గోగులపాటి కృష్ణమోహన్

My photo
కవి, రచయిత, జర్నలిస్టు.

Thursday, 7 January 2016

రాజావాసిరెడ్డి మల్లీశ్వరి కవనాల మాల

                     
                రాజావాసిరెడ్డి మల్లీశ్వరి, కవయిత్రి

ఆయుత. కవితా యజ్ఞం

సర్ 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవితా సంఖ్య23
1-1-2016
శీర్షిక.  గెలుపు  పాట

వసంతాన్ని నేను

తలపు తోటలో పూచిన

తొలి వలపు పూవును నేను

వనిత మనసున కదిలే

విరహాగ్ని జ్వాలను నేను

మావి చిగురు కొనల్లో

మంద మలయ పవనాల్లో

సుందర దృశ్యాన్ని నేను

కోయిల రాగాల కూజితాల

కొత్త అర్థాల పలవరింపు

నేను

వసంతాన్ని నేను

చిత్ర విచిత్ర తత్వాల

సోయగాన్ని నేను.

అందమైన. ఆర్చ్షాన్ని.

హర్షాన్ని నేను.

కవితామతల్లికి కాన్కను

నేను

మొలకలు చిగురింప

వింత వర్ణాల మేళవింపు

నేను

మరులుగొన్న మనసున

విరిసిన

మరుమల్లి పూవును నేను

చిరుజల్లు దొంతరల

చెలరేగే పదను కోర్కెను

నేను

వసంతాన్ని నేను

వెన్నెల తిమిరాల గెలుపు

పాటను నేను
ఆయత కవితా యజ్ఞం
సక836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవితా సంఖ్య 24
శీర్షిక అగ్ని శిఖ

అపుడు నేనొక మల్లిని

మానవుల ఊహల్లోని

సుగంధాల సౌరభాన్ని

మానవుల తన్మయత్వంలో ని

కోటి పిలుపుల రూపాన్ని

ఈనాడు నేనొక యజ్ఞాన్ని

కాల సర్పాలు సమిథలుగా

మారుతున్నాయి

శవాలు వేద మంత్రాలు

చదువుతున్నాయి

ఆనాడు నేనొక తుహినాన్ని

దివినుండి భువికొచ్చిన

జననాంతర సహృదాన్ని

ఇపుడు నేనొక అగ్నిశిఖని

గుండెల్లోని కల్మషమంత

గహనానికి చేర్చే ప్రవాహాన్ని

ఒక నీలి తెర వాలినపుడు

నేను నాట్యం చేస్తాను

ఋతానృతాల

మీమాంసలో

ఆ భయంకర

యుద్ధభూమిలో

జాలిగా చూసే నిర్ణేతని

నరజాతి మేథస్సులలో

జ్వలించే యౌవన జ్వాలను

కాలానికి కాలానికి మధ్య

అంతరాన్ని

మీరెవరెరుగని ఓ విచిత్రాన్ని

దేనికీ లొంగని ఓ మంత్రాన్ని



 ఆయుత కవితా యజ్ఞం
సర్.  836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య. 25
2-1-2016
శీర్షిక.    చీకటి రాత్రులు

సంధ్య వాలిపోతోంది

ఏటిలోని అంతిమ

తెరచాపలా

మానవాళి మనుగడ

మసక చీకటిలో కి

అడుగిడుతోంది

ఎటు చూచినా-

ఎపుడు పడిలేచే

మంచితనం

ఎక్కడ విన్నా ఆక్రందనలు

ఆర్తనాదాలు

విజయం నాదేనని

విర్రవీగుతోంది దారిద్ర్యం

అంతిమ విజయం

తనదేనని

ఆనందంగా చెబుతోంది

కుళ్ళన మనస్తత్వం

నేను ముందంటే

నేను ముందంటూ

నలిగిన బ్రతుకులపై

నడిచి వస్తోంది సంకుచిత

స్వార్థం

అల్లల్లాడే కనురెప్పల్లో

ఆశ ఆఖరి శ్వాస తీసికొంది

విలవిలలాడే ప్రాణం

విశ్రాంతి నందింది

మనస్తత్వాల అడ్డుగోడల్లో

మంచితనం తన

అస్తిత్వాన్ని మరచి

రాను రానంటూ

మింటికెగిరిపోయింది

నేను వస్తానంటూ

 ఆశ  వెళ్ళిపోయింది

మిగిలిందేమిటిక్కడ---?

తెల్లబోయిన మానవాళి

మనుగడ

తెల్లవారని బ్రతుకులు

ఉషస్సులేని  చీకటి రాత్రులు

దారిద్ర్యం చాపిన

జ్వాలాకీలలు


ఆయుత కవితా యజ్ఞం
సక. 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య 26
3-1-2016
శీర్షిక.  మాటే కదా తోడు

జీవితం కుత్సిత

మన:దంష్ట్రల నడుమ

బంధీయైంది

స్నిగ్ధ శిరీషమైన మనసు

నిస్సహాయంగా.  చూస్తోంది

వ్యథా భరితమైన నాకై

అశ్రునయనం. లేదు

హేళన మిళితమైన విష

వ్యాళ  చూడ్కులు వినా

మధురిమ చవిచూడని నాకై

ఏ మృదు హృదయం లేదు

వంచన పరదాల

కుచించుకున్న తోడేళ్ళ

రూపాలు వినా

వ్యాకీర్ణ శాద్వల. శ్యామల

జీవనప్రాంగణాన

శీర్ణ సౌందర్య కలుపు

జొంపాల వత్తిడి వినా

హృద్య హృదంతరాళ

మమతల మాధుర్యాల

చిత్రాలు లేవు

అలంకృతమైన. నా ఎదన

భేతాళ కరాళ నృత్యాలు

వినా-----వసంతాల లేమి

రాలిన పత్రాల సౌందర్యమే

ఏలాడు నేను

రాగాన్ని ఎదలో

కౌముది నధరంపై దాచి

నటించమంటోంది మనసు

ఈ మాయావరణం

పొలిమేర దాటేందుకు

చిరునవ్వులు వెలిగించ

మంటోంది

చితి పేర్చిన అనుభవాలపై

బతికేందుకు. కావాలి.

కల్మషం

మరి నా మది ఈత రాని

ఓ. ఝషం

కాలం చూపాలి ఊరబయటి

సౌందర్యం

కల కంటే రాదు మనసులో

సౌఖ్యం

సఖ్యతనిచ్చినా

మనసును విప్పినా

తేనెల ఊటలైన మాటలే

ముఖ్యం





ఆయుతకవితాయజ్ఞం.
స క -836.  
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి. కవిత సంఖ్య. 28

ఉన్న ఊరు-కొన్న చీర

వండిన ఆహారం-వేసిన

ఆహార్యం

పలికే పలుకు-చిందే చినుకు

ఉరిమే ఉరుము-

కురిసే  తుహినం

దున్నేహలము. పండే

పొలము

పారే  ఝరము-పాడే

స్వరము

పూచే చెట్టు-కూసే పిట్ట

యువత మనసు-యౌవన

సొగసు

పొడిచే పొద్దు-పొందే

ముద్దు


ఆగని ఉషస్స

దాగని ఇంద్ర ధనుస్సు

సరం స్వరం  స్వర్ణం

వర్ణాల  స్వరాలావర్ణవం

కన్ను-వెన్ను- అందాల

మిన్ను

వనధి-వనాల నిధి

వండనిశాకం -వండిన

పాకం

కాగే నెగళ్ళ- ఆడే నెమళ్ళు

పిలిచే ప్రకృతి -వలచే

ప్రేయసి

రంగుల కుంచె-

మంచు ముసిరిన మల్లెల

కంచె

మనసుల భాష- వేద ఘోష

ప్రియ యోష-పీయూష

కురిసే వర్షం -మురిసె హర్షం

సాగే ఆర్షం-

అంతా వర్ణ మయం

ఆవరణమంతా

సు వర్ణమయం





ఆయత కవితా యజ్ఞం
స క 836
రాజావాసిరెడ్డి నల్లీశ్వరి
కవిత సంఖ్య. 29
4-1-2016
శీర్షిక.   పేద తెరువరి


సెలవా  మరి --

నెలవే దో తెలియని పేద

తెరువరి ని

వచ్చా. నీకై------

ఎగసి పడే హృదితో-----

మమతల మాలలతో-----
-
వెనుదిరిగి వెళుతున్నా

శూన్య హస్తాలతో

సెలవా మరి---!

నెలవేదో తెలియని పేద

తెరువరి ని

స్మృతుల తడిసి-----

వలపులెగసి---

తలపు సెగల వగచు

నే బేలనై

ఈ రేల వెర్రినై

ఈ రీతి ఎదురుచూచు

ఎడదతో

నిరాశ నిండిన

అశ్రు  ధారలతో

తీయని ఊహలు

ఆవేదనా. అలలవగా

ఖేద తమాల వాటిక

త్రోయగా

సెలవా మరి----!

నెలవేదో  తెలియని పేద

తెరువరి ని

కుసుమము విరిసి

వినూత్న సౌరభాలనెదజల్లు

నాడు-

చిన్ని అలలు. కౌతుకముతో

తలలెత్రి. చూచునాడు-

వెన్నెల సోనల చల్లదనము

గురియునాడు

నీ రూపమే.

నా ఎడద నూహింతు

సుతారంపుటూహలో

సెలవా మరి--!

వెలవేదో తెలియని పేద

తెరువరి ని



ఆయుత కవితా యజ్ఞం
స క 836
రాజావాసిజరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య. 39
6-1-2016
శీర్షిక.   పేరు ఏదైతేనేం----?

ఆశగా వన్నెల్ని తెచ్చే
వసంతమ కోసం ఎదురు చూస్తూ----------
శిశిరకాలపు. స్మృతుల
చివుళ్ళకోసం
కన్నీళ్ళు దోసిళ్ళ మోస్తూ--
నిలకడలేని మనసును
ఓదారుస్తూ----
కండరాల నుండి
గర్భ కుహరం నుండి
ఓ అగ్నిశిఖ నేనొస్తానంటే
ఒడిలో జోల పాడలేని. అవిటితనం
నా సంతోషం
గుప్పు. గుప్పుమనే దీపం
దూరాన ఉంటేనేకదా
చందమామ అందం
మనిషికి ఎన్ని భయాలు---!
ఓల్గా గంగల గురించి
మాట్లాడే మనిషి
తనలోని.  మరో మనిషిని
ఆలకించడేం?
సమాజ సమానతల అస్తిత్వాల ప్రశ్నించే మనిషి
స్తబ్ధత   సంకోచాల గురించి
మరచిపోతాడేం---?
దోసిళ్ళ కన్నీళ్ళు
పారిజాతాల్లా నేల తల్లి
పాదాలంటితే
ఒక్క పూవైనా పూయని
నా ఆశల వంక నిరాశగా
చూస్తూ--
సహనం -సౌశీల్యం-త్యాగం
-ఈ త్రికోణపు ఉచ్చుల్లో
ఆడ మనసును ఉరితీస్తుంటే

ఆశల పుప్పొడికి మరో జన్మ లేదు-రాదు
కన్నీరు చుక్క ఉప్పదనంలో
ప్రేమని------స్నేహాన్ని
వెదుక్కునే  పిచ్చి మనసా
నీకేమివ్వను?
పుట్టిన పాప పేరేదైతేనేం
ప్రేమ నటిస్తూ----
అభద్రతా భావంతో
చచ్చే మనిషిని చూచి
నా పాప వెక్కిరిస్తోంది
స్త్రీకెంత స్వేచ్ఛఉన్నా
ఆలింగనం తప్ప ఆపై----
నేనింకా కన్నీరు కారుస్తున్నానంటే
భావనా-చేతనా. ఉన్న మనిషిని నేను

-


ఆయత కవితా యజ్ఞం.
స క 836.
రాజావాసిరెడ్డి. మల్లీశ్వరి.
కవిత సంఖ్య.   41
7-1-2016
శీర్షిక.   నేను


రంగులహరివిల్లుల్ని

గుప్పిట పట్టిన బాల్యంలా-

కలల కల్హారాన్ని

కనుల. దాచినయౌవనంలా-

నురుగు నవ్వుల పూలతో

పుడమిచల్లి పాదాలంటే

కడలి కెరటములా-

ఆసులో. తిరిగే దారంలా-

ఉషస్సు -తమస్సు

నడుమ నలిగే. కాలంలా

ఉల్కలై గాంభీర్యాన్ని

కోల్పోయే నక్షత్రంలా

అవనని తాకీ తాకగనే

పవిత్రతను నోచని

వానచినుకులా-

మాదకత్వాన్ని కోరే

మనిషి  అల్పత్వంలా-

శిథిల శిల్ప సౌందర్యంలా-

అస్త వ్యస్త వ్యవస్థ

ప్రతీకలా-----------నేను
ఆయుత కవితా యజ్ఞం.
స క 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య. 42
7-1-2016
శీర్షిక.     ఎప్పుడొస్తావో----


ఎన్ని చూపులు నీ కోసం-----

ఎన్ని పిలుపులు నీకోసం-----

ఎన్ని ఆత్మలు నీ కోసం

ఎప్పుడొస్తావో.తెలియదు---

ఊహలా-------

చినుకువై---

బిందువువై---నీవొస్తుంటే

టప్ మని  నేలను రాలుతూ

జీవితపు. ఆంతర్యాన్ని

ఎంత చక్కగాఆవిష్కరిస్తావు


నేలను తడి చేస్తూ---

లోలోపలికి చొచ్చుకు పోతూ

తడిరాని. కళ్ళని-

క్రౌర్యం వీడని కళ్ళని-

ప్రేమలేని కళ్ళనివెక్కిరిస్తావు.

ఆర్ద్రత నీకు లేదంటూ

నిద్రాణమైన దేన్నో

లేపాలని------

ఎండిన పెదాలబడి

ఎంతటి బ్రతుకునిస్తావు----

బ్రతకటమెలాగాని

దేవుళ్ళాడే వాళ్ళకి

దోచుకునే. వాళ్ళకి

ఓ పాఠంలా గా

ఎప్పుడొస్తావో-------

తల్లి స్తన్యాన్ని పొందిన

పసినోరులా--

నిర్భాగ్యుని బ్రతుకున

ఎప్పుడో కాని రాని

పండుగలా

బండరాళ్ళ మధ్య

ఎండిన భూతాల మధ్య

నలిగి పోతూ

దిగులు పడుతూ

ఛిద్రమౌతూ

కలలు కనటం కూడా రాని--

మరచిన.వాళ్ళజీవితాలలోకి

ఓ ఆనందంలా

ఓ వెలుగులా

ఎప్పుడొస్తావో---------
















ఆయత కవితా యజ్ఞం
స క 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య.  43
8-1-2016
శీర్షిక.  పిలుపు

అమ్మా-----!

ఎక్కడి నుండో----

ఎవ్వరిదో----

పిలుపు

ఆగకుండా-

అదే పనిగా-

ఆలాపనగా-

మనసును మెలిపెడుతూ-


ఎవరి మాట వారే

పూర్తి చేయలేని ఈప్రవాహాన

తండాన

ఎవరు వింటారా

పిలుపు----?

మళ్ళీ మళ్ళీ అదే పనిగా----

ఒక సారి మూలుగులా

ఒక సారి నేలలోంచిమొలక

వచ్చినట్టుగా----అందంగా

ఒకసారి పూవుపూసినట్టుగా

ఒకసారి మనసు ను

కదిలించేలా

ఒకసారి.  ఉరుములా

బంధాలు ఉండీలేవనిపించే

కాలాన

నటనే నాగరికతైన కాలాన

వ్యామోహాలే

విద్యుత్కేంద్రాలైన కాలాన

అలలు అలలుగా

పొరలు పొర్లలుగా

తెరలు తెరలుగా

పొగలు పొగలుగా

విలువలు విచ్చి పోతున్న

కాలాన

పిలుపు వినేదెవరు----?

చేయినందించేదెవరు----?

దీర్ఘమైన ప్రవాహం

హ్రస్వమై

అణువై

పరమాణువై

కుచించుకు పోతుంటే

ఎవరు వింటారు ఏ

పిలుపైనా

ఎవరు ఎదురు చూస్తారు

ఏ మలుపులోనైనా------.


