Sk 585
అరుణ.ముటుకూరు
హన్మకొండ
చదువుల తల్లీ : కవితపేరు
తల్లీ ! భారతీ వందనము
నిన్ను కొలువ వయసు , సందర్భం లేదమ్మా
ఎల్లవేళల మా వాక్కు నందున నిలిచి గెలిపించవె వాక్దేవి ,
" కచ్ఛ పి " వీణా ధారిణవైన నీవు
ఆ నూరు తీగల వీణ అలవోకగా మీటు సమయాన " సరసువతి " వై
నీ పతికో విన్నపం చెప్పమ్మా
" మేధ " తో పాటూ " మేత " కూడా రాయమని మా నుదుట
ఎందుకంటే , మరి "సిరి " వున్నచోట " శారద " వుండదని
మా లోకపు మాట
అపుడే , నీ భిక్ష తో మెదడుకు వేసిన మేత పరాయి దేశం లో విసిరే దుర్గతి తప్పుతుంది కదా
ఈ మేధో వలసలూ వుండవు , దూరానున్న పిల్లలకై పెద్దల నిరీక్షణ వుండదు
దేశ సమ్స్క్రుతి మాయమవ్వదు
ఈ ఒక్క విన్నపం వొప్పించు మాతా మరకత శ్యామా . .
******************************************
SK 326
గోగులపాటి కృష్ణమోహన్
సూరారం కాలని, హైదరాబాద్
శీర్షిక: సరస్వతీ శక్తి
అక్షరం మానవకల్పితం కాదు.
అది కేవలం ఒక గుర్తు కాదు.
అది భగవత్‌ప్రసాదం.
అది పరమపవిత్రం
(అక్షరమ్ పరమమ్ పదమ్), పరబ్రహ్మస్వరూపం.
అది సాక్షాత్తు అమ్మవారి శరీరం. అందువల్లనే ఆమెకు బ్రాహ్మీ అని పేరు.
శ్లో|| బ్రాహ్మీ తు భారతీ భాషా గీర్ వాగ్ వాణీ సరస్వతీ (అమరకోశం)
తాత్పర్యం : ఆమె పేరు భాష. ఆమె పేరు బ్రాహ్మి. ఆమెయే భారతి, గీర్దేవి, వాగ్దేవి, వాణి. ఆమెయే శారద, సరస్వతి.
సరస్వతీశక్తి అక్షర సమామ్నాయ రూపంలోనూ,
ఆ అక్షరాల్ని కలిగి ఉన్న పుస్తకాల రూపంలోనూ సుప్రతిష్ఠితురాలై ఉన్నారు.
ఆవిడ మంత్రం కూడా అక్షర సమామ్నాయ మయమే.
శ్లో|| బుద్ధిరూపా బుధేశానీ బంధీ బంధవిమోచనీ |
అక్షరమాలాక్షరాకారా క్షరాక్షర ఫలప్రదా ||
(సరస్వతీ సహస్రనామస్తోత్రం – 72)
తాత్పర్యం :
ఆమె బుద్ధిశక్తి రూపములో ఉన్నది. ఆమె ప్రపంచంలోని పండితులందఱికీ అధ్యక్షురాలు. బంధాన్ని కలిగించేదీ ఆమే, దాన్నుంచి విమోచించేదీ ఆమే. ఆమె శరీరం అక్షరమాల (Alphabet).
తాత్కాలికమూ, శాశ్వతమూ అయిన ఫలితాలను ఒసంగేది ఆమె.
**************************************
ఓం
స.క. 707
గుడిసి ఓబుళపతి
కదిరి
శీర్షిక : అమ్మా సరస్వతీ
బ్రహ్మ సృష్టించిన మానవ శరీరానికి
విలువ వచ్చినది నీ వాక్కు వల్లనే
అజ్ఞాన అంధకారాన్ని అంతమొందించడానికి
అవతరించిన ఆది గురువు నీవమ్మ
సకలవిద్యలను నరులకు అందించిన
సత్యవాణి నీవమ్మ
జంతువులనుండి మనుషుల్ని వేరు చేసి జ్ఞానమిచ్చిన జ్ఞానదేవత నీవమ్మ
ఎన్నటికి తరగని ధనం విద్యా ధనంమాకిచ్చి
విజ్ఞానులను చేసిన వీణాపాణివమ్మ నీవు
విశ్వంలో విలువైన ధనం విద్యా ధనం
అది జనులకు ఇచ్చిన జగన్మాతవమ్మ నీవు
విద్య లేని వాడు వింత పశువు అని నమ్మి
విద్యను విశ్వవ్యాపితము చేసిన విద్యా ప్రదాతవమ్మ నీవు
సత్యవాక్కులను నేర్పి సత్యవంతులను చేసిన సరస్వతీదేవివమ్మ నీవు
వాగ్భూషణమే సుభూషణము అన్న
వాగ్దేవివమ్మ నీవు
లక్ష్మి కొంతమందిది విద్య అందరిది అని
నిరూపించిన విశ్వరూపిణివమ్మ నీవు
చదువులతల్లీ సరస్వతీ నీకు
నిత్య నీరాజనాలు అమ్మా!
నీకు నిత్య మంగళమమ్మా
*********************
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
సహస్ర కవుల సంకలనం 2
🌷🌷🌷🌷🌷🌷🌷
🌺సరస్వతీ మాత🌺
గుడిపల్లి వీరారెడ్డి Sk no 305
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
ఏమి చదివి నావు,ఎంత చదివినావు
ఎక్కడ చదివింత ఎదిగినావు
ఎఱుక చెప్పిన పుణ్యంబు అంతనీకె
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
అన్ని తెలిసినోడె ఆగమైపోయినట్లు
చదువులమ్మవయ్యు సంగీతనిధివయ్యు
తలలేని వాడి కిల్లాలి వైనావు
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
సృష్టించి వదిలేసె సృష్టి కర్తయంట
చూడలేక సాకెవాడు వేరే నంట
చదువులమ్మిట్ల... నీ మొగడు చేయతగునా!
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
గురుకులాలల్లోన రాచబిడ్డలే చదివారు
కలవారి కోసమే కార్పొరేట్ విద్య
నాడైన,నేడైన కలవారి చేతిలో బంధీవె కాదా!!
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
చదువులమ్మగ వెలుగొందు శారదాంబకైన
చామచల్య చిత్త యా లక్ష్మికైన
సామ్యవాదంబంటె చేదాయె నేమేమిటో!!
తప్పు చెప్పడు వీరన్న తరచి చూడ
సహస్ర కవుల సంకలనం. 2
సరస్వతీదేవి
🌺🌺🌺🌺🌺🌺🌺👏
గుడిపల్లి వీరారెడ్డి Sk no 305
6.12.2015
🌺🌺🌺🌺🌺🌺
*************************
స.క.సం:-79
పేరు:-దివాకరశాస్త్రి
వికారాబాదు
ఓంసరస్వతీదేవ్యైనమః
కం:-
శ్రీశారదాంబవాగ్ధేవీ, శార్వాణీ,
జయోస్తువిద్యలరాణీ
ఆశీర్వదించుజనయిత్రీ, శాంతవదనసరస్వతీ,జయధాత్రీ...!
