గోగులపాటి కృష్ణమోహన్

My photo
కవి, రచయిత, జర్నలిస్టు.

Sunday, 22 November 2015

ముటుకూరు అరుణ కవితలు

                          అరుణ ముటుకూరు,
                       హన్మకొండ, వరంగల్ జిల్లా

నేను కవిని:-
కవిని నేను
అవును  కవిని నేను
" క "ని పించను." వి " ని పించ ను
అంతే గా మరి నే వాట్సప్ కవిని
అయినా
కలాన్ని " క " దిలించగలను సమస్యల పై
కొరడా " వి " ది లించ గలను
అవును నేను కవిని,
" కష్జజీవి "  కి ఇరువైపుల
కాపలా కాసేవాడి  ని నేను ,
"కవిని నేను"
*********************

అమ్మకు లేదు సెలవు:-
ఆదివారంఎందరికో సెలవు
అమ్మ కి లేదు ఆదివారం
అమ్మ కి లేదు సెలవు
ఆకలికీ  లేదు సెలవు
సూర్య చంద్రులు తప్పరు నెలవు
అమ్మదో జీతబత్యాలు లేని కొలువు
ఇంతకంటె ఉద్యోగమే  సులువు
కడుపు నిండే దాకా పెడుతుంది కొసరి, కసరి.
వుండే దాకా తన వూపిరి
అమ్మ కి లేదు సెలవు
********************

రోబో :-
‬విమానాన్ని  రైట్  సోదరులు కనిపెట్టారు
రేడియం క్యూరి  దంపతులు
రైల్ ఇంజన్, స్టీం ఇంజన్.
వారు వీరూ అని చదువుతున్నాం కానీ
ఏ భావం లేకుండా వుండేలా  మనిషి లాంటి రోబోని ఎప్పుడో కనిపెట్టాడు పురుషుడు
ఆ రోబోనే భార్య......
********************

పతివ్రత:-
పురాణాల నాటి మాట.,
భర్త ఏం చేసినా గుడ్డి గా అనుసరిస్తూ
పతి కోసం వ్రతాలు చేసేది....
ఈ నాటి అర్ధం
వ్రతం చెడకుండా భర్త ని
దారిలో పెట్టేది
*******************

గడ్డిపూవు:-
పూవులేరి తెచ్చా ఆ కోవెల పోవాలని
ఏ  పూలతో కొలవాలి  తండ్రీ... నిన్ను.....
వాడని  పూలతో పూజించినా.....
మరునాటికి వాడిపోతాయి
ప్లాస్టిక్ పూలతో కొలుద్దామా
పరిమళం లేని సుమాలు అవి.....
గడ్డిపూవైనా  పర్లేదులే అంటావా
నిజవే చిత్తశుద్ధి లేని  పూజకన్నా
ధ్యానం తో చేసే గడ్డిపూవే
నా పూజకు పనికి వచ్చే పువ్వు
***********************

నిన్ను తెలుసుకో :-
నేను చెప్పిన మాటలకే  నా బాధ్యత
నువ్వు అర్ధము చేసుకున్నదానికి కాదు
నన్ను , నా తప్పుల్ని ప్రశ్నించే ముందు
నీలో ఏ తప్పూ లేకుండా చూసుకో
నీలోపాలని నేను సహిస్తున్నా
మరి నా లోపాలు నువ్వెందుకు ఎంచుతున్నావ్
లోపం లేని వారున్నారా ఏ లోకంలోనైనా
******************************

 గెలువు:-
మాట ఇవ్వమ్మా చెల్లీ
మరలిపోనని , తరలిపోనని
మరణం  కాదు పరిష్కారం ఈ సమస్యకి
నిన్ను అణచిన , అవమానించిన  వారిని
ఎదిరించి నిలువు
వారిపై గెలువు
ఒదిగిన నీవే ఎదిగి చూపించు
తళుకు, బెలుకు రాయివనుకున్న వారికి
వారు, చేజార్చుకున్న నిక్కమైన  నీలానివని
తెలియజేయి . . . .
ఏ సమస్యకు మరణం కాదు పరిష్కారము తల్లీ...
************************************


స్త్రీకి స్త్రీయే శత్రువు:-
తరాలు మారినా , అంతరాలు తరిగినా
కొడుకే కావాలన్న మమకారం వదలదా
ఎపుడో , పున్నామ నరకం తప్పిస్తాడని,
ఇపుడు , కూతురిని తేడాగా చూస్తూ నరకం పెట్టాలా,
నా కొడుకు చవట... కోడలి మాట దాటడు,
మా అల్లుడు బంగారు...కూతురి గీత దాటడు,
నీ కూతురికి కూతురు పుడితే మాలక్షుమ్మ,
అదే నీ కోడలికి పుడితే ... కొడుక్కి మరో పెళ్ళి,
నీ కూతురుకి ఓ అత్త వుంటుంది,
మరి అందుకే నేమో స్త్రీకి స్త్రీయే శత్రువు.
******************************


ఎవరిది మోసం :-
మొదట నన్ను ప్రేమించాడు , పెళ్ళాడి కట్టేశాడు
మళ్ళీ , నీకు వలేశాడు , ప్రేమించానన్నాడు
నువ్వు నిజము తెలిసికొని వుంటే . . . . . , ఇంకో కుటుంబాన్ని కూలుస్తున్నానని  తెలిసికొని వుంటే . . . . . .
ఎంత బాగుండేది చెల్లీ . . నా తల్లీ
పవిత్ర సూత్రానికే కట్టుబడ ని వాడు నీ అపవిత్ర బంధానికి విలువిస్తాడా . .
చదువుండీ ఏం లాభం
వాడిని కన్న వారి , నేను కన్నవారి బాధ్యతతో నేను , వాడి మోహము నుంచీ బైట పడి నువ్వు తెలివి లోకి వచ్చే సరికి
ఏముంది ఇద్దరికీ ఒళ్ళో ఇద్దరేసి బిడ్డలు
వాడు మరో చోట కొత్త వలతో, కొత్త వాళ్ళ తో తయారు
*****************************************


గుట్టు:-
మన తాపం ఎంత రహస్యమో...
మన కోపం కూడా అంతే  రహస్యం.
నా పై నీ వారితో నువ్వు చేసే ఫిర్యాదులు...
వారికి నన్నవమానించడానికి నువిచ్చిన దారులు.
ఆలుమగల మధ్య కౌగిలి బంధం వంటిదే పోరు బంధం
కొట్టుకుంటాం , కలుసుకుంటాం
ఎన్నెన్నో అనుకున్నా మనం ఒకటి.
మన మధ్య మనల్ని కన్నవారైనా , మనం కన్నవారైనా పరాయే
ఎప్పటికి  తెలుసుకుంటావ్ ఈ సత్యం
****************************


అర్ధం కాలేదు:-
అర్ధం అయ్యావనుకున్నా....
ఒక గూటిలో కలిసున్నపుడు తెలిసింది
" అర్ధమే " అయ్యావని ,
మిగిలిన సగం నీలో మరో కోణం వుందనీ...
చేతులు కాలాయి... ఇప్పుడు ఆకులతో పనేంటి ?
జీవితమే అయిపోయాక వ్యర్ధం...
*************************


ఎందుకు ఎందుకూ:-
ఒక చిన్న రాయి చాలు అద్దం పగలడానికి...
ఒక చిన్న వుప్పు రాయి చాలు పాలు విరగడానికి...
ఒక చిన్న పదం చాలు మనసు ముక్కలవడానికి...
ఒక మెతుకు చాలు అన్నము వుడికింది లేనిదీ తెలియటానికి....
 ఒక చిన్న పాఠం చాలు తెలివి వుందో లేదో చూడడానికి...
మరి, మరి ఎందుకిన్ని సబ్జెక్టులు....  ఇన్ని పాఠాలు....
ఎందుకూ? ఎందుకూ?
*****************


మొగ్గ:-
విరిసి విరియని మొగ్గ
చలైనా... ఎండైనా... చెత్త కుండీనే వాడి పట్టుపరుపు...
కుక్క, కాకి వాడిపై జాలితో వదిలేశాయి...
చలి ఎండా కరుణతో తమని తాము తగ్గించుకున్నాయి...
కన్నతల్లివి ఇంతైనా జాలి, కరుణా చూపలేకపోయావ్...
ఒక తప్పు, కప్పిపుచ్చుకునేందుకు వాణ్ణి చెత్త కుండీలో పడేసి మరో తప్పు చేశావు...
కనీసం దొరికినట్లు ఏ శరణాలయం లోనో ఇవ్వొచ్చు...
అదీ చేయలేకపోయవ్...
నిజానికి వాడు నిలువెత్తు చెత్తవైన నీ నుంచీ బైట పడ్డాడు... సంతోషం అది.
నీ పెంపకంలో పెరగనందుకు వాడు చాలా ఆనందపడతాడు.
***************


వేధించే వెన్నెల  : -
చూశావా, సఖా !
ఆ చంద్రుని జాణతనం ,
నువ్విక్కడ  లేవని తెలిసీ ,
మరీ పుచ్ఛపూవులా, వెన్నెల కాస్తున్నాడు!!
చెంతన లేవని చులకనగా నవ్వుతున్నాడు!!!
అందరికీ అందంగా. చల్లగా ఆనందాన్ని పంచే కౌముది
నాపై మాత్రం ఎందుకిలా మంట ఎత్తిస్తూ, బాధిస్తున్నాడు?
పర్లేదులే ప్రియా...
అవసర నిమిత్తం దూరదేశానున్న నీవు రాగానే ఇద్దరమూ కలిసి ఆ శశిని ఉడికించుదాం.
నువ్వొచ్చిన నాడే నాకు వేయి పున్నములు!
చల్లని నీ నవ్వు చాలదూ... ఆ అర్ధ చంద్రుడు నాకేల?
***************************************


కొడుకు :-
కడుపులో పసిగుడ్డు గా త న్నావ్.
నలుగురితో పంచుకుని మురిసిపోయా
పది ఏళ్ళా నాడు అదే చేస్తే తల్లి గా దండించా
నిను కొట్టీ , తిట్టీ దారిలో పెట్టా
అది నాటి పనికి కక్ష కాదురా
క్రమశిక్షణ
నేను కంటి చూపుతో శాసించిన నువ్వు
నా పై కన్నెర్ర చేస్తున్నావ్
ఎదిగేవ్ కదా ! అందుకే అపుడు తెలియక కడుపులో తంతే
ఇపుడు , తెలిసీ గుండెలపై తం తు న్నావ్
నాడు పంచుకుని మురిశాను , నేడు దాచుకుని కుములుతున్నా
**************


ఆ . . . . . . . డ పిల్ల  కాదు :-
పండు వెన్నెల నవ్వింది , పక్కన పడతి లేదని
అడవి వెన్నెల  నీవు నా తోడువే నంది
ముప్పై ఏళ్ళ కే ముసలాడి నయ్యానా
ఏ ముదితా దొరకడం లేదు
ఆ . . . ఆ . . . తెలిసింది ,
మా మగాళ్ళ లోని మృగాళ్ళు
ఆడపిల్లని పుట్టనీయడం లేదు,
పుట్టినా.... బ్రతక నీయడం లేదు
వాళ్ళ వుసురు తగలదు మరి ,
నాకే కాదు , నా లాంటి  వారెందరికో
అందుకే , ఇకనైనా  ఆడపిల్లను పుట్టనిద్దాం , బ్రతకనిద్దాం
ఇదీ , మన స్వార్ధమేగా !
మనం మోడుకాకూడదని , మోదం తో
అహ్వానిద్దాం
మరో కొత్త సమాజ సృష్టి చేద్దాం
ఆ . . . . . . . . . డ పిల్లని కాదు , అమ్మాయని భావిద్దాం
****************************************


అమ్మ : -
నీ ఇంటి మహారాణి
అత్తింటి యువరాణి కావాలంటావ్ ,
మరీ, తాతింటి యువరాణిని
మనింటి మహారాణీ గా చూడవేం
*************************


సమానత్వం:-

ఉద్యోగాలు చేసే రోజుల్లో
ఒకరికొకరం సమానం , సహకారం అనుకున్నామో లేదో
కానీ ఇప్పుడు ,
పదవీ విరమణ తర్వాత అన్నిటా సహకారమే , సమానత్వమే
నీకో కళ్ళ జోడు , నాకోటి
నీకూ వుంది పళ్ళ సెట్టు , నాకూ వుందో సెట్టు
నీకో చేతి కర్ర , నాకూ ను
చూడు ఎంత సమానత్వమో , సహకారం కూడా
మరి , ఒకరి వస్తువులు ఒకరు
వెతుక్కోవడం లో  😊😊😊😊😊😊
****************************


కవిత పేరు : గగన కన్య
ఆకాశ కన్య మీకు నేనే మీ తీసిపోనని
నీలిరంగు చీర పై నక్షత్ర పూలతో కుట్టు పని చేయించి
తన వెన్నెల మేనికి హరివిల్లు రంగుల మేకప్ వేసి
చందమామ వంటి మోముపై ఎవరి చెడు చూపు పడకుండా
ఓ మచ్చ పెట్టి , అర్ధ చంద్రుని లా తీయగా నవ్వుతూ
నేల పై నున్న నీటి అద్దం లో తన అందం చూసుకు మురుసు కుంటూంది
******************