ఆయుత కవితా యజ్ఞం
స క 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య.  44
శీర్షిక.   కాలం ఒడిలో


కాలం నా ప్రియ బాంధవి

నా ఊపిరి కట్టిన మేడలో

నేను నా ప్రియ బాంధవి

కౌగిలింత లో. ఒదిగున్నాము

ఎన్నో నవ్వులు వెన్నెలగా----

ఎన్నో కన్నీళ్ళు ఆర్ద్రతగా----

సడలే యౌవనంలా

క్షణక్షణం జారిపోతోంది

ఆ క్షణాల షామియానాలో

జ్ఞాపకాల జంపకానాలు

కప్పుకున్నా

నా జ్ఞాపకాలను దివ్య

స్మృతులుగాజేసి

నా ప్రత్యణువు

పులకింపజేసిన

ఆ ప్రియ భావంఎక్కడో-----?

మానవ హృదయాలలో

రవళించే స్పందనలోనా---?

ప్రేయసి ధరియించిన

పాద మంజీరాల

సవ్వడిలోనా----?

ఎక్కడో------------/

నా చూపులు సారించిన

నా ప్రియ చేలాంచలంలోనా

మా కౌగిలింత వదిలిన

అనుభవాల

అనుభూతులలోనా----?

చీకటి సంధ్యలు

వెన్నెల పాయల

మురిపెంలోనా---?

ఎక్కడో---------------






ఆయుత కవితా యజ్ఞం
స క 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య 45
7-1-2016
శీర్షిక.    అలసట లే ని
మనసు

వేకువలేని  ఉషస్సులో

విరిసిన వాసన లేని

పూవును

రేకు రేకున

రోజు రోజుకు  పూసే.  కోరికను

ఉనికి-

వీడని మమతల -

బంధాల మొగసాల

భాషలో లోపించిన

అక్షరాన్ని

నాదాన. రాగంలేని శ్రుతిని

గాలి -వెలుగు-నింద-నేలా-

నీవు. త్రుళ్ళిపడుతున్నారు

చైతన్యం మీలో నింపుకుని

చిరు కెరటాల్లా.

చిందులేస్తున్నారు

రవళి రాని శూన్యమైన

వెదురు పుల్లనైనాను

జీవన దుందుభి

మ్రోగిద్దామంటే

సంగీత ప్రమితి చాలటం

లేదు

కాలం కడలి

పొంగులెత్తుతోంది

రమ్మని చేతులు

చాపుతోంది

అలసిన. నాకు ఏ

అశ్రుకణం

ప్రేయసిలా. ఒడినీయ లేదు







ఆయుత కవితా యజ్ఞం
 స క 836
రాజావాసిరెడ్డిమల్లీశ్వరి   కవిత సంఖ్య.  46
7-1-2016
 శీర్షిక.         ఆగని పరుగు        

జీవితం ఓ పరుగు పందెం

పుట్టుక వద్దారంభమై

గిట్టే వరకు పరుగెడుతూ నే

ఉంటుంది

విశ్వ సంగీతము

రాగోదయము

ఆచ్ఛాదనలేని. వెన్నెల

రాగ ద్వేషాల నడుమ

ఆంతర్యం

ఇంకా పరుగెత్తేలా

చేస్తున్నాయి

మనసు-వయసు-

వయసు-సొగసుల మధ్య

కాలం విధించిన. దూరంలో

పయనిస్తూనే.  ఉంటుంది

ఆ దూరంలో--

కరకు రాతి గుండెలు-

మమతల పాలవెల్లులు-

అడుగడుక్కి ఎత్తు పల్లాల్లా

కనిపించి. పోతునే

ఉంటారు

మనసు

జీవితాన్ని స్పందించేసే

వరం

వయసు

ఆ స్పందనకు జీవం

అందుకే -

మనసెపుడు నవ యౌవని

అందుకే ఇంతగా

పరుగెడుతోంది జీవితం

ఆ పరుగులో అలసిన చోట

ఆగిపోతా

ఇంకా చేరుకోవలసిన

దూరముంటే

నీ చైతన్యం

నాలో. నింపుకుని

గమ్యం తెలియని బ్రతుకులో

నింపాదిగా.

నీ బాటలో అడుగులేస్తూ

ఆ. దూరాన్ని దాటిపోతా


ఆయుత కవితా యజ్ఞం
స క 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య.  47
శీర్షిక.   ఒంటరి పక్షి
8-1-2016


సీతాకోక. చిలుకను

శీతల పవనాన్నికాను-

అందం.  స్వేచ్ఛ

నాదవటానికి

పొదరిల్లును- పూజల్లును

కాను

అందరిని

ఉత్తేజపరచటానికి

సెలయేటి. ఉరవళ్ళు

అలల పరవళ్ళు కాను

వింత సవ్వడి నేనవ్వటానికి

నేనమంటే.  ఎవరు---?

ఆవేశమా-ఆనందమా

నిర్లిప్తతా-  నిర్వేదమా

ప్రేమ రాహిత్యమా-

ఏకాకితనమా

ఉత్తేజమా-ఉద్వేగమా

ఎందుకు కళ్ళకిన్ని  కన్నీళ్ళు

మనసుకెందుకింత

సున్నితత్వం-----!

పూల గాలికి

పసినవవ్వులకి

పరవశించే దాని

స్వభావమేంటి----!

కాలం.  జలమై

గుండె గుబులును.  

పెంచితే.

కనిపించని.  నిన్నేమనను

మనసలరించు

ఋతువుల. మార్పు

ఎగదోసే.   ఆశల కూర్పు-

దూరాల గగనాల

ఉదయించే. తూర్పు------

నీవు

నా ఊపిరి- ఉత్సాహం

అవ్యక్త చేతనానంద

ఉత్తుంగ తరంగం. నీవు

శరచ్ఛంద్ర హాసరేఖల

నర్తించు జ్వలిత జ్వాలవు

నీవు- కీలవు. నీవు

మల్లెల గుభాళింపు నీవు

మధుపాయివి. నీవు

ఆకలి దప్పుల శూన్యంలో

పయనమెంత దూరం--?

అనంత సంద్రం. పై. సాగే

ఒంటరి పక్షిని------నేను












.

అయితే కవితా యజ్ఞం
స క 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య. 48
8-1-2016
శీర్షిక.  నివాళి

యుగాల తెరల్లోంచి

చూస్తున్నా

చీకటి రాజ్యం చేస్తోంది

మమత సమత

ఆర్తనాదాలు చేస్తున్నాయి

మంచితనం వెర్రి కేకలు

విన్పిస్తూ

స్వార్థ తిమిరం గద్దెక్కి

నర్తిస్తూ

అహంభావం.  సంగీతాన్ని

విన్పిస్తూ

నక్కలు వీధుల్లో

కుక్కలు స్మశానాల్లో

చంద్రుడు పగలు ప్రకాశిస్తూ

సూర్యుడు రాత్రి

విజృంభిస్తూ


యుగాల తెరల్లోంచి

చూస్తున్నా


నీవున్నావు

ఎడారి ఇసుక ఒంటెల మీద

ఎండ మానుల

ఒయాసిస్సులమీద

లంబానికి ఒంటరితనం

సృష్టించుకుని

నేనున్నాను

పూల గుత్తులలో

మండే సూర్యుడిలో

ఒక్క. పూవును చూస్తూ

యుగాలు గడిపేయగలనన్న

కవుల మధ్య

ప్రకృతి శోభల మధ్య

పల్లవించే మంచితనం

మధ్య

నేను


మహాకవుల పాదాల వెలిగే

దివ్వెను

వారి పాదాల నిలిచే

పువ్వును

వారి పెదాలు. పలికే

పదమును

వారి. మోమున నర్తించే.

నవ్వును







ఆయుత కవితా యజ్ణం
స క836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య.  49
8-1-2016
శీర్షిక.   పక్షినయ్యేదెన్నడు.----!

షహనాయీ  స్వరాలనెవరు
వినిపించమన్నారీ కోకిలను---?
ఎద నిర్లిప్తతతో నిండిపోతే------
పొద్దంతా నీ జ్ఞాపకాలను
మోస్తుంటే
నా పెదవిని ఓ చిరునవ్వు
కను కొలకులలో ఓ కన్నీరు బొట్టు
అవి నువ్వేనా----

ఈ రాత్రినెట్లా సింగారించను
చెప్పు. నిట్టూర్పుల అగరులో
చెట్టును. చూస్తే
పూలను సింగారించుకుంది
నేలను చూస్తే పచ్చదనాన్ని
సింగారిుచుకుంది
నిందను చూస్తే
తారల్ని సింగారిుచుకుంది
మరి. నేను-----
నీకేమివ్వని విన్నవించను
నీటి మీద వాలిన పక్షి
రెక్కలల్లార్చుకుంది
ఆనందాన్ని పీల్చి
ఊపిరి పోసుకుంది
మరి. నేను------
నా జీవమే నువ్వు
నువ్వెక్కడ----
ఆనందపు.ఊపిరెక్కడ----?
బాధే ఏకాంతమై
ఏకాకితనమై------నేను
వెలుగు రెక్కల్ని కప్పుకున్న
పక్షినయ్యేదెన్నడు







అయితే కవితా యజ్ఞం
స క 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య. 50
9-1-2016
శీర్షిక.   యుద్ధం

కవిత

యద్ధం---యుద్ధం--యజ్ధం
వద్దనే వాడెవ్వడు
సిద్ధమయ్యే వాడే కాని
మనిషి మొలిచిన నాటి నుండి
అనవరతంగా
అనివార్యంగా
అవిశ్రాంతంగా
ఆనందంగా
యుద్ధమంటే--
అహంకారమా
ఆధిపత్యమా
హత్యలా
నిరాయుధుల వధలా
మారణ హోమాలా
ఏమైనా మనసు పోరు
కాదుగా
మనని మనం జయింటం
కాదుగా
యుద్ధం
కబళిుంచటానికా
కూల్చటానికా
దోచటానికా
అంత ం చేయటానికా
ఆహుతి చేయటానికా
ఆశ్రయానికి కాదుగా
యుద్ధం--మరుస్తుంది
తనవారన్న మాట
తనకేలయన్న మాట
పంతం కూడదన్న మాట
తానొంటరియౌనన్న మాట
తాను సంఘజీవినన్న మాట
పెద్దలన్నారు--విజయం తలచి
ఇంటి  పోరు గెలవటం
విజయం
నిన్ను నీవు తెలియటం
విజయం
సత్యమాడితే విజయం
పదిమందితో కలిసుంటే
విజయం
యుద్ధోన్మాదులనా మాటలు
విననవ్వం--కననివ్వం
రణం-రణం-రణమంటూ
కదండి తొక్కిస్తాయి
అయినవారినిపోగొడతాయి
ఆపదలు సృష్టిస్తాయి
యుద్ధం చెయ్
చెయ్ యుద్ధం
అణచలేని. ఆవేశం మీద
అమితమైన అత్యాశ మీద
అంపశయ్య స్వార్థం మీద
ఆపలేని అసూయ మీద
యుద్ధం చెయ్
చెయ్ యుద్ధం
అవినీతి అలజడుల మీద
కపటం కార్పణ్యాల మీద
మనిషి కూరుకుపోతున్న
జాడ్యాల మీద
మట్టుపెట్టలేని అవలక్షణాల మీద
అంగలార్చే ప్రభుత మీద
ఆకలి తీర్చని వ్యవస్థ మీద
యద్ధం చెయ్
చెయ్ యుద్ధం
పిల్లల్ని అనాథలను చేసే
అమ్మతనం మీద
ఒడిలోకొచ్చిన బిడ్డను
విసిరేసే తండ్రుల మీద
బాధ్యత మరచిన
తలిదండ్రుల మీద
భవిష్యత్తు నేర్పని గురువుల మీద
ఏమీ నేర్వని మీమీద
నువ్వేంటో తెలుసుకోని నీ మీద
యుద్ధం చెయ్
చెయ్ యుద్ధం
తన తప్పు మరచి స్త్రీని
బలిపశువును చేసే
పురుషాహంకారం మీద
అనాధిగా ఆడదంటె అబలేననే. మానసిక అవిటితనం మీద
ఎదకరి సంతసమోర్వలేని
వారి మీద
మనిషికి పనికి రాని మేథస్స.
మీద
యుద్ధం చెయ్
చెయ్ యుద్ధం
బలవంతుడిదే గెలుపన్న న్యాయం పోవాలని
సహృదయ సౌభ్రాతృత్వం
విరియాలని
మంచితనం ఇ ల గెలవాలని
మనసులు కలసి మంది మదిని మమతలూరాలని
పోరు కాదు పొందు లాభమని
శాంతి దీపం సదా వెలగాలని
తలచుకో గతాన జరిగినప్రతి యుద్ధం
నాగసాకి.  తెలుపలేదా పాఠం
 జలియన్వాలాబాగ్.   తెలుపలేదా ప్రాణాలకై
అరాటం
పటాన్కోట ఘటన తెలుపలేదా బ్రతుకు కోసం
పోరాటం
ఏ యుద్ధమైనా ఆడు
అమాయకుల జీవితాలతో
చెలగాటం
అశోకుడు పొందిన  మనస్తాపం
అతడు చేరిన ధర్మ మార్గం
బుద్ధ జీవులకెల్ల బాధ
భవిత వాసులకెల్ల వ్యథ-----
యుద్ధం







ఆయుత కవితా యజ్ఞం
స క 836
     పేరు రాజావాసిరెడ్డిమల్లీశ్వరి
9-1-2016
కవిత సంఖ్య. 51
శీర్షిక.    నీకన్నా. నాకెవరు---!

కవిత

ఎప్పుడొస్తావో--
ఏమని.  వస్తావో--
నేనున్నానంటూ. చటుక్కున
కళ్ళ ముందుమెదుల్తావు
కళ్ళని ఆవరిస్తావు
మనసు ఆసాంతం
బాధతో మెలిదిరిగినపుడు
వద్దన్నా వినవు
రావటం ఆపవు
కళ్ళ ముందలి దృశ్యాన్ని
మసక బారుస్తూ
నిన్ను నే భరిుచలేనన్నా--
వస్తావు
నా ఆత్మ విస్వాసాన్ని
అమాంతం మింగాలనే
చూస్తావు
తడి చేస్తున్నట్టే చేస్తూ
కళ్ళలోని--
మనసులోని మృదుత్వాన్ని
ఆవిరి.  చేస్తావు
ఎక్కడ నీ ఉనికి------!
లాక్కోవాలనుకుంటావు నా
మనికి
కేవలం ఉప్పదనానివా--?
ఓదార్పువా---?
కణమై--
కల్లోలమై
జీవితాన్ని  తోచనీవు
రానా వద్దా అంటూ
కవ్వించే నువ్వు
రాకపోతే బావుణ్ణనుకంటాను
రాకపోతే నువ్వు-
ఎందుకింత కఠినమయ్యావనుకుంటా
బిందువై
అశ్రుబిందువై
అనుబంధమై
నా కనుల దాగే నీకు
చెప్పనా--------నిజం
నీ కన్నా నాకెవరు-------!