కం:-
వాణీహిరణ్యగర్భుని
రాణీ, వేదాలమాతరజితస్వరూపా...!
పాణీ,బ్రహ్మప్రియసఖీ
వీణాధారిణినమోస్తువిద్యలతల్లీ.,!
తే.గీ:-
హంవాహనరూపిణిఆదిజనని
చిలుకజపమాలకల్గినచిద్విలాసి
శ్వేతవర్ణస్వరూపిణివేదమాత
వీణపుస్తకదారిణివిద్యలివ్వు
శార్ధూలం:-
అమ్మానీకృపచూపవమ్మజయశ్రీఆనందసందాయకీ
అమ్మావిద్యలరాణివమ్మజగమేనాడించువాగ్భూషిణీ
అమ్మాశారదదేవివమ్మప్రతివారంతాభజించేరుఓ
యమ్మాభారతిసాహితీప్రభలలోనాశిష్యులందించవే.,!
శార్ధూలం;-
శ్రీశార్వాణిజయోస్తులిమ్మువరమైశ్రీకారమైవేయితో
నాశీర్వాదకవీంద్రులైనకవితల్ఆనంమందించవా...!
విశ్వాసంఒనగూర్చివాడనగరంవిశ్వాంతరాళంబునన్
ఆశాజ్యోతిగఅందజేయకవనానందంబులందించుమా...!
*****దివాకరశాస్త్రి*****
~~~వికారాబాదు~~~
******************************************
మాడుగుల నారాయణ మూర్తి ఎస్.కె.311 ఆసిఫాబాద్
జిల్లా ఆదిలాబాద్
అవనిని జీవరాసులకు నార్తి బాపగ ప్రేమ పంచియా
భవహరు ఙ్ఞానదాత గురు భావనతో తలిదండ్రి సేవకై
శివుని మనోఙ్ఞయౌ ముగుద చేసిన బొమ్మకు పార్వతీ సుతు సంభవుని ముఖమ్మునన్ వెలయు వాణికి వందనమాచరింతునే..
స్వరనీరాజన భారతీ వరసుధా సౌగంధ దీపాంబికే
కరుణా నాగరి సుందరీ శృతిలయా గాంధర్వ మాధుర్యహే
శరదిందిందిర మందహాస సుదతీ సంగీత సామ్రాఙ్ఞినీ
చరణాబ్ఙంబుల వేడుకొందు బలమౌ సాహిత్య మందీయవే
స్వరములలోన సప్తపద వ్యాహృతి ప్రాణము సప్త ధాతువుల్
వరలును దేహమందుగన ప్రఙ్ఞలుగా విలసిల్లునుల్లమున్
పొరలుగ యేడులోకముల పూర్ణతనొంద విరాజమానమై
యిరువది యొక్కటై సమిధ లేర్పడు భావ విలాస వాణియై
**************************************
మాడుగుల నారాయణ మూర్తి
ఎస్.కె.311ఆసిఫాబాద్
జిల్లా ఆదిలాబాద్ అంగవిహీనులైన సరసాంగుల జిహ్వకు ప్రీతి నేస్తమై
చెంగున గంతులేయు సతి చిన్మయ రూపి కళామతల్లిగా
రంగుల పొంగులందు నడయాడుచు రంజిలు నాదవీణయై
ముంగిలి హాసభాస నవమోహిని జూచితి పద్య భారతిన్
మాటలురాని మూగ పసి మానసమందునమార్పుతెచ్చుచున్
ధీటుగ వాగ్విలాసమును తేనెల తేటల పల్కు లొల్కగన్
మూటలనిచ్చు దేవి ధర ముక్తిపురమ్మున ప్రౌఢ రూపియై మేటి సరస్వతీ. సురలు మెచ్చిన దక్షిణ కాశివాసినీ
వీణా పాణి స్వరాంబికా కరుణహే విద్వన్నుతా శారదా
జాణా ముక్తి పురస్థితా రమణివో చైతన్య ధీశక్తి గీ
ర్వాణీజ్ఞాన సుధా రసముతో వ్గ్ధార గోదారి పూ
బోణీ నిర్మల గంధమియవే పూర్ణేందు మాడుగుల
నారాయణ మూర్తి
ఎస్.కె.311ఆసిఫాబాద్
జిల్లా ఆదిలాబాద్ . ధ్యానము జేతునమ్మ జగదంబిక భారతి వాగ్విలాసినీ
మౌనిగ కళ్ళు మూయ మతిమంతులుగా తను ఙ్ఞాన
దీపమై
మానసమందు చీకటుల మాయము చేయు ప్రకాశమద్దమై
ఆనన సుందరోజ్వల శశి భాను సమాంతర కాంతి పుంజమై
ధాత చతుర్ముఖాల రస ధారల భావుక వైఖరీ స్థితుల్
ప్రీతి మనోవకాస స్వర పేటికలో కృతనిశ్చయమ్ముతో
ఖ్యాతినిదెచ్చు వాగ్వనిత కామినిగా రసనాధి దేవతై
మాత సరస్వతీ. సుమతి మాటల చేతల హంసవాహినీ
అంగములన్నిటన్నిలచునాత్మకు స్పందన గల్గజేయునా
సంగములో ప్రయాగకడ జాహ్నవి తో యమునాంతరంగమై(తోయమునాంతరంగమై)
సంగడి గౌతమీ ఝరుల శక్తిగ ప్రాణహితాదరమ్ముతో
లింగము ప్రక్క ముక్తి పుర లేమగ గాంచు మహా సరస్వతీ
మాడుగుల నారాయణ మూర్తి ఎస్.కె.311ఆసిఫాబాద్
జిల్లా ఆదిలాబాద్
వ్యాసుని చేత సైకతముప్రాణ ప్రతిష్ఠగ మూర్తి వాణియై
వాసికినెక్కె బాసరన భాషలు విద్య కళామతల్లిగా
నాసిక జన్మభూమియగు నాతియ గౌతమి తీరమందునన్
వాసము చేయులోక సహ వాసుల వేల్పుగ శ్రీ సరస్వతీ
****************************************
S.k.291
ఎస్.మల్లికార్జున్
"నివె దనము "
చిన్న చిన్న పదాలు చేర్చి కవితలు, కావ్యాలు గా చెప్పుకొనే పిచ్చివాన్ని..."బుద్దిదాత్రి"
ఏమున్నది నా కవిత్వంలో ..."కౌమారి"
నేనున్నాను అని చెప్పుకోవడం తప్ప..."జగధిఖ్యాత"
నా పూర్వపు కవులంతా
కోటి కోటి కావ్యాల పుష్పాలను నీ పాదాల ముందు సమర్పిస్తే...
