నుండి... అంతరిక్షం వరకు...
కల్లాపు చల్లుట నుండి... కలాన్ని జులుపుట వరకు
ఇంటిపని, వంటపని మొదలు... ఎలాంటి పనిఅయినా
పురుషులతో ధీటుగా చేయగలం మేము.... పని చేయించగలము
అనుకున్నది సాధిస్తాం.... ప్రగతి పథాన నడిపిస్తాం
అతివలం మేము .... ఆత్మ విశ్వాసానికి ప్రతీకలం మేము
తేది : 18/11/2015
పేరు : ఇందిర వెల్ది,
ID No.. : sk.no.334. 🌺🌺🌺🌺🌺🌺🌺🌺
🌺 నేనెవరిని? 🌺
సకలచరాచర సృష్టిలో,
అరనాలుగు కోట్ల జీవరాశిలో
ఉత్కృష్టుడిగా జన్మించాను.
నవ్వగలను,
ఏడ్వగలను,
చలించగలను,
మాట్లాడగలను.
నిప్పును కనిపెట్టాను,
నీరు, గాలి వంటి
పంచ భూతాల విలువ తెలుసుకున్నాను.
చక్రాన్ని కనిపెట్టాను,
చరిత్ర సృష్టించాను,
నిరంతరం యుద్ధాలలో
మునిగి తేలాను,
గెలుపే కాంక్షగా బ్రతికాను.
సౌకర్యాల కోసం మొదట్లో,
విలాసాల కోసం తర్వాత
వస్తువులుకనిపెట్టాను.
జంతువులను మచ్చిక చేసుకున్నాను,
సాటి మనుషులను
నా బానిసలుగా మార్చుకున్నాను.
వేదికలెక్కాను,
వాదనలు చేశాను.
అవినీతిని
ఆయుధంగా
మార్చుకున్నాను,
చట్టాన్ని
నా చుట్టంగా
మార్చుకున్నాను.
అక్రమాలెన్నో
చేశాను,
అరాచకత్వానికి
నేనొక విలాసంగా
మారాను.
అడవుల్ని నరికాను.
కాలుష్య రక్కసిని
తట్టి లేపాను,
సాటి జీవులను
రోగాలకు బలి చేశాను,
సంపాదనే లక్ష్యంగా బ్రతికాను.
వస్తువులను ప్రేమిస్తూ మనుషులను ఛీకొట్టాను.
మానవత్వం
మనుషులకే స్వంతమన్న సంగతి మరిచాను.
తల్లిదండ్రులు అంటే
గౌరవం లేదు,
దాయాదులపై
దయ అంటే ఏంటో తెలియదు,
నా మార్గానికి,
నా ఆనందానికి
అడ్డు వస్తే
తల్లి లేదు,
పిల్ల లేదు అడ్డంగా నరికేస్తా.
వావి వరుసలు
మరిచాను,
కన్న కూతురుపైనే
కన్నేశాను,
కామ వాంఛలు తీర్చుకున్నాను.
మత పిచ్చితో
మసిలాను,
మారణకాండ
సృష్టించాను,
కల్తీ వ్యాపారంతో
తోటి మనుషుల
ప్రాణాలు తీశాను
కోకొల్లలుగా.
ధూమపానం, జూదం,
మద్యపానం
నా బలహీనతలు,
అరిషడ్వర్గాలు
నా అనుంగ మిత్రులు.
సాటి జీవుల ప్రాణం
సత్తు పైసకంటే హీనం
నా దృష్టిలో,
పాపాల భైరవునిగా మారాను.