ఆయుత కవితా యజ్ఞుం
స క 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
9-1-2016
కవిత సంఖ్య.  52
శీర్షిక.  మారిన ఉన్నా

కవిత

ఛిద్రమైన. బాల్యాన్నైనా
శీరణమైన యౌవనాన్నైనా
అవశమైన జరనైనా
మాటి మాటికి నే మాపునే
ఉన్నా
ఏ అమ్మ ఒడి నాకు పంచీయ. లేదు
వీథిలోని కుక్కలా
రొద చేసే కాకిలా
తరిమేయ పడుతూనే ఉన్నా
ఏ అమ్మ చెయి  నాకు
ఆసరా కాలేదు
అమ్మ అన్న మాట నేర్చిన
నాడు
అత్త అన్న పిలుపు
పిలిచిన నాడు
ఏ అమ్మ ఆప్యాయత చూపలేదు
ఒడిలో పాపలు కదలిన నాడు
పాపల పాపలు నా ఒడిని ఆడిన నాడు
ఏ అమ్మ నా కనుపాప కాలేదు
నా చేయి పట్టి అగ్ని హోత్రం
చుట్టూ తిప్పన. చేయున్నా
నే చేయి పట్టి నడక. నడత నేర్పన. చేయున్నా
ఏ చేయి నాకు ఊతమవ్వ లేదు
బాధ్యతల బరువుంటున్నా-
మనసు బావురుమంటున్నా
ఏ రోజు నే పరువయ్యే ఉన్నా
లోకం సుద్రంలాభయపెడుతున్నా
సంద్రపు. నీరులా
నేనావిరై పోతున్నా
ఏ చెమ్మా నన్నంటని
శూన్యమై ఉన్నా

ఆయుత కవితా యజ్ఞం
స క 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య. 54
9-1-2016
శీర్షిక.  సంక్రాంతి
కవిత

ఎక్కడ క్రాంతి-----?
ఎందుకీ. సంక్రాంతి---?
సంబరమా అదెక్కడుంది-?
నీక్కనిపించటం లేదా----
ఎన్ని భోగి మంటలైతే--
ఎన్ని తూటాల బారులైతే
-----క్రాంతి
రాలిన ఆకుల్లా ఎన్ని ప్రాణాలైతే
ఎన్ని బ్రతుకులు కాగిపోతే
------కాలిపోతే------
క్రాంతి
ఉదయించే సూర్యుల్లాంటి
విరబూసే మందారాల్లాంటి
ఎన్ని శిశు హాసాలు నేల రాలితే
ప్రపంచీ కరణకు
అంతరాలు గస్తీ లు కాస్తుంటే
ఎక్కడ బడుగు బతుకుల్లో
క్రాంతి--?
క్రాంతి--సంక్రాంతి ఎక్కడ?
మనం-
విశాల  మైదానాల్ని మరచి
నీ నా హద్దుల్ని గీస్తుేంటే
ఎలా చూస్తాం క్రాంతి--?
ఎలా వేస్తాం భోగి మంటల్ని
----?
ఎందరు రైతులు
కలుపుమొక్కల్లా--
పండని. పైరుల్లా--
నాటులోనే వేటు వేయబడుతుంటే
ఎక్కడ క్రాంతి--కాంతి?
నాలుగు రోడ్ల కూడలిలో
నలుగురి కోసమంటూ
భోగి మంటలు వేస్తే
రోడ్డు పక్క చలికి వణికే
బిచ్చగాడు గుర్తురాడు
తన్ని తరిమేసిన అమ్మానాన్నలు గుర్తు రారు
అభిజాత్యంతో
అధికారంతో
ఇంటి నుండి గెంటేసిన
ఇల్లాలు. గుర్తు రాదు
విందులో తప్ప తాగి
తూలుతుంటే
కన్న పిల్లలు గుర్తు రారు
ఏదీ ఎవరికి గుర్తు రాని --
లేని మనకి-కాంతి ఎక్కడ?
క్రాంతి ఎక్కడ--?
కాంతి-క్రాంతి లేనపుడు
సంక్రాంతి ఎక్కడ---?
మానవ మేథ
 హీనమై--హేయమై
సంకీరణమై-శీర్ణమై
సెలయేళ్ళ -
జలపాతాలు. కాలేని కాలమై
ఎడారులై
ఇంకిన. జలమై కుచించుకు
పోతూంటే
కాంతి-క్రాంతి. ఎక్కడ---?
సంక్రాంతి  ఎక్కడ----?







ఆయుత కవితా యజ్ఞం
స క836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య. 55
10-1-2016
శీర్షిక.  నియంత నీడలో
కవిత
మనసు మల్లెపూలతో
మాట్లాడటం  మానేసింది
దానికిప్పుడు కావలసింది
పరవశం కాదు
నా గళంలో కఠినత్వం
తొంగిచూసిందీవేళే
నా ఆలోచనలలో
 ఒంటరి గా బయల్దేరిన నాకు
నా లోచనాల్లా నీవు దొరికావు
మనసు
రోడ్డు మీద నడుస్తుంటే
నన్ను చూడవేం అంటూ
నలిగిన మనసులు ప్రశ్నిస్తున్నాయి
అవును
ఆపన్నులు నా కోసం
పూసలేదు
నిజమే
నీవు నా నియంతవు
నేను--
ఈప్రపంచపు తోటమాలిని
అలసి సొల్లసినపూవులు
రెక్కలు విరిగిన పక్షులు
నను నిత్యం కలవరిస్తాయి
అవి నా అతిథులు
నా చలువలో మూగగా
అమాయకంగా నిదురోతాయి
నా గుండెల్లో సంద్రపుటగ్నులు
నా రెక్కల్లో చంద్రుని వెన్నెలలు
నేను నీ నియంతనని
ఎర్రని చూపుల్తో
నిలుస్తావు నా ముందు
పేదగా నీ ముందు
చేతులు ముకుళించా---
నీ నియంతృత్వపు
అధికారమంతా నే ననుభవించనా-----!





ఆయుత కవితా యజ్ఞం
స క 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య. 57
10-1-2016
శీర్షిక.   నేను  గరళాన్ని
కవిత

తీరం తాకి
నురుగు నవ్వులు పూచే
అలనౌదామనుకున్నా
పడవల సందడి లేని
తీరమైనాను
సౌరభాల పూదోట కావాలనుకున్నా
తోటమాలి.
లేమిని మరువలేకున్నా
ఆమని కౌముది పీయూషనై
నిన్నలరిద్దామనుకున్నా--
ఆశల పూపొదరిళ్ళఅనుభవాల ముళ్ళు.   గుచ్చుకున్నా
మనసు బాల్యంవీడనంటోంది
తొలి పొద్దు అందం
ఏదీ యౌవన మధ్యాహ్న వేళ
ఆవేళం ఉమిసిన
ఆవేదనా  గీతాన్ని
బాధ్యత మరిచిన బాల్య
కౌమారాన్ని
నేను  గరళాన్ని
మరణాన్ని
నేను. స్మితాన్ని
శ్మస్మితాన్ని.
నేను  శాంతి అశాంతుల వలయాన్ని
నేను వేదనావేదనల రూపాన్ని
నేనెవరికి చేరువకాని
హాయినిచ్చు పవనాన్ని
ఆనందమివ్వలేని హితాన్ని
వసంతాన్ని


ఆయుత కవితా యజ్ఞం
స. క. 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య.  58
10-1-2016
శీర్షిక.   జారిన క్షణాలు
కవిత
కలలాంటి వాస్తవాన్ని
కమ్మగా ఎదకు హత్తుకున్నాను
అలలా ఓ కల కదలిపోతే
అనుకన్నన్నాను
అది నీ అంతరంగ
ప్రతిబింబమని
నింగిలో ఒక చుక్క రాలిపోతే
నేననుకోలేదు
అది నా జడలోని
మల్లెపూవని
జారిన ప్రతి క్షణం. యౌవనంలా. జారిపోతూ
వాడిపోతోంది
మంచులా నీ ముగ్ధ మోహన. రూపం
ముదము గొలిపిననాడు
జారిన గతంలో
జీవన నగ్న సత్యాలు
జీర్ణించుకోలేదు
కలలాంటి వాస్తవాన్ని కమ్మగా ఎదకు హత్తుకున్నాను
గాలికి కదలాడే గరికపూవులా
బేలనై నిలిచా నిదోమూల
దారి ప్రక్క పూడ్చానని జాలిపడే వారేకాని
దేవుని  చరణాల కడకు
చేరనివ్వరు జనం నన్ను
వ్యాపించిన తావిని
తనవార. ఆఘ్రాణించి
వాడిపోయిన నన్ను ఈసడింపుగా చూస్తారు
అందుకే ---అన్నాను
నిన్ను చూచి
నా అంతరంగాన్ని మరిచిన నాడు-
ఈ బ్రతుకు విలువలు
నన్ను అర్థం చేసికోనివ్వలేదేం అని-
కదలాలన్నా కాళ్ళ లేని నేను
కాలం కబంధ హస్తాల
కరగిపోతాను
కరకు హృదయాలబడి
నలిగిపోతాను
భయం----భయం---
అందుకే---
-పూడిపోని. ఎదలోతుల
వాడిపోని.  ఆశలతో
కలలాంటి వాస్తవాన్ని
కమ్మగా ఎదకు హత్తుకున్నాను




ఆయుత కవితా యజ్ఞం
స క 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య.  59
10-1-2016
శీర్షిక.  మహానదిలా
కవిత

ఎంత దీర్ఘంగా ఉంటుందో-
మిన్నాగులా-
ఎంత లోతుగా ఉంటుందో
అంతు. అందని మనిషి మదిలా-మహానది
తిండి లేని మనిషిలా-
నీరులేని. మహానది
జీవితం మహానదిలా మారితే-------
మలుపు మలుపనా
ఎన్ని. అడ్డంకులు----!
ఎన్ని. ఆవేదనలు----!
తనలోని ఇసుకను లాక్కు ని
తనకలంకారాలైన చేపల్ని
రొయ్యల్ని. లాక్కుని
మనిషి ఎంత అల్పత్వం
చూపినా
ఎంత దౌర్జన్యం చేసినా
నీరనే జీవాన్ని  దోచేసినా
నిశ్చలంగ. నిలచి చూస్తూనే
ఉంటుంది --మహానది
కొత్త నీరొస్తుందని-
జల పుష్పాలు. పూస్తాయని
కొత్త దారులు. కలుస్తాయని
అల వెనుక అల రాదా-
ఎందుకీ ఆరాటాలు
పోరాటాలు

మరి మనిషెందుకు
నేర్చుకోడా.  ఓపిక---?




ఆయుత కవితా యజ్ఞం
స. క. 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య.  60
11-1-2016
శీర్షిక.    షో. కేసులో బొమ్మ
కవిత
నీ చిట్టి వేళ్ళతో నన్నెన్ని సార్లు తాకావో-
నీ చిన్ని చేతులతో  నన్నెన్ని సార్లు తిప్పి తిప్పి చూశాను-
నల్లని నా మేను తడి చేస్తూ-
ఇంకా ఇంకా తడి చేస్తూ
అర చేత్తో  నన్ను తుడుస్తూ-
నిగనిగలాడేలా. చేస్తూ
నన్నెంత శుభ్రంగా
ఉంచాలనుకున్నావో
కంటకాన్ని చేతబట్టి
 నామీద                                   కను విందుగా
ఎన్ని ఆకృతులుచిత్రించావో
నిత్యం-మధ్యాహ్నం
ఎక్కాలతో-పద్ధాలతో
నన్నెంతగా సింగారించావో
బొందులూడిన దాన్నైనా
నన్నెంతగా ప్రేమగా చూశావో
నే పగలకుండా
ఎంతగా. జాగ్రత్రపడ్డావో
రోజులు మారాయ్
నన్నవతల. పారేశావ్
రెపరెపలాడే
కాగితాల్ని కౌగలించుకున్నావ్
అనుదినం
నీ ఊసులు-ఆశలు
వానితోనే
కాలం చెల్లిందని
నా మనసెంతగా నలిగిందో
ఇప్పుడు నేను-
సామాన్ల గదిలో-  ఓమారుమూల
బూజుపట్టి-చిట్లిపోయి
నీ జ్ఞాపకాల్ని మోస్తూ-
ఇప్పుడెందుకో
నా జ్ఞాపకం నిను
కదిలించింది
నా బూజు దులిపావ్
శుభ్రంగా తుడిచావ్
అకర. మాలలు. నాకేస్తావనుకున్నా-
గోడకు తగిలింది శిలువవేశావ్
నేను
నీకందానన్న సంతోషం
నీలోలేదు
యురేఖా అన్న ఆనందం తప్ప
నా ఆనందం-ఆశ
హుష్ కాకై పోయాయ్
నేనిప్పుడు-
ప్రతి వాడికి వింతగా అన్పించే. వస్తువును
నీ చేతి స్పర్శే కాదు
నీ వేలి స్పర్య్శ అందని
దూరాన్ని
కాకపోతే----
--షో కేసులో  బొమ్మను




ఆయుత కవితా యజ్ఞం
 స.  క. 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య.   61
11-1-2016
శీర్సిక.      నవ్వు
కవిత
కనులు విప్పి
కొత్తగా లోకాన్ని చూస్తున్నా
కమ్మని కవితగా
కలగంటున్నా
తొలిపారి  మందస్మితం
చేశా యి నా పెదవులు
పెదవుల్లోని నవ్వుల
కాంతి
ఒళ్ళంతా  పాకి
విరిసిన యౌవనం  వింతగా
నవ్వింది
రోజులు గడిచాయ్
భావాలు పెరిగాయ్
నమ్మకాలు  పోయాయ్
తొలి ఉషస్సు
ఒళ్ళు విరుచుకున్నట్లున్న
నవ్వు---ఆనాడు
వెలుతురంతా భయంతో
చీకటిలో ముడుచుకున్నట్లున్న
నవ్వు----ఈనాడు
ఆ నవ్వుల తేడాలో
నా ఉనికిని మరచి
పొమ్మంటోంది--
ఆ ఘర్స్‌ణలో-
యుద్ధంలో
-బేలగా చూస్తోంది
నిర్ణయించలేని ----మనసు
స్మితం. మందస్మితం
చేసిుది
మనిషి నవ్వుల్లో ఎన్ని
తేడాలు------!
మనశ్శరీరాలకున్నంత తేడా----


ఆయుత కవితా యజ్ఞం
స. క. 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య.  60ృ
11-1-2016
శీర్షిక.    నేను

నీ చిట్టి వేళ్ళతో నన్నెన్ని సార్లు తాకావో-...
నీ చిన్ని చేతులతో  నన్నెన్ని సార్లు తిప్పి తిప్పి చూశావో
నల్లని నా మేను తడి చేస్తూ
ఇంకా ఇంకా తడి చేస్తూ
అర చేత్తో  నన్ను తుడుస్తూ
నిగనిగలాడేలా చేస్తూ
నన్నెంత శుభ్రంగా
ఉంచాలనుకున్నావో
కంటకాన్ని చేతబట్టి
 నామీద  కను విందుగా
ఎన్ని ఆకృతులుచిత్రించావో
నిత్యం-మధ్యాహ్నం
ఎక్కాలతో-పద్ధాలతో
నన్నెంతగా సింగారించావో
బొందులూడిన దాన్నైనా
నన్నెంతగా ప్రేమగా చూశావో
నే పగలకుండా
ఎంతగా. జాగ్రత్రపడ్డావో
రోజులు మారాయ్
నన్నవతల. పారేశావ్
రెపరెపలాడే
కాగితాల్ని కౌగలించుకున్నావ్
అనుదినం
నీ ఊసులు-ఆశలు
వానితోనే
కాలం చెల్లిందని
నా మనసెంతగా నలిగిందో
ఇప్పుడు నేను
సామాన్ల గదిలో-  ఓమారుమూల
బూజుపట్టి-చిట్లిపోయి
నీ జ్ఞాపకాల్ని మోస్తూ-
ఇప్పుడెందుకో
నా జ్ఞాపకం నిను
కదిలించింది
నా బూజు దులిపావ్
శుభ్రంగా తుడిచావ్
అక్షర. మాలలు. నాకేస్తావనుకున్నా-
గోడకు తగిలింది శిలువవేశావ్
నేను
నీకందానన్న సంతోషం
నీలోలేదు
యురేఖా అన్న ఆనందం తప్ప
నా ఆనందం-ఆశ
హుష్ కాకై పోయాయ్
నేనిప్పుఢు
ప్రతి వాడికి వింతగా అన్పించే. వస్తువును
నీ చేతి స్పర్శే కాదు
నీ వేలి స్పర్య్శ అందని
దూరాన్ని
కాకపోతే----
--షో కేసులో  బొమ్మను





ఆయుత కవితా యజ్ఞం
స. క. 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య.  62
11-1-2016
శీర్షిక.     కళ్ళ
కవిత
కళ్ళ   కలల లోగిళ్ళే కాదు
విలయాల వాకిళ్ళు కూడా
కళ్ళ కను రెప్పల్తో స్నేహిస్తాయి-
ఎంతగా. ఓదారుస్తాయి
మనిషికి- మనసుకు లేని
ఆర్ద్రత కళ్ళకెక్కడిది--!
రెక్కల్లో పిల్లల్ని. పొదుముకునే కోడిలా
ఎన్ని జ్ఞాపకాల్ని
కనురెప్పల క్రింద దాచుకుంటాయి
దెబ్బ తగిలినా
మనసు నలిగినా
శరీరం నిస్సత్తువైనా
నిర్లక్ష్యం చేయబడినా
ఒంటరితనమూపేసినా
ఆశలు. నిరాశలైనా
నిర్లిప్తంగా నిలిచినా
కారుస్తాయి కన్నీళ్ళు. కళ్ళు
అహంకారాన విర్రవీగే. కళ్ళు
గాజు గోళాలై
జారి పోయిన కా లాన్ని-
ప్రేమని
మర్చిపోని.   మరువలేని
అనుభూతుల్ని
మననం చేసుకుంటాయి
కళ్ళు
నీవేంటో చెబుతాయి
నీఆలోచనల్ని. తెలుపుతాయి
తెలి వెన్నెల్ని తనలో దాచి
ప్రేమను వర్షిస్తాయి
తమ మత్తులో లోకాన్ని
ముంచేస్తాయి
ఆత్మీయంగా అల్లుకుంటాయి
ఆవేశమై పిడుగులు
కురిపిస్తాయి
జ్ఞాన వాటికలౌతాయి
ఎందర్నో ఆకర్ష్షిస్తాయి
ఎన్నటి చేతో
ఆకర్షింపబడతాయి
కనురెప్పల్ని తళతళలాడిస్తూ
ఇంద్రధనుస్సుల్ని
సృష్టిస్తాయి
భావ పరంపరలౌతాయి
నిన్ను నన్ను కలుపుతాయి
అందాన్నారాధిస్తాయి
అగ్నిని వర్షిస్తాయి
ఆక్స్‌ేపిస్తాయి
ఆశించంది అందకున్న
రగులుతాయి
ఇష్టమైన క్ల్షణాల్ని నెమరువేస్తాయి
గాజు గోళాలైన కళ్ళకి
తను చేసిన గాయాలు
తను పొందినగాయాలు
ప్రేక్షణ మాలికలౌతాయి