అగ్రపూజ్యుడు గణపయ్య:-

వ్యాసవిరచిత భారతాన్ని లిఖించి  మా కందించావు...
మా సంకటాలు తొలగేలా ప్రతి మాసం
సంకటహర చతుర్ధినిచ్చావు...
ఏ పూజలోనైనా అగ్ర పూజ నీదేస్వామీ...
నీ పై రాయాలంటే నాకు బుద్ది సిద్దింపచేయవయా ....
విఘ్నరాజా, గజాననా పాహిమాం పాహిమాం ...
చిన్ని వాహనం తో మాకు ఒద్దిక నేర్పావు,
వినదగు నెవ్వరు చెప్పిన అంటూ
పెద్ద చెవుల అర్ధం తెలిపావు,
గుజ్జు రూపమే పేరుకి....
బహు గట్టి వాడవు గణపయ్యా !
అందరి పెళ్ళికి నీకే తొలి ఆహ్వానం
కానీ....
నీ పెళ్ళి లో కలిగిన విఘ్నం (పోయిన తాళి కై ) సరిచేయడం కోసం ఇంటింటా నీ వాహనం వెతుకులాట....
భోళాశంకర సుతా....
కుడుములకే  ఆనందించే అల్ప సంతోషివి
కానీ...
మేం అల్ప మానవులం , కోరికలు అనల్పం
క్షమించి  దయ చూపుమయా దేవా !
****************************
తప్పునాదే:-
 అవునా నువ్వు అబద్దం చేప్తావా ?
నన్ను ప్రేమించానన్నావ్ ?
నేను లేక వుండలేనన్నావ్ ?
నా నవ్వు సంతోషం కావాలన్నావ్?
నీతో వుంటే అవి నాతో నే వుంటాయను కున్నా
కానీ ... కానీ .... ఒక్కటయ్యాక ,
నా మొహంలో నవ్వు చిదిమేశావ్...
సంతోషాన్ని దూరం చేశావ్....
నీ ఇజమ్, నైజం బైట పెట్టావ్....
నువ్వేనా ! నన్ను అంతటి మాటలంది?
ఇంకా నేను నీతోనే వున్నానా?
నిజమేలే , నా సున్నితత్వం బండబారి పోయింది.
తొలిసారే బాధ... ఎన్నో సార్లు గా మారాక
ఇంకా సున్నితం ఎక్కడ.....
ఇప్పుడని పిస్తోంది నువ్వు అబద్దం చెప్పావా ?
నన్ను ప్రేమ తొ పెళ్ళాడావా? పగ తో దరిచేరావా?
ఏ నాటి బంధమేననుకున్నా కానీ
నీది ఏలినాటి  పగ అని గుర్తించ లేదు
తప్పు నాదే
*****************************

చాటింగ్ - చాంటింగ్:-
 ఛాటింగ్  తో పాటు ఛాంటింగ్ కూ
సమయమియ్యి  మానవా
మొదటిది నిన్ను మనుషులకి దగ్గర చేస్తుంది
రెండోది దైవత్వాన్ని నీ  దగ్గరికి  చేరుస్తుంది
*******************************


అమ్మ పొట్టలోంచి లోకాన్ని చూసె య్యా లని ఆత్రంగా బైటపడ్డా ,
నెలలు పెరిగే కొద్దీ బోర్లా పడ్డం , పాకడం , దోగాడ్డం నేర్చుకున్నా,
నెమ్మదిగా నిలబడి , బుడి బుడి అడుగు లేశా
అవే వడి వడి పరుగు లయ్యాయి
వుద్యోగం , కుటుంబ బాధ్యత ల కోసం పరుగు కొనసాగింది
వయసు పెరిగి పరుగు తగ్గి , నడకకి  దిగింది
బాధ్యత లు తీరిన వయసులో
నడక నెమ్మదించింది ,
పిల్లలు దగ్గర లేని సమయాన
నడకా కష్టమై తిరిగి దోగాటగా కావలసినవి అందుకున్నా,
అందుకూ శక్తి లేనపుడు పాకినట్లు
మందుల పెట్టె నందుకున్నా,
చివరికి , నాటి బాల్యం అంతా తిరిగొచ్చింది ,
కానీ , కడుపున దాచుకుందుకు నా మాత లేదు . . . . . .
భూమాత తప్ప
sk 585
అరుణ.ముటుకూరు
హన్మకొండ
తిరిగొచ్చిన బాల్యం : కవితపేరు
*************************

:
కవితా పాపాయిని ప్రసవించి , అలసిని మేను అలా నడుము వాల్చింది ,
ఇంత లో , మంటలనార్పే యంత్ర పు గంటలా నా సెల్లు తెగ శబ్దం చేసింది ,
నిద్ర ఎగిరి , ఆశ కలిగి ఎవరైనా నా పాపాయి పై చె ప్పారేమో నని ,
సెల్లు చూద్దును కదా , నిద్ర పోయి కళ్ళే కాదు , నా వళ్ళూ మండింది ,
ఎందుకా ?
సెల్లు నిండా తర్జని చూపుతూ హస్త గుర్తులే
ఆ పెద్దాయన ఎన్ని సార్లు ఇలా వులికి పడ్డారో, నడ్జ్ లు తీయండని అన్ని సార్లు చెప్పారు
నడ్జ్ : కవిత పేరు
sk 585
అరుణ.ముటుకూరు
******************


అమ్మ ను  కన్న అమ్మ అమ్మమ్మ నాన్న ను   కన్న అమ్మ నానమ్మ
తాత అన్న వెంట ఏ తాత అన్న ప్రశ్న వచ్చె మరి ఇరువైపుల వరుస తాతే.ఏమన్న సర్దుకుపోయే
ఇంక మగువ నణచిన దెక్కడ
నవ్వుతాలుకి తప్ప నిజము కాదు సుమీ
వరుస :కవితపేరు
sk no 585
అరుణ.ముటుకూరు
*******************


అసలు ప్రాణం పోయలేనపుడు
తీయడానికి మనకు హక్కుందా ? అది చెట్లు , జంతువులు , మనుషులు ఏదైనా !
గోవుని కోలిస్తే ముక్కోటి దేవుళ్ళ కొలుపే
చెట్టూ , పుట్టా , నీరూ , నిప్పు అన్నీ కొలిచే దేవుళ్లే
రావి చెట్టూ , గోవు మనకు మంచి చేసే చుట్టాలే
మన అనారోగ్యాన్ని దూరం చేసే ప్రియబాంధవులే
నదిని , మొక్కని , జంతువుల్ని అన్నీ , అన్నీ నాశనము చేస్తున్నాం
మనల్ని మనమే సర్వ నాశనం చేసుకుంటూన్నాం
ఎవరైనా రక్షించబోతే ఆ అధికారికి
బదిలీయే ప్రతిఫలం
అనుకూలమైనవి కాదనుకుని ప్రతికూలంగా బ్రతుకుతున్నాం
అరుణ.ముటుకూరు
sk no 585
గోవధ
******************


పాతవి మరచి , కొత్తని తలచి
అన్నిటికీ యంత్రాలే నని తెలిసి
లాభమే ముంది పెరిగాక వగచి
సంకేత మిస్తూనే వుంటుంది కాయం
శ్రమలేకుంటే బరువెక్కుట  ఖాయం
అపుడుఅవుతుంది  మనసు గాయం
ఆపై అనారోగ్యం వస్తుందని  భయం
అందం మందమైన వేళ ఎవరికిముద్దు
అందుకని , అతిగా జీరో సైజు వద్దు
Sk585
అరుణ ముటుకూరు
కవితపేరు : ఆకృతి
*******************


ఎవరో పిల్లాడికి ప్రమాదమని విని పరిగెత్తి వచ్చింది.తన కడుపు పంటే నని తెలిసి తల్లడిల్లింది
ఏదో ఆశ ముప్పిరి గొని కెమెరా కంట్లోంచి చూసింది
వాడి తెలివికి తబ్బిబ్బై తాడు వేయమని అడిగింది
లేచిన వేళ మంచిది , వాడు మృ త్యుం జయునిగా వచ్చాడు
అంతే చాలని వూరుకోక ఆలోచించింది
తన కూలీ డబ్బుల్లోంచి సగం రాళ్ళు కొని నింపింది బావిని
అక్కడితో ఆగక వూరంతా అలాంటివి చూసి అదే పనిగా పెట్టుకుంది
మరో తల్లికి ఆ కష్టం రాకూడదు అని
అదో వుద్యమం లా వూరంతా ఆమెకి సహాయం , సహకారం అందించారు
ఆ వూరి వారి గాధ పక్క వూళ్లో , పక్క రాష్ట్రం దాకా పాకింది
ఆమె ఇచ్చిన స్పూర్తి ఇకపై బావిమరణం లేకుండా చేసింది
గణ గణ అలారం మోగింది
అయ్యో ఇదంతా కలా
Sk 585
అరుణ ముటుకూరు
కవితపేరు : మూతపడ్డబోరు బావులు
****************************

స క 585
అరుణ . ముటుకూరు
హన్మకొండ
నేనేమి చేశాను నేరం : కవితపేరు
దేవుడా ! ఇందులో నా నేరం ఏమైనా వుందా
మరీ , ఇంత నిర్దయగా నన్నొదిలే శావ్
నేనేదో , తప్పు చేసినట్లు లోకుల చూపులు , మాటలు
నా జబ్బు కంటే బాధిస్తున్నాయి
ఏ నాడు మనసులో నైనా మధురోహలు తలవని నాకు . .
ఏమిటో ఈ అవమానం
రక్తదానం , చేద్దామని శిబిరానికి వెళితే వైద్యులు చేసిన తప్పిదానికి
నాకా . . . నాకా  శిక్ష
నేను చేయని , నా బాధ్యత లేని తప్పుకి
నేనెందుకు బాధపడాలి
ఆ వైద్యుణ్ణి నిలదీసి , వుచితం గా
నా బాధ ని నయం చేసుకుంటా !
నా ధైర్యమే నాకు రక్ష
sk 585
అరుణ . ము టు కూ రు
హన్మకొండ
********************
 
Sk 585
అరుణ ముటుకూరు
హన్మకొండ
కవితపేరు : స్వయంకృతం
మనం ఏమిస్తే మనకదే దొరకును
చెట్లను నరికేసి ,
కొండల్ని పిండి చేసి ,
అద్దాల మేడలు ,
ఆకాశహర్మ్యా లు నిర్మించి ,
పరిశ్రమల విషవాయువులు
గాలిని , నీళ్ళని కలుషితం చేస్తూ ,
తప్పులపై తప్పు చేస్తున్నాం.
మరి , పెరిగిన వేడికి కరిగిన మేఘుడు , కలిగిన బాధతో వర్షిం చి నపుడు
ఇపుడు , ఇపుడు మనకు మిగిలింది చుట్టూ నీరే, కన్నీరే !
*****************************************

Sk 585
అరుణ.ముటుకూరు
హన్మకొండ

కవితపేరు : గుర్తుకొస్తున్నా. . .  యి (love)(love)(love)(love)(love)(love)(love)

గతమెపుడూ   మధుర జ్ఞాపకమే
అందు బాల్యం మరింత మధురం
కల్మషం లేని , కలిమిలేమి చూడని బాల్యం
గుర్తుకొస్తున్నా. . .  యి


తమ్ముడి తో ఆడిన గోలిలాటలు ,
షాకు , నాలుగు స్తంభాలాటలు ,
కుందుళ్ళు, గాలిపటాలు
గుర్తుకొస్తున్నా. . . . . యి


బడిలో ఆడిన కబడ్డీ , పక్కింటి నేస్తురాలితో ఆడిన తాడాట , బడిలో గెలుపు లు , వ్యాసాలు , వకృ త్వం లో కొట్టిన ప్రైజ్ లు
గుర్తుకొస్తున్నా. . . . . . యి

అమ్మమ్మ ఇంటిలో నాకే వదిలే పెద్ద వూయల , తాతయ్య వేయించిన సిమెంటు బారకట్ట      
వేప చెట్టు నీడలో దాన్ని వదలక ఆడిన ఆటలు
అమ్మమ్మ చేసే జొన్నరోటీ తియ్యవంకాయ కూర
గుర్తు కొ స్తున్నా. . . . . . యి

చిన్నదాన్ని అని వదిలేశారు
అని గునిసే చె ల్లితో ఆడిన చెస్ , చైనీస్ చక్కర్స వంటి వెన్నో గుర్తుకొస్తున్నా . . . . . యి

బామ్మ చేసే గుత్తి వంకాయ , పాలకోవా బిళ్లలు , నేనుంటే ధైర్యం గా పెట్టుకునే చెగోడీ ప్రహసనమ్
చేస్తూ సగం తిన్న వైనం గుర్తుకొస్తున్నా . . . . . యి

బాబాయికి తెలియక ఆడిన పేకాట లు , మాతో కలిసి బాబాయి ఆడిన అచ్చనగిల్లాలు , వామనగుంటలు
గుర్తుకొస్తున్నా . . . . . . యి