ఒకరోజు
నిద్ర లేచాను,
చుట్టూ కటిక చీకటి,
ఆక్రందనలు,
ఆర్తనాదాలు,
రోగులు,
వేదనలు,
ఆకలి దప్పుల కేకలు,
మనుషులను
మనుషులే పీక్కుతింటున్నారు,
పంచ భూతాలు,
అరిషడ్వర్గాల చేతుల్లో
ఆవిరి అయిపోయాయి,
వందల సంవత్సరాలుగా
నేను కూడపెట్టిన నోట్లకట్టలు,
బంగారం,దస్తావేజులు
ఒకప్పుడు కుక్కిన పేన్లలాగ
నా బీరువాల్లో పడిఉన్నవి,
నన్ను చూసి
విరగబడి నవ్వుతున్నాయి
ఎగతాళిగా.
యంత్రభూతాలు
ఎక్కిరిస్తున్నాయి
కారు చీకటిలో,
కాళరాత్రిలో
వెతుకుతున్నాను
వెర్రివానిలాగ
అనుబంధాల కోసం,
ఆత్మీయతల కోసం.
పక్కంటి పరమస్తున్ని
బ్రతిమిలాడాను
నాకే మతం లేదు
లేవరా అని,
ఎదురింటి వాళ్ళ కుక్క
డాలీని పిలిచాను
ఈ ఒంటరి ప్రపంచంలో బ్రతకలేనని,
ఇలా....
ప్రతి అనుబంధం కోసం
అర్రులుచాచాను,
గగ్గోలు పెట్టాను,
ఏ జీవిలో కదలిక లేదు,
ఇంతలో
ఒకప్పుడు
నా స్వార్థానికి బలైన చెట్టు
విరగబడి నవ్వి,విరిగిపడింది
పెళ్ళున,
నా ప్రాణం ఉక్కిరి బిక్కిరి అవుతోంది,
ఆరవ తరగతిలో
సైన్సుమాష్టారు చెప్పిన
ఆమ్లజని
ఏది దేవుడా
అని ఆక్రోషించాను.
టిన్నులకొద్దీ వృధాగా
పారబోసిన నీటికోసం
వెతుకుతున్నాను,
ఒక్క గుక్కెడైనా దొరకదా అని,
ఎముకలు కొరికే
చలి నన్నావహంచింది
వెచ్చదనం కావాలి
నాకు ఏది నిప్పురవ్వ?
పైన నీలిరంగు ఆకాశం
కాలయముడిలా చూస్తోంది
నన్ను పాశంతో సిద్ధంగా
క్రిందికి చూశాను
భూమి గర్జింస్తుంది
లవకుశ సనిమాలో సీతతల్లిలా?
అయ్యో భగవంతుడా !
నాతో బాటు
సమస్త జీవరాశిని బలి చేశాను,
ఇప్పుడేం చేయను?
నాకు అవసాన కాలం సమీపించింది,
విచారిస్తూ
పయనమయ్య అనంతలోకాలకు
.........
కారు చీకట్లో
కాంతిరేకలా
సుదూరంగ వెలుతురు,
గాలి,నీరు,చెట్లు
జీవంతో ఉన్న ప్రదేశం
కనిపించింది
హమ్మయ్య
అనుకున్నాను
🌺
భూమిపై
జీవజాతి అంతరించలేదని,
వైతరణికి చెరువ అవుతుంటే
దారిలో ప్రకృతి కాంత
అభయమిచ్చింది,
ప్రశాంతంగా పోరా
కొత్త సృష్టి చేస్తా అని
......
నాలో నేను
గొణుక్కుంటూ ఉన్నాను
నేనవరిని ?అని,
నేను మనిషిని కాను
అద్భుతమైన ప్రకృతిలో
అల్ప ప్రాణిని
🌺
ఇందిరా వెల్ది
sk no.334
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
సింగారము ఒలికెడు బంగారపు వన్నెనాది,మక్మల్ బట్ట వంటి మెత్తని మేని నాది,అతివలపాలిట ఆది లక్ష్మిని నేను,అడవిలో పుట్టానని వగచానొకనాడు,నన్నెవరెట్టుకుందురని ఏడ్చానొకనాడు,నీకు సాటిలేరని,నీకు పోటిరారని,లక్ష్మివే నీవని,సరస్వతివి నీవని,పార్వతివి నీవని,పసుపువే నీవని,పారానివి నీవని,సౌభాగ్యం నీవని,తెలంగాణ అతివలంత తెగ మురిసిపోయారు,పువ్వులరాణివి నీవేనంటూ మురిసి పరవశించారు.....