ఆయుత. కవితా యజ్ఞం
స క.  836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య.  63
11-1-2016
శీర్షిక.  నిరంతరంగా
కవిత
ఎంత మంది నడవలేదు ఈ. దారిని----
మెలమెల్లగా----
అడుగులోఅడుగేస్తూ----
కొందరు
ఉరుకుల్తో  పరుగుల్తో
కొందరు
నేలతో. గాలితో కబుర్లతో
కొందకు
కాలక్షేపానికి కొందకు
పైట రెపరెపలకి. రంగులకి
కొందకు
బిచ్చగాడి పాత్రను లాక్కునేందుకు కొందకు
పూల కోసం కొందకు
అయ్య తాగుడికి కొందకు
పని వెతుక్కుంటూ కొందకు
పని లేక  కొందరు
దారి తెలియక కొందరు
ఏ దారి లేక కొందరు
పాడిన పాటే
మళ్ళీ మళ్ళీ పాడినట్టు
ఎంత మందినడవలేదు
 ఈ దారిని-
ఉత్తరాలిచ్చే.
తపాలా బంట్రోతు
ఉత్త మాటలు చెప్పే. బండోడు
కూరల రంగడు
చాకలి సుబ్బడు
షావుకారు రాజయ్య
కూలివాడు అప్పయ్య
అపుడే బడికెళ్ళే.
పిల్ల వాడు
భుజాన నాగల్నేసుకు వెళ్ళే
సాంబడు
ఎవరూలేని. బిచ్చగాడు
ఎంత మంది నడవలేదు ఈ. దార్ని----!
బండి చక్రంలాకాలం కదలుతుంటే-
తిరుగుతుంటే-
ఈ దారి ఎన్నిటిని చూళ్ళేదు---!
రచ్చబండ చర్చలు
రాజకీయాలు
పోకిరీ రాయుళ్ళ పోజులు
జాజులు
పసి పాదాలు
నిశి గీతాలు
మిణుగురులు
నేల-నింగి కాని కప్పలు
ఎగిరే పిట్టలు
ఆడే మబ్బులు
పూలను కవ్వించే పిల్లగాలులు
అయినా-----
ఈ దారి. అలసి పోలేదు
ఆగిపోలేదు
అడుగడుక్కి
ఓ కొత్త వాసనను. అందిస్తూ
ఓ కొత్త పాటను విన్పిస్తూ
నిరంతరంగా------


ఆయుత కవితా యజ్ఞం
స. క836
రాజావాసిరెడ్రి మల్లీశ్వరి
కవిత సంఖ్య. 64
11-1-2016
శీర్షిక. జీవితం
కవిత
జీవితం-
ఓ గానుగెద్దా-----!
ఆగకుండా తిరుగుతూ----
ఓ ఎడారా-----
మబ్బు. మడి-తడి
లేకుండా---
ఓ పూలతోటా----
సుఖాలు వసంతమై నిలుస్తూ---
ఎంత నూనె తీసినా--
ఇంకా---ఇంకా---
అలవాటైనా---
అలసట అలలైనా
మృగతృష్ణల మెరుపుల్లో
దొరకని చెలమలా
వెక్కిళ్ళ మధ్య--
రాలు పూల మధ్య-
చీకటి చారల మధ్య-
జీవితం                                       నీ స్మృతి-----
ఓ మొగలి గుబురై
సంపంగి కుదురై
పాము పడగై

ఆయుత కవితా యజ్ఞం
స. క. 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య. 65
11-1-2016
శీర్షిక.    నీరాకఏరువకైనా----
కవిత
బాల్యం పొలిమేరలు దాటి
యౌవన బరిలో పాదం మోపితే-----
ఆరాటం-
ఆవేశం-
ఆవేదన
ఐతే------
ఆనందపు అర్ణవమేది?
పరుగులు
డబ్బు వెంట
బ్రతుకు వెంట
బాధ్యతల వెంట
కాని విలువేది---
మనసుల కలిగిన మమతలకు
బాంధవ్యాలకు----?
నక్షత్తాలను నింపుకున్న
అ నింగిదెంతఉత్సాహం
వ్యథాభరిత జీవితాలదెంత ఏకాకితనం---!
నీ వాక్కు వేదాల పలికైనా
నీరాకఏరువకైనా నీ చిట్టి వేళ్ళతో నన్నెన్ని సార్లు తాకావో-
నీ చిన్ని చేతులతో  నన్నెన్ని సార్లు తిప్పి తిప్పి చూశాను-
నల్లని నా మేను తడి చేస్తూ-
ఇంకా ఇంకా తడి చేస్తూ
అర చేత్తో  నన్ను తుడుస్తూ-
నిగనిగలాడేలా. చేస్తూ
నన్నెంత శుభ్రంగా
ఉంచాలనుకున్నావో
కంటకాన్ని చేతబట్టి
 నామీద                                   కను విందుగా
ఎన్ని ఆకృతులుచిత్రించావో
నిత్యం-మధ్యాహ్నం
ఎక్కాలతో-పద్ధాలతో
నన్నెంతగా సింగారించావో
బొందులూడిన దాన్నైనా
నన్నెంతగా ప్రేమగా చూశావో
నే పగలకుండా
ఎంతగా. జాగ్రత్రపడ్డావో
రోజులు మారాయ్
నన్నవతల. పారేశావ్
రెపరెపలాడే
కాగితాల్ని కౌగలించుకున్నావ్
అనుదినం
నీ ఊసులు-ఆశలు
వానితోనే
కాలం చెల్లిందని
నా మనసెంతగా నలిగిందో
ఇప్పుడు నేను-
సామాన్ల గదిలో-  ఓమారుమూల
బూజుపట్టి-చిట్లిపోయి
నీ జ్ఞాపకాల్ని మోస్తూ-
ఇప్పుడెందుకో
నా జ్ఞాపకం నిను
కదిలించింది
నా బూజు దులిపావ్
శుభ్రంగా తుడిచావ్
అకర. మాలలు. నాకేస్తావనుకున్నా-
గోడకు తగిలింది శిలువవేశావ్
నేను
నీకందానన్న సంతోషం
నీలోలేదు
యురేఖా అన్న ఆనందం తప్ప
నా ఆనందం-ఆశ
హుష్ కాకై పోయాయ్
నేనిప్పుడు-
ప్రతి వాడికి వింతగా అన్పించే. వస్తువును
నీ చేతి స్పర్శే కాదు
నీ వేలి స్పర్య్శ అందని
దూరాన్ని
కాకపోతే----
--షో కేసులో  బొమ్మను




ఆయుత కవితా యజ్ఞం  స. క.  836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య. 65
శీర్షిక. నీ రాక ఏరువాకైనా
కవిత
బాల్యం పొలిమేరలు దాటి
యౌవన బరిలో పాదం మోపితే
ఆరాటం
ఆవేశం
ఆవేదన
పరుగులు
డబ్బు వెంట
బ్రతుకు  వెంట
బాధ్యతల వెంట
కాని విలువేది----?
మనసుల కలిగిన మమతలకు
బాంధవ్యాలకు----?
నక్షత్రాల నింపుకున్న
ఆ నింగి దెంత ఉత్సాహం
వ్యథాభరిత జీవితాలదెంత
ఏకాకితనం
నీ వాక్కు వేదాల పలుకైనా
నీ రాక ఏరువాకైనా
నా కలలకు లేదు మరో జన్మ

ఆయుత కవితా యజ్ఞం
స. క.  836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సుఖం.  66
11-1-2016
శీర్షిక.  కూలిన కలల పొదరిల్లు
కవిత
నిశీథాన నా కళ్ళ చెమరింపులో
ప్రేమ లేని కఠిన శిలవైన నీవు-నీ స్మృతి
నా జీవన ప్రభాతాన
నా దు:ఖిత గమకిత      కంఠ నాదం
మంచు బిందువుల్లా
ప్రతి పువ్వునా.పరచుకుంది
లోకానికి సౌందర్యాన్నిస్తూ-
మిడిసిపడే మధ్యాహ్నపు.
వయసులో
మత్రెక్కించే మనసు సోమరి
ఊహలు
కడపటి సుధ్యలో
కాలం దరి చేరనంటోంది
అలసిన నా కనురెప్పల క్రింద
శిథిల స్వప్నాల పొదరిళ్ళు-
ఆశల పుప్పొడి రాలిన పూల గుత్తులు
సంవత్సరాల సముద్రాల మీద
నా జ్వలిత చైతన్య నావలు
మరలి రాని మజిలీలు చేస్తూ-
ఈ చంద్ర కాంతిలో
ఒంటరి ఏరులా నేను అలను ఊపే చిరుగాలిలా ఎక్కడ. నీవు?
ఏదీ ఆ ఆనందం---?
మెరిసే ఇసుక రేణువునీ కాదు
స్వచ్ఛమైన నీటి బిందువుని
కాదు
ఓ గృహం నిర్మించటానికి-
ఓ మనసుకు ఆతిథ్య మివ్వటానికి

ఆయుత కవితా యజ్ఞం
స. క. 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య. 67
12-1-2016
శీర్షిక.  చీకటి వెన్నెల
కవిత
రాని ఉషస్సుకై
ఎన్ని రాత్రులెదురు చూస్తేనేం--
స్పందన-అనుభూతి లేకుండా
సందడిగా పరుగెడుతోంది కాలం
ఆ కాలానికే రస స్పర్య్శ
లేదిపుడు
నా కళ్ళ నీలి నీడల్లో
నీ ప్రేమకు సాక్ష్యాలు
లేవంటే
ఆ నీడల అర్థం---?
?-----భాష్యం చెప్పను--!
కొండల నుండి రాలే మహా ఝరికి. శ్రావ్య సంగీతం
ఎలా వస్తుంది--_?
నీవు నా ముందున్నపుడు
వెన్నెలమ్మను నేనేనని నీకెలా. చెప్పను---!
నా పిలుపందని దూరాన నీవున్నపుడు
ప్రేమ జీవితాన్ని
రస ప్లావితమొనర్పదు
గాయాల కలుపు మొక్కల్ని
పెంచుతుంది
వెన్న్నెల్లో
నా నీలి కురులకు
నీ పెదవులు
ఏ గుసగుసలను
వినిపించాయో--
ఆ గానం నన్ను వీడదు
నా ప్రాణం నిలువనీదు
నన్ను నన్ను గా మననీదు




ఆయుత కవితా యజ్ఞం
స. క.  836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య.   68
12-1-2016
శీర్షిక.   గ్రహం
కవిత
గుండెలో-
కసి రగిలించే హోమాలు
ప్రజ్వరిల్లిన నాడు
రావు  అశ్రుజల ధారలు
మెదడులోని మరలన్నీ
మరల మరల గతులు మార్చి
కుళ్ళిన మనోదర్పణంలో
కంటికిుపుగ చూసుకునే
మనుష్యుల.  మనసుల
 చోద్యాల వాసమిది
మండే అణువణువు
మారాలి ఓఅగ్ని కణం
కళ్ళ గోళాలలో
కసి రేగిన కౌగిళ్ళలో
బిగిస్తిన  పిడికిళ్ళలో
భయం దాక్కుంది నిజం
దాగదని
బరువెక్కిన గుండెలలో
బాధలెగిసిన బ్రతుకులలో
బలిసిన.  పిరికితనం
ఒరిగిపోయింది చావు ఒడిలో
యముని గర్జన  ముందు
మంచితనం వంచితయైంది
దేవుని  గ్రహం మీద
పోయింది మనుజుని
అనుగ్రహం
మిగిలింది ఒక గ్రహం
అదే స్వార్థ గ్రహం
కులికింది ఒకే పదం
అదే -అదే ధనం
మురిసింది. ఒకే పదవి
అదే -అతివ పెదవి

అయితే కవితా యజ్ఞం
స క. 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య.   69
శీర్షిక.    వెన్నె
కవిత
పున్నమి వెన్నెల-
ఎంత. -ఎంత  అందం!
ఎంత భువనైక మోహనం!
అదే పనిగ చూస్తే--
ఏదో------భయం
భగ్నమౌతుందేమో
 ఆ. నిస్సవ్వడి----అందం-----
ఆకునాకు.  రాసుకున్న్న
చప్పుడు
ఎండుటాకులు రాలిన చప్పుడుప
పసిపాప నిదురలో
కెవ్వుమన్న క్వాణం
అవ్వ చలితో వణకుతున్న
దొని
ఆకలి పేగుల కేకల. ఘోషం.   నెత్తుట. తడిసిన. ప్రాణుల
రణితం
ఎంతగా.ఎంతటి
నిస్సద్దునాశించాను--!
అంతగా-------అంతటా
శబ్దమే--
ఆగలేనిది--
ఆపలేనిది---
ఆగిపోనిది---
వెన్నెల్లో పొగడపూల జల్లు
ఎంత ఆనందం---హాయి
ఆపూలనేరటం-
మాల లల్లటం
అప్పుడే----
గొంతునుండి. పొంగుకొస్తుందో. ఎంకి పాట
గుర్తొంస్తుంది---కంకి వేట
పలుకరిస్తుంది
 పూరి. గుడిసె  గుడ్డి దీపం
తరుముకొస్తుంది
ఇప్ప పూల వాసన
వెంటాడుతుంది
నెత్తుట ధార. వెంటాడుతుంది
ఆరని. ఆగని.
ఆశల సందడి
తుది లేని వెదుకులాటలో
ఎన్ని. ఎదురు చూపులో
ఎన్ని ఆశల.దహనాలో
ఎందరి  ఆశయాలో
విహంగాలై-----
తెలుపుదనంతో
వెలుగుదనంతో
రెక్కలు పరచుకున్న---
     
             ఈ.  వెన్నెల


ఆయుత కవితా యజ్ఞం
స.  క.   836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సుఖం.  70
12-1-2016
శీర్షిక.    బడి
కవిత
పేరు లేని బడి
పేరున్న బడి
పేరొందుతున్న బడి
పేరు కోసం  వెంపరలాడేబడి.
ఒద్దనుకున్న బడి
ఒదులుకన్న బడి
క్రమశిక్షణ లేని బడి. క్రమశిక్షణ రాని బడి
దండనలొద్దనే బడి
దండించే.  బడి
కాఠిన్యాల. . బడి
సౌమ్యాల.  బడి
సౌందర్యాల బడి
ప్రతి మనిషి నడిచే బడి
నాక్కావాలో పడకకుర్చీ -
అవసరంలేదని ఎవరికో ఇచ్చేశా-
అవసరం లేనివన్నీ
ఓ మూలకు విసిరేట్టైతే---
నేను మా ఆయనను విసిరేస్తా
మా అత్త మామల్ని
విసిరేస్తా
ప్రశ్నల మీద ప్రశ్న లడుగుతూ
నా స్వేచ్ఛకు అడ్డొచ్చే పిల్లల్ని
వదిలేస్తా
వివరం లేని పిచ్చి బళ్ళు
విశ్వాసం--ప్రేమలేని బళ్ళు
కంచెలోనే. కదా
అందం
అపురూపం
మందితోనే. కదాజీవితం
పెదాలపై ఉబికే ఫెమినిజం
పెనుగులాటలో
మరో చేయికై ఆరాటం
స్వరాలన్నీ కలసిపోయినట్టు
పదాల గారడి
తెలియని కూడికలు
తీసివేతలు
నిజానికి
మన స్థానమెక్కడ?
కన్నీటి. విలువ
కంచి నుండి వస్తే నే
మాట విలువ
మనసు నుండి వస్తే నే


ఆయుత కవితా యజ్ఞుం
స. క. 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత. సంఖ్య. 71
12-1-2016
శీర్సిక.
         విత్తునై మొలకెత్రాలని
కవిత

విత్తునై ----మొలకెత్తాలని
            పుష్పంచాలని
              ఫలించాలని
చెట్టునై---
శాఖోపశాఖలు గా
విస్తరించాలని-
ఎన్ని చేతులు నేలను
అదుముతున్నాయో
ఎన్ని కళ్ళు అగ్ని గోళాలై
జ్వలిస్తున్నాయో
ఎన్ని మనసులు కసిగా చూస్తున్నాయో
శపిస్తున్నాయో
భూగర్భాన్ని నను బంధించాలని
ఊపిరాడక
నే మరణించాలని
స్వార్థ స్వలాభాలు
వాటి కళ్ళు
మైదానం కాదు వాటి మనసులు
ముళ్ళు మొలిచిన బీళ్ళు
నీటి చుక్క రుచి ఎరుగని-
ఎప్పటికి-ఎన్నటికి
పంట పండని మొండి
నేలలు
విత్రునై నే మొలకెత్తక పోతే
గంగనై
నే ప్రవహించక పోతే
బోనమేది----?
పానమేది-----?
వెన్నెల స్వాగత హారతిస్తూ
గాలి  వీవనలౌతూ
వర్షం నన్నభిషేకిస్తూ
నా అవిర్భాన్ని
ఆవిష్కరిస్తాయి
నేనున్న చోటే మైదానమని
నేనే శాలివాహనుణ్ణని
నేనే తెల్ల గుర్రమెక్కి  వచ్చే
కల్కినని
ఎవరు మీకు చెబుతారు--?



