గోగులపాటి కృష్ణమోహన్
హైదరాబాద్
SK 326 - 4
శీర్షిక:సరదాల దసరా..
దుష్ట మహిషుని దునుమాడిన దుర్గాదేవి అనుగ్రహం...
రావణ సంహారం గావించిన శ్రీరామ విజయవిలాసం...
పంచపాండవుల అజ్ఞాతవాసాంతం...శమీపూజకు ఆద్యం...
పుష్పాలతో పేర్చిన బతుకమ్మలపై నెలకొన్న గౌరీదేవి అభయం
ఇంటళ్ళుళ్ళ బెట్టులతో కొత్తబట్టల రెపరెపలు...
బంధువుల రాకతో నిండిన ఆత్మీయానుబంధాలు..
నోరూరించే పాకశాల ఘుమఘుమలు... పేకాటల పదనిసలు.... ...
పాలపిట్ట దర్శనాలు... దేవాలయ ప్రదర్శనాలు ....
ఆశీర్వాదాలు అందించే ఆత్మీయుల ఆలింగనాలు...
మనసు లోతుల్లో నిండేను మమతలజ్ఞాపకాలు..
మన సంస్కృతి సాంప్రదాయాల కు దర్పణం ... ఈ సరదా దసరా ఉత్సవం....
మీ
గోగులపాటి కృష్ణమోహన్
No comments:
Post a Comment