ఆ పుష్పాలలొ నున్న ఒక్కొక్క రెమ్మను ఏరుకుంటున్న అమాయకున్ని..."వీణపాణి"
ఆ కమ్మ రెమ్మలలోనున్న అక్షరాలను తెచ్చి
అటుతిప్పి ఇటుతిప్పి, ఇటుతిప్పి అటుతిప్పి వర్ణించి...
అహంకారంతొ కంచుడక్కా కొట్టుకోవడం తప్పా...
కొత్తదనమేమున్నది..."హంసవాహిని"
ఇకనైనా కరుణించి కటాక్షించు
నా శీలాన్ని పరీక్షించి జ్ఞానాన్ని ప్రసాదించు..."వరదాయిని"
నీ శక్తిని వృదాచేయను..."వాగీశ్వర"
నీ కీర్తికి చేటు తేను
నా అవసరానికి అర్హత లేని వాటిని అందలమెక్కించను..."భువనేశ్వరి"
ఊహ మత్తులొ జోగను
అవని జనుల, కష్టజీవుల ఉనికిని మరచిపోను..."భారతీ"
అనాటి కవుల వలె కొత్త ఆవిష్కరణకు ఊతమివ్వు...
అజ్ఞానులలొ జ్ఞాన జ్యోతి వెలిగించుటకు ఆజ్ఞనివ్వు..."బ్రహ్మచారిణి "
నీ ఆలయ కావ్యాల కట్టడానికి
నన్నొక కవిగా మలచి కర్తవ్యాన్ని ఉపదెశించు ..."శారదా"
నాకీఅవకాశాన్నిచ్చి
నా జన్మకు సార్ధకత చేకూర్చుము తల్లీ ..."సరస్వతీ "
సిరిమల్లి
సహస్ర కవిభిర్భక్త్యా
కురుతే తే పదార్చనమ్
విభిన్నైః కవితా సూనై
రద్య వాణీ దయాం కురు
యా గృహ్ణాతి "కళాధర" స్య వికసన్మందార పుష్ప వ్రజం
యా సాయిప్రియ "నీలకంఠ" కవితా ధారాసు సానందతే
యా ప్రీణాతి "రవీంద్ర" సంభృత కవి శ్రేష్ఠాన్ సహస్రాధికాన్
సా నః పాతు సరస్వతీ భగవతీ భాషాసతీ భారతీ
************************************
7416863289
సహస్ర కవుల సంకలనం.
అంశం_సరస్వతి.
మన్నె లలిత.
ఎస్ కె_161.
కవిత పేరు_వాణీ విలాసం.
పలుకుజెలి పలుకులు విని
సరసిజభవుడు సరదాగా నవ్వె
"తెలుగు అచ్చులు హల్లుల పోట్లాటా"?
నేేను లేనిదే నీవు లేవనే
కుమ్ములాటకు కారణమడిగా
అ_మ్మ,క_న్ను__అ,క___
అ_అ అచ్చు,క_హల్లు.రెండు కలిస్తేనే పదాలన్నా
వాటితొ వాదించి,వాదన నివారించా.
కమ్మనైన కవితలల్లే
కవితాజ్యొతి వెలిగించా.
ఆ వెలుగు జ్యోతి వేయిజ్యోతులై
గిన్నిస్ రికార్డు సాధిస్తే
అమ్మ గాఆనందిస్తా.
బ్రహ్మాణి మాటలకు సమ్మదముతొ
బ్రహ్మ సరసిజముపై
సరస్వతిని ఆశిీనురాలినిచేసె
'అ'చ్చులు 'హ'ల్లులుఅక్షరాక్షరాలు కలిసి
అహ!అనుకున్నవి ఆనందంగా.
పంచదార కన్న పండ్ల రసము కన్న
జుంటి తేనె కన్న జున్ను కన్న
మావి చిగురు కన్న మధురామృతము కన్న
తెలుగు భాష మిన్న నలువ చెలియ
ఒంటరిగా నే సంస్కృత
మింటర్నెట్ ద్వార నేర్వ నెంచితి కానన్
కంటిరొ తప్పుల తడకలు
చంటిని మన్నింపుడయ్య సరసులు మీరల్
సహస్ర చందనాలు వాణీ
**********************
తల్లీ! ఓ సరస్వతీదేవి !
ఉద్భవించతివి వాక్కై వాణిగా
అడుగెడితివి అవనిపై అక్షరంగా
వేద ఇతిహాస పురాణ కావ్యకన్యగా
ఎదిగి తోడైతివి బ్రహ్మకు సతిగా
ప్రపంచ ప్రక్రియలకు నీ అందెలమంజీరాలై
ఇంపు సొంపుల లయ అమృతధారలై
సరిగమపనిసల సుస్వరాలై
జీవకోటిని పరవశింపజేసే సంగీతమై
రామాయణ భారత భాగవతా భక్తిశక్తై
ప్రబంధాలు విడదీయని అనుబంధాలై
ప్రాచీన ఆధునిక పోకడలతో కలసి
కాగితంపై నవరసాలుగా నాట్యామాడి
ఇంట్లో ఇంటర్నేట్టై అతుక్కుపోయి
వాట్సాప్తొ వన్యలద్దుకొని
హైకులతో లతలగా జగమంతా అల్లుకొని
కవితాపుష్పాలై సహస్రకోటిపరిమళాలుగా
కవుల కలంలో కాలమై కదిలి దారులేస్తున్నావా ?
తల్లీ !ఓ సరస్వతీదేవీ
చదువులతల్లీ నీకు సహస్ర చందనాలు
+++++పుల్లా.రామాంజనేయులు
ఉపాధ్యాయుడు
Sk:725 కర్నూలు జిల్లా
9491851349
***********************
అక్షర దీపోత్సవం.
కళామ తల్లి నీడలొ
కవితా వాహినిలో కవి మిత్రులందరూ,ఏకతాటిపై
పదిలంగా పయనిద్దాం
వందలాది మనసున విరిసిన
అభినందన. మందారమాలను
ఆ తల్లికి సమర్పిద్దాం
మేధావుల అడుగు జాడల్లో
ముందడుగు వేస్తూ
నేను సైతమంటూ...
సహస్ర కవి మిత్రులచే
లక్షల అక్షర జ్యోతులు వెలిగించి
సభ్య సమాజన్నావరించిన
దరాచార దుశ్చర్యల,
అంధకారన్ని తొలగించి
రవి కిరణాలై వెలుగునిద్దాం
కవితా కుసుమాల. పరిమళాన్ని
ప్రపంచమంతా ప్రసరిద్దాం.