ఆయుత కవితా యజ్ఞం
స. క.   836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య.  72
12-1-2016
శీర్షిక.   ఆడది బానిసే
కవిత
వెలుగు రేఖల స్పర్శలు-
పావురాల కువకువలు-
చల్లగాలి పరామర్శలు-
 మళ్ళీ రోజు మొదలైంది
మనసుతో నిమిత్తం లేకుండా
చేతులు అలవాటైన పనుల్ని. చేస్తూ--
పరిసరాల్ని మనసు కళ్ళు
గుర్తించినా-లేకున్నా
అడుగుల్ని వడిగా వేస్తాయి
కాళ్ళ
అయినా----
పిలవటానికి
పిలుపువినటానికి--పిల్లలేరి?
జీవితాన్ని చేతబట్టుకుని
కలల సాకారానికై వెళ్ళారుగా
ఇంకా ఎవరున్నారుకనుక
పిలవటానికి ---
ఆసులో దారంలా
చేసిన పనినే. చేస్తూ--
సంవత్సరాలు గా-----
నాకు గడియారమా
గడియారానికి నేనా పోటి
తేలీదు
కరకు మనసుల్ని
కడుపున తన్నిన బిడ్డల్ని
ఎవరు మర్చిపోని
ఎప్పుడు  ఎదురు చూపే------
పూల పొట్లం తెచ్చే
నాన్న కోసం-
తాగి వచ్చే భర్త కోసం-
బళ్ళోకెళ్నిన.పిల్లల కోసం-
ఉడికే అన్నం కోసం-
వచ్చే పంపు కోసం-
అందరికి అన్నీ చేసి
ఆకలితో ఆఫీసుకెళ్ళే క్షణాలెన్నో---
అందించే డబ్బుతో -ఆప్యాయత-
తాగిన మత్తులో ప్రేమ-
కావాలా. అవి  అని
ఆలోచించే. క్షణాలెన్నో
ఇంకా ఆడది బానిసే
ఓదార్పులో.  అలుసే
మనసులేని.  మర బొమమేకం
లోకం దృష్టిలో
ఎన్ని సంకళ్ళు-
ఎన్ని లక్ష్మణ రేఖలు-


ఆయుత కవితా యజ్ఞం
స. క. 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య. 73
13-1-2016
శీర్షిక.      కాలం
కవిత
కలుస్తూ---విడిపోతూ
దూకుతూ--
ప్రవహిస్తూ--పరవళ్ళవుతూ
నీవో వింత జలపాతం
అడుగడుక్కి పోగేసుకున్న
అనుభూతుల ఆత్మగానం-నీవు
ఈరాత్రి--
నీవు. ఎప్పుడు కొత్తే
ఎలనవ్వుతో
కళ్ళలోకిి-
గుండెలోకి. దూకుతూ----
నీవు -
ఎన్నో జలపాతాల్ని
సృష్టిస్తావు-
కలల అలలపై
నురుగు నవ్వులా పూస్తావు
పట్రుకుందామంటే
ఎంతటి వాయుగుండమౌతావు
ఇప్పుడు -
నీ   నా. మధ్య కాలం
దారితప్పి------
ఎడారులలోకి విసిరేసినట్టు
కాలం ఎప్పుడు  అంతే-
తాను. జారిపోతూ
ఎందర్ని అనామకుల్ని
చేస్తుంది-
ఎందర్ని అందలమెక్రిస్తుంది-
ఈలపాటై ఎందర్ని
ఉత్సహిస్తుంది-
పొలికేకై ఎంతగా
ఉద్యమింపచేస్తుంది
పికిలిపిట్టలా ఎన్ని
అందాల్ని. విదుల్చుతుంది
ఏటి. పాయలా
ఎన్ని ఒంపుల్ని
చూపుతుంది
మోదుగపూలై
ఎంతగా రక్తాన్ని చిమ్ముతుంది
వెన్నెల జల్లై
ఎంత అమృతాన్ని ఒంచుతుంది









-నీ చిట్టి వేళ్ళతో నన్నెన్ని సార్లు తాకావో-
నీ చిన్ని చేతులతో  నన్నెన్ని సార్లు తిప్పి తిప్పి చూశాను-
నల్లని నా మేను తడి చేస్తూ-
ఇంకా ఇంకా తడి చేస్తూ
అర చేత్తో  నన్ను తుడుస్తూ-
నిగనిగలాడేలా. చేస్తూ
నన్నెంత శుభ్రంగా
ఉంచాలనుకున్నావో
కంటకాన్ని చేతబట్టి
 నామీద                                   కను విందుగా
ఎన్ని ఆకృతులుచిత్రించావో
నిత్యం-మధ్యాహ్నం
ఎక్కాలతో-పద్ధాలతో
నన్నెంతగా సింగారించావో
బొందులూడిన దాన్నైనా
నన్నెంతగా ప్రేమగా చూశావో
నే పగలకుండా
ఎంతగా. జాగ్రత్రపడ్డావో
రోజులు మారాయ్
నన్నవతల. పారేశావ్
రెపరెపలాడే
కాగితాల్ని కౌగలించుకున్నావ్
అనుదినం
నీ ఊసులు-ఆశలు
వానితోనే
కాలం చెల్లిందని
నా మనసెంతగా నలిగిందో
ఇప్పుడు నేను-
సామాన్ల గదిలో-  ఓమారుమూల
బూజుపట్టి-చిట్లిపోయి
నీ జ్ఞాపకాల్ని మోస్తూ-
ఇప్పుడెందుకో
నా జ్ఞాపకం నిను
కదిలించింది
నా బూజు దులిపావ్
శుభ్రంగా తుడిచావ్
అకర. మాలలు. నాకేస్తావనుకున్నా-
గోడకు తగిలింది శిలువవేశావ్
నేను
నీకందానన్న సంతోషం
నీలోలేదు
యురేఖా అన్న ఆనందం తప్ప
నా ఆనందం-ఆశ
హుష్ కాకై పోయాయ్
నేనిప్పుడు-
ప్రతి వాడికి వింతగా అన్పించే. వస్తువును
నీ చేతి స్పర్శే కాదు
నీ వేలి స్పర్య్శ అందని
దూరాన్ని
కాకపోతే----
--షో కేసులో  బొమ్మను
-


           
ఆయుత కవితా యజ్ఞ
స.    క.   836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత  సంఖ్య.  74
13-1-2016
శీర్షిక.   ప్రణయాలే మరి మరి
            ముద్దు
కవిత
చలి---------చలి---చలిలో
కాలజ్ఢాని. మేల్కొలుపుల్లో

వేకువలో
వాకిలిలో
చక్కని చుక్కలు
చుక్కల చెక్కిన వల్లుల్లో
రంగవల్లుల్లో
శ్రీకరమౌ--శుభప్రదమౌ
గోమయపు
ముద్దల సుద్దుల
విచ్ఛిన పచ్చని
చిత్ర పూలందాలలో
అగరు ధూప సుగంధాలలో
రమణులుుచు పసుపుకుంకాలలో
చేమంతి పూవంటి
చెల్లెల్నీయవే
తామరపూవంటి
తమ్ముణ్ణీయవే---అంటూ చేయు కరతాళ ధ్వనులలో
శ్రుతి శుభగమౌ
హరిదాసు కీర్తనలలో
సద్య సవుని
నులి వెచ్చని సూనలలో
ఆశల కోమల కోరకాలు
విచ్చుకున్న  కాంతి
             
   ఈ సంక్రాంతి
సిుగారమైన గంగెద్దాటలలో
సన్నాయి పాటలలో
మొక్కిన మొక్కులుతీరునని తెలిపే బుడబుక్కలవాని
దీవెనలలో
పిట్టలదొర  తమాషా మాటలలో
ఈ దోవోత్సవం మా జీవికయను కళాకారులలో
సంబరమంతా తమదనే
పిల్లల కేరింతలలో
బంతి పూ తోరాలలో
ఇంతుల చిద్విలాసాలలో
విరిసిన కాంతి
         ఈ సంక్రాంతి
రోకటి దంపుల  వరి పిండితో
రోజు రోజు అరిసెలు వండగ
అందరగూడి
కొత్త అల్లుళ్ళు
పొంగే ప్రేముడి గురుతులలో
పొంగుచు  తిందురు పొంగళ్ళు
పూల పుప్పొళ్ళ పుష్యరాగాలు
మణి మాణిక్యాల మందారాల
తెచ్చె  నన కాంతి-
నవ కాంతి
            ఈ. సంక్రాంతి
పంతాలు లేక మనుమా
అంటూ.      
ప్రణయాలే మరి మరి ముద్దంటూ
సంక్రాంతి నించు మించు
అుచనాలకందని
ఆనంద డోలికలు
ప్రతిఇంటా


ఆయుత కల్తీ యజ్ఞం
స. క. 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య.   75
13-1-2016
శీర్షిక.  నీరవుతున్నా
కవిత
చిన్న తనాన.    
బడికెళ్ళేందుకు
వాగులు వంకలు దాటుతూ
శ్రమ  నైనా
కాలయాపనైనా.    బడికెళ్ళ్తూ
సంచెడు పుస్తకాలు మోసి
నడుము పోగొట్టుకున్నా
బడిలో రాసి రాసి
వేళ్ళరగదీసుకున్నా
రంగు రాళ్ళేరుతూ
వేళ్ళ పోగొట్టుకున్నాను
యంత్రమయ జీవికతో. కంప్యూటరనే చిత్ర విచిత్ర పెట్టెతో
కళ్ళు పోగొట్టుకున్నా
కొండల్ని పగులగొడుతూ
-----భుక్తి కోసం
కండల్ని  పోగొట్టుకున్నా
బండరాళ్ళనెత్తుతూ
మెడ పోగొట్టుకున్నా
వేసవి ఎండల. రోడ్డు వేస్తూ
ఊపిరి తిత్తులు పోగొట్టుకున్నా
రోగమొచ్చిందని ఆసుపత్రికి పోయి
మూత్రపిండాన్ని
పోగొట్టుకున్నా
నడుస్తున్న సమాజాన
అన్నిటా. దోచుకుంటున్న
సమాజాన
మానసిక సత్తువను పోగొట్టుకున్నా
కాసింత  గంజి తాగి
కాళ్ళ  చాపుకుంటే
అదేదో--కాలుష్యమంట
జవ జీవాల్ని
పోగొట్టుకున్నా
ఇంటిల్లి పాదికి
గుప్పెళ్ళు మెతుకులు తేలేక
చేతకాని వాడినై
నమ్మకాన్ని  పోగొట్టుకున్నా
మిగిలిన గుండెనెక్కడ
దాచుకోను----------?
గుండె బరువునెలా
దించుకోను--
సగటు మనిషి బ్రతికేదెలా
చాకిరి. వినా
చావు వినా
నాగరీకం నాకేం మిగిల్చింది
నిస్పృహనౌతున్నా
నీరవుతున్నా





ఆయుత కవితా యజ్ఞం
స క.  836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య.   76
13-1-2016
శీర్షిక.  సుందర హారతులు
కవిత
పొద్దు మలపయి
పొద్దు పొడసూపింది
పుడమికేమో అందం
కడలికేమో.   ఆనందం
రెక్కల తట తటలాడించె పక్షి
కనురెప్పలు
 రెప రెపలాడించె  మనిషి
రేకు రెప్పలు విచ్చి చూచె
నలరులు
సువాసనలెగయజేసె
తోయజ మొగలు.  
కొలను నీట విరిసె శతపత్రములు.  
  గుడి గోపురా నచేసె పావురాలు. కువకువలు
బుజ బుజ పూయు మొగ్గలు
గజగజ వణకు చలికి లేత
బుగ్గలు
నిదుర కళ్ళను నేలనూడిచి
కుప్పెల జడలూపుకొనుచు
ఒప్పుల కుప్పలు వేసె
రంగవల్లులు
పంట కాల్వ మీద వాలి
పిట్టలానంద భ్రమణాల సోలె
పశువుల మెడలో గంటలు మెరసె
పూల పొంత
తేటులు మురిసె
బావి వీట. కడవల మోత
కావడి బిందెల నీటి మోత
నాకిటి ముందట హరిదాసు పాట
ఆనందమాయె
పసి దూడల  గెంతుతాట
తుర్రుమనే  తూనీగ వెంట పిల్లలు
సర్రున  మీల కోసం
జాలరి విసిరే వలలు
పశువుల వెంట సాగు
పాలేళ్ళు
అటుకుల కోసం మోగు రోళ్ళు
గుడి గంటల రావాలతో
భక్తులు . పలుపూలు. పళ్ళతో
జంట కవులై
పసుపు కుంకుమలు
పొగిడె ప్రకృతి శోభలు
ప్రతి పల్లెకందాలివి
ప్రతి పల్లెకు ప్రభాతాలివి
ప్రతి పల్లెకు
సుందర. హారతులివి








ఆయుత కవితా యజ్ఞం
స. క.  836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవితా. సంఖ్య    77
శీర్సిక.   మెదడులోనిా
             మనసులోనా
కవిత
మెదడులోనా--
మనసులోనా---
ఎక్కడ మొదలవుతుందో
తెలియదు
అక్కున చేర్చుకోవాల్సిన అమ్మ ఒడి నుండి తోసేసిన బాధ
అనుకోకుండా.చేరువైన
మనసు
అకస్మాత్తుగా దూరమైన బాధ
ఆప్యాయతాదరణలందని
బాధ
పక్షులు మరచాయని
చెట్టు పడే బాధ
నీరెండిన నది పడే బాధ
పంట సిరిలేని చేను పడే బాధ
వెన్నుపూసలా
స్థిరంగా. ఉుటుంది
రకరకాలుగా
లయలు     వయసుగా
అలలుగా---
అలా పెరుగుతూ--
అనుభవాలతో తడిసి. తడిసి----
ఎక్కడ మొదలవుతుందో
తెలియదు
నోటికి అందిన స్తనం నుండి. స్తన్యం అందని బాధ
భూమి బద్దలై.
హాహాకారాల్ని. తనలో
దాతుకున్నట్టు
హృదయం బరువెక్కిన
బాధ
పరిమళ స్పర్శ--
సుఖం లేని బాధ
పడవలపై వెళ్ళి
ఎగసిపడే కెరటాల
మాయమైన వారి కై.బాధ
చెట్టంట---
పుట్టంట.   కలసిపోయి
అస్తిత్వానికై
అసువులర్పంచే వారికై
బాధ
తెగని నెమరువేతే-----
మెదడులోనా---
మనసులోనా---
ఎక్కడ మొదలవుతుందో
తెలియదు ----బాధ






