SK326
గోగులపాటి కృష్ణమోహన్
హైదరాబాదు
నవ్యాఖిలమ్ములో జ్యోతి వెలుగుల కృష్ణమనోహర దీపావళి
సహస్రకవులందరికి ఇది తొలి దీపావళి. కవితా వెలుగుల దీపావళి...!!
వాట్సప్ వేదికపై కవితా వరుసల వెలుగులు పంచే ఆనంద దీపావళి...!!!
నరకాసురున్ని వదించి నరులందరి జీవితాలలో వెలుగును నింపిన దీపావళి ...!
మాత సత్య శౌర్యానికి చెడుపై మంచి విజయానికి ప్రతీక ఈ దీపావళి ...!!
అజ్ఞానపు చీకట్లు తొలగించే విజ్ఞాన దీపాల తెజోశ్చాహం ఈ దీపావళి..!
దీపాల వరుస దీపావళి నవ్య ఆనంద ఆరావళి....!!
ఈ అఖిల జగత్తులో వెలుగును నింపే నిత్య సంతోష సరాగవళి ఈ దీపావళి..!!
ఈ దివ్య జ్యోతుల దీపావళి కావాలిమీకు నవ్య ఆనంద ఆరావళి ..!!!
సహస్ర కవులందరికి అవ్వాలి ఆనందపు వెలుగులు నింపే దీపావళి... ఈ కృష్ణమోహనమ్ముల దీపావళి
No comments:
Post a Comment