స్వయంభూ శతకం4 - స్వయంభూ శతకం
సహస్ర కవుల కవితా రచనలు
.............................................
ID NO.305
18th November 2015
Name.గుడిపల్లి వీరారెడ్డి
నెం 1 నుండి 12 వరకు పద్యాలు
......................
శీర్షిక..
స్వయంభూ శతకం
.....
1. శ్రీకర !గౌరీవర ! వర
దా ! కరుణాలయ ! దయానిధాన ! పురారీ !
శోక విదారణ ! నిత్యము
లోకాలను గాచు చిత్తలూరి స్వయంభూ !
2. అమ్మకు గౌరమ్మకు, ముగు
రమ్మల మూలంపు టమ్మ యౌ అమ్మకు చి
త్తమ్మున మ్రొక్కుచు, శతకం
బొమ్మిక గొనుమందు చిత్తలూరిస్వయంభూ!
3. ఎలుకను బోలిన మనసును
నిలకడగా నిలుపు నరుని నిర్మల మతమున్
దెలుపు గణేశు నుతించెద
నులుకక కరుణించు చిత్తలూరిస్వయంభూ!!
4.తడబడు నడకల నుడుగుచు
నుడివెద నైదక్కరముల నొప్పెడు మంత్రం
బడుగడుగున సకల శుభము
లుడుగరగా నిచ్చు చిత్తలూరి స్వయంభూ!!
5.తలపును నీ పై నిలిపెడు
వలపుల నిను గూర్చి పలుక వైవిధ్యముగన్
పలుకుల చెలి దయ నాపై
నొలికించుము తండ్రిచిత్తలూరిస్వయంభూ!!
6.మహదేవా యను నామమె
ఇహపరములనింటబయటయిలవేల్పుగమ
మ్మహరహము బ్రోచు పెన్నిధి
ద్రుహిణాదులుగొల్చుచిత్తలూరిస్వయంభూ!!
7.ప్రాలేయాచల కన్యా
చేలాంచల శోభ మెచ్చు శీలీ ! శూలీ!
కాలీ హృత్సరసీరుహ
రోలంబా! శరణు చిత్తలూరిస్వయంభూ!!
8. ప్రోచే వాడవు నీవే
నీ చేతిని వీడనయ్య నిచ్చలు భక్తిన్
వేచితి నీ గుడి ముంగిట
నో చిరు పూ భంగి చిత్తలూరిస్వయంభూ!!
9. వందే గిరి చాపా! హృ
న్మందిరమున మెట్టుమయ్య మంగళరూపా!
ఎందుకురా ఈ జాప్యమ
రుంధత్సారధ్య చిత్తలూరి స్వయంభూ!!
10.దోయిలి నొగ్గితి నా కా
దాయము కందాయ ఫలము తండ్రీ నీవే
వాదన లెందుకు వేద మ
హోదయ చిద్రూప ! చిత్తలూరిస్వయంభూ!!
11.
ధనికులనే కరుణించుచు
దినవెచ్చము కొరకు నేడ్చు దీనులకియ్యన్
ఘనభూష లేవి దాల్చని
గుణనిధి నీవయ్య పిసిని గొట్టు స్వయంభూ!!
12.పారగ కృపాకటాక్షము
ఓరెమ్మిడుచున్న స్వామి ఉపశమనమ్మౌ
దారినిచూపగ రార భ
వోరగ విధ్వంస !చిత్తలూరిస్వయంభూ!!
.........................................
గుడిపల్లి వీరారెడ్డి Sk no 305
.......................................
[11/22, 9:03 AM] Gvr bngr: 🌺🌺🌺🌺🌺🌺
మాతాన్న పూర్ణ సతియగు
ప్రీతిన్ పునుకేల దాల్చి బిక్షం బెత్తన్ ?
చేతన్ సిరులెన్నున్నా
చేతము పరిశుద్ధమన్న చేత స్వయంభూ!!
🌺🌺🌺👏
వేంకటేశునిగ నిను సేవించితి
తిరుమలేశ ! సేవను గొనుమా!
ఈ "వీరా" సంకటముల
ఏ వేళకు బాపు వేం- కటేశ్వర శంభో !!
అక్షర నిధులెన్నున్నా
రక్షణ నీదింత లేక రగులునె కవితల్
అక్షయ కృప నీదగు ఫా
లాక్షము విడి జాలు వార వ్రాసెద శంభో !!
తీర విహీనము యీ సం సారంబను
పాడుకడలి సత్వర మీదన్
దారేది ?ఊతమిమ్మా
ఊరించక వచ్చి చిత్తలూరిస్వయంభూ !!