ఆయుత కవితా యజ్ఞుం
 సక 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య. 78
14-1-2016
శీర్షిక.  స్థితి
కవిత
మనసులో.  ఓ మూల--
లోలోపల.  సందేహం
ఈ ఆనుదం ఎన్నాళ్ళని
ఇది లా.   ఉండ పోతే
ఎంత బావుణ్ణనే.   ఆరాటం
కాలం కళ్ళ ముందే.
జారిపోతుంటే
దేన్ని
సంపూర్ణంగా
అచ్చంగా. ఖచ్చితంగా
నమ్మలేని. స్థితి
అనుభవించలేని.   స్థితి
నేను నీ సొంతం-----ఈ
మాటల్ని.  నమ్మేదెలా----?
నమ్మినట్టు నటిుచేదెలా---?
ఎవరిని     దేన్ని
పరిపూర్ణంగా. నమ్మలేని స్థితి
నీ కోసం. ఎంతో
శ్రమించామనే. తలిదండ్రులు-
నీ. కోసం ఎంతో. చేశామనే
స్నేహాలు-
శుష్కహాసాలు-
ముఖాలనిండా
మోడరన్. పెయింటింగ్
ఆకృతి. తెలియదు-
అర్థమూ. కాదు
ఒక్క. క్షణం -
నాకై నేనే నిర్మించుకున్న
నిశ్శబ్దం--
ఎంత బాగుంటుంది---!
అక్కడ
ఆంక్షలు-
ఆదేశాలు--
స్వార్థాలు.   లేవు
ఆవేశాలు-
ఆవేదనలు. లేవు
ఆనందం  అందమై
శాంతి రూపం దాల్చి
నీ. కోసం. -
నేనంటుమది
కన్నీరు తుడుస్తుంది
కాఠిన్యం మరపిస్తుంది
తోడేళ్ళ కళ్ళ ఆకళ్ళ నుండి
కాస్తుంది
ప్రశాంతతనిస్తుంది









ఆయుత కవితా యజ్ఞు
స. క.  836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య79
14-1-2016
శీర్షిక.   ప్రణమిల్లనివ్వు
కవిత
చిన్ని దివ్వెనై. వెలుగనివ్వు
వేల దివ్వెల్ని. వెలిగించటానికి
వాన చనుకునై రావనివ్వు
వృక్షమై -జీవమై-పరోపకారమై.  నిలవటానికి
చిన్న పాటనై.   వినదంచనివ్వు
జగతిని మేల్కొల్పటానికి
పిల్ల తెమ్మెరనై మసలనివ్వు
పది మంది సేద దీరటానికి
చిన్న పూవునై  పూయనివ్వు
స్నేహ పరిమళమై
వ్యాపిుచటానికి
నా ఈ చేతుల. ప్రణమిల్లనివ్వు
సాయమింత చేయు
శక్తి పొందటానికి

ఆయుత కవితా యజ్ఞం
 స. క.  936
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్
య14-1-2016
శీర్షిక.                    అంతటా.నేనవ్వాలని
కవిత
నేనెప్పటినుంచో---
అనుకుంటున్నా-
అలల్ని. సింగారించాలని-
అస్తవ్యస్తంగా ఉన్న తారల్ని
అందంగా అమర్చాలని-
చేతి వేళ్ళన్నీ ఒకేలా
ఉంటే. చూడాలని-
కాగితప్పూలకి
సువాసననద్దాలని-
తీరికేది-------!
చెవి ప్రక్కన గుయ్ మంటూ
ఒక దోమ
ముఖం చుట్టూ తిరిగే
ఓ గబ్బిలం
నెత్తి మీద వాలాలని. చూసే
ఓ గ్రద్ద
ఇంటి ముందు అరుస్తూ
ఓ కుక్క
దారి వెంట నడుస్తుంటే
జవాబివ్వలేని
ఎన్నో.  ప్రశ్నల ముఖాలు
వీటినే
చూడనా--
విననా---
కాలమంత. వీటికే
ఖర్చవుతోంటే
ఎన్నని భరించను---?
ఏరు తోసుకొస్తోంటే-----
ఎలా ఆపగలను----?
ఓ గుడ్లగూబ పళ్ళికిలిస్తుంటే-
ఓ గాడిద సకిలిస్తుంటే
పూలు పూచే చెట్టునెలా
చూడను----!
పాడే పిట్టనెలా వినను-----!
ఏరు తోసుకొస్తుంటే
చిందే నెత్తుటి. చుక్కల్ని
లెక్కించనా
సవ్వడి చేయక రాలే
పూలను లెక్కించనా
ఆగక సాగే పాదాల్ని
లెక్కిుచనా
చెరిగిపోని చిరు నగవుల్ని
లెక్కిుచనా
మాటల రాయుళ్ళని లెక్కించనా-
నాణాలని. వెదజల్లే వారిని
చూడనా
ఏరు తోసుకొస్తోంటే
నేనెప్పటినుంచో
అనుకుంటున్నా---
ఆగి మధ్యాంతరాలలోనే కాదు----
అంతటా. నేనవ్వాలని

ఆయుత కవితా యజ్ఞం
స క 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య.   81
శీర్షిక.  చెప్పు
కవిత
నువ్వు. నామవాచకానివా -
క్రియవా-
ఏదైతేనేం----
మాకుంది. నీ అవసరం
తోలైనా--- రబ్బరైనా---
చెక్కైనా--- ప్లాస్టికైనా
దేవితో   చేయబడినా
మాకుంది. నీ అవసరం
కిర్రుకిర్రుమన్నా
తపతపమన్నా
పల్చనైనా
మందమైనా
మాకుంది నీ అవసరం
జలతారుతో---రాళ్ళతో
ఊలుతో---తాళ్ళతో
ఎంత సింగారించినా
లేకున్నా
మాకుంది నీ అవసరం
ఇంట్లో---తోటలో-----
బడిలో---బాటలో---ఎక్కడైనా---
ఎలాంటి చోటైనా
మాకుంది నీ అవసరం.
ఒకసారి-
మెత్తగా. హాయినిస్తూ
ఒకసారి-
కఠినంగా.  కరుస్తూ
ఒకసారి-
ఒద్ధనిపించేలా బిగుతుగా
ఏ సారి ఎలాఉన్నా
మాకుంది నీ అవసరం
కాలికి-   అలంకరణకి
              అందానికి
            ఆనందానికి
దేనికైనా
మాకుంది నీ అవసరం
            ఆడటానికి
            అదిలించటానికి
              బెదిరించటానికి
మాకుంది నీ అవసరం
పువ్వుల్ని  నులమటానికి
నవ్వుల్ని. చిదమటానికి
తేలును చంపటానికి
తేలులాంటి మనిషికి
బుద్ధి  చెప్పటానికి
ఎలాంటి వాడికైనా
ఉంది నీ అవసరం
అరిగిపోయిన
ఆదుకుంటావు
విరిగిపోయినా
ఊరుకుంటావు
చిరిగిపోయినా
చింతపడవు
ఊడిపోయినా
ఊతమౌతావు
ఎవరున్నా- లేకున్నా
నువ్వెప్పుడూ నాతోనే
ఇంటి ముందే నీ స్థానం
వాకిలే నీ ఆస్థానం
అయినా కాని-
నువ్వెంత కాచినా
బడిలో కి. వచ్చినా
గుడిలోకి రాలేవు
కాలి కిందే నువ్వు
అయితేనేం--
నీ విలువ-
అవసర.   అవ్యక్తం









ఆయుత కవితా యజ్ఞం
స క 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య. 82
15-1-2016
శీర్షిక.    పుట్టక ముందే పాడటం నేర్చపకున్నా
కవిత
పుట్టక ముందే పాడటం నేర్చుకున్నా---
నను.  నేనే మీ కోసం పాటగా మార్చుకున్నా
శాంతి రెకక్షల్ని ఎగరేస్తూ---
వెలుగు చుక్కల్ని లెక్కిస్తూ-
మీ కోసం మరణం లేని దారుల్ని వెతుకుతూ-
అడవిలో ఎన్ని చెట్లు. -
లేవు-
వాటికి ఆశలు లేవూ-
పూలు పూయాలని
పక్షుల్ని. పిల్లవాలని
విందుల్ని చేయాలని
ఆధారమవ్వాలని
అయినా----
అవి కదలవు
కార్చిచ్చు కాటేసినా
అడవి. తమదే అంటాయి
అవి కదలవు
కదలిపోవు
కాలికి గజ్జె కట్టి
నేను పాట నైనానంటే----
వెన్నెల. రేఖల్ని
వేకువ అందాల్ని
జాజుల జాతరల్ని
పారే నదుల్ని
పడి లేచే కెరటాల్ని
పాడే పక్షుల్ని
సుడి గుండాల్ని
లావా ప్రవాహాల్ని
రగిలే అరణ్యాల్ని
ఆంతర్యాల్ని
ఎన్ని వినిపించను-----/!
ఎన్నెన్ని వినిపించను-----!
పుట్టక ముందే పాడటం నేర్చుకున్నా---


ఆయుత కవితా యజ్ఞం
స. క. 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య.   83
15-1-2016
శీర్షిక.  అడుగు
కవిత
నువ్వు-
అడుగులేస్తూ----
అలసిపోతూ---
నడవ  లే క నాకై చేతులు చాస్తే
నీ అడుగడుక్కి
ఎంత. ఆనందించాను---!
ఎంత సంబర పడ్డాను--!
తప్పటడుగుల్తో----
నీవు.  పడిపోతే--
జీవితంలో నీవు తప్పటడుగులు
వేయరాదని
అడుగు
నీ ప్రతి అడుగు
ముందుకు ముందుకు
వేయాలని
రవిచంద్రుల. గతులు
నీ గతులు  కావాలని
మోయ లేని  అడుగునైనా
నాకందాకా. నడవాలని
దీవించా
అడుగడుగునా----
సుగంధాల నినునాపే
పూవులుంటాయి
వేడి గాలుల్లా.  వేధించే
వ్యక్తులుంటారు
వెన్నెల్లా-తారల్లా
దారి చూపే నేస్తాలుంటారు
పంచామృతాన్ని
తాగిందో తోడేళ్ళ
రూపాలుంటాయి
సత్యమసత్యమయే
వధ్య స్థలాలుుటాయి
నీ పొలికేక.  వెర్రికేకైవ్యర్థమయే
సందర్భాలుంటాయి
నింగి. నెగిరే పక్షుల్నిచూస్తూ
ఆ నింగి యందాల కై చూస్తూ
అడుగులేస్తే.  
పడుతుంది. అగాధాన
నీ అడుగు
నీ తల కిందికి. వంచి
మును ముందుకు  అడుగెయ్
మొలకల్ని చూస్తూ---
ముద్దాడుతూ----
తెలుసుకో
అవి పెరిగి వటవృక్షాలౌతాయి








ఆయుత కవితా యజ్ఞం
  స. క. 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య.   84
15-1-2016
శీర్షిక.  వెలుగు
కవిత
ఒక్కదాన్నే. కూర్చున్నా
ఏమీ తోచక-
నా   అర. చేతుల వంక. చూసుకున్నా
చేతి వేళ్ళన్నీ. మూశా-
గట్టిగా---
గుప్పిట-
దేనికి గుర్తు---?
విప్లవానికా---
శక్తికా---
ఐకమత్యానికా----
గుద్దుతానని. బెదిరించటానికా----
అర చేతుల్లో
కనిపించే.  గీతలన్నీ గుప్పెట్లో---చీకట్లో---
కనబడవు
వెలుగులో
కన్పించే. గీతలన్నీ
మూసిన      గుప్పెట్లో---
చీీట్లో---బందీలు
చీకట్లోంచి. చూస్తుంటాయి--
గుడ్లగూబల్లా
భయపెడతాయి---
భవిష్యత్తు  మేమేనని---
అబద్దమూ అంతే
నిజమే. వెలుగై
వెలుగే. నిజమై
వెలుగులో బలముంది--
నిజముంది----
ధైర్యముంది--
బ్రతుకుంది---
వెలుగునాపటం. --
          ఎవరితరం----!






ఆయత కవితా.  యజ్ఞం
స.  క     836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి  
కవిత సంఖ్య.    85
శీర్షిక. అన్వేషణ
కవిత
అంతరాత్మ
 నీ.  దాకా. పయనించి
నీ మూసిన.  పిడికిట
బందీయైంది
ఊపిరాడక పొగరుగ
ఎదురు తిరుగుతోంది
పెంకిగా నిన్ను
గెలవాలంటోంది
హృదయ స్పందన  ప్రేమ
దాన్నేపీలుస్తుుది ఆత్మ
ఎద తలుపు తెరచి చూడు-
వేల జన్మాల
బంధాలున్నాయని-
ఉప్పొంగే ప్రేమ సంద్రాలున్నాయని-
శతాబ్దాల నుండి
ప్రేమే-మనసు  జీవమని
ఆవిష్కరిస్తావు
నా అసహనపు.  హద్దుల్ని
చెరిపెయ్
నా మనో దర్పణాన
నీ బొమ్మే. కనిపిస్తుంది
నా రాస్తాలో
ప్రేమే బలీయమైందని
తెలుసు
ప్రేమే
మూణ్ణాల ముచ్చట కాదు
పాశవిక ప్రదర్శన శాల కాదు
ఏ రోజు. నీ. స్మృతులు
నను. దర్శిస్తాయి
నీ జీవం
నా  ఊపిరి కానీయని
మనవి చేస్తాయి
నేను-
నీ. కోసం-
గాయాల కోసం
ప్రేమ తత్త్వాన్నన్వేషిస్తూ--
నేను-
నిను చూస్తూ
కలనై--కవితనై  కరగిపోతా
నేను-
లేని-కాని-రాని నాడు
ప్రేమకై-
నాకై. వెతుక్కుంటావు

ఆయుత కవితా యజ్ఞం
స క836
రాజావాసిరెడ్డి.  మల్లీశ్వరి.
16-1-2016
కవిత. సంఖ్య. 86
కవిత
ఈ ప్రపంచాన్నుండి
ఆవల లోకాలకు
వెళ్ళిపోదామనుకున్నా---
నన్నెవరు.    గుర్తించ ని
ఆది.   ---మధ్యాంతాల
నిశాంతాలలో
ఒక వైపు-    
 కక్ష-- నిస్సహాయత
మానవత్వాన్ని. మండిస్తుంటే
మరో వైపు----
ప్రేమ-     ఆరాధనా
అనుబంధాన్నధికం
చేస్తున్నాయి
ఇప్పుడనిపిస్తోంది--
ఉమర్ఖయాం.
సాకీనెందుక్కాలేదని----
కృష్ణుడి రాధనెందుక్కాలేదని---
ప్రపంచాన్నుండి
విడివడిపోయి
ప్రచండంగా వెలిగే
ఆ జ్యోతి శిశిరాన్నెందుకు
కాలేదు---
తెల్ల ఉమ్మెత్తలు-
పత్తి మందారాల-
వెన్నెల కోరకాలు-
నిరాశా పరివృత మదిలో
నిలిచిన. నీహారికలు-
నిన్ను.   వదలి
సర్వం మరచి
నీలి నక్షత్ర పథాలలో
నీడలా వెళ్ళిపోవాలనుకున్నా
నీ పెదాలందించిన
బలాన్నుత. పుపజుకుని
గిలగిలా.  తన్నుకునే
ప్రేమ తత్వం నుండి
బయటపడి
ఆవలేముందో
చవి చూడాలనుకున్నా
నిరీక్షణలో-
గవేషణలో. మున్కలేస్తూ
పైకి లేచిన ప్రతిసారి
ఎదనిండ
శ్వాస  తీసుకొంటూ
కాలానికెదురీది. పోతూనేవున్నా
కావాలనుకున్నది చేరాలని
యత్నస్తూనేవున్నా





ఆయుత కవితా యజ్ఞం
స. క. 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య.  87
16-1-2016
శీర్షిక.  మన భాష
కవిత.      
మల్లెల జల్లు
వెన్నెలజాలు
మరువపు తునక
మనభాష
మధుర సుధ
మంచి కథ
మమతకన్న మిన్న
మనభాష
పలుకు పలుకున
తీపి రాగాలొలికించు
వరవర్ణములన్ని
ఒయారమొలికించు
ఎదల భావాలనందగించు
ఎదటి వారికి
స్నేహ హస్తమునందించు
ముద్దు ముచ్చటల మూటగట్టు
ముత్యాలవ్రాయి కాటపట్టు
మరువలేని మాధుర్యాల
తేనెపట్టు
మనసులల్లుకునే
ఎలమావి చెట్టు
పాదు పాదున
ప్రేమ నీరములొలికించు
ఖండ ఖండాంతరాల
కంచుఢక్కల భేదించు
ఘంటారావమై
నలుదెసల నినదించు
పూ తావిలా
పుడమెల్ల వ్యాపించిన
అమ్మ అమ్మ. యనుచు
ఆప్యాయతను పంచు
ఆదరాభిమానాల
తానె మిన్నంచు
శంఖారావమై
గీతను వినిపించు
ఓంకారావమై
విశ్వమంత. వ్యాపిుచు
కవితామయమై
ఎడదలను స్పందించు
మురళీ గానమై
జగతి సమ్మోహించు
దేశ భాషలందు
తెలుగే లెస్సనిపించు
దేశమాత పెదవిని
ఎల నగవు పూయించు