కోటి ఆశల పల్లకిలొ,
శతకోటి దీవెనల చల్లని తల్లి
చదువుల తల్లిని ఊరేగిద్దాం.
సహస్ర కవి మిత్రుల యాత్ర
దిగ్విజయంగా సాగేలా
ఆ తల్లిని ప్రార్థిద్దాం.
ఓ వీణా పాణి ,పుస్తక వాణి
విధ్యాధరి, సరస్వతి దేవి
నీ కృపాకటాక్షం
ఏ నాటికి తరగనిది,చెరగనిది
ఎవరూ దొచుకోలే నిధి...
ఓ తల్లీ వాగ్దేవి,అందుకో వందనం
సహస్ర దీపోత్సవ నీరాజనం..
పుష్పజగన్నాథ్..అనంతపురం.
*************************
కొరిడే విశ్వనాథ శర్మ SK506 ప్రిన్సిపాల్ ధర్మపురి
యో బ్రహ్మాది సమస్త దేవవినుతో లిఙ్గాత్మకస్యాత్మజః ,
యం లబ్ధ్వా హి ముదాన్వితా సుతనయం గౌరీ జగన్మాతృకా |
యస్యేష్టానుగుణం సమస్తవిపదో దూరీకృతా భక్తగాః,
వందే తం వరరామలిఙ్గతనయం శ్రీవిఘ్ననాథం సదా ||
యైషా దుష్టనివారణే సునిరతా భక్తార్తినిర్హారిణీ,
యస్యాస్త్విష్టతయా హి లబ్ధవిభవా నిష్కించనాః ప్రాణినః |
మూఢాన్ జ్ఞానవతః కరోతి సతతం యా స్వప్రసాదాన్ముదా,
వందే తాం పరమేశ్వరీం భగవతీం జ్ఞానప్రదాం శారదామ్ ||
యైషా బాసరపీఠికా స్మిత ముఖీ భక్తార్తి దూరీకరీ ,
యైషా మూఢమతీన్ ప్రశస్తవిబుధాన్ కర్తుం సదా హ్యుత్సుకా |
యైషా కల్పలతా హి చార్థిన ఇయం వాంఛాదిసందాయినీ
పాయాత్సైవ సరస్వతీ జనమిమం జ్ఞానార్థినం చార్తినమ్ ||
****************************
ఎస్: కె: 244
కడబాల నాగేశ్వర రావు
7382356659
🙏సరస్వతీ దేవి ప్రార్థన🙏
యా కుందేందు తుషార హార ధవళా యాశుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిస్సేష జాడ్యాపహా. 🙏🙏🙏🙏🙏 🙏🙏
సరస్వతీ దండకమ్
జయ జయ జయ జనయిత్రీ ! కరాన్వీణసంధాత్రి గాంధర్వ విద్యాకళాకణ్వనాశాం త్రివేదీప వళీ సారసాహిత్య నిర్వవిర్తితప్రోల్లసద్భక్త గంగా మనేకాబిచార క్రియాహోమధూమావళీ మేచకాధర్వణామ్నాయ రోమావళింగల్ప శిక్షాక్షరాకల్పసాక్షాచ్ఛరిత్రాం నిరుక్త ప్రియోక్తిం భుజద్వం ద్వతాం నన్నుతానేన సంశోభితాం ఛన్దసాం జాతివృత్త ప్రభేదప్రభిన్నేన విద్యామయీంత్వాం భజేభగవతీ, గుణద్దీర్ఘ భావోద్భవాం సంతతింసలదధానాం మహాశబ్దనిష్పాలకవ్యాక్రియాశాస్త్ర క్వణత్ కాంచిపట్టీ కటీమణ్డలేబిభ్రతీం జ్యోతిషాహారదణ్డేన దారోదయస్ఫూర్తి విద్యోతమానేనవిబ్రాజితా మాత్మపక్షానురాగాన్వితాభ్యాముభాభ్యాంచ పూర్వోత్తరాభ్యాం మహా దర్శనాభ్యాం ప్రతిష్ఠాపితోష్టప్రవాళాం పరబ్రహ్మకర్మార్ధభేదాది ధాన్తం శరీరం ప్రతిష్ఠాంపరాం ప్రాప్తయాచారు మీమాం సయ మాంసలేవోరు యుగ్మేన సమ్యక్ ఫరాచ్చాదనం లాలయన్తిం ముహూ వత్రదానే గుణాన్విత పూర్ణగానకృత్ఖండన ప్రోఢిమాఢౌ కమనేసదస్త్యాత్మనాతర్కవ్యాకరణ కావ్య భీకార్యముఖేఖ్యానయన్తీధ్రువందేవి వన్దేతుమాంత్వామహమ్ ద్రుహిణి గృహిణి ! మత్స్యపద్మాది సంరక్షితం పాణిపద్మద్వయం పురాణం శిరస్తావకం నిర్మలం ధర్మశాస్త్రమ్ గలాభ్యాం భ్రూలతాం క్రియాయస్తరాజస్య తద్భిందువాచిత్రకంఫాల భాగేతదర్దేన్దు నాంతే విరచిర్విపంచీకలక్వాణనాకోణచాపంప్రణిన్యేన్వయమ్ భవతు మమశుభం భరతీ ! త్వత్ప్రసాదాది సాత్వత్పాదార భూతం ప్రభూతం ప్రభూతమ్ సమస్సోమసిద్ధాన్త కాన్తాదదాయై సమశ్శూన్యనాదాత్మమధ్యాన్వితాయై సుజ్ఞాన సోమస్త్యహృత్పం కజాయై నమస్తేస్తుసాకారతాసిద్ధభూమ్నేనమస్తేస్తుకైవల్యకల్యాణసీమ్నేనమస్సర్వగీర్వాణ చూడామణీశ్రేణిదాశోణప్రభాజాలబాలాతపస్మేరపదామ్బుజాయైనమస్తే శరణ్యైవరణ్యైనమశ్శర్మదాయైనమశ్శాశ్వతాయై నమోవిశ్రుతాయైనమశ్శారదాయైనమస్తే నమస్తే నమః.
*****************************************
బ్రహ్మ మానస పుత్రికవై..
ఆ బ్రహ్మ హృదయ కమలమందే జేరి
పుస్తక ధారిణిగా..
వీణాపాణిగా..
హంసవాహినిగా..
భారతిగా.. వాగ్ధేవిగా..
సకల కళా వాచస్పతిగా..
సాహిత్యమున.. పదములై.... సంగీతమున రాగములై.. చిత్రలేఖనమున చిత్తరువులై.. శిల్పమున శిలయై... నాట్యమున పదఝరులై...అలరారుతూ..
సకలజనులకు బ్రహ్మ లిఖిత రీతిగా..
వారి కళలను ఒనగూర్చుతూ... వారికి సిరులను.. యశస్సునూ అందంచే వరదాయినివి..