ఇందిర వెల్ది sk no 334, డాక్టరు లక్కరాజు నిర్మల గారి ప్రేరణతో.
రాముడు బుద్ధుడు, కృష్ణమోహనుడు వీరుడై యుద్ధము చేయగ , లక్ష్మణుడు సంజీవనితో సజీవుడుకాగ కవితా కావ్య కన్యక జయేందిరను చేపట్టిరి, దేవతల చిన్నమ్మ కొడుకుని జయించి.
ఒక్కడు ఉదయించాడు రవీంద్రుడై, వేయి మెదళ్ళను మేల్కొల్పాడు ఆదిశేషుడై, తెంగ్లీష్కుకు బానిసైన తెలుగు వారికి,తల్లి భాషలోని అమృతాన్ని అందవ్వగ , తరలివస్తున్నారు తామర తంపరగా తేట తెలుగు కవిత
నీ వదనం,అది విరిసిన మందారం,
నీ అధరం అరమగ్గిన మధుర ఫలం,
నీ కురులు ఇంద్రనీలమణులు,
నీ కన్నులు కమలానికి ఇచ్చును వన్నెలు,
నీ చూపులు నా గుండెలొ గుచ్చెను పిడి బాకులు,
నీ వీనులు నవ సంఖ్యను ఎగతాళి చేయును,
నీ కరములా కావవి తామరతూండ్లు,
నీ నఖములు నక్షత్రవీధిలో తారకలు,
నీ దంతాలు దానిమ్మ బీజాలు,
నీ పదములు రాయంచకు నేర్పును నడకలు,
అన్నింటికి మించి
నీహృదయం శాంతికి నెలవు,
నీ సహనం ధరణికి తావు,
నీతో ఉంటే నా బ్రతుకున నిండును కాంతి,
నా మనసుకు దొరుకును శ్రాంతి.
ఇందిరా వెల్ది
ACTO, SK334.
ప్రేమ అయస్కాంతం వంటిది, ఆకర్షస్తూనే ఉంటుంది.
స్రేమ మత్తువంటిది, మైకంలో ముంచుతూనే ఉంటుంది..
ప్రేమ అగ్న వంటిది, రగులుతూనే ఉంటుంది.
ప్రేమ ఎండమావి వంటిది, ఆవిరయి పోతుంది.
ప్రేమ గుడ్డిది, దేనినీ చూడలేదు.
ప్రేమ పాపం వంటిది, శిక్షిస్తుంది.
ప్రేమ త్రాచు వంటిది, కాటేస్తుంది.
ప్రేమ రాయి వంటిది, గాయపరుస్తుంది.
ప్రేమ ఫెవికాలు వంటిది, అతికితే వదలదు.
ప్రేమ దోమ వంటిది, కుడితూనే ఉంటుంది.
అయినా ఈ ప్రేమ కోసం మసుషులు బలి అయ్యారు, అవుతున్నారు, అవుతారు.... ఎందుకంటే ప్రేమంటే ప్రేమే ❤ అందరికి.
ఇందిరా వెల్ది,skno.334.
ద్వాపరమున నరకుని దునిమెను ధరణి సత్య,కలియుగమున కలరు నరకులు వేలువేలు,వీరల జంపుటకు వనితలెందరు కావలె వెన్నకన్న.
ఇందిర334.

పై కవితలపై మీ అభిప్రాయాలను తెలియజేయండి.
ReplyDeleteపై కవితలపై మీ అభిప్రాయాలను తెలియజేయండి.
ReplyDelete