ఆయత కవితా యజ్ఞుం
స. క.  836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య.   88
శీర్షిక.    చేపట్టు.   జై కొట్ట
కవిత
సప్త. వర్ణాల ఇంద్రచాపం
నింగిని.  వెలుగు
ఏబదియారు వర్ణాల. భాష
నేలను. వెలిగే.   మన.  తెలుగుభాష
తెలుగు. మాగాణిలో
మాకందాలెన్నో
గంటమెత్తి
కంఠమెత్తి
శ్రుతి శుభగమ్ముగా
తేట తెల్గు కవితా గానమొనరించిన
కవి కోకిలలెన్నో
అష్టాదశ వర్ణనలలో
అందమైన మధురోహలెన్నో--
తెలుగు మహానసంలో
వండి వార్చిన. వంటకాలెన్నో--
మానవ మనస్తత్వ మర్దన
జనిత నవనీతం.
మహాభారతం
జీవితం భోగ వైరాగ్యాల సమ్మిళితమన్న
కవికర్ణ రసాయనం
మనిషికి. కర్తవ్య బోధన సారం   గీత
ఆదర్శ జీవన యానానికి
అడుగుజాడ నేర్పిన
రామాయణం
మనిషికేంకావాలో తెలిపిన.  
పోతన. భాగవతం
షడ్రుచుల సమాహారం
బహు రసోపేతం
శతక సాహిత్యం
కవి పదాలెంతో. పదునన్న
చాటుపద్య సాహిత్యం
తాలింపులో. ఘుమఘుమలా
చిటపటలా.
లోక రీతిని తెలిపిన.  
వేమన పద్యం
నోటికి సువాసనను
అందాన్నిచ్చిన
క్రర్పూర.  తాంబూలం
కర్పూర వసంతరాయలు

ఏభాష వండి.  వడ్డించగలదింత
ఆత్మకింపైన బోనం
ఏనాటికొక్క తెలుగు భాష తప్ప
తెలుగన్నది.  అమ్మదనం
తెలుగన్నది. కమ్మదనం
తెలుగన్నది చింతనం
తెలుగన్నది తియ్యదనం
తెలియాలందరు
తెలపాలందరు
ఎగరాలి   దిక్కు దిక్కు.ల తెలుగు పటం
నినదించ్లాలి ఘంటారావమై
తెలుగు పదం
మారు మ్రోగాలి
పాంచజన్యమై
తెలుగు గళం
వినిపించాలి
మురళీ రవళిగ
తెలుగు గళం
చేపట్టు తెలుగు వ్యాప్తికి
జైకొట్టు తెలుగు కీర్తికి




సప్త కవితా యజ్ఞం
స. క836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య.   89
17-1-2016
శీర్షిక.   మనిషే-----
కవిత
నేల ఎన్నిటిని
సిుగారించుకుుటుుదని-----
ఎన్ని సుగంధాలను
పూసుకుంటుుదని---
ఒక సారి.
జొన్నకంకి. అందంతో
ఒకసారి
వరిమొక్కల చందంతో
మరోసారి.  కంది కాంతల.  ఒయ్యారాలతో
మరోసారి
పత్తి తెల్లని. కాంతులతో
మరోసారి.
పెసర.  ఆకుపచ్చదనంతో
మరోసారి
అరటి శీతోపచారాలతో
ఇంకాస్తారి
పొగాకు. పరిమళంతో.  
ఇంకోసారి
పసుపు గుభాళింపు తో
ఇంకోసారి
కుస్తుంభరి పరిమళంతో
వేరొకసారి
చిలకమొక్క పూల మురిపాలతో
వేరొకసారి
రాలిన పారిజాతాలతో
వేరొకసారి
పున్నాగ పూల పులకరింతలతో
వేరొకసారి తరుచ్ఛాయలతో
అందాల గుభాళింపునే. కాదు--
తనలో దాచుకుుటుుది
ఆర్తిని--ఆప్యాయతలనెంతో
ఏమీ రాక-
చేతకాక---
మనిషే---
సౌందర్యాన్నాస్వాదన
రాదు
అసలా. సౌందర్యాన్ని
గుర్తెరగటము.  రాదు
నేల-
ఎన్ని. రుచుల్ని.  వడ్డిస్తుంది---
ఎన్ని--వనరుల్ని
వసతుల్ని.  ఇస్తుంది
తృప్తి లేని మనిషి
తృప్తి.  లేకే
నేలను
ఇంకా. ఇంకా ఛిద్రం చేస్తూ--
ఇంకా ఇంకా బాద్‍స్తూ---
వేదిస్తూ---ికై
శోధిస్తూ---
దాన అన్యుల. వధిస్తూ---
వధింపబడుతూ---
అవివేకంగా----
అనామకంగా--












ఆయుత కవితా యజ్ఞుం
స క 836
రాజావాసిరెడ్డి.  మల్లీశ్వరి
కవిత సంఖ్య.   90
17-1-2016
కవితా శీర్షిక
               నీవక్కడే
ఎంత. గర్వ పడ్డానో---
అంతగా. గాయపడ్డా--
నీ కోసం
పొగిలే  హృది కన్నీరై
కసిని పెంచుకుంటే--
కోరికల జలతార్లతో
సింగారిుచుకున్న
 దేహం ఒలికించిన
పరమళాలు  నిస్సారమై--
నీకై----
చీకటి రాత్రిని వెలిగించముటే--
కలల దివ్వెలు
దివిటీలవ్వాలుటే-
కమల ముందు
వెలిసిన. సౌందర్యమై--నీవు
హిం దోళాలు-
మేఘమల్హారాలైన   కాలం
ఇప్పుడు--
మౌనమై-
నిర్నిద్ర నిశీథి. నింగి--
నేల--
నేను--
కఠినతనే ఇల్లుగా
కౌగిలిగా.
చేసుకున్న.  నీవు--
నాతి చరామి అర్థాన్ని
ప్రేమ రస సిద్ధిని
అందుకోవు
అందలేవు
సన్నిహితత్వాన్ని
నేర్చుకోవు
సుతారంగా
సున్నితంగా
ఎదకు హత్తుకోవు
ప్రేమ రాహిత్యాన
ఉక్కరిబిక్కరౌతూ--
నేను---
శూన్యంలా
అక్షరాల్లేని. పుస్తకంలా
నీ.  నిర్లక్ష్యం-- అహం
నీ కృత్రిమత్వం.
నను.  కదిలించదు
నీ.  ఆర్భాటాలు-- ఆుక్షలు
దాటి
పూవులా--
ఎగిరే. పిట్టలా
స్వేచ్ఛనౌదామంటే
నా మానసికానందాన్ని
బలాన్ని. హరించి
నా ఆశల పొదరిల్లును
చిన్నాభిన్నం చేసి
నన్నబలను చేయాలనుకుుటావు
అపుడే---
గుండె లోతుల్లోంచి
ఓ పొలికేక.
మేలుకో. అంటూ
స్తబ్దత నొదిలిుచుకుని
సమీరురులా సాగిపోతా
వాంఛల. ఆనవాళ్ళను
వెతుకుతూ---
ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ--
నీవక్కడే
ఊరుంది కాదని
మరో పూసజ్జకై.   వెతుకుతూ--------





ఆయుత కవితా యజ్ఞం
స. క.   836
రాజావాసిరెడ్రి మల్లీశ్వరి
కవిత సంఖ్య.  91
శీర్షిక.  దానికేం.  తెలుసు
17-1-2016
కవిత
జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు
ద్రవమై--   మెత్తబడి
ఘనీభవించి---- కఠినమై
దానికేం తెలుసు---!
అడుగడుగునా.
కొత్త పూల వాసన.
స్వాగతిస్తుంచని----
వరదల.  మునిగి
గాలుల. వడలి
ఆక్రందనలు. హడలి
మర్రి ఊడల్లాంటి
దుర్మార్గాలకి బలవ్వాలని
ఈ. నేల
     నీరు
     నింగి
      గాలుల మీద
సర్వ. హక్కుల్ని
కోల్పోవాలని
ప్రవాహమై.  --తీయనై
జీవితాన్ని. కలిపే- నిలిపే
ప్రేమ  ఉప్పు నీరవుతుందని
ఆర్భాటాలు-
ప్రగల్భాల  నడుమ
ఇప్ప పూవై. మిగుల్తుందని
పాదాల్ని. తడిపే. అలలు
పాదాల క్రింద నిలిచే అలలు
పాదాల్ని  నీటిలోకి
లాగేస్తాయని
ఎంతగా తీపిని
తినాలనుకుంటే
అంత గా.  చేదు క్రుమ్మరిస్తుందని
జీవితం వడ్డించిన
విస్తరనుకునేలోపే.  బయటపడతాయి
అన్యాయాలు
ప్రలోభాలు
అధికారాలు
అభిజాత్యాల. చిల్లులు



ఆయుత కవితా యజ్ఞుం
స. క. 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య.  92
17-1-2016
శీర్సిక    ఇంకెన్నాళ్ళు
కవిత
ఇంకెన్నాళ్ళు
అవమానపు క్షణాలు
అనాథ జననాలు
కర్ణుల జన్మాలు
ఇంకెన్నాళ్ళు
కరగని ఆత్మల కరకుదనాలు
నక్షత్రాలు  శకలాలై
అనామకంగా రాలిపోవటాలు
ఇంకెన్నాళ్ళు
కొవ్వొత్తిలా త్యాగమై
నిలవటాలు-- వెలగటాలు
ఆడంబరాలకు.  మేళాలు- తాళాలు
మనసు లేకుండా
మనసుకు తెలియకుండా
శరీరాల్ని. అమ్ముకోటాలు
ఇంకెన్నాళ్ళు
దేవుణ్ణంటూ అవతారాలెత్తటాలు
అన్యాయమైపోటాలు
హతమవ్వటాలు
ఇంకెన్నాళ్ళు
విరిగిన పడవకు మేకు లేదు
కాలే కడుపుకు. గంజి లేదు
ఉపాథే కరువై. ఆశలే. ఉరై
ఏమీ ఎరుగనట్టుుడే
జీవితం
ఇంకెన్నాళ్ళు
అలలపై రాలిన పూవులా
నిశ్శబ్దంగా---
రాలిన పూలకు విలువేంటి
చుట్టేసే.చేతులు. తాచుల్లా
ఇల్లు. చీకటి కొలువులా
ఉపాధి బ్రతుకు చీకటేగా ఇంకెన్నాళ్ళు
మాటలు-
మంత్రోచ్చారణలు నిజమా
నీ పాలిటవి ఖాళీ.పాత్రలు
ఇంకెన్నాళ్ళు
తల దించి చూడు
నీ పాదాలే
నడచి. నడచి. అలసిపోయి
తలెత్తి చూడు నేస్తం!
ఉంది-  వెలుగునిచ్చే నింగి
నీ అలసటని పోగొటటానికి
నీకు త్రోవ చూపటానికి
నీ చేయి చాపు నేస్తం
చూడు
ఎన్ని చేతులు కలుస్తాయో

   
ఆయుత కవితా యజ్ఞుం
స. క. 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య.   93
శీర్షిక.  హ్రస్వమై
18-1-2016
కవిత
వేసవి ఎండను
వీగిపోయే  వారిలా
ఎడద. ఎడదలో
ఆ లోచనాలలోను
ఆలోచనలలోను
ఆను.  క్షణం--
హ్రస్వ దృష్టే
నాగరికతని---
మానవతని
ఎంత. గొప్పగా చెప్పుకున్నా--
నను నీవు ఓర్వలేవు
నా. ప్రశాంత.  వదనంలో
ఆరోగ్యమైన నా. మనసులో
వక్ర రేకల్ని
విషపాతాన్ని
చూడాలనుకుంటావు
నదిలా---
ప్రవహిుచాల్సిన.  మనసు
షడ్రుచుల
ఇసుక తిన్నెల్ని
ప్రదర్శిస్తుంటే ---
హ్రస్వదృష్టి.
ఇంకా. ఇంకా హ్రస్వమై---
కల్ప. వృక్షాల్ని---
కామధేనువుల్ని
రవిచుద్రుల   ప్రభావాల్ని
మెచ్చవు
ఒడ్డున తన్నుకునే
చేప పిల్లని----
గట్లను ఒరుసుకంటూ వెళే
నదిని---
ముడుచుకుపోతున్న
నేలతల్లని---
తరగి పోతున్న.
సన్న. బ్రతుకుల్ని----
చూస్తూ----
వికటాట్టహాసమౌతావు
అరాచకమై. విజృంభిస్తూ--
ఆది మానవుణ్ణి. తలుస్తూ
-------



ఆయుత కవితా యజ్ఞం
స క. 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య.   94
18-1-2016
శీర్షిక.   లోకు తీరే అంత
నిను. తాకి
నీ. తావిని మోసుకొచ్చిన
గాలులేవీ----
ఇప్పుడు----
ఎన్నాళ్ళనుండి.  ---
చూస్తున్నా.   నిన్ను
గాలితో ---
ఆడుతూ-
పాడు తూ
ఎంత స్వేచ్ఛననుభవిస్తావు --నువ్వు
వానలోతడుస్తూ---
ఎండలో.  ఎండుతూ--
నిరాదరణకు  గురౌతూ--
అయినా---
నవ్వుతూనే. ఉంటావు
-------/అమాయకంగా
గడుసు పూల లోతు
తెలియదు
భ్రమరాలాట. తెలియదు
ఎంత సుతారాల.   బేలవు--!
ఎన్ని  రెమ్మలు లేవు----
తోటలో---
అయినా-----
నే.  నిన్నే.  చూస్తుంటా
నీ అలరులెంత
మృదువు---
నీ.   మనసు --
అర్థం కాదు
అవసరము లేదు----లోకానికి
హిమ కణాలు  నిన్నెుతగా
అలరిస్తాయి---/
అలంకరిస్తాయి---
నీతో---
ఎంత. స్నేహిస్తాయి---
ఆపాటి.  జ్ఞానం
మనిషి‌కేదీ----!
అప్పుడప్పుడే
విచ్చుకునే. విరులతో
సిరి. కళ్ల్ళతో
లోకానికఎంత.   వింతగా
గోచరమౌతావు---
అంతా.చూస్తూ.  --
అయోమయం
అమరిక కనబడదు
అవగతమూ. కాదు
నీవు.
నిండుగా
పూల. ముసినవ్వుల
సింగారమై.    సయ్యాటలాడుతూ---
ఆనందాల.  ఊగుతూ --
అందాన్ని హర్షిుచదు లోకం
చిదిమేయాలని--
చూస్తుంది
చిదిమి.  ఆనందిస్తుుది
చిుతల్లోకి. తోసేస్తుంది
చిం తల లోకం
పొంతన చూడదు
చింతల. లోకం దాటితే--
ముందుకు  పోతే---
నిన్ను ఆపగలదా---లోకం
లోకం తీరే అంత







ఆయుత కవితా యజ్ఞం
స. క.  836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత. సంఖ్య.  95
18-1-2016
శీర్షిక.   మనసున్న తీరాలకు
కవిత
నేస్తం!
మన మస్తిష్కాలలో
పరిభ్రమించే
స్థిరాస్థిరాల. తత్వాలు
మనకొద్దు
జాతి విభేదాలు
కులమతాలు
కాలమై-- జాలమై
వేధిస్తాయి
మనం పోదాం  నేస్తం--
చింతల్లేని. లోకాలకు---
మానవత ఉబికే స్థలాలకు---
మంచితనపు. నివాసాలకు---
మమతలు.
మనసున. నింపుకునేందుకు
అనురాగం. పాడుకునేందుకు
నీ పిల్లగాలుల్తో
నా పరిమళాలతో
విరబూసి. తావిని వెదజల్లే
మల్లిని
నీ రెక్కలలో పొదిమి
పట్టుకుని
ఆవలి. లోకాలకు
తీసుకెళ్ళు.  నేస్తం
ఈ మానవులు
ఒక రేయి.
ఆనందానికి. బలిచేస్తారు
నీ నవ్వున విరబూసి
నీకై రాలిపోవాలని---
అందుకే ----
రా.  నేస్తం.  రా--
స్వార్థం  లేని.  దూరాలకు
మనసున్న తీరాలకు