నీ కృపతో పొందేదే విద్య.. దానిని ఒకరికి.. పంచేకొద్దీ తరగని ఘని..
నీవు జన్మతఁ నొసగిన విద్య..
ఒకరిచే అపహరింప బడేదికాదు..
నీ కటాక్ష వీక్షణాలు మాపై సదా ప్రసరింపజేసే తల్లీ
నీ కిదే మా వందనము...
పోపూరి. మాధవీలత..
sk.no116 .
***********************
ఎస్.కే.203:
06.12.2015.
మాడుగుల మురళీధర శర్మ సిద్ధిపేట-9440478439.
******"చదువుల తల్లి"*****
🌷🌷🌷🌹🌷🌷🌷
'చదువుల తల్లి' సర్వజన సారమతీ , స్వర శారదాంబ! హే! సదమల వృత్తి నిన్ను మది శక్తి సమన్విత ధారణమ్మునన్!
మది పులకించు సుస్వర సమాగమ సప్త సురాగ మాలికల్!
హృది విదితంబు చేయుము మహా మహితాన్విత! హే!స్వరాంబికా!......
*****************************
"సరస్వతీ నమస్ఠుభ్యం, వరదే కామరూపినీ" అని
బ్రహ్మా మానస పుత్రిక, అయిన వాగ్ధేవిని తలచుకుని అ,ఆ లు దిద్ద్దుకుని
"తల్లీ నిన్ను దలంచి పుస్ఠకం చేతఁ బూనితిం" అని
ఆ చదువుల తల్లిని స్మరిస్ఠూ,
పుస్తకాల ద్వారా విద్యని జ్య్గానాన్ని పేంచుకుని
"యా కున్దేన్దు తూషార హార ధవలా "అని
మనసుకు నఛిన అభిరుచుల పట్ల
కలలను అభ్యాసము చేసుకుని
కీర్తిని , యసస్సును కలిగి
"సామామ్పాతూ సరస్వతీ భగవథీ నిస్సేషా జాద్యాపాహా " అని
సధ్భుధి ని, సఠ్ప్రవర్ఠననూ
అన్దరికీ కలిగించమనీ ప్రార్ధిస్తు
ఆ తల్లి పాదార విన్దలకూ నమస్సుమంజలీ సమర్పించుదాం
v. Hymavathi, sk no.549
************************
స.క.సం:-79
పేరు:-దివాకరశాస్త్రి
వికారాబాదు
ఓంసరస్వతీదేవ్యైనమః
కం:-
శ్రీశారదాంబవాగ్ధే
వీ,శార్వాణీ,జయోస్తువిద్యలరాణీ
ఆశీర్వదించుజనయి
త్రీ,శాంతవదనసరస్వతీ,జయధాత్రీ...!
కం:-
వాణీహిరణ్యగర్భుని
రాణీ,వేదాలమాతరజితస్వరూపా...!
పాణీ,బ్రహ్మప్రియసఖీ
వీణాధారిణినమోస్తువిద్యలతల్లీ.,!
తే.గీ:-
హంసవాహనరూపిణిఆదిజనని
చిలుకజపమాలకల్గినచిద్విలాసి
శ్వేతవర్ణస్వరూపిణివేదమాత
వీణపుస్తకదారిణివిద్యలివ్వు
శార్ధూలం:-
అమ్మానీకృపచూపవమ్మజయశ్రీఆనందసందాయకీ
అమ్మావిద్యలరాణివమ్మజగమేనాడించువాగ్భూషిణీ
అమ్మాశారదదేవివమ్మప్రతివారంతాభజించేరుఓ
యమ్మాభారతిసాహితీప్రభలలోనాశిష్యులందించవే.,!
*****దివాకరశాస్త్రి*****
~~~వికారాబాదు~~~
**************************
Sk 72
అరాశ
గజ్వెల్
వేదరూపిణి విశ్వకారిణి వీణనాద విలాసినీ
మోదవర్ధిని ఖేదమర్ధిని మోహ లోభ వినాశిని
సాధు పోషిణి శత్రు శోషిణి సత్వ సద్గుణ వాహిని
పాద పంకజ పద్మలోచని పాహి భాసర వాసిని
భావనామృత చిత్రమై కవి భాస మాన సుపొత్తమై
జీవ ధారణ శిల్పమై కడుచేవ గల్గిన నృత్యమై
సావధాన సుగీతమై కళ జంత్ర గాత్ర విశేషమై
పావనీ వెలిగేవనీ జయ భారతీ శరణాగతీ
,,,,,,,,,,,, , ,,, , ,,,,,,,,,,,,,,,అరాశ
************************
SKno322.గడ్డం లక్ష్మణ్ కాటారం కరీంనగర్. "అమ్మ సరస్వతీ కవితకామణీవీ జగమేలు మాత, మాయమ్మ సువిద్య సర్వగుణ యోగవతీ శరదిందిరాణ్మణీ,యిమ్మహి నేలె కల్పజన యీశ్వరి షోడశ కాంతి వర్ణితా,కమ్మని రాగతాళ పద కావ్యజగత్తును నేలు భారతి! "నాదమయూరివై ప్రణవ నాద పురాణ కటాక్ష దర్శినై, వేదసుదార కీర్తనల వేలుపు పధ్మజు రాణివాణివై, నీదరహాస మెల్లరకు నిత్యము కావ్యప్రసూనమై కథై, సాదుజనావళి కవిత సంస్కృతివై దరిజేరు భారతీ!
***************************************
----------------------- SK -0412
పార్థసారథి నాయుడు దగ్గుపాటి
డిప్యూటి ఫారెస్టు రేంజి ఆఫీసరు(రి)
చిత్తూ రు , ఆంధ్రప్రదేశ్
+919440995046
.....................................
శీర్షిక :
అమ్మా! సరస్వతీ ఆది వాక్పాలకీ 🙏
.....................................
అమ్మా! సరస్వతీ ఆదివాక్పాలకీ
వాక్కులివియె కనుము చక్కనమ్మ
వాక్కుచైతన్యమై వర్ధిల్లగాజేయ
అవధరింపుమమ్మ అవని అంత
పుట్టుకతోనె వాక్కు పుట్టువమౌచూడు
కెవ్వుమంటు భవిని గెలివిచేయు
వాగ్విశారదమై వర్ధిల్లు చోట
లేములుండవెపుడు లేశమైన
బాషయె దీపము బహుమంచి మాద్యమం
బాష భూషణమగు భార్గవికిని
విశ్వవాచస్పతి తెలుగు వినుతికెక్కి
జగము అవధరింప జనము మెచ్చ
కవిసహస్రములార గాములారక ముందె
లేచి చైతన్యముచేయ లెండు ఇలను
హితసహితమయిన సితకరములయిన
కవనములందించ రండి గారవముగ
అమ్మ అవధరించునంతరంగము చేరి
కవి నిమిత్తమాత్రుడరయ నెపుడు
అమ్మ కృపనుబడయ ఆరాధననుచేసి
అవని వేడుకొందమడకువగును
సర్వజీవజాలాల సంక్షేమమునకు
విశ్వశాింతి సాధన విరచనలకు
ఆత్మ శోధన మరి ఐకమత్యములకు
చదువు చాల మంచి ఉదవసితము
చదువుతోడ బతుకు చలిదేలి పోదు
హృదయమున హితము పొదవకుండ
ప్రేమ సుహృద భావముల గరిమలు పెరగి
మినిషి మెలగ వలయు మనసుతోడ
-----------------------SK- 0412
పార్థసారథి సారథి నాయుడు
చిత్తూరు
dpsnaidu@gmail.com
+919440995046
....................................
