[11/11, 11:46 AM] గోగులపాటి కృష్ణమోహన్: SK 326
గోగులపాటి కృష్ణమోహన్
హైదరాబాదు
సంబరాల దీపావళి
మాతోనే ఈ సంబరమంటూ కాంతులు పూసింది కాకరపువ్వొత్తు
నాకు సాటి లేనేలేదంటూ వెలుగులు చిమ్మింది మతాబు
నాకుందా పోటీ అంటూ ఎగసిపడింది చిచ్చుబుడ్డి
వయ్యారం చూడండంటూ గిఱ్ఱున తిరిగింది భూచక్రం
ఓస్,ఇంతేనా అని తన విలాసం చూపింది విష్ణు చక్రం
డాబూ దర్పం మాదేనంటూ హంగు చేశాయి టపాకాయలు
పిల్లలకు మేముంటే చాలంటూ టపటపమన్నాయి తుపాకులు
ఆకాశమే సరిహద్దంటూ దూసుకుపోయాయి రాకెట్లు
మేముకూడా ఉన్నామంటూ మొహమాట పడ్డాయి అగ్గిపెట్టెలు
మీరంతా ఏం చేస్తేనేం అసలందం మాదేనంటూ
మిలమిలలాడాయి వరుసల దివ్వెలు
నజరానా దీపావళి
కలియుగమున నరకాసురులు ఇంకెందరో
వీరిలోని అఙ్ఞానాందకారాలు తొలగాలని ఆశిస్తూ
మరోదీపావళి కి స్వాగతం చెబుతున్న

No comments:
Post a Comment