ప్రియనేస్తం పై పంతం తో నేర్చి ఓడించిన టేబుల్ టెన్నీస్
నీ డిబేట్  కోసం వూరు కెళ్ళక
ఆగానన్న కెమిస్ట్రీ పంతులు గారి మెప్పుకోలు
గుర్తుకొస్తున్నా . . . . . యి
ఎన్నని చెప్పను, ఈ చిన్ని కవితలో
నాటి చదువులు ఆడుతూ పాడుతూ
మరి నేడో
ఐనా , ఇపుడు వీడియో, tv లు వద్దని పిల్లలతో ఆడుతున్న ఆటలు
గుర్తుకొస్తున్నా . . . . . యి
*********************

Sk 585
అరుణ.ముటుకూరు
హన్మకొండ
కవితపేరు : మళ్ళీ పుట్టాను

  అమ్మ గర్భం నుండి బైట పడడమే పుట్టడం అనుకున్నా

అమ్మా నాన్నల్ని  ఆశ్రమం పంపినా
తోడబుట్టినవారినిపట్టించుకోకున్నా
భార్యని హింసలు పెట్టినా
పిల్లల్ని దండన తప్ప దయ చూ పకున్నా
నాకు , నాకు చిన్న ప్రమాదం లో
కాలికి గాయమైతే
వారంతా క్షమించి , ఆత్రం గా నా దరి చేరినపుడు
అపుడు , అపుడు నిజంగా మనిషి నై
నేను మళ్ళీ పుట్టాను
****************************
కడుపు కింత గంజి అయిన పోద్దమని కూలి కెళితే ,
ఆదివారం బిడ్డ ఇంట నే ఆడత ననుకున్న
ఈత నేర్వక పెద్ద చర్వుకు బోయి
ఇంత కడుపు కోత బెడతడ ను కోలే
నీపైన పానం బెట్టిన కొడకా వోలె కొసం మింక బతకాలే
Sh585
అరుణ ముటుకూరు
హన్మకొండ
కడుపు కోత : కవితపేరు
*********************

అమ్మ అన్న దరికి , నాన్న అన్న వురికి పోవు పెదాలందురు
పిలుపుదేముంది , నాన్న అన్న , డాడీ అన్న
చనువు ముఖ్యము గాదె
తీరిక సమయాన , ప్రయాణమున మాకు విసుగు రానీక , తాను విసువు నందక విసరు ప్రహేళికలు
మెదడుకు మేతగా
విడమర్చి చెప్పు మంచి పద్యాలు , భావార్ధాలు
నిశాపతిగాన మాకు భారత , రామాయణం గాధలు చెప్పి , నిశివేళ తాను కధలు , కవితలు కూర్చు
తప్పుచేయు తలపు మరి మదినం
టకుండ తమ్ము , చెల్లెల చిన్నవయసైన బాగ దండించె
నన్నుగూడ గొట్టే నొకసారి
ఆడుకొనపక్కింటనుండ వద్దు అన్నగాని ఏమో ఇచ్చి , నా న్న తొ ఎగతాళిగా చెప్పే ఆ ఇంట నె వరో , నాన్న కోపము నా వీపు నంటే
ఆపై చిన్న దెబ్బనైన నెరుగము నాన్న చేత , అల్లరి నాపఅమ్మతో తప్ప
తాను కొట్టి , రాత్రి మమ్ము చూసి ఏడ్వదొడగ    , మంచి చె ప్పునపుడు కొన్ని యెడల తప్పదని వోదార్చే నాన్న
అత్తమామల నాదరించు దొడ్డ మనసున , బంధుజనుల సేవ జేయు బహు సహనమున ఇల్లాలు
పేరుకే కాదు సేవను కూడా వసుంధర యే
నే బడికెళ్ళు సమయాన , ఇంజనీర్ ఐన ఆసక్తి గా యమ్ ఎ చదివి నాన్న , డిగ్రీ న తానును ఓపెన్ డిగ్రీ చదివి చదువుకు వయసు లేదని చెప్పకనే చెప్పే
బంధు సహాయాన అటు నిటు బేధం లేక ముందుందురు ఇర్వురు


ఎంత వున్నను , పొదుపు విలువ చెప్పి పనులతో పాటూ పొదుపు నేర్పే నమ్మ
అమ్మ అన్ని చూసుకొనగ , తన వృత్తి , ప్రవృత్తి నందు విజయములు పొందే నాన్న
,
" అరుణ "    , " కిరణ" ములకు ప్రకృతి "   పల్లవి" ం చవలెనని పేర్లలోను కవితా దృష్టి చూపే నాన్న
కొత్త భాష తప్ప నాడు తెలుగు వద్దని ఆదివారం మాత్రము రూలు పెట్టె నాన్న
మాకు ప్రతీ చదువున, ప్రతీ పోటీలో బహుమతులు దక్క కలిసి సంతసించిరి  మనమున
ఒకటా , రెండా  ఎన్నని చెప్పను ఆది గురువుల మంచి , ఎంచి
వారు ఒకరికొకరు సగము అనుట కు మా" త " , పి " త " లను మాటలే తార్కాణం
వారు విద్య , వినయం , విచక్షణ నేర్పిన ఆది గురువులు , ఆదర్శ ప్రాయులు
అమ్మానాన్న ఒకటే , విడదీసి చూచుట వశము గాదు
Sk 585
అరుణ ముటుకూరు
హన్మకొండ
కవితపేరు : ఆది గురువులు
**************************

Sk585
అరుణ.ముటుకూరు
హన్మకొండ
అన్నదాత : కవితపేరు
పండిన పంట ధర వస్తే కోలాహలం
పంట రాకుంటే మదిలో కలకలం
పురుగులు పోకున్నాయని కలకాలం
శీతలపానీయం లా తాగావా హాలాహలం

వల్లకాడే   నీ  విలాసం
కుటుంబం కకావికలం
సేంద్రియాలు వదిలి రసాయనాలు
వేసిన నీ కలాపం
తెచ్చిపెట్టింది అందరికీ ఇంత విలాపం

ప్రభుత్వం చూస్తున్నా ఈ వికృతం
ఆపడం లేదు నకిలీ విత్తన వృత్తం
రైతు చావులు అయ్యాయి నిత్య కృ త్యం
మీరే లేకుంటే మా పరిస్థితి అస్తవ్యస్తం
అన్నదాత వు నీవు ప్రాణ దాతవు కాబోకు 
*******************************

Sk 585
అరుణ.ముటుకూరు
హన్మకొండ
చదువుల తల్లీ : కవితపేరు
తల్లీ ! భారతీ వందనము
నిన్ను కొలువ వయసు , సందర్భం లేదమ్మా
ఎల్లవేళల మా వాక్కు నందున నిలిచి గెలిపించవె వాక్దేవి ,
" కచ్ఛ పి " వీణా ధారిణవైన నీవు
ఆ నూరు తీగల వీణ అలవోకగా మీటు సమయాన " సరసువతి " వై
నీ పతికో విన్నపం చెప్పమ్మా
" మేధ " తో పాటూ " మేత " కూడా రాయమని మా నుదుట
ఎందుకంటే , మరి "సిరి " వున్నచోట " శారద " వుండదని
మా లోకపు మాట
అపుడే , నీ భిక్ష తో మెదడుకు వేసిన మేత పరాయి దేశం లో విసిరే దుర్గతి తప్పుతుంది కదా
ఈ మేధో వలసలూ వుండవు , దూరానున్న పిల్లలకై పెద్దల నిరీక్షణ వుండదు
దేశ సమ్స్క్రుతి మాయమవ్వదు
ఈ ఒక్క విన్నపం వొప్పించు మాతా మరకత శ్యామా  . .
*****************************************
Sk 585
అరుణ.ముటుకూరు
హన్మకొండ

కవిత పేరు : భవిష్యద్వివాహం
👊🏻👊🏻👊🏻👊🏻👊🏻👊🏻👊🏻👊🏻👊🏻
పెళ్లిపందిళ్ళు  , ఫంక్షన్ హాల్స్ , భజన్త్రీలు , ముత్తైదువలు , పిండివంటల ఘుమఘుమ లు
ఏవీ అవసరం లేని భవిష్యత్ ఇది
కావలిసింది అంతర్జాల కనెక్షన్ తప్ప

పంతులుగారు , కొత్తబట్టలు , పెళ్ళికూతురు , స్నేహిత, బన్దుగుల ఆహ్వానాలు అన్నీ అందులోనే . .
ఆపై పెళ్ళి సమయాన పెళ్ళికూతురు తన ఇంట , నేను మా ఇంట , అందంగా తయారై , స్నేహితులు , బంధువులు అంతా చేరాము స్కైపు ముందు
తంతు మొదలై పె . కూ ని స్కైపు ముందుకి తెమ్మని పంతులు గారి ఆదేశం
లేప్ టొప్ పక్కనుంచి సిగ్గులమొగ్గ పెళ్ళికూతురు ఆగమనం
బంగారు బొమ్మ పాట తో తాను , అలనాటి బాలచంద్రుని పాట తో నేను హాజరు
పురోహితుల వారడిగారు మీ ఇద్దరు మీ స్టేటస్ " సింగిల్ " నుండి " మేరీడ్ " కు మారడం ఇష్టమే నానని
అవునని మా అంగీకారం , వెను వెంట పూలు , స్మైలీ స్టీక్కర్స్ తో
నిండిపోయె మా ఫోన్ లు
ఆహా సులభ పెళ్ళి , కాణీ ఖర్చు లేని పెళ్ళి అనుకున్నా
నాకు ఆరునెలలు 3జీ వాలిడిటి  తో మొబైల్ రీచార్జ్ దక్షిణ అంటూ పంతులు గారి మెసేజ్.
అమ్మో , నాకొద్దు ఇలాటి పెళ్ళి అరుస్తూ లేచాక తెలిసింది తెల్లారి కల అని.
ఐతే నిజమేనా
********************************

అయుత కవితా యజ్ఞం
25_ 12_ 2015
Sk no : 585
అరుణ.ముటుకూరు
కవితా శీర్షిక : కలం _ బలం
🔪🔪🔪🔪🔪🔪🔪🔪
కవిత
కలం రేపును కలవరం
ప్రేమికుల చేతి రాతల్లో

కలం చూపును కనికరం
నేరస్థులు ఐనా న్యాయమూర్తులు లెక్కల్లో

కలం రాల్చును అగ్ని క్షణక్షణం
నిజమైన రాతల రూపాల్లో

కలం ప్రవహించు కరుణ రసం
ఆప్తుల భావ ప్రకటనల్లో

కలమెంత బలమైనా
               కారాదు విశృంఖలం

కలం బలం నేరుగా చేరును జనం

 ఏమి  చేయలేదు కలం
                 జతకలుపును
                 వియోగపరచును
తిమ్మి ని బమ్మి చేయును

రూకలు విసరినా , నూకలు చల్లినా      
చలించరాదు కలం
        అదే దాని బలం
    కత్తి కన్నా కలమే బలం
ముమ్మాటికీ ఇదే నిజం , నిజం
*************************

శీర్షిక : పక్షి విలాపం
🐲🐲🐲🐲🐲🐲
ఆకాశపు పగటి చుక్కల్లా హాయిగా ఎగురుతూ.ఆహారం సంపాదిస్తామ్
దొరకని పక్షాన వలస పోతాం అంతా కేవలం అతిధులుగా
మళ్ళీ మరలుతాం

మమ్ము చూసి ఎగిరారు , వలసా పోయారు , కానీ ఆతిధేయుల్లా అక్కడే నివాసం
తిరిగి రారు

మీ పొలాల్లో క్రిమికీటకాలనూ దూరం చేసే మమ్ము రసాయనాల తో లోకానికి దూరం చేస్తున్నారు

మీ ఆహారానికి, ఆసక్తి కి , ఆ  శక్తి కి
మాలో ఎన్నని ఎన్నని చంపేస్తారు
 ఆఖరికి మీరు తినే బబుల్ గమ్ తో కూడా మమ్ము అంతమొందించే స్తున్నారు
తిని ఎక్కడ పడితే అక్కడ వూయక కాగితం లో చుట్టి చెత్తలో వేస్తే,

అదేదో ఆహారం అని వాలి అతుక్కుని రాక మరణించే కొన్నైనా , బ్రతుకుతాయి కదా

సుకుమారులమంటూ మీ చిక్కు వడ్డకురులు గాలికొదిలేసి , మాకూ అందులో చిక్కి  "పోయేలా " వరమిస్తున్నారా వనితలూ

ఆ జుట్టు తీసుకోలేక , ఎగరలేక వేటికో బలైపోతే అది మీ పుణ్య మేగా

మా గిజిగాడన్న అంత పక్కాగా మీ ఇళ్ళు వున్నాయా ఏ ఇంజనీర్ కడుతున్నాడలా

సవతి పిల్లలు భరించలేవు , తెలిసే దాక మా కోయిల అక్క పిల్లల్ని ప్రేమగా పెంచడం లేదు కాకి తల్లి

మా గూళ్ళు పెట్టే చెట్లను నరికినా మరో చోటు వెతుకుతాం ఇక్కడి పళ్లు తిని అక్కడ గింజలే సి కొత్త మొక్క అంకురార్పణ చేస్తాం