***************************
అంబటి భాను ప్రకాశ్.
స.క.956.
గద్వాల.
కవిత: వాణి
తే*, మనసు దీరగ నరహరి మహిమ నెంచి
కవిత రాయగ చేతను కలము బట్టి
బుద్ది గోరితి దయసేయు భువన మందు
నిన్నుదలతును వరముల నిమ్ము వాణి.
***********************************
SKno322.గడ్డం లక్ష్మణ్ కాటారం కరీంనగర్. "కవుల సాహితి సుదలెంతొ ఘనము కాగా! భాష యాసల సృజనలా భావమలర! *హైకు*నందున జేరి మా ఆర్తిదీర! పెంచిపోషించు భారతి ప్రేమదీర.!(love)
సహస్ర చందనాలు వాణీ
**********************
తల్లీ! ఓ సరస్వతీదేవి !
ఉద్భవించతివి వాక్కై వాణిగా
అడుగెడితివి అవనిపై అక్షరంగా
వేద ఇతిహాస పురాణ కావ్యకన్యగా
ఎదిగి తోడైతివి బ్రహ్మకు సతిగా
ప్రపంచ ప్రక్రియలకు నీ అందెలమంజీరాలై
ఇంపు సొంపుల లయ అమృతధారలై
సరిగమపనిసల సుస్వరాలై
జీవకోటిని పరవశింపజేసే సంగీతమై
రామాయణ భారత భాగవతా భక్తిశక్తై
ప్రబంధాలు విడదీయని అనుబంధాలై
ప్రాచీన ఆధునిక పోకడలతో కలసి
కాగితంపై నవరసాలుగా నాట్యామాడి
ఇంట్లో ఇంటర్నేట్టై అతుక్కుపోయి
వాట్సాప్తొ వన్యలద్దుకొని
హైకులతో లతలగా జగమంతా అల్లుకొని
కవితాపుష్పాలై సహస్రకోటిపరిమళాలుగా
కవుల కలంలో కాలమై కదిలి దారులేస్తున్నావా ?
తల్లీ !ఓ సరస్వతీదేవీ
చదువులతల్లీ నీకు సహస్ర చందనాలు
+++++పుల్లా.రామాంజనేయులు
ఉపాధ్యాయుడు
Sk:725 కర్నూలు జిల్లా
9491851349
****************************
వాక్కై ఫలించే వాగ్ధేవి.నాలుకపై నర్తించే నారాయణు కోడలా.నాలుగు ముఖముల వాడి నట్టింటి సిరి.
సకల ప్రాణులకు సర్వంబు తెలివెడు జ్ణానజ్యోతి.నీవు తోడున్న జగములనేలవచ్చు.సుఖశాంతులు బడయవచ్చు.దివ్య వైకుంఠ పదవి పొందవచ్చు.నీవు తోడుంటె సిరి తానంత నా దరికివచ్చు.నీవు తోడున్నసుబ్బిగాడు సుబ్బరాజౌను తల్లి అందుకే సత్కార్యములు చేయ సద్భుద్ధిని ఇవ్వు సనక సనందనుల తల్లి సతీ భారతి.....
ఇందిరా వెల్ది s.k.no.334.
***************************
సహస్రకవుల కవితా రచనలు
"సరస్వతి "కవితలు
SK320, కేతా భూలక్ష్మీదేవి,
అవనిగడ్డ, కృష్ణాజిల్లా
కవిత సంఖ్య :1 (11)
కవితా శీర్షిక :🍁నాకు మాత్రం నువు చదువుల తల్లి 📖
నాకు మాత్రం నువు చదువుల తల్లి
==========================
అమ్మా! శారదా! బ్రహ్మ మానస పుత్రికవో!
ఆ బ్రహ్మ కే పట్టమహిషివో! నాకు మాత్రం నువు చదువుల తల్లి!
నీ పుట్టుక నెంచ, నీ స్థాననిర్ణయం చేయనేనెంత తల్లీ!
నీ దయతో! నీ పాద ధూళితో పరవశనవు నీ బిడ్డనే తల్లీ!
నాకు తెలిసిందిదే తల్లీ! నాకు మాత్రం నువు చదువుల తల్లి!
అమ్మా! వాగ్దేవి! సంస్కృతాంధ్ర పాండిత్యములనేగాను దిట్ట
మరి నిను స్తుతి చేయుటెట్ట! ఏమో! మనసార నినుగొల్తు కైమోడ్చి ఇట్ట
నాకున్న జ్ఞానమిదేతల్లీ! నాకు మాత్రం నువు చదువుల తల్లి
అమ్మా! వీణాపాణీ! కచ్ఛపి వీణతంత్రులమీటి జగత్తుకి జ్ఞానస్వరాలనందించే తల్లీ!
నా జీవన వీణతంత్రులమీటి నాలో జ్ఞానరాగాల్ని పలికింపచేయు తల్లీ!
ఈ అజ్ఞానిని మన్నించు తల్లీ! నాకు మాత్రం నువు చదువుల తల్లి!
అమ్మా! హంసవాహినీ! నీ ధవళ వస్త్ర, పద్మపత్ర, హంసవాహన దర్శనం
మనోవికారాలనధిగమించిన స్వచ్ఛహృదయ సాధన చేయమని చేస్తుంది దిశానిర్దేశనం
నాకు తెలిసిన జ్ఞానమిదేతల్లీ! నాకు మాత్రం నువు చదువుల తల్లి!
అమ్మా! జ్ఞానసరస్వతీ! ఈ అజ్ఞానికి నీవు దయ చూపితివి ఇసుమంత జ్ఞానభిక్ష
అదియే నా క్షుద్బాధ తీర్చుభిక్ష, నా జీవితానికి శ్రీరామరక్ష!
నాకున్న జ్ఞానమిదేతల్లీ! నాకు మాత్రం నువు చదువుల తల్లి!
జయ జయ జయ భారతీ! నిను నమ్మికొల్చువారికి నీవే భగవతీ!
జాడ్యాలను, మౌఢ్యాలను తొలగించవేతల్లీ! నీకిత్తు ధవళ హారతీ!