సహస్ర కవుల కవితా రచనలు
.............................................
ID NO.305
18th November 2015
Name.గుడిపల్లి వీరారెడ్డి
నెం 1 నుండి 12 వరకు పద్యాలు
......................
శీర్షిక..
స్వయంభూ శతకం
.....
1. శ్రీకర !గౌరీవర ! వర
దా ! కరుణాలయ ! దయానిధాన ! పురారీ !
శోక విదారణ ! నిత్యము
లోకాలను గాచు చిత్తలూరి స్వయంభూ !
2. అమ్మకు గౌరమ్మకు, ముగు
రమ్మల మూలంపు టమ్మ యౌ అమ్మకు చి
త్తమ్మున మ్రొక్కుచు, శతకం
బొమ్మిక గొనుమందు చిత్తలూరిస్వయంభూ!
3. ఎలుకను బోలిన మనసును
నిలకడగా నిలుపు నరుని నిర్మల మతమున్
దెలుపు గణేశు నుతించెద
నులుకక కరుణించు చిత్తలూరిస్వయంభూ!!
4.తడబడు నడకల నుడుగుచు
నుడివెద నైదక్కరముల నొప్పెడు మంత్రం
బడుగడుగున సకల శుభము
లుడుగరగా నిచ్చు చిత్తలూరి స్వయంభూ!!
5.తలపును నీ పై నిలిపెడు
వలపుల నిను గూర్చి పలుక వైవిధ్యముగన్
పలుకుల చెలి దయ నాపై
నొలికించుము తండ్రిచిత్తలూరిస్వయంభూ!!
6.మహదేవా యను నామమె
ఇహపరములనింటబయటయిలవేల్పుగమ
మ్మహరహము బ్రోచు పెన్నిధి
ద్రుహిణాదులుగొల్చుచిత్తలూరిస్వయంభూ!!
7.ప్రాలేయాచల కన్యా
చేలాంచల శోభ మెచ్చు శీలీ ! శూలీ!
కాలీ హృత్సరసీరుహ
రోలంబా! శరణు చిత్తలూరిస్వయంభూ!!
8. ప్రోచే వాడవు నీవే
నీ చేతిని వీడనయ్య నిచ్చలు భక్తిన్
వేచితి నీ గుడి ముంగిట
నో చిరు పూ భంగి చిత్తలూరిస్వయంభూ!!
9. వందే గిరి చాపా! హృ
న్మందిరమున మెట్టుమయ్య మంగళరూపా!
ఎందుకురా ఈ జాప్యమ
రుంధత్సారధ్య చిత్తలూరి స్వయంభూ!!
10.దోయిలి నొగ్గితి నా కా
దాయము కందాయ ఫలము తండ్రీ నీవే
వాదన లెందుకు వేద మ
హోదయ చిద్రూప ! చిత్తలూరిస్వయంభూ!!
11.
ధనికులనే కరుణించుచు
దినవెచ్చము కొరకు నేడ్చు దీనులకియ్యన్
ఘనభూష లేవి దాల్చని
గుణనిధి నీవయ్య పిసిని గొట్టు స్వయంభూ!!
12.పారగ కృపాకటాక్షము
ఓరెమ్మిడుచున్న స్వామి ఉపశమనమ్మౌ
దారినిచూపగ రార భ
వోరగ విధ్వంస !చిత్తలూరిస్వయంభూ!!
.........................................
గుడిపల్లి వీరారెడ్డి Sk no 305
.......................................
[11/22, 9:03 AM] Gvr bngr: 🌺🌺🌺🌺🌺🌺
మాతాన్న పూర్ణ సతియగు
ప్రీతిన్ పునుకేల దాల్చి బిక్షం బెత్తన్ ?
చేతన్ సిరులెన్నున్నా
చేతము పరిశుద్ధమన్న చేత స్వయంభూ!!
🌺🌺🌺👏
వేంకటేశునిగ నిను సేవించితి
తిరుమలేశ ! సేవను గొనుమా!
ఈ "వీరా" సంకటముల
ఏ వేళకు బాపు వేం- కటేశ్వర శంభో !!
అక్షర నిధులెన్నున్నా
రక్షణ నీదింత లేక రగులునె కవితల్
అక్షయ కృప నీదగు ఫా
లాక్షము విడి జాలు వార వ్రాసెద శంభో !!
తీర విహీనము యీ సం సారంబను
పాడుకడలి సత్వర మీదన్
దారేది ?ఊతమిమ్మా
ఊరించక వచ్చి చిత్తలూరిస్వయంభూ !!
No comments:
Post a Comment