మీకు మాకూ తేడా తెలివా అంటే మాకున్నదా,  మీకా ?
Sk 585
అరుణ ము టు కూ రు
హన్మకొండ
**********************
Sk 585
అరుణ.ముటుకూరు
హన్మకొండ
ఎలా తెలుపను : కవిత పేరు

తొలిచూపు ప్రేమ ఆకర్షణ అనేవాడి ని
నిను చూసిన అ తొలి క్షణం దాకా
ఎన్నోసార్లు వెన్నెల్లో నే చూసిన గోదారి తళతళ లు
నీ కళ్ళ మిలమిల ల్లో కనిపించేదాకా
భావం పంచుకోడానికి చూసిన కళ్ళకి మాటల్రావు , చెప్పే నోటికి
చూపులేదు
నాకే తెలియని నా మనసు అన్వేషణ కి అర్ధం నువ్వని , అ రూపం నీదేనని , నా సగభాగానివి
నువ్వేనని
పంచుకుని పనిచేసే నా  పంచేంద్రియాలు విస్మయం తో మొద్దుబారాయి
తెలిసింది చివరికి నువ్వు నా దానవే నని
నాలో నాదానివని.నీకు తెలిసేలా
అది నీ కెలా తెలుపను ప్రియా !
💝💝💝💝💝💝💝💝🎎

 అరుణ. ముటుకూరు
sk 585
హన్మకొండ
 కవితపేరు : తృణ ప్రాయం

నీ పని ఐతే తృణమో , పణమో ఇస్తానంటావ్
నిన్నవమానిస్తే తృణప్రాయంగా తీ శేశా డం టా వ్
మమ్ము ఆహారం గా గైకొని పశువులు నీకు ఎరువిస్తాయ్
తుఫాన్ లకి , గాలివాన లకి కూడా వెరవం
తలవంచినా తిరిగి గర్వంగా తలెత్తుతాం
బుద్ధి " గడ్డి " తిన్నది , అంటూ పదాల్లో తప్ప పరగణ లో మిగలనీయవ్
నా నాశనం తో , పశువుల్ని , క్రిమికీటకాల్నీ నాశం చేసి నీ నాశనమే
కొనితెచ్చుకుంటూన్నారు
బుద్దుని భూమిలో ఇంత అమానవీయతా
ఓ మనిషీ ఇకనైనా బుర్రలోని కాంక్రీట్ వీడి కళ్ళు తెరువు
పర్యావరణ రక్షణ కై పాటు పడు
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
****************************

అయుత కవిత యజ్ఞం
sk 585
అరుణ . ముటుకూరు
హన్మకొండ
శీర్షిక : మనసు తెలుసుకో మాట కలుపుకో
(love)(love)(love)(love)(love)(love)(love)(love)
మాట విలువ తెలిసి మసలుకో
మంచి మాట మనుగడ కు      బాట
మనసు నొచ్చు మాట బంధపు వేటు
కోపంలోనూ నిగ్రహించు రెప్పపాటు వూరికే    వదరకు  అంత       చేటు
నోరుజారిన దొరకదు ఎదను చోటు
ఇకనైనా తెలుసుకో నీ    పొరపాటు
చేయకు             తప్పుపైతప్పు మరోమాటు
ఆలోచించు ఎపుడూ క్షణం పాటు
బంధాలు నిలుపుకోక ఎందుకీ ఏమరపాటు
వద్దు ఏ విషయం లోనూ తొందరపాటు
అందరినీ దూరం చేసుకు పొందకు కుంగుబాటు
అందరినీ కట్టకు ఒక గాట
ఇకనైనా పట్టు మంచి బాట
ఇప్పటికీ వినకుంటే అది నీ గ్రహపాటు
****************************

అయుత కవిత యజ్ఞం
అరుణ . ముటుకూరు
Sk 585
శీర్షిక : ఊహా సుందరి     (4)
👧👧👧👧👧
ఎవర్నువ్వు అసలెవర్నువ్వు
కనులు మూస్తే కళ్ళ ముందుకొ స్తావు
భారపు సొగసుల కోమలి కనిపించవే
నువ్వలా నవ్వుతూంటే మువ్వలా
చెదిరేను నా మది చిలికే కవ్వంలా

నీలాల నీ కురులు
రేపెను  ఎదనలజడులు

నాట్యం లా నీ నడక
నా ధ్యానం తప్పులతడక

అల్లిబిల్లి గారడితో చేయకే నలిబిలి
అసలు నువ్వంటే కాదు
నీ కోసం తపించే నే నంటే నాకిష్టం

జగానికి మాటకారిని , నిను చూస్తే
          అయిపోతా మౌని ని

ఉబికి వస్తోంది కంట నీరు
నిను చూసిన ఆనందమో , నీకేం
  చెప్పలేని దుఃఖమో

నీ వెనకే నా మనసు పరుగు ఎప్పటికి  ఆగునో    అసలు
**********************************
అయుత కవిత యజ్ఞం
sk 585
అరుణ.ముటుకూరు
హన్మకొండ
శీర్షిక : కవిత _ స్పందన _ కరువు (5)

అల్ల నల్లన ఒకనాడు మెదిలె రవీంద్రుని మదిలో అయుత కవితా యాగం చేయవలెనను కోరిక

నేను సైతమంటూ చేరిరి వచన ,
పద్య  కవులెల్ల బిరాన

సహస్ర మనుకున్న కవులు అందు పావువంతున హైకు చేరిరి

అందున గూడ నూటికి పావురే
అల్లుచు నుండిరి కవిత , పద్యం

తక్కిన వారు చుట్టాల పగిది చూసి పోవుటే తప్ప స్పందన కైన
చేయి రాదేలనో

తెలిసినచో చర్చలు , తెలియకున్న  పాఠ్యార్ధి గ ఎక్కడ
దొరకునింత మంచి అవకాశం

అహంకారం , అతిశయం , అభిమాన , అలకలు , బుజ్జగింపులు
ఎన్ని సాగినా , ఏమి చేసినా అన్నిటికీ కొందరంటే కొందరే

ఏదీ నాటి ఆరంభ స్పందన
ఎక్కడ మీ అభినందన
ఏదండీ మీ అభిశంసన

షడ్రుచుల ఉగాది పచ్చడి వోలె
శత శైలుల కవులు గలరీ సహస్రాన

చదివితిరా నా కవిత అని
 అడిగిన గానీ,
అడిగినా . . .  గానీ
రాదేల స్పందన

ఒప్పున్న సంతసం , లేకున్న సరి దిద్దడం

చింత ఏటికి , కలసి రండు , పంచ మాస వ్రతం పూర్తి చేతము

తెలుగును, రవీందరు ని
      ఆశయమును
                 బ్రతికింతము
*******************

అయుత కవిత యజ్ఞం
sk 585
అరుణ . ముటుకూరు
శీర్షిక : చితికిన బతుకులు (6)

  అమ్మా నాన్న ల బలవంతమో
ఆదుకుని  అన్నం పెట్టే వారు లేకో
వారి లేత భుజాలు     మోస్తున్నాయి మోయలేని భారం
ఎవరు ఆపగలరీ ఘోరం

చిన్ని చిన్ని చేతుల చితికిన బ్రతుకులు
ఆకలి మంటలు బాప అవధులు లేని అలసట
ఎవరి ఆశలకో బలియైన బాల్యం

నాన్నా ఈఁ బారు   లో పనేమిటి
అన్న పెద్దాయనకి , మా నాన్న మీ లాగే ఇక్కడే వుండీ వుండీమాకు లేరు
అందుకే నేను ఇక్కడ
సమాధానం


వున్న అమ్మకి బట్టలు బరువు
లేని అమ్మకి     బట్టలు కరవు
ఎక్కడుంది          చిరు నగవు

ఎన్నో ఎన్నెన్నో రకాల ఆధరువులు
చేరితే చెత్తకుండీ ఎందరికో అదే ఆధారములు

ఆశతో చేరినా ఆనక తనకు ఎవరూ లేక ఒంటరి అయిన సినిమా బతుకులు
రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు
తెలిసినా తప్పవు వారికి ఇక్కట్లు
తెలియదా రెండో వారి   ముచ్చట్లు తెలిశాక లోకుల పలు   చీవాట్లు
వారితో తమ వారున్నతెలియుట ఎట్లు
****************************

అయుత కవిత యజ్ఞం
sk585
అరుణ . ముటుకూరు
హన్మకొండ
శీర్షిక : బుక్ ఇంగ్ (8)

పుస్తకాలని ఫేస్ చేయక
ఫేస్ బుక్కంటూ బుక్కవుతున్నారు

ఇంతులకి పాడుతూ వంతలు
ఇంటర్నెట్ లో ఇంటన్ నెట్ వేస్తూ

          పేరొకటి , చిత్ర మొకటి
ఎక్కడా లేదు నిజాయితీ ,
  ఎవరికీ లేదు     రాయితీ

చిత్రాన్ని చూసి చిత్తరువై పర్సులు
ఖాళీ చేసుకున్న  ప్రబుద్దులు

లైకు కొట్టిన వారిని లైకు చేయడం
షేరు చేస్తే జీవితాన షేరు ఇవ్వడం
కుటుంబ చిత్రాలు స్నేహితులు చూస్తారని అనుకుంటే ,
దాన్నీ వదలక ఏదో చేసి   బెదిరింపు
ఏ మినహాయింపు లేని
                  కొనసాగింపు

ఒకరికొకరు తోడు , నీడ కాదిపుడు                                 బంధం
ఎక్కడో పరిచయం , ఎందుకో కలవడం , అంతలోనే వీడి పోవడం
ఇది ఎక్కడి దురవస్త
ఏమగునో ఈఁ వ్యవస్థ

ఇలా , ఫేసుబుక్కుకు బుక్కైన ఫేసులెన్నో
*******************************

అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ . ముటుకూరు
హన్మకొండ
శీర్షిక : " మమ " కారం

ఆంగ్ల వత్సరాదిన కొత్త కవిత             శ్రీకారం
వుంటే ఒకరికొకరం సహకారం అవుతుంది ఆ కల      సాకారం

కూడదు ఎవరికి    అహంకారం
చిరునవ్వే ఎపుడు అలంకారం
తెద్దాము     దీనికో      ఆకారం

  ఎందుకు ఘీం కారం , హుం కారం
  వహిద్దాం శాంతాకారం , ఓంకారం
   ఎవరిని   చేయము     వెటకారం
మనకే ముంది అసలు    అధికారం

అలిగి వెళితే అనధికారికారం
తీర్చుకున్నట్టా    ప్రతీకారం
అదసలు కాదు     పరిష్కారం

అందరికీ ఎంతో సంస్కా రం
చేద్దాం కొత్త విధ ఆవిష్కారం
అది  అందరికీ      అంగీకారం

కవిత బాలేకున్నవద్దు ఛీత్కారం ,         తిరస్కారం
పాఠాల పై ఏర్పడిన  మమకారం
రాస్తాం      వస్తుంది     పురస్కారం

ఉద్ధండ కవులు అలంకారం
వారు చేస్తున్నారు ఉపకారం
పసి కవితల పురిటి కంపు కి వద్దు వికారం
కడదాం అందరమూ కలసి ప్రాకారం
***************************

అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ . ముటుకూరు
హన్మకొండ
శీర్షిక : డే  ఆశ్రమం (9)


నాడు తమ ఇష్టం తో ప్రజ , రాజ్య , సుత ను వదలి వెళ్ళేవారు వానప్రశ్థమ్

ఇపుడు అయిష్టంగా పిల్లలు వదులుతున్నారు వృద్ధాశ్రమాల్లో

పిల్లల్ని పంపుతారు డే స్కూల్
పెద్దల్ని పంపాలి డే    ఆశ్రమం

పగలంతా దంపతులు ఉద్యోగార్ధం
పిల్లలకి , పెద్దలకి లేదు రక్షణ
వారి ఆరోగ్యం , ఆనందం అన్నిటికీ
వుంటుంది కదా సంరక్షణ
ఎవరి కోసమో వుండదు నిరీక్షణ

అందుకే వారిని డే స్కూల్ , వీరిని డే ఆశ్రమం
వీరికి కంగారు , వారికి ఒంటరితనం
రెండూ దూరం
తాము కన్నవారు , తమని కన్నవారు వయసున పసి వారే


సాయంత్రాలు అందరూ కలిసి ప్రేమలు , కబుర్లు పంచుకుంటూ ,
ఒకరి అనుభవాలు ఒకరు నంజుకుంటూ

ఎ వరికెవరూ  దూరమూ కారు
ఇబ్బందీ కారు
ఒకరి జీవితాన ఒకరి జోక్యం వుండదు  ఎవరికి    సౌఖ్యం
కావాలి     కొంత       లౌక్యం
తరాల పిల్లలకి ఏర్పడు సఖ్యం

తమ వారు లేని ఇంట కంటే , తమ వయసు వారు వున్న కాలక్షేపం
అది వారి ఆరోగ్య పు   క్షేమం
ఆలోచించండి వారి  సంక్షేమం


గూటికి చేరగానే పిల్లలు , వారి పిల్లలు మరింత వుత్సాహం
వుపయోగం వారి అనుభవ సారం
ఇంకా ఎందుకు తాత్సారం