ఇది కపిత్వమో! కవిత్వమో! తెలియదు తల్లీ! నాకు మాత్రం నువు చదువుల తల్లి!
SK320, కేతా భూలక్ష్మీదేవి,
అవనిగడ్డ, కృష్ణాజిల్లా ై
***************************************
సహస్రకవుల కవితా రచనలు
"సరస్వతి "కవితలు
SK320, కేతా భూలక్ష్మీదేవి,
అవనిగడ్డ, కృష్ణాజిల్లా
కవిత సంఖ్య :2(12)
కవితా శీర్షిక :💪 శక్తినివ్వు 💇
========================
అమ్మా! సరస్వతీ! ప్రతిచోటా నీవుండలేక
నీ ప్రతిరూపాలుగా గురువులనే బిడ్డలను పంపావు!
మరెందుకమ్మా! మంచి - చెడులనే కవలపిల్లలను కన్నావు?
అవునమ్మా! నీ బిడ్డలలో కొందరు పశుపతులైతే, మరికొందరు పశువులు
కొందరు సురులైతే మరికొందరు అసురులు ఈ పశువులను, అసురులను మనుషులుగా మార్చే శక్తినివ్వు
తల్లీ భారతీ! కన్నావు చాణక్య, శ్రీకృష్ణ శంకరాచార్య, రామకృష్ణ పరమహంస, వివేకానంద, మహాత్మా గాంధీ లాంటి గురు రత్నమాణిక్యాలను తల్లీ!
కానీ రత్నాలతోపాటు కీచకులు, చోరులు లాంటి రాళ్ళే ఎక్కువైనవి తల్లీ!
ఈ రాళ్ళని రత్నాలుగా మార్చే శక్తినివ్వు!
తల్లీ భారతీ! గురురూపంలోని కొందరు కీచకులు మదగజాలై కన్నబిడ్డలవంటి బంగారు తల్లుల బాల్యాన్ని చిదిమేస్తుంటే ఆ చిట్టితల్లులు మౌనంగా ఎందుకు భరించాలీ! అందుకే బుద్ధిచెప్పే శక్తినివ్వు
తల్లీ వీణాపాణీ! గురుబోధ పేరుతో మనుషుల నమ్మకాలతో అమ్మకాలు సాగించి, అక్రమ ఆస్తులు, అక్రమ సంబంధాలు పెంచుకునే కొందరు అల్పుల తాటతీసే జ్ఞానశక్తినివ్వు
తల్లీ భగవతీ! మాకు సర్వేపల్లి, మౌలానా, కలాం, సావిత్రిబాయి పూలే వంటి గురువులు, మళ్లీ అంతటి వాళ్ళని తయారు చేసే గురువులు, మలాల వంటి విద్యార్థులు కావాలి తల్లీ!
మంచిని మంచిగా, తప్పుని తప్పుగా చెప్పగలిగే శక్తినివ్వు
(తెలంగాణాలో ఈ మధ్య జరిగిన బాలిక ప్రసవం, ఆంధ్ర ప్రదేశ్ లో మోపిదేవి లో పదే పదే గర్భస్రావం జరిపించడంవలన జరిగిన బాలిక మరణం, నిత్యానంద లాంటి వాళ్ల ఉదంతాలు ఈ కవితకు ప్రేరణ )
SK320, కేతా భూలక్ష్మీదేవి,
అవనిగడ్డ, కృష్ణాజిల్లా
***********************************
నాగవెల్లి ప్రసాద్ ( స.కవి - 19)
కరీంనగర్.
......................................................
@ సరస్వతీ వందనం @
నమోస్తుతే నమోస్తుతే!
సరస్వతీ నమోస్తుతే!!
జ్ఞానం , అజ్ఞానం సమపాళ్ళలో
ఉన్న మా మనుషుల్లోనా
అజ్ఞానం ప్రారదోలి
జ్ఞానాన్ని పెంపొందించు....
మంచి , చెడు రెండూ
ఉన్న మాలోనా...
చెడుపై మంచిని గెలిపించి ,
ఆ మంచి దేశానికి
ఉపయోగపడేలా చేయి..
అక్షరాలతో అద్భుతాలను
సృష్టించే శక్తి నిచ్చి
మనుషుల్ని మహనీయులుగా
తీర్చిదిద్దు...
నమోస్తుతే నమోస్తుతే!
సరస్వతీ నమోస్తుతే!!
.............................................
నాగవెల్లి ప్రసాద్ ( స.కవి - 19)
కరీంనగర్.
***************************************
నీ సరి దైవ మేదియని నీ స్మరణాంబుధిలోన మున్గి నే
చేసెద నీకు సేవ, మరి చేయుచు కావ్య రసాల సృష్టినిన్!
ఏ సమయంబునైన మది నీ విధి దీక్షను బూనియుందు! ఓ
వాసర రాణి! వాణి! ఇదె వందన చందన మందుకో గదే!
******************************************
Skno 327
B నాగేశ్వరరావు-
కాకినాడ ,
8801526321
శీర్షిక. వాగ్దేవీ నమో నమః
జ్ఞానస్వరూపిణి విశ్వవిజ్ఙానదాయిని
కామరూపిణి,వాణీ
వందే హంసవాహిని
వందే విధాత సతీ
నమో నమో సరస్వతీ!
పండిత పామర పూజితే
అక్షర రూప విరాజితే
కమల సంభవు రాణీ
గాన,సంగీత కళావాహినీ
వందే దివ్య వీణాపాణీ
వాగ్దేవీ నమో నమః!
*******************
యస్.కె.188- క్రొవ్విడి వెంకట రాజారావు: 9553424499
ఏకసంఖ్య
పుడమి బ్రారంభముల కెల్ల ముందు
నిలిచి
ఘనత వహియించు చుండు ఓంకార
మొకటె
యుర్వి జనులకు బహు కాంతి నొసగు
చుండి
సాగు సూర్యుని రధమందు జక్ర
మొకటె
విఘ్నములనెల్ల దొలగించు
విఘ్నరాజు
దంత మొకటౌటచే నేక దంతు డయ్యె
వస్తు సర్వస్వమును శుభ్ర పరచునట్టి
ఘనత కలిగిన యగ్ని యేక ఋషి
యయ్యె
అరటి యొకమారు ఫలియించి
యంతమొంది
యొప్పు నేకోషధి ప్రఖ్య నొందుచుండి
జీవులకు జీవ మొసగెడి శ్రీయుగల్గ
యేక రసమను పేర నీరెన్నికగను
యీ ధరను భవ్య శిష్యత కేకలవ్యు
డొక్కడే సాటు వౌచుండి యొప్పు
ననెద
దానవాళికి గురువైన ధన్యుడతడు
శుక్రుడేకాxఇ పేరిట శోభ దాల్చు
భౌతికపు బంధనము లెల్ల వదలినట్టి
ఘన విరాగిని బిల్తు రేకాంగు డనుచు
గ్రహము లందున రాజు వేకైక దృక్కు
కాకికిన్ గద్దు నామ మేకాxఇ
యనుచు
నొకటియను సంఖ్య కిలలోన
నున్నయట్టి
ప్రముఖతను గూర్చి చెప్ప నేరైన
బూన
సంగతుల్ బహుభంగి చెప్పంగ
వచ్చు
దరచుచున్ శాస్త్ర కళల
నుదాహరించి
******************************
SK 148-పెసరు లింగారెడ్డి:
"వీణా పాణి"
--ॐॐॐ--
వరగల్ వాసీ వాక్కులవాణీ
ఆగమ నిగమాలకు ఆధారం నీవే
భాసర నివాసీ భాషలరాణీ
మహత్వ శక్తుల మంజులవాణీ
సతతము నీకు సత్ప్రణామములు
వీడను నామది వీణాపాణీ
కనికరించు నను కమలవాహిణీ
క్షరములేని అక్షరముల రాణీ.!!
