గోగులపాటి కృష్ణమోహన్

My photo
కవి, రచయిత, జర్నలిస్టు.

Thursday, 19 November 2015

కళాచందర్ కలం సృష్టి



           వరుకోలు కళాచందర్,  జర్నలిస్ట్. (SK 387)

🌺🌺🌺🌺🌺🌺🌺🌺

   🌻  ఉన్నమాట...!  🌻

🌺🌺🌺🌺🌺🌺🌺🌺

🌺

మనిషిని మనిషీ దోచేవేళ
బాధల గాధలు రగిలేవేళ
నీడలె  కాటులు వేసేవేళ
అష్ఠదరిద్రమ్ములలరే వేళ

జగజ్జిత్తులు
       ఇంకా చాలవా !
ఏఉగాదీ
      నీకేమియ్యదు తేలవా  !?

[11/18, 1:40 PM] 🌺🇮🇳✅ Kalachander.v:

🌺

పునరాగమనం
        స్రుష్టిలక్షణం !

ఇక,

పురోగమనమైనా
        తిరోగమనమే !
తిరోగమనమైనా
        పురోగమనమే !!

 తేడాలేదు...!?

[11/18, 1:51 PM] 🌺🇮🇳✅ Kalachander.v:

🌺

కరవుకాలంలో
'కరువో కరువ'ంటూ
పద్యం లంఘించుకుంటే

అది
భుక్తాయాసం తర్వాతవచ్చే
త్రేన్పుకిందే లెక్క

ఆత్మగుణంతో
అంతోయింతో
సాయంచేస్తే
     అదే పరమాత్మ  !!

[11/18, 1:58 PM] 🌺🇮🇳✅ Kalachander.v:

🌺

దారులు విరుద్ధమైనా
లక్ష్యాన్ని వదలడంలేదు
కలిసుండక ఉండడంలేదు
                        తిరగలిరాళ్ళు!
వాటినైనా
ఆదర్శంగా తీసుకోవాలి
                        ఆలుమగలు !!

[11/18, 4:31 PM] 🌺🇮🇳✅ Kalachander.v:

🌺

ఊరికి చేసినసేవ
పీనుగుకు చేసిన సుంగారము
గోడకు వేసిన సున్నము
తిరిగిరావంటారు

           ఊరికి చేసిన సేవ
            తిరిగివస్తుందిగా మరి !

అయితే ఓటి

అవతలి పక్షమైనా
ఇవతలి పక్షమైనా
    సంఘటితమైతేనే వస్తుంది !
    సత్సంగమైతేనే  వస్తుంది !!

[11/18, 4:48 PM] 🌺🇮🇳✅ Kalachander.v:

🌺

ఎవరూ లేనిది వాడూ
         తేనీరూ తాగలేడు
వానికోసం వాడు
          ఏమీ చూసుకోడు

వాడి
ప్రతి సుఖంలోనూ
ప్రతి కష్ఠంలోనూ
      ఎవరి సుఖమో
       ఎవరి  కష్ఠమో
కారణమై దాగుంటోంది
దుమ్మెత్తి  చీకొడుతోంది

పళ్ళూడినా వాడు
ఆవైపే వెళ్తున్నాడు

అలానే చస్తాడేమో వాడు
బహుషా! సత్సంగేమో చూడు!!

[11/18, 5:04 PM] 🌺🇮🇳✅ Kalachander.v:

🌺

సత్సంగంటే
సర్వసన్యాసి కాడు
స్వధర్మాన్ని వీడి
పరధర్మాన్ని  కోరడు

ఏనిమిషమూ...
 అతనికై అతడు ఆలోచించడు
  సమాజంకోసమే అసలుచింత

రాత్రైనా పగలైనా
కష్ఠమైనా సుఖమైనా
ఇష్టమైనా  నష్టమైనా
సమాజక్షేమం దారిలో
సత్సంగత్యం అతనిది

    ఆ అర్థమె పరమార్థం...
            అతడే పరమాత్మ !!

[11/18, 5:18 PM] 🌺🇮🇳✅ Kalachander.v:

🌺

పేడలో చారాణా పడితే
నోటితో తీస్కుంటున్న
                   ఈ జనంలో

        ఉడతా భక్తిగా...
        ఉత్తవైన చేతుల్తో...
సమాజసేవకు వాడు
కొత్తమార్గం వెతుక్కున్నాడు

స్మశానంలో వైరాగ్యంతో
చందాలు రాయిస్తున్నాడు !

రాజైనా.... సేవకుడైనా...
ఉన్నోడైనా...  లేనోడైనా...
అక్కడంతా
       చచ్చినట్టేగద మరి !!?

[11/18, 5:29 PM] 🌺🇮🇳✅ Kalachander.v:

🌺

భావవ్యాప్తి కార్యక్రమం
గాలివాపు కార్యక్రమమవుతోంది

సూక్ష్మాన్నిగాంచని ఈ చోట
                     స్థూలమే జీవం !

సూక్ష్మమే స్థూలమవుతున్న సత్యం
      వీరికబద్దం !

అంతకంటే....
                         అనవసరం  !!

[11/18, 6:43 PM] 🌺🇮🇳✅ Kalachander.v:

🌺

ఎల్లలులేని...
ఏమరపుల్లేని...

భావసారూప్య
బందాలకోసం వెతుకులాట...

  ఈ కవనం ! ఈ కవిత !!

[11/18, 6:49 PM] 🌺🇮🇳✅ Kalachander.v:

🌺

ఎల్లలులేని...
ఏమరపుల్లేని...

భావసారూప్య
బందాలకోసం వెతుకులాట...

  ఈ కవనం ! ఈ కవిత !!

            🌺
            ✏@ కళాచందర్,
                          జర్నలిస్ట్.
                     ( SK 387 )

🌺🌺🌺🌺🌺🌺🌺🌺

No comments:

Post a Comment