ప్రేమ చూపండి ఎల్ల కాలం
పెరిగే జీవిత కాలం
*********************

 అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ.ముటుకూరు
హన్మకొండ
శీర్షిక : అంగుష్ట చరవాణి(10)

అరచేతిలో ఇమిడి పోయే ప్రపంచం చరవాణి రూపాన

కలిపింది ఎందరినో , ఎక్కడి వారినో ఒక్క చోటనే

చిన్ననాట చూసి అంగుళగడియారం ఔర అని
అచ్చె రు వొందితి


పెరిగే  సాంకేతికత అంగుళి
చరవాణి రూపాన


 విస్తుపోతినెంతేని ఏను
ముందేమి చూచెదమో

ఎంత చూసిన , మాట్లాడిన కొంత
సంతసం,  వాస్తవమే

పసి వారిని చూడ ముదమే , ముద్దు లాడ వశమే

చూసిన , మాట్లాడిన దూరము తొలగున , భారం తగ్గున

కలువకు చంద్రుడుదూరమైనరీతి
చరవాణి  చేతనున్న ఏమి ప్రీతి

చరవాణి  చేతన్  మంచిదే కొంత
తోడ న్ కాగలదా సుంత
*******************
 అయత కవితా యజ్ఞం
SK 585
అరుణ . ముటుకూరు
హన్మకొండ
శీర్షిక :  వృక్ష _ _ అసురులు (13)

అసురులకి లెక్క లేదు నరులు
నరులకి అవసరం లేదా తరులు

విరిబోణి కి వద్దా విరులు
వారే లేకున్న ఎందుకు వరులు
అపుడు అగును కలలు ఆవిరులు

పుట్టినపుడు ఊయలవుతాం
పోయినపుడు పాడె అవుతాం

   జీవితమంతా అందిస్తాం హస్తం
   అర్ధం చేసుకోరు మా తత్వం
    ఇదేగా . . . మీ మనస్తత్వం

కాసింత నీరేగా . . . కోరుకుంటాం
కూసింత దప్పిక . . తీర్చుకుంటాం

పరిమళం తో ఇస్తాం. .  నాసికానందం
వర్ణాలతో కలిగిస్తాం. . .  నయనానందం
అందిస్తాం మీ కెంతో మోదం
అయినా నరికే ఉన్మాదం

నీడ నిస్తూ తీరుస్తాం  తాపం
మాకు    మీతో   మనస్తాపం

మీ తిండి , బట్ట , వాసం ,సహవాసం అన్నిటికీ . . . మేము ఆధారం
మేము లేకుంటే. . . .  మీమనుగడేప్రశ్నార్థం

చిన్నగాయానికే  చేస్తారు . .  హాహాకారం
రాళ్ళతో కొట్టినా చూపుతాం. .  కనికరాలు

ఊరుకుంటారా  . . . గిల్లితే మీ బుగ్గ
నిలువునా నరికినా. . . . .  వస్తాంమరోపక్క

బ్రతకలేకున్నా . . . . . సురుల్లా
చంపకండి . . . . . . . . .అసురుల్లా

నాటండి నేడు ఒక . . . . . . మొక్క
తీరుస్తాం మీ అవసరాలు.ఎంచక్కా
***************************

అయుత కవితా యజ్ఞం
    Sk 585
అరుణ . ముటుకూరు
హన్మకొండ
శీర్షిక :

హస్త లాఘవమన్న . . . . . .
                       ఏదో అందురు గానీ
చేత నైపుణ్యత నుండుటయే గాద
ఇట కవులెల్ల చేయి తిరిగిన  
                                     వారన్న
మరి , హస్తలాఘవమున్నవారనుట
                                              ఒప్పేసుమీ
దొంగలన్న మాత్రమేమి తప్పు ,
      సుకవితలతో మా మది
        దొంగిలజేయు చున్నది        వాస్తవమే
**********************************

అయుత కవితా యజ్ఞం
Sk 585
అరుణ.ముటుకూరు
శీర్షిక : ఏది కవిత్వం (12)



కవిత్వం అంటే ఏంటని వచ్చిందో
 చర్చ రవీంద్రుని సభలో
బుర్రలకు , కలాలకు, కాగితాల కు
పదునెట్టారు
సలసల రక్తం మరిగి , మాటల్లో
బైటికొస్తే అది " విప్లవ కవిత "

బావపై , భామ పై, వరసైన ఎవరిపైనైనా భావయుక్త పోలిక అందంగా ఒదిగితేఅది"భావకవిత"

నవరసాల్లో ఏ రసం లో చెబితే అది ఆ రసం కవిత కాదా

సమాజ సమస్య లపై శరం సంధిస్తే
అది " సమాజ స్పృహ కవిత "

అసలు పదాలే వుండాలా
కుక్క పిల్ల , సబ్బు బిళ్ళ కాదేదీ
కవిత కనర్హం అంటాడు శ్రీ శ్రీ
నా అక్షరాలు వెన్నెల్లో ఆడే ఆడపిల్ల లంటాడు తిలక్
ప్రేమంటే అమలినమంటాడు రాయప్రోలు
బూజు పట్టిన పాత చింత కాయ
వదిలేయండి , జనాలకి అర్ధమయ్యే
వ్యవహార భాష తో ముందుకు సాగండి అంటారు గురజాడ , కుందుర్తి , గిడుగు , కందుకూరి
ఎవరి శైలి వారిది , అన్నీ ఆస్వాదించగలం అంటాం మేము
నాటి నన్నయ , తిక్కన , సోమన
రాసినవీ అందమైన కవితలే
నేటి " సి నా రె " వరకూ
ఎంత బాగా రా " సి నా రె " అని మెచ్చిన కవితలే
మరింక ఏటికి ఈఁ ప్రశ్న
శ్రమని మరపించే అలవోకగా పదాలు పేర్చి , కూర్చి పాడే అందమైన జానపదము " జాను కవితే "
కమ్మని కోకిల కూత కూడ కవితే ఆస్వాదిస్తే
కాళిదాసు మేఘుడితో సందేశం పంపినా ,
జాషువా గబ్బిలం తో రాయబార మంపినా
రెండూ ఆనందించాం
అంతెందుకు నేను కవిని కాదన్న వాణ్ణి కత్తి తో పొడుస్తా నన్న జంధ్యాల కవితా చతురతని ఆనందించాం
పోతన , శ్రీనాధ, ధూర్జటి , రాయలు , వాల్మీకి , వ్యాస ఒకోరు ఒకోలా
అసలు భావం ముఖ్యం కానీ భాష కాదే , కాదు , కాకూడదు , మరి
" who can kiss her cheeks except my lips" అన్న కీట్స్ కవినీ వహ్వా అంటాం.
కవిత అంటే " రసోన్మీలనం " పొందడం.
పెద్దవారైనా ఒకో సబ్జెక్ట్ కి ఒకో టీచర్ వుండి , చిన్నవారైన పిల్లలు అన్ని చదివినట్లు
ఇందరి కవితలు చదివి ఆనందం పొందే పాఠకుడే అసలైన గొప్పవాడు
******************************************


అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ.ముటుకూరు
హన్మకొండ
శీర్షిక : ప్లాస్టిక్కు హత్యలు (  11 )


పక్షుల కిలకిలా రావాలు , అలారం లా కోడి అరుపులు , అంబా అంటూ
లేగదూడల పిలుపులు అవుతాయేమో గతం.

వదిలేసిన ఆవొకటి వచ్చింది ఇంటికి
కొన్ని బియ్యం వేస్తే చాలలేదు పంటి కిందకి
ఇంకేదో కావాలనే సందేశం నా కంటికి
అప్పటికి పంపేశా బైటికి

ఎత్తు కడుపు చూసి దూడ అనుకున్నా
తినక పొర్లుతుంటే ఆకలి లేదనుకున్నా
అసహజ పొట్ట అనుమానం పెంచిన దన్నా

అభిమానం , అనుమానం ముప్పిరి గొని ఎక్స్టరే  తీయిస్తే తెలిసిందో భయంకర నిజం
పొట్టనిండా ప్లాస్టిక్   కవర్లే
అవికరగకే నొప్పితో దొర్లే
తీయించా నిపుడు    పర్లే
అంతటితో వూర్కోలే
వూర్లోను వున్నవి అట్లే
ఎన్నోకొన్ని  బ్రతికినట్లే
ఐనా , నా పిచ్చి కానీ
ఒక చిన్న వూరిలో నే ఇన్ని , మరి రాష్ట్రం , దేశం , ప్రపంచం లో . . . ఎన్నో
కవర్లు కరగవని తెలిసీ , ఇంత మందం , అంత మందం పర్లేదులే నని ఎందుకో ఈఁ  నిబంధనలు
అంత మందాన తడిశాయేమో చేతులు
మీ జూ లో జంతువులకీ కాలిపోతున్నాయి కడుపులు
ఇకనైనా మనీ మరచి మేలుకొండి
నా      య        కు       లూ . . . ?
 (అందుబాటు లో గడ్డీ లేదు
అందేలా సినిమా పోస్టర్లు లేవు
ఆకాశాన్ని అంటే డిజిటల్ తప్ప
మీరు పడేశా రని , కవరైనా చెత్తలో ఏదోవుందనితింటాంతెలియక.
తెలిసిన మీరైనా మానండి దయచేసి ) వాటి స్వగతం
***************************************

అయుత కవితా  యజ్ఞం
sk 585
అరుణ ముటుకూరు
హన్మకొండ
శీర్షిక : హద్దు దాటకు(14)


హద్దు లేనిది పిల్లలపై ప్రేమ
అందుకని నువు వలువలు , విలువలు దిగజారకు భామ
ఆ హద్దు వారు గీయనిదైనా నీకు తె లియాలి సుమా
అతి ఎపుడూ అనర్ధమే
అది తెలియక చరిస్తే జీవితం వ్యర్ధమే
నీపై బైటివారి ప్రేమ స్వార్థమే
తేడా తెలియకుంటే బతుకు నిరర్ధకమే

దేశానికి , నదికి, భుములకి వుంది హద్దు
ప్రాజెక్ట్ లకి ఆనకట్ట హద్దు
అది దాటితే ప్రళయమే
నాటి సునామీ , నేటి వరద హద్దు దాటిన ఫలమే

ఆనాడు సీత దాటింది హద్దు మరిదిపై మాటల్లో , అతని గీతల్లో
ఫలితం ఓ మహాకావ్యమంత
గతం చూసైనా తెలియాలి కద మొద్దు
అడవి హద్దు దాటి జంతువులు వూర్లో కోస్తే భీభత్సమే
ప్రశాంతత కు నష్టమే

నాకేం కాదు , నాకన్నీ తెలుసు అంటూ హద్దు మీరితే
అది తెచ్చేను నీకు చేటు
ఆపై అమ్మానాన్నలకి రక్తపోటు

తల్లితండ్రులు మీరు తప్పు చేయకండి.అమ్మాయైనా , అబ్బాయైనా అతి స్వేచ్ఛ అనర్ధమే
ఎంత హద్దొ ఎంత ముద్దొ మీకూ తెలియాలి
********************************

అయుత కవితా యజ్ఞం
Sk 585
అరుణ . ముటుకూరు
హన్మకొండ
శీర్షిక : సంసారం సంగీతం (15)

లెక్కలు సరిచేయ కావాలి. . . . . .
             ఆరోహ,    అవరోహణలు

సంగీత మధురిమ కి కావాలి . . .
             శ్రుతి లయలు

సంసారానికి   ఉండాలి . . . . . .
             హెచ్చు తగ్గులు

సంసారం సంగీతం లా లెక్క         తప్పక ఉండాలంటే ,
             సంయమనం కావాలి.... ఇద్దరికీ

ఎక్కడ నెగ్గాలో , ఎప్పుడు తగ్గాలో  తెలిసిన
              కాపురం కదా అగు గోపురం
            సంసారాన కదా సమ్ సారం
*****************************

 అయుత కవితా యజ్ఞం
Sk 585
అరుణ.ముటుకూరు
హన్మకొండ
శీర్షిక :                 (17)


కొండను తవ్వి విల్లా
అండన ఒక్క పిల్ల

కావలిసినంత చదువు
జ్ఞానం మాత్రం పొందవు

మిడిమిడి జ్ఞాన మందుల చెలిమి
పేరు కూడ తెలియని రోగాల బలిమి

గ్రహాలపై మోపుతాం కాలు
పక్కవారికై చాచము హస్తాలు

సంపద కేమీ కొదువలేదు
దానానికి మనసు రాదు

లేదు మనసుకు శాంతి
దొరకక ఏ ఇంతి

ఎంతో వున్నది మేధస్సు
కోరును అది యశస్సు

చేతికి ఎంతో ఖరీదు వాచీ
సమయం సరిపోక పేచీ

ఇదే కదా నేటి జీవన విధానం
ఇవ్వము ఎవరికి  ప్రధానం

చేసుకుంటే సమయ పాలన
తప్పకుండ పొందు లాలన

వేగము తగ్గిన నిదానం
చేర్చును సన్నిధానం
*******************

 అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ . ముటుకూరు
శీర్షిక : మనిషి మారలేదు (18)
9_ 1_ 2016