************************
సరస్వతి పుత్రుల నిలయం సహస్రాధిక కవుల వలయం సమతా మమతల సహజీవనం సనాతన ఆధునికాల మధనం సంస్కార సధ్బావాల సహితం సతతం సమకాలీన వేదం సరస్వతీ పుత్రుల నిలయం సహస్రాదిక కవుల వలయం
సహస్రకవి 856 బందా వేంకట రామారావు, రిటైర్డు ఇంజనీయర్
**********************************
సహస్రకవి101-60అనుసూరి వేంకటేశ్వరరావు హైదరాబాదు
సహస్రకవుల రెండవ సంకలనం దీ 6/12/2015
విషయము : సరస్వతి
శీర్షిక: సరస్వతి మాత
ఓం జై సరస్వతి మాతా జైజై సరస్వతి మాతా
శరణాగతులను ఉద్దరించే మహిమాన్విత మాతా
ఓం జై సరస్వతి.....
జ్ఞాన నేత్ర ప్రధాతా
మహాభాగ్యవిధాతా
నిను కొలిచే మనుజల సిరులిచ్చే మాతా
ఓం జై సరస్వతిమాతా ...
నీ దయ మించన సిరి ఉందా
నావాక్కుననిలిచే దయవుందా
మనసా వాచా కొలిచేవారికి నీ దయ చూపు మాతా
ఓం జై సరస్వతిమాతా ..... మనుజుల నేలే మహాదేవీ
మా వాక్కున నిలిచే వాగ్దేవీ
అంబ వాగీశ్వర మాతా ......
ఓం జై సరస్వతిమాతా ......
సర్వ జ్ఞాన ప్రధాతా
సర్వ వేద విధాతా
నాలోసుస్వరమై నను గావుము మాతా
ఓం జై సరస్వతి మాతా .....
ఓం నమో మహా మాయా
ఓం నమో కమాలాసనా
నా మనసున నిలిచిన మనోరంజని మాతా
ఓం జై సరస్వతి మాతా ....
భారతి నీవే అక్షరమై
నా జీవన రాగ సుస్వరమై
నా కవనంలో జీవమై నిలువుము మాతా
ఓం జై సరస్వతిమాతా ..
శాస్త్రరూపిణి మాతా త్రికాలజ్ఞమాతా
బ్రహ్మవిష్ణు శివాత్మికమాతా
భువనము నేలగ రావా మాతా
ఓం జై సరస్వతి మాతా
కరుణను జూపవె కమలాక్షి
మూఢ మతులకు మతినిమ్ము
నిజనీరాజన మిదే మాతా మము కరుణించుము మాతా
ఓం జై సరస్వతి మాతా
****************
,sk 194
పేరు: ఘాలి లలిత "ప్రవల్హిక"
నెల్లూరు
❄️💰ధవళాంగి💰
శ్రీవాఙి గీర్వాఙి వాగ్దేవి దవళాంగి
పలుకు జిలుకలకొల్కి
పద్మజుని ప్రియసఖి
ఎల్లజనులకు నీవు
విఙానఘని వమ్మా
నిను గొల్వనిత్తువే
కొరతలేని విద్య
మంజులభాషిఙి మానసోల్లాసిని
సప్తస్వరాల మీటికవు
సకలకళలకు దీపికవు
మా మదినేలే మహరాఙివి
వైరమేలమ్మ నీ అత్తకు నీకు
నీవున్నింటికి తారానంటది
విద్యనేనిచ్చా,విత్తు నీ వీయని
చేవ్రాత నే నొసగా తలరాత నీవియ్యని
విన్నవించమ్మా నీ విభునకు
లచ్చికోడలా మా వాగ్బామ
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
రచన : కళాచందర్, జర్నలిస్ట్.
( SK 387 )
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
శీర్షిక: పలకులమ్మా...పలుకరాదె?
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
🌺
చదువుంటే మంచివుద్యోగమస్తదని
నాకెందుకో చదువె నేర్పినారు
చదువనేదేయిక కొలువు కోసమ్మని
ఎర్రిమాటలు నాలొ నింపినారు
లోకాన్నిచదవడం చదవేనని మరచి
జైలుగా బాల్యాన్ని జేసినారు
చదవనినాడె కొలువుఖాయమయ్యె
అంతజదివిరిపుడేది జాడకొలువు !?
పలుకులమ్మా నీకైన పలుకవశమె !?
కల్లగాదు కళా చంద్రమాట...!!
🌺
✏️@ కళాచందర్,
జర్నలిస్ట్.
( SK 387 )
🌺🌺🌺🙏🌺🌺🌺🌺
**************************
సహస్రకవుల కవితా రచనలు
"సరస్వతి"కవితలు
SK432,
సల్ల విజయ కుమార్,
షాద్ నగర్, పాలమూరు జిల్లా
కవితా శీర్షిక : చదువుల తల్లి పద్యాలు (కందాలు)
🌸 🌸 🌸 🌸 🌸 🌸 🌸
1⃣
సతతము నిను భజియింతును
అతులితమగు భక్తితోడ; అత్యధికముగన్
కృతులను వ్రాసెడు కవితా
చతురత నందించుమమ్మ చదువుల తల్లీ!
2⃣
నిరతము నిను సేవించెద
పొరపాట్లను చేయకుండ; ముద్దుల నొలికే
సరసపు మాటల కవితా
సరళిని నా కొసగుమమ్మ చదువుల తల్లీ!
3⃣
ఉల్లములో నిను దలతును
మల్లెలతో పూజచేసి; మంగళముగ నే
నల్లు కవితలో తేనెల
జల్లులు వర్షింపుమమ్మ చదువుల తల్లీ!
🌸 🌸 🌸 🌸 🌸 🌸 🌸
No comments:
Post a Comment