పూర్వం. . . . . .  ఎపుడో అడవుల్లో జంతు జీవనం ,
                పచ్చి మాంస భక్షణం ,
దొరికింది వీర భోజ్యం ,
         బలమే గెలుచు సత్యం
వావి వరసలు లేవు ,
             సిగ్గు , ఎగ్గు తెలియవు
ఏమాత్రం లేక వెరపు
        కాంక్ష తీర్చుకోను తెగింపు .
   మారి , మారి , మారి , మనిషిగా
       మనీషి గా కూడ అయ్యాడు
ఇప్పుడు , తిరిగి మరో మారు
        కొత్త మార్పు " మనీ " , " షి "
                             గా మాత్రమే
నాడు మారిన మనిషి , . . . . నరుడి నుండి వానరుడిగా
నేడు , తిరిగి మళ్ళీ . . . మారాడు      
                                   వానరునిగా !
భావిస్తూ  ప్రతీ ధరణీ , తరుణి కి
                              తనే      వోనరునిగా
అందుకే . . . . అయినా మనిషి మారలేదు
    ఆతని కాంక్ష తీరలేదు
(బ్రహ్మచారి శత మర్కటః
అమ్మాయిలు లేని రాబోయే లోకాన ఎన్ని శతాల మర్క టా లో )


అయుత కవితా యజ్ఞం
Sk585
అరుణ.ముటుకూరు
హన్మకొండ
14_ 1_ 2016
శీర్షిక : అద్దె అమ్మను కాను
మనసున్న బొమ్మను

కన్నా కానురా నేను అద్దె అమ్మ
అంటే నా కంట ఊరును చెమ్మ

నిను కోరింది మరో  అమ్మ
కడుపార మోసినది ఈఁ అమ్మే

ఆ అమ్మ కోరికకై మనసు నచ్చకున్నా
నిన్ను వదులుకున్నా మది నొచ్చుకున్నా

ఏ ఇంటనో మహరాజుగా వుంటావని
వప్పుకున్నా కని ఇస్తానని

తెలిసి నను తిట్టుకోకురా నాన్నా
ఎక్కడున్నా చిట్టి కన్నా

ఆ తల్లి పిల్లలకై ఎంతో రోసింది
తప్పక నిను నా కడుపున దాచింది

ఆ ఇంట అవుతావని గారాల పట్టి
ఇచ్చా ను  దుఃఖం నొక్కిపెట్టి

అనకురా నన్ను అద్దె అమ్మనని
తెలిశాక ఆ అమ్మ నలుసువు కావని

రానీక ఆ తల్లి కంట చెమ్మ
నీకై తాను తపించిన అమ్మ



అయుత కవితా యజ్ఞం
Sk 585
అరుణ . ముటుకూరు
హన్మకొండ
 శీర్షిక : పొరుగింటి  పుల్ల కూర( 62)

మన దేశాన ఎక్కువే నమ్మకాలు
మక్కువ ఎక్కువైన మూఢ నమ్మకాలు . . .

మొక్కుతాం ఏదైన రాయి , రప్ప , చెట్టు , పుట్ట . . .
భయపడతాం ఎందుకో  గాలి , ధూళి . . . . .
నమ్ముతూనే హనుమంతుని , . . . .
ఆశ్రయిస్తాం మంత్రాలు , తంత్రాలకై

భావాల్లో ఆధునికమనుకునే అమెరికా , . . . . . .

మనం వేలంవెర్రి గా అనుసరించే అమెరికా , . . . . . . .

స్పైడర్ మాన్ , శాండ్ మాన్ అని చిత్రాలు తీసి సంతసించె అమెరికా . . . .

మన దేవుళ్ళు నిజమేనని రుజువు చేసే అమెరికా . . . . .

ఆ , దేశపు మాజీ అధ్యక్షులు మన హనుమంతుడు తనకు ధైర్యం , స్థైర్యం ఇస్తాడని చెప్పినపుడు _

ఆనందం తో నవ్వాలో , వద్దో తెలియని భావం . . . .

మన కట్టు , బొట్టు , పద్ధతులు , ఇపుడు దేవుడూ ఇల మన మంచి వారు . . . .

మనకు నప్పని వారి వేషధారణ , డేటింగ్ పద్ధతులు పట్టుకు మన. పడతులు . . . .

అందుకే పొరుగింటి పుల్లకూర అన్నారు.  ప్చ్ ! ! ! ! ! ! ! !



అయుత కవితా యజ్ఞం
Sk 585
అరుణ . ముటుకూరు
హన్మకొండ
 శీర్షిక : పొరుగింటి  పుల్ల కూర( 63)

మన దేశాన ఎక్కువే నమ్మకాలు
మక్కువ ఎక్కువైన మూఢ నమ్మకాలు . . .

మొక్కుతాం ఏదైన రాయి , రప్ప , చెట్టు , పుట్ట . . .
భయపడతాం ఎందుకో  గాలి , ధూళి . . . . .
నమ్ముతూనే హనుమంతుని , . . . .
ఆశ్రయిస్తాం మంత్రాలు , తంత్రాలకై

భావాల్లో ఆధునికమనుకునే అమెరికా , . . . . . .

మనం వేలంవెర్రి గా అనుసరించే అమెరికా , . . . . . . .

స్పైడర్ మాన్ , శాండ్ మాన్ అని చిత్రాలు తీసి సంతసించె అమెరికా . . . .

మన దేవుళ్ళు నిజమేనని రుజువు చేసే అమెరికా . . . . .

ఆ , దేశపు మాజీ అధ్యక్షులు మన హనుమంతుడు తనకు ధైర్యం , స్థైర్యం ఇస్తాడని చెప్పినపుడు _

ఆనందం తో నవ్వాలో , వద్దో తెలియని భావం . . . .

మన కట్టు , బొట్టు , పద్ధతులు , ఇపుడు దేవుడూ ఇల మన మంచి వారు . . . .

మనకు నప్పని వారి వేషధారణ , డేటింగ్ పద్ధతులు పట్టుకు మన. పడతులు . . . .

అందుకే పొరుగింటి పుల్లకూర అన్నారు.  ప్చ్ ! ! ! ! ! ! ! !


అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ.ముటుకూరు
హన్మకొండ
శీర్షిక : ముసుగు (64)

పాలు తాగే పసి పాపకి తల్లి చూపైన తగలనీయని కొంగు చాటు " ముసుగు "

బాల _  ప్రౌఢ గానీ వితంతువైతే _   తప్పదు తెల్లచీర
" ముసుగు "

ఏడాది ఉండే ఊరగాయకి వాసెనగుడ్డ " ముసుగు "

వర్షానికి , ఎండకి అభయం చెంగు "ముసుగు "

మతానుసారం రక్షణ కై తప్పదు
బురఖా " ముసుగు "

మనసు ఛండాలమైన పైకి పెద్దమనిషి " ముసుగు "

ఓట్ల కోసం నాయకులు వేస్తారు
వాగ్దానాల " ముసుగు "

కోరిక తీరేందుకు చెప్పే మాటలు
    ప్రేమికుల అందమైన
         " ముసుగు "

సులభ జీవితానికి బాబాల వేసే
ఘరానా " ముసుగు "

విచ్చలవిడి తిరుగుడికి , మొహం
      కప్పే చున్నీ " ముసుగు "

కొందరికి , ఎండకు ముఖ చందము
       దాచుకునే పల్లు " ముసుగు "

అసలు శరీర పుటందం దాచేసే మేకప్
         " ముసుగు "

స్వార్థం లేదనిచెప్పే దానపు
              " ముసుగు "

వెరసి , లోపలి మనిషిని కనపడ నీయని  ఆభరణం " ముసుగు "


 అయుత కవితా యజ్ఞం
Sk 585
అరుణ.ముటుకూరు
హన్మకొండ
శీర్షిక : నవ్వు    (60_ (20))

కల్మషం లేని పసిపాప నవ్వు
మనసున   ఆనందం   రువ్వు

పలకరింపుగ నవ్వే నవ్వు
పదిమంది తో స్నేహము నివ్వు

మొహమాటపు నవ్వు
మొక్కుబడిగా ప్రతి నవ్వు

చెలి మందహాసపు నవ్వు
మదిన రేపు పరవశపు లవ్వు

హింసించి నవ్వే వికటపు నవ్వు
బాధితుల ఎదను పగను దువ్వు

క్షమించి కరుణ చూపే నవ్వు
మది తేలికచేసే పుచ్చపువ్వు

కోరింది దొరికిన ఆనందపు నవ్వు
మనసు సంతసం తో వికసించిన పువ్వు

రాకూడని సమయాన , ఇబ్బంది నవ్వు
ఇరుకున పడి , తెచ్చి పెట్టుకున్న నవ్వు

అహంకార , అవహేళన నవ్వు
ఏనాటికైనా దించును కొవ్వు

చెలికాని తుంటరి నవ్వు
చెలి హృదయం ఎగిరే గువ్వ

పితూరీలు , దెప్పుళ్లు, సాధించే నవ్వు
వళ్ళు మండించె వంకర నవ్వు

మీసం  దువ్వి గర్వంగా చూసే సహచరుని  చిలిపి నవ్వు
సహచరి గుండియలో ఊయల లూపు చిరు నవ్వు



అయుత కవితా యజ్ఞం
Sk 585
అరుణ.ముటుకూరు
హన్మకొండ
శీర్షిక : వెన్నెలా . . . ఓ _ వెన్నెలా (65)

వెన్నెల రాతిరి
నెల కొకసారి

చేరతాను కడలి దరి
నా కెవరూ లేరు మరి

చేర్చలేదు ఎవరినీ నా దరి
వెన్నెలే అని నా సహచరి

నేనో నిత్య బాటసారి
అందుకే ఈఁ బాట ఏరికోరి

చేరాలని నిను చూస్తూ అద్దరి
కుక్క తో కతో ఈదిన చందాన గోదారి
జీవితాన విసిగి వేసారి
చరమాంకాన తరించా నిన్ను చేరి



అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ.ముటుకూరు
హన్మకొండ
శీర్షిక : వర్ణం (66)


రంగు రంగం టూ పాకులాడేవు
నే పుట్టినపుడు " నలుపు "

          పోయినా "  నలుపే "

ఎండన తిరిగినా " నలుపు "

భయం , అనారోగ్య ల్లో కూడ "నలుపే "

నువ్వేమో " తెలుపం" టావు

పుట్టినపుడు నీ రంగు " గులాబీ "

           ఎండకు వెళితే " ఎరుపు"

 పెరిగే కొద్దీ అవుతావు "తెలుపు"


                    జలుబున"  నీలం "
,
           భయాన పాలిన " పసుపు "

         అనారోగ్యం తో " హరితమూ "
            ఆఖరున వర్ణం "  బూడిద"

రంగులు మార్చే వూసరవెల్లి లా

అందుకే అన్నాడు సూపర్ స్టార్ రజనీ

నా ఒంటి రంగు నీ నెత్తిన

నీ రంగు నా కాలి కింద అని



అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ ముటుకూరు
శీర్షిక : అద్దెకు పసివారు (67)

సిగ్నల్స్ దగ్గర బిచ్చగాళ్ళ ని చూస్తే కలుగు ఓ అనుమానం
వారి ఒళ్ళో పిల్లలు ఎపుడూ నిద్రే ఏంటో కారణం

ఆసక్తితో , అనుమానం తో వెంబడించి పోయా దూరం . .
కొయ్యబారిపోయా అంత
భయంకర మా నిజం . .

తెలుసుకున్నాక , మనసుకు తగిలే గాయం . .
పసివారిని అద్దెకు తెచ్చారు అన్నది ఖాయం

తెలియదా తల్లికి , నల్లమందు తో
నిద్రపుచ్చే వైనం . .
పైగా , వారి కోసమే నని వేస్తుంది
నెపం . .

వింటేనే , రక్తం మరిగి వస్తోంది కోపం. .
పోనీలే , కాలో , చెయ్యొ విరవలేదు నయం . .

ఇది , ఆ పసివారికి _ అవుతుంది శాపం
భవిష్యత్ లో తీయక తప్పదు_  ప్రాణం

చిరుప్రాయానే చేస్తున్నావు_  అపాయం
ఆలోచించు ఇంకేదైనా_  ఉపాయం


అయుత కవితా యజ్ఞం
Sk 585
అరుణ ముటుకూరు
హన్మకొండ
శీర్షిక : రెండో అవకాశం (68)

మీకు తెలుసా . . . . .
      రాత్రిళ్లు పార్కు బెంచీ పై నిద్ర
     పగళ్ళు ఫిల్మ్ సిటీ తపో ముద్ర
మీకు తెలుసా . . . .
   ఎనిమిది లో రెండుసార్లు విఫలం
ప్రపంచం అభిమానం పొంద సఫలం

మీకు తెలుసా . . . . .
     నీ గొంతు బాలేదని రేడియో
    అక్కున చేర్చుకున్న స్టూడియో
మీకు తెలుసా . . .
   జీవనానికి పనిపెట్రోలుబంకుల్లో
జీవితాన్ని ఇచ్చే  ఎన్నో రంగాల్లో

మీకు తెలుసా . . . . .
        మూడు దశకాల వయసు దాక కండక్టర్
ముదిమి వయసైనా దేశ దేశాల అభిమాన కలెక్టర్

వీరంతా ఎవరో తెలుసా . . . తెలుసా

బెంచ్ పై పడుకున్న వాడు బాలీవుడ్ బాద్షా_ _  షారుక్

8లో గెలవని కుర్రాడు , ఎన్నో శతకాల మొనగాడు _ _ _ సచిన్

బొంగురు గొంతు తిరస్కారం
గాంభీర్యపు  పురస్కారం _ _ _ అమితాబ్

పెట్రోలు బంకు పని
కోట్లు ఎన్నోలెక్క లేని _ _అంబానీ.

నాటి కండక్టర్ _ _ _ నేటి సూపర్ స్టార్ _ మన తలైవ రజనీ

జీవితం అంటే _ _ ఇప్పటి వరకూ
  నువ్వేం చేయలేక పోయావని కాదు

ఇప్పటికీ _ ఇంకా ఏమైన చేయగలం అని
ఒకరు కాదంటే ఆగిపోదు జీవితం
దానికెపుడూ ఉంది . . . . రెండో
                                         అవకాశం


అయుత కవితా యజ్ఞం
Sk 585
అరుణ.ముటుకూరు
హన్మకొండ
శీర్షిక : పెళ్ళంటే . . . _ (69)

పెళ్లి అంటే సప్త సంఖ్యల తంతు
ఏడు అడుగులు ,

ఆరు ఋతువులు

పంచ భూతాల

నాలుగు దిక్కుల

వేసే మూడు ముళ్ళ తో

ఇరు మనసులు

ఒక్కటి

అవ్వడం మాత్రమే కాదు

అది రెండు కుటుంబాల పరువు , బాధ్యతల పంపకం

        దానిని సక్రమంగా నెరవేర్చడం ఇరువురి వంతు

అబ్బాయి తలచాలి అత్తింటి కొడుకుగా ,

  అమ్మాయి నిలవాలి ఏ ఇంట నైన కూతురిగా

           అపుడే ఇరువురూ చెరి సగం

          ఆ బంధాన ఉండదు ఏ సంకోచం
       
            అది నిలుచును కలకాలం


[1/23, 10:46 AM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
Sk 585
అరుణ.ముటుకూరు
హన్మకొండ
శీర్షిక : అనాధ అంతరంగం  (70)

ఆశ్రమం లో తెలియదు అమ్మ , నాన్నా అన్న పదాలు . . . . .
ఆయా , వార్డెన్ తప్ప

తెలిశాక తోడు ఎవరు కన్నీరు తప్ప

అసలు , . . అమ్మ నన్నెందుకు వదిలేసింది . .
ఛ . . కాదేమో _ ఏదైన ప్రమాదం లో నన్ను రక్షించి తను ఏమైందో !
అవును , అంతే అయుండొచ్చు
అమ్మ మనసు అమృతం

ఎవరైన , తరిమితే , నన్నుంచి రక్షణ గా
తను అయిపోయిందా భక్షణ

లేక , తప్పించుకుని , ఎపుడో వస్తుందేమో నా కోసం
అవును , అమ్మ మనసు నవనీతం
నాకోసం చూస్తోందేమో అనుక్షణం

ఎలా తెలియగలం ఒకరినొకరం
తెలుస్తుంది లే రక్త సంబంధీకులం

అమ్మకి తెలుసేమో ఏవైనా గుర్తులు
ఎలా , ఒంటిన మానిన వాతలు
పోయాయేమో నాటి చిహ్నాలు
అయినా , అమ్మకి ఉ న్నాయా నా ఊసులు
ఉండేవుంటాయి , అమ్మ దేవత . . .

అసలు , వదిలి వెళ్ళిందా , వదిలించుకుని వెళ్ళిందా ,
తప్పు చేసి కన్నదా
అయితే , ఇక రాదా
ఈ దేశం లోనే ఉందా ?

నాన్న , వాళ్ళ వాళ్ళ హింస
అమ్మలో   కలిగి    మీమాంస
నన్ను చేర్చింది ఈఁ    బస

నన్ను చెత్త కుండీలో నో ,ముళ్ళ కంపల్లో నో పడేయలేక

అవును , అలా చేయలేకే , ఎందుకు అంటే ఆమె అమ్మ
అయినా , ఎందుకు అమ్మా వదిలేశావ్ ?
[1/23, 4:17 PM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
Sk 585
అరుణ.చామర్తి (ముటుకూరు )
హన్మకొండ
శీర్షిక : ప్రభుత్వ ఆస్తులు (71)

హిరోషిమా దాడితో _ నేలమట్టం
తిరిగి జపాన్ _ బాగుంది చూట్టం


తెలుసా అందుకు _ కారణం
ప్రభుత్య ఆస్తి _ తమ ఆస్తి అన్నంత
ప్రాణం

  వాష్బేసిన్లోనీరైనా చేయరువృధా
కలిపేస్తారు ఫ్లష్టాంక్ కి భలే కదా

హోటల్ లో చేసే భోజన వ్యర్ధం
అవసరార్ధుల కిస్తారు జన్మ ధన్యం

మరి , ఎలా మన  దేశాన అభివృద్ధి
మనకుంటే గా అసలు బుద్ది

ఇంట్లో కొళాయి లో చుక్క నీరు పోనీయం
మున్సిపల్నీరు లీకైనా పట్టించుకోం
తగలబెట్టం ఎంత కోపం లోనూ _
             సొంత ఆస్తి
చిన్న కారణానికే మంటే _ ప్రభుత్వ ఆస్తికి

పొరుగు  దేశాల ప్రధానుల కైనా  తప్పుకు తప్పదు శిక్ష
మన దేశాన  చట్టం లొసుగులపుట్ట
ఉగ్రవాది కైనా రక్ష

శుభ్రంగా ఉంటే చాలు మన ఇల్లు
చెత్తను చుట్టేసి పంపు పక్కిల్లు

వారికీ , మనదే పొరుగిల్లు
అది గుర్తిస్తే సంతోషపు జల్లు

స్వచ్ఛత అంటూ ఫోటో పోజు
ముందు దులుపు మనసుకు పట్టిన
బూజు
[1/23, 7:33 PM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ . చామర్తి (ముటుకూరు)
శీర్షిక : ఎక్కడో . . .చూసిన జ్ఞాపకం
(72)
ఆ తీర్చి దిద్దిన కాటుక కళ్ళు
ఎక్కడో చూసిన ఙ్ఞాపకం  . .
చిన్నప్పుడు చెల్లినా


కిల కిల నవ్వు , మదిలో జివ్వున
లాగే నవ్వు . . .
ఎప్పుడో విన్న ఙ్ఞాపకం . . . .
నా మరదలిదా

గల గల లాడే గాజుల శబ్దం . . .
ఎపుడో అనుభూతి పొందిన ఙ్ఞాపకం . . . . . అమ్మ గాజుల శబ్దమా

నిగనిగలాడుతూ పాములా వాలు జడ
సవరం లేని వరం ఆ వేణి
ఎప్పుడో ఆడిన ఙ్ఞాపకం
ప్రేమని పంచిన అక్క దా . . .

నుదుటన మిలమిల మెరిసిన కుంకుమ బొట్టు . . .
ఎక్కడా , చూసిన ఙ్ఞాపకం
నవమాసాలు మోసిన అమ్మదా

ఎప్పటివో ఈఁ ఙ్ఞాపకాలు
ఇపుడు మచ్చు కు లేవు ఆనవాళ్ళు

కళ్ళకు మస్కార , జడ మారే పోనిటైల్ , మట్టి గాజులు పెళ్ళిలో నే , బొట్టు బిళ్ళ లు . . .

అలంకరణ కి ఉందిఎంతోసమయం
అధిక శ్రమైనా ఆగరు నిమిషం
[1/23, 8:21 PM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ.చామర్తి (ముటుకూరు)
శీర్షిక : అర్ధాంగి (73)

అర్ధాంగి అంటే నీ అంగీలు సగం తను వేసుకునేది కాదు
నిన్ను అర్ధం చేసుకునేది
" అర్ధమే " కాదు అందులో
అర్ధవంతమైనది అంగీకరించేది
వ్యర్ధమైనది త్యజించేది

అర్ధం గ్రహించేది
ప్రతిపదార్ధం వివరించేది

భర్త అంటే భరించేవాడు అంటాం
భరించినా , బాధించినా భరిస్తూ
     బాధ్యత గా అందరినీ చూసేది
[1/24, 10:00 AM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ.చామర్తి (ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక : చావుతో బ్రతుకు (74)

ఎప్పటినుండో తెలుసు ఎన్నో దానాలు
         అన్నదానం ,
          కన్యాదానం ,
          విద్యాదానం ,
కాలం తో వచ్చిన దానం
               తెచ్చిన పుణ్యం    ఎన్నో కుటుంబాల  మోదం

అదే అదే అవయవా దానం
పరోపకారార్ధంఇదం  శరీరం
ఇదే నేమో  అసలు     అర్ధం

మన నయనాలు ఇద్దరి చూపు
కాలేయం     ముగ్గురి   కమరు
ఊపిరితిత్తులు ఇద్దరి కూపిరి
కర్ణభేరి అగు నిద్దరికి శ్రవణం

మనం పోయినా ఇలా బ్రతికుంటాం
18 మంది శరీరాల్లో
అన్ని కుటుంబాల మనసుల్లో
అందుకే , ఆస్తి లా ఆరోగ్యాన్ని
కాపాడుకొందాం
పోయాక కూడా బ్రతికి ఉందాం
[1/24, 7:45 PM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
     Sk 585
అరుణ.చామర్తి (ముటుకూరు )
హన్మకొండ
శీర్షిక : చిత్రం , భళారే విచిత్రం (75)

ఒకప్పుడు _ రాజధాని లో చూశాం
బస్సు మీద బస్సు

డబల్  డెక్కర్

తర్వాత , సినిమా పెళ్ళి మీద పెళ్ళి

ఇపుడు ఇంటి మీద ఇల్లు ,

అదీ పోయి అపార్ట్మెంట్ అంటూ ఎన్ని అంతస్తులో

ఎన్నెన్నో రూముల , ఎన్నో వరసల భవంతి - అంబానీ ది

ఔరా , చిత్రము !
బస్సు మీద బస్సు లేదుఅనుకున్నా

కానీ , 1కాదు , 2కాదు ఏకంగా నాలుగు

ఎంత చిత్రం , ఏమి విచిత్రం

ఇంకేమీ రానున్నాయో
[1/25, 7:38 AM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
      sk 585
అరుణ.చామర్తి (ముటుకూరు )
శీర్షిక :  ఎక్కడుంది బాల్యం (77)


బాలికల దినోత్సవం అంటూ
జరుపుకునేందుకు పండగ
అంటారు  బాలికల కా ఎందుకు ఖర్చు
       దండగ

ఎటు చూసినా కాటేస్తూ కాలుష్యపు కోరలు
బైటికి వెళితే వెకిలి చూపులు

బాల్యం ఎంతో అమూల్యం
చిదిమేస్తే జాతి చెల్లించాలి మూల్యం

కల్తీ తిండి , కక్కూర్తి తిండి తెచ్చును స్థూలకాయం
బాల్యం త్వరగా మారు కౌమారం

ఎప్పుడు వస్తుందో బాల్యం
బ్యాగ్ల మోతలు బట్టీ చదువులు తప్ప , ఆటలు శూన్యం

ఎప్పుడూ హడావిడి బ్రతుకులు
టెన్స్  తో అలసిన జీవితాలు
[1/25, 7:39 AM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ . చామర్తి (ముటుకూరు)
శీర్షిక : తెగులు తెలుగు (76)

తేనె   లొలుకు   తెలుగు
తడబడుతూ నీ  పలుకు

వచ్చిన ఆంధ్రము  రానట్టు ,
రాని       ఆంగ్లము వచ్చినట్టు
మాట్లాడతారు ఇదేం తెగులు

తప్పుల తెలుగు ,
తికమక పడుతూ
     తగలెడ్తావు
ఆన్కరుగా నీ స్పాను మిగులు
మాతృభాష ద్రోహిగా పేరు నలుగు

తాగినోళ్ళలా " శాంతిని "
                        " షాం తి " ని
చేసి , మనశ్శాంతి హరిస్తావు
వత్తులతో చేయవు పొత్తు
తెలుగుకు తేబోకు ముప్పు

క , చ , ట , త , ప లను
గ , స , డ, ద , బ
బేధం లేదు
బట్లరింగ్లీ షా , బట్ల ర్ తెలుగా
అర్దం కాని అయోమయం
నేర్చుకుందుకు చేయరు యత్నం

మాతృ భాష హంతకులు మీరు
ఇంతకన్న జంతు భాష మేలు
[1/25, 9:43 AM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
  అరుణ . చామర్తి (ముటుకూరు)
హన్మకొండ
    శీర్షిక : గుర్తింపు (78)

రాబోయే కాలం లో అందరికీ అంకెలు అవుతాయేమో గుర్తింపు

మెమోరీ చిప్ లో డిలీట్
కాగా కుదింపు

పేరు పెద్దదైన తెచ్చు ప్లేసుకు ముగింపు

దేవతల పదవుల కొనసాగింపు
కాదు ఎవరూ మినహాయింపు

బ్రహ్మ _ పద్దతి దిగుమతి దారుడు
sys _ installer

విష్ణు _ పద్దతి అమలుదారుడు
sys _ operator

శివ _ పద్ధతి కార్యదర్శి
Sys _ programer

నారద _ మాటల రవాణా దారుడు
Data transmitor

యమ _ నాశకుడు
Deleeter

అప్సరస లు , రంభా , మేనక తదితరులు _ చీడ పీడ లు
Virus
గణేష్ _ పీడ నాశకుడు
   Antivirus
హనుమాన్ _ వార్తా హారుడు
     E _ mail
చిత్ర గుప్త _ గుప్త విషయవరుడు
   Hard disc
సరస్వతి _ సర్వ విజ్ఞాన ఖని
      browser
పార్వతి _ మాతృ ఫలకం
   Mother బోర్డ్

లక్ష్మి _ ధనార్ధులపేటిక
     Atm
రాబోయే కాలం లో దేవతల  కూ ఇలాటి  గుర్తింపు
ఆలోచనా మాత్రానికే జలదరింపు
[1/25, 3:20 PM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ . చామర్తి ( ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక :  ఎందుకొచ్చిన పాట్లు (79)

నా   పని   ఎంతో నాటు
నేను కూడ అసలే  మోటు
పంటకు పురుగు   గాటు
పడ్డది   జీవిత      వేటు

అయినోళ్ళు ఉంటే ఏం చే టు
పట్నం లో పనులకేం    లోటు
వాచ్మెన్ పనికై వేశా  మాటు
దొరికింది నాకో మంచి చోటు

రేయి పగలు వాహనాల  ఫీటు
క్షణమైనా నిద్రలేని పిడుగుపాటు
రెండు రోజులగ్గానీ తెలియలా ఫేటు ఆనందానికి పడింది పోటు

నా కొద్దీ    ఫ్లాట్ లతో పాట్లు
లేకున్నా తళతళలాడే నోట్లు
తీసుకుని పాత పనిముట్లు
మళ్ళీ ,ఇటురాను దేవుళ్ళ పై ఒట్లు
[1/26, 8:30 AM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ . చామర్తి (ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక : ఏం  సాధించాం (80)

 పుట్టిన రోజుకి చెప్పాలి
    అభినందనలు _ వ్యక్తి కి
శుభాకాంక్షలు ఎమ్ చేశామని కొత్తగా_ _ _  వ్యవస్థ కి

నాడు _ పరాయి పాలకుల నీడన బానిసలం
నేడు _ స్వతంత్ర దేశాన మనకు
మనమే _ బందీలం

ఏం సాధించేమని ఈ వేడుకలు
ఎందులకీ తరహా  సంబరాలు

దేశం కోసం ఇచ్చారు ప్రాణాలు _ అపుడు
దేశద్రోహుల కోసం ఆత్మహత్య లు _ ఇపుడు
వారి కోసం ధర్నాలు , సమ్మెలు

ఇదా మహాత్ముడు కలలు గన్న స్వరాజ్యం
ఏది ప్రజల కోసం ఆ  రామరాజ్యం

పెద్దలపై గౌరవం పూజ్యం
ఏదో ఒక గొడవ నిత్య సత్యం

మనకి ఉందా దేశభక్తి
మన పిల్లలకెలా కలుగును అనురక్తి
అందుకే పోతున్నారు దేశం వదిలి
తప్పదు ఈ కాలమే కదా కలి
[1/26, 4:06 PM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ . చామర్తి (ముటుకూరు )
హన్మకొండ
శీర్షిక :   నచ్చ లేదు నాకిక్కడ (81)

వచ్చా విశాల భవంతి లోంచి
        ఇరుకు అపార్ట్మెంట్
నిజానికివి , కాదా కంపార్టమెంట్

ఎటుచూసినా పచ్చదనం , పచ్చి గాలి వదిలి , సర్దుకున్నా కుండీలో కాసిని
ఆశ్చర్యం కొందరిలో ఇక్కడా , బానే పెంచావే   హాసినీ

ఏ పిలుపుకో , కేకకో వంగి చూస్తే
పైనుండి ధారాపాతం
   ఉతికి న బట్టల చుక్కలో ,
   తుడిచిన మాబు తాలూకు
బొట్టు లో అభిషేకం
శుచిగా గుడికని బైటికి రాగానే
మొహాన తగిలే వేలాడే చీరలు
ఇబ్బంది చెప్తే , సరిదిద్దుకోక గీరలు

అన్నింటి కీ కావాలి అందరి అనుమతులు
ముందుకు వచ్చి చేయకపోగా మూతి తిప్పుళ్ళు
అర్ధరాత్రి , అపరాత్రని లేక చేసే పైవారి చప్పుళ్ళు
ఉలికిపాటున లేస్తే , నిద్రలేని రాత్రుళ్ళు
పనుల కై ఎవరూ కలవని వైనం
బాధ్యతాయుతులపై బరువు మోపు _ఖాయం
ఆపై చెప్పినా లెక్క _ ఖచ్చితం
అంత అయ్యిందా అని _
సందేహాలమయం

ఉన్నాఅందరితో స్నేహం గా
లాభమేమని లెక్కలు నికరంగా

ఇళ్ళు కాదు ఇరుకు
మనసులే కరకు
[1/26, 4:52 PM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
Sk 585
అరుణ . చామర్తి (ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక :  సరాగాలు (82)


సఖీ నీ ప్రేమ ఓ  
             అమృతవర్షి ణి
సన్నగా , సమ్మోహనం గా నవ్వితే
       మది పాడు మోహన రాగం

చెంత చేరిన చేతి గాజుల      హాహాకారం మధ్యమావతి

నీ రాకకై  వేచి చూసే వూహ
      మలయమారుతం

నువ్వు రాని క్షణం మనసు పాడే
        చక్రవాకం

నువ్వు అలిగిన దినం , అది మారు
కదనకుతూహలం

నీ అంగీకారం అవుతుంది కళ్యాణి రాగం

కాదంటే సృష్టిస్తా మనసులో కొత్త ఆందోళన రాగం
[1/27, 10:56 AM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ.చామర్తి (ముటుకూరు )
హన్మకొండ
శీర్షిక :  హిపోక్రసీ (83)

మన పాలసీ - - డెమోక్రసీ
మన ఆచరణ - - హిపోక్రసీ

ఎదుటి వారితో మన ఇంటిమసీ
నిజం చెప్పలేని డెలికసీ

కోరుకున్న ప్రైవసీ
దొరకకున్న ఏమనలేని  డెలికసీ

పెళ్ళిలో వంట , జంట బాలేకున్నా బాగుండదు ,
బాధ పెట్ట రాదు అని
చూపుతాము డిప్లమసీ

నా పైంటింగ్ ,
కధ , కవిత
పడ్డది పత్రికలో అంటూ చూపితే హేపీ గా
ఎలా వున్నా అధ్భుతమంటాం
డిప్లొమాటిక్ గా
అందుకే , పాటించి పెద్దల సుద్దులు
నొప్పించక, తా నొవ్వక
తప్పించుకు తిరిగే హిపోక్రసీ బుద్దులు
[1/28, 10:02 AM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ.చామర్తి (ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక :  తావీద్ మహిమ (85)

వినరా భారత వీరకుమారా ! విషయము చెబుతానూ . . . .
     తందాన తాన . . . . .
చూడక మీ పాపే పామును తొక్కిందా . . ఆ . . ఆ
చూరున , మూలన పామే నక్కిందా . . . . అయ్యో ! తందానా . . . నా
పామే పాపపై పగబూనిందా . . .

ఇందులో లేదు ఎమ్ గారడీ
మిమ్ము చేయడం లేదు బురిడీ

పాము జోలికి రాకుండా ఇస్తాం ఒక తాయేత్తు,అంతా తావీజ్ మహిమ
. . . తందనానా భళి

చింతచెట్టు ను చూసి దడుచు కున్నావా . . . . .
నీ నీడ నిన్నే భయపెడుతూ న్నదా . . . . అయ్యో . . . తందానా . . . నా

మరి , భయం పోగొట్టే మార్గం ఏందయ్యా అంటే
నేను చెయ్యడం లేదు గారడీ
మిమ్ము కొట్టించడం లేదు బురిడీ

అంతా . . . . తావీజ్ మహిమ . . .
భళి రా భళి . . . .
ఇవ్విధముగా , సర్వరోగ నివారిణి
తావీజ్ మహిమ ఏంటయ్యా . . . .

మాయ చేరు లోంచి మట్టి మీద పడే దాక . .
అమ్మ కడుపు నుంచీ ఆంబిరి యల్ కార్డ్ తో వచ్చేదాక . . . .

కోసే బొడ్డు తాడు మారుతుంది కొంత
తాయెత్తు గా మొలతాడు చెంత
మనకు ఉండదు ఇక ఏ చింత

ఏ రోగానికి  అయినా అదే మందు
 పూర్వుల గొప్పదనం ఏమందు
ఎవరి " స్టెమ్సెల్స్    "    
                     వారికెవాడునిండు
బాంకుల్లో తారుమారు కాకుండు

ఇదయ్య తాయెత్తు అసలు కధ
అన్నిటిల అదే తావీజు గ మారు వ్యధ
[1/28, 12:02 PM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ చామర్తి /ముటుకూరు
హన్మకొండ
శీర్షిక : ఏమి సేతుర . . . . ! (86)

దొరికింది కోరిన ఉద్యోగపు_
 అపాయింట్మెంట్
ఇవ్వక , తప్పదట _ అగ్రిమెంట్
పర్లేదా ! ఇస్తే అ కమిట్మెంట్
అసలే చదువు _ కమ్పార్టుమెంట్

పెళ్ళికి అడ్డు ఉద్యోగ _ సెంటిమెంట్
ఇక , తప్పదు _ ఎంగేజ్ మెంట్
అసలే , నాకు _ టేంపర మెంట్

చూపగలనా అసలు _
అడ్జస్ట్ మెంట్
ఉండదు , ఎక్కడికీ ఏ _ మూమెంట్

రెండు పడవల ప్రయాణం లో అవనా _ పిప్పర మెంట్
చేతులు కాలాక ఎందుకు _ ట్రీట్మెంట్
చేస్తే , పోలా పెళ్ళి _
 పోస్ట్పోన్ మెంట్
[1/28, 12:54 PM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ.చామర్తి (ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక :  తావీద్ మహిమ (85)

వినరా భారత వీరకుమారా ! విషయము చెబుతానూ . . . .
     తందాన తాన . . . . .
చూడక మీ పాపే పామును తొక్కిందా . . ఆ . . ఆ
చూరున , మూలన పామే నక్కిందా . . . . అయ్యో ! తందానా . . . నా
పామే పాపపై పగబూనిందా . . .

ఇందులో లేదు ఎమ్ గారడీ
మిమ్ము చేయడం లేదు బురిడీ

పాము జోలికి రాకుండా ఇస్తాం ఒక తాయేత్తు,అంతా తావీజ్ మహిమ
. . . తందనానా భళి

చింతచెట్టు ను చూసి దడుచు కున్నావా . . . . .
నీ నీడ నిన్నే భయపెడుతూ న్నదా . . . . అయ్యో . . . తందానా . . . నా

మరి , భయం పోగొట్టే మార్గం ఏందయ్యా అంటే
నేను చెయ్యడం లేదు గారడీ
మిమ్ము కొట్టించడం లేదు బురిడీ

అంతా . . . . తావీజ్ మహిమ . . .
భళి రా భళి . . . .
ఇవ్విధముగా , సర్వరోగ నివారిణి
తావీజ్ మహిమ ఏంటయ్యా . . . .

మాయ చేరు లోంచి మట్టి మీద పడే దాక . .
అమ్మ కడుపు నుంచీ ఆంబిరికల్ కార్డ్ తో వచ్చేదాక . . . .

కోసే బొడ్డు తాడు మారుతుంది కొంత
తాయెత్తు గా మొలతాడు చెంత
మనకు ఉండదు ఇక ఏ చింత

ఏ రోగానికి  అయినా అదే మందు
 పూర్వుల గొప్పదనం ఏమందు
ఎవరి " స్టెమ్సెల్స్    "    
                     వారికెవాడనిండు
బాంకుల్లో తారుమారు కాకుండు

ఇదయ్య తాయెత్తు అసలు కధ
అన్నిటిల అదే తావీజు గ మారు వ్యధ


5 comments:

  1. మంచి పంచ్ తో అలరారుతున్న అరుణ గారి మినీకవితల్లో ఆరోగ్యకరమైన స్ర్తీవాదం కనబడుతుంది. ముఖ్యంగా స్త్రీల పరంగా సమాజంలో కనబడే అవాంఛనీయ మానవసంబంధాలని తూర్పారబట్టడం బావుంది. నా అభినందన లు. - మాకినీడి సూర్య భాస్కర్



    ReplyDelete
    Replies
    1. థాంక్యూ సార్

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. థాంక్యూ సార్

      Delete