ఆయుత కవితా యజ్ఞం
స.  క.  836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య96
18-12016
శీర్షిక.      తప్ప----
మనిషి మీటే. తంత్రులెన్నో---
ఒక్క హృదయ తంత్రిని
తప్ప
పలికే పలుకులఎన్నో----చేసే
ప్రేమ నిుడిన పలుకు
తప్ప
తీసే.  రాగాలఎన్నో----
తీయని.  అనురాగం
తప్ప
చూసే. లోతులఎన్నో---
ఎద లోతు చూడటం
తప్ప
సంపాదించే సుపదఎంతో
మమమనే భావ సంపద
తప్ప
ఆశించే వివిధ రుచులఎన్నో
ఆకొన్న వాడికి అన్నమివ్వటం.
తప్ప
సంద్రపు నీరులా ఎందరో
మన చుట్టూ
దాహార్తి  తీర్చేనీటి.  చుక్కలా  తప్ప

ఆయుత కవితా యజ్ఞం
స. క.  836
రాజావాసిరెడ్డి. మల్లీశ్వరి
కవిత సంఖ్య.   97
18-1-2016
శీర్సిక.     లోచీకటిలో
కవిత
చీకటి---చీకటి---అంతా చీకటి
చీకటిలో---మనం
మనలో---చీకటి
మన్లలోపల  చీకటి
దారుల్లేని గమ్యాన్ని
వెతుకుతూ---
దొరలు విసిరే వలల్ని
దాటుతూ---
దేనికో. తెలియక
మోరలెత్తి. చూస్తూ
పోతున్నాం చీకటిలో మనం
ఆశలు చావని. బ్రతుకుల్లో
మోజులు తీరని వయసుల్లో
కరడు  గట్టిన  రాతి
గుండెల్లో
దేని కోసమో. వెతుక్కుంటూ
పోతున్నాం మన. లో. చీకటిలో
రాజులు కట్టిన కట్టడాలలో
రాకెట్లు ఎగసే స్థలాలలో
రాళ్ళలో-రవికిరణాలలో
దేని కోసమో  వెతుక్కుంటూ
చీకటిలో పోతున్నాం
సాంప్రదాయాల సరిహద్దుల్లో
ఆచారాల మత్రుపానీయాల్లో
తూలుతొంటూ-
తోసుకొంటూ
పోతున్నాం చీకటిలో
అధరాన వెలిగే నవ్వునో
ఆశలు వెలిగించే దివ్వెనో
ఆవేదన రగిలించే  పగనో
ఆనందం కలిగించే ఎదనో
వెతుక్కుంటూ  పోతున్నాం
చీకటిలో
మన్లలోపల  చీకటిలో
పోతున్నాం


ఆయుత కవితా యజ్ఞుం
స. క.  836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య.  98
19-1-2016
శీర్షిక.  రెప్ప చాటు ఉప్పెన
కవిత
తెలియని-
అందని--
మనసు. పిలుపున
బాధే మౌనమైన. వేళ
రెప్పల మాటున ఉబికే నీరు
 నిదుర. రానివ్వదు---
పోనివ్వదు
అంతులేని--
పంచుకోలేని   విషాదాన
కనులు కల్లోల జలధులే
మౌనాల మనసు
ఓదార్పులేని అనాథ
తోడు-నీడ
ఆట-పాటా. లేని.  బికారి
చీకటి. వెలుగుల. చెలగాటాన--
ముద్దూ. మురిపెంలేని జీవితాన
ముళ్ళ మాటల జడివాన మనసుకు తెలుసు
దాని మనసేమిటో----
మొగలి పూలైనా
మోదుగ పూలైనా
మల్లెల జల్లైనా
మధుమాలతుల ఇల్లైనా
పిలిచే మనసుకు తెలుసు
స్పందనా-ప్రతి స్పందనా
ప్రేరణ--
కంపనా-- అనుకంపనా
బదులున్నా- లేకున్నా
పిలువక. మానను
పిలుపందినా. లేకున్నా
పిలుపునాపను
పిలవటం. మానను
నీ మనసు. తరిగే దాకా--



😝ఆయుత కవితా యజ్ఞం
స. క.  836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య.  99
19-1-2016
శీర్షిక.  పూలకు.  మాత్రమే
కవిత
ప్రపంచ యుద్ధాలు. దేనికో
పగలు.  పట్టుదలలు దేనికో
నే పెంచిన. మొక్క
ఒక్క పూవు పూసిందుటే---
ఎంత.  ఆనందం ----!
పూచిన పూవు వర్ణం-
వాసనా. ఏదైనా---
పువ్వు. పువ్వే.  కదా
పూవును చూచి
ఆనందించే మనసు
పూలనెందుకు.  నిరసిుచటం
మొగ్గలోనే తుంచేయటం
తోటలో పనికిరావంటూ
తరిమేయటం
ఆంక్షలు.   విధించటం
చీకట్లో--

చేస్తున్నామనుకుంటూ
                          నిర్దాక్షిణ్యంగా.పూలను. తొక్కేయటం
ఎన్ని పూలు.
కంపు శరీరాలకు. సెంటులా
ఎన్ని పూలు
మెత్తదనపు సెజ్జలా
ఎన్ని పూలలంకారంగా
చరిత్రలో-----
రాలిన పూ కుప్పలెన్నో
పూలు-----
వాజ్ లో---
కూజాలో--
చెత్త బుట్రలో--
ఎక్కడైనా----
ఇమిడే పూలు
ఎవరినైనా----
మురిపించే పూలు
ఎవరికైనా---
నచ్చే పూలు
పూలకు మాత్రమే. తెలుసు---
ముళ్ళున్నా--
మృదుత్వం కోల్పోకుండటం
గడుసు పూల కడ
      పూల దొంగల. కడ
మిన్నకుుడటం
ప్రపంచానికి  వింత వాసన
నలమటం
కను విందు.చేయటం
ఆనందాన్నందిుచటం
తరాల నెలవవ్వటం



ఆయుత కవితా యజ్ఞం
స.  క.  836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య---100
19-1-2016
శీర్షిక. ఎప్పటికి. నేనెవ
         కాను
కవిత
ఎన్ని బరువుల్ని. మోశాను---
ఎన్ని పాద ముద్రల్ని
చిత్రించుకున్నాను
నింగి-
నేల.  కలిసే చోట
గర్వాన్ని సొంతం చేసుకోవాలని
ఎంత. ---
పయనించాను----
ఎంత. ప్రయత్నించాను----
ఎన్ని.---
అలల దెబ్బల్ని-
ఎన్ని నీటి ఒరవళ్ళని-
ఎన్ని తుఫానుల్ని
అనుభవిుచాను-
ప్రాణ భీతినున్న జలపుష్పాల్ని.  
వాటిని తిన మరిగిన.  శునకాల్ని
మీలను బుధించే వలల్ని
ఎన్నేళ్ళుగా. చూస్తున్నా---
ఒంటరి.  ఆకసాన్ని
 చూస్తూ---
నేనే నీకు. తోడు. సుమా
నీ ఉరుముల్ని.  మెరుపుల్ని
సహించే.ది. నేనే సుమా
అంటూ
ఎన్నేళ్ళుగాచెప్తున్నా---
ఎగసిపడే
సంద్రమెంత. భయపెట్టినా
కడలి కెరటాలెుత
ఉయ్యాల లూపినా
నురుగు నవ్వులెంతగా
కవ్వించినా
వెన్నెల నన్నెంతగా
అందగించినా
తామరాకులా
నిర్లిప్తమౌతూనే. ఉన్నా
విషధి.
విజృంభించి. ముంచేస్తే
ప్రారబ్దమనుకుని.
సరిపెట్టుకోలేకున్నా
ఎన్ని శిశు సుమాలు
నా ఒడిలో. ఆనందిస్తాయి
హాయిననుభవిస్తాయి రెక్కల్లో పొదిమి పట్టుకుని
ఎంత మందిని
నిర్భీతిగా
నిజాయితీగా
నిర్మొహమాటంగా
నిస్సందేహంగా
గమ్యం.  చేరుస్తా
మీ నమ్మకాన్నెంతగా
పొందుతాను
అయినా---
నేనెవరికి. కాను
ఎప్పటికి---
ఎవరూ
నన్నుతన దాన్ననరు









ఆయుత కవితా యజ్ఞం
 స.  క836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య.   101
20-1-2016
శీర్షిక. కలవరింతే
కవిత
వాన చినుకునై
హిమ కణమునై
తృణమునై
నీకై.   మొలకెత్తాలనుకున్నా--
పండుగాపూల చేనై
విరిసిన పూవై
నీకై పూయాలనుకున్నా--
ప్రతిన వెన్నెలై
పరవశించే పరిమళమై
నీకై పాటనవ్వాలనుకున్నా--
ముందుగా తెలిసుంటే---
కాలానికింత. అసూయ అని---
శీతల నిశీథై
నిను మాయ చేస్తుందని--
గోరింటలా
నీ ఇంట పండుతాననుకున్నా--
గొబ్బినై
నీ ముంగిట
అందగిస్తానని
అందమిస్తాననుకున్నా--
ఏం తెలుసు
కాలం అదృశ్య  హస్తమై
నిను లాక్కెళుతుందని---
ప్రమిదనై
నీ ఇంట  వెలగాలని
తొలి సందె వెలుగై
కొలువుంటానని.      చంద్రకాంతమై
నీ గడపను నిలవాలని
ఎంత.  సంబరపడ్డా-----!
నీ విచ్చిన మల్లెల్ని
మాలకట్టి
సింగారమౌదామనుకున్నా---
ఏం తెలుసు
కాలం నను శిశిరం
చేస్తుందని-----
తరతరాల. ఆరాటం
ప్రేమై.
నీకై. చేతులు చాస్తే---
కాలం
నిన్నొక.  లిప్తను చేస్తుందని--
అనంతానంత
ఏకాంత పరిష్వంగణ వినా
పరిపక్వత.  ఏదీ----?
పరిపూర్ణత. ఏదీ-----?
కాలానికెంత.  కసి----!
నిను కలవనివ్వదు
నను కలుసుకోనివ్వదు
మీలో కలసిపోనివ్వదు
కలవరింతే----నీకై
కలలాగైనా.  వరించేదెపుడు----?
నీవు.
ఏనాటికీ ------కనుమరుగే------!
ఏమని.  అందు---
మీ.   అభినందనల
        అభి వందనం
         విందు
అహో------
         వీనుల.  విందు
       మనసుకు. పసందు
ఆహా----మనస్వి.
        కళాచందు
నాయుడుగారిచ్చె--
నందనవనాల.  ముందు
ఈశ్వరులు. మెచ్చె--
నను.  మున్ముందు
అందించే --
గాన కళా  చిందు
సుకృతం --
మీ.  అభిమానాల.  పొందు
మీ. ఆశీస్సులందు--
నా జన్మ. ధన్యమైనదందు
తనియంగా   నేనందు
మానస మానుదాశ్రువులనొందు
నే.  చేసెద మీ ఎల్లర. ముందు
మనసా- వాచా.  అభివాదం
కవితా రస పాన మత్త చిత్తుల. ముందు
కవితా ప్రభల్వెలిగించు
వారల. ముందు
కవితా సేవకుల. ముందు
అర్పించెద నా ప్రణిపాతం

రాజావాసిరెడ్డి. మల్లీశ్వరి
తేది-----20-1-2016

ఆయుత కవితా యజ్ఞం
స. క. 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి.
కవిత సంఖ్య 101
శీర్షిక.    ఎవరు
కవిత
నీకిష్టం లేనిది
నీవు.  చేస్తావా---??
ఇది. మావాడి. ప్రశ్న
నిజమే---
లోకమే.  అంత
తన ఇష్టాన్ని
ఇతరులపై.  రుద్దాలని
చూస్తుంది
నిజమే---
లోకమే. అంత
ఎవరికిష్టమైంది.
వారు. చేస్తారు
కరుణశ్రీ.   చెప్పలేదా
పూలకోరికేంటో
శివారెడ్డి.  చెప్పలేదా
అతడేమిటో
అమ్మ చెప్పలేదా
పేగు బుధమేంటో---
          ప్రేమేంటో
నిజమే---
ఎవరికిష్టమైంది
వారు చేస్తారు
చెట్లను
మొదలంట నరకటం

పక్షి గూళ్ళను
కూల్చేయటం
పారే నదుల్ని
ఆపేయటం
అధికారాల-
విప్లవాల-
తూటాల-
పచ్చని మైదానాల్ని
బీళ్ళు చేయటం
నిజమే--
ఎవరికిష్టమైంది
వాళ్ళు చేస్తారు
మరి--
మొండి    చేతన్
మొలిపించేదెవరు ?
శిశిరంలో
పూలు  పూయించేదెవరు?
పక్షిగూళ్ళు కట్టేదెవరు?
శ్రావ్య సుగీతాన్ని
వినిపిుచేదెవరు?
బీళ్ళను
దున్నేదెసరు?
అమృతాని
అుదించేదెవరు?


ఆయుత కవితా యజ్ఞం
స క 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య 102
21-1-2016
శీర్షిక.    పుస్తకం
కవిత
అంటారు-
దైంతో సమానమని---పుస్తకం
కొన్నేళ్ళదే పుస్తక. జననం
అయినా---
దాని.   ఐక్యు.   అనంతం
చిన్నా- పెద్ధా
ఆడా-  మగా
అందరికి.   ఆప్తమైంది
పుస్తకం
మనసుకు
ఊసుల ఊయలేయటు
కథలతో.  ఊరించటం
కవితతో.  మనసును
మరిపిుచటం.  
విజ్ఞానం--విడ్రూరం
ప్రేమ---భక్తి---
నీతి-వైరాగ్యం
అుదించటం
వేస్తమై. నిలవటం
పుస్తకం.  ఆంతర్యం
కాలాల నడిమి---
అుతరంగాల్ని
అనుభవాల్ని
అవసరాల్ని
అభివ్యక్తిని
సేతుకమై. వినూత్నంగా
తెలిపే ది--పుస్తకం
నేను లేందే---
మీకు పొద్దు పోదంటూ
నిద్దుర.  రాదంటూ
రెపరెపలాడే
పేజీలనే.  కళ్ళతో
రంగుల. అట్టల.  చీరలతో
పేరనే.  బొట్టుతో
సింగారమై
ప్రతి చోటా
అందుగా. నిలిచే ది
మనలను పిలిచే ది
కొనండుటూ. కవ్విిచేది
పుస్తకం
మనసుపడే-----
ఆరడికి
ఆలోచనలకి
అద్దమౌతూ.  
మంచి.      చెడుల.  ప్రభావాన్ని
మనపై.చూపుతూ. ---తరతరాల.  వారసత్వంగా
జీవనదిగా.  నిలిచే.దే.  పుస్తకం
నిజానికి--
హస్తభూషణమే. కాదు-
మన జీవితాలకో
మార్గదర్శి.   పుస్తకం
హిత ప్రదాయిని
పుస్తకం






ఆయుత కవితా యజ్ఞుం
స.    క.  836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
22-1-2016
కవిత సంఖ్య.  103
శీర్షిక.   మౌనం
కవిత
మౌనం--
మౌనంగా
మరి అందుగా
మరి మరి కావాలనిపిుచేలా
మౌనం--
ప్రశాుతతకి.  చిహ్నం
గంభీరతకు.   సంకేతం
ఘర్షణలకు. దూరం
శక్తికి    నిలయం
ఇష్టాయిష్టాలు
పోరాటాలు
మనోగతాలు
ఎన్ని---ఎన్ని---ఎన్ని
మౌనం
తెలుపదు---
మౌనం
మనోబల సిద్ధి దాయిని
మౌన ముద్రతో
మునుపు
మునులెన్ని ఘనకార్యాలు
సాధించలేదు.
మౌన రాగాల
మౌన పోరాటాల
స్వతంత్ర జెండా
గాంధీ.   ఎగరేయలేదు--
నెల్సన్. మండేలా
జాతికి స్వేచ్ఛ తేలేదు--
మౌనంగా. ఉండే సనుద్రం
ప్రళయాన్ని సృష్టించదు--
ఆశ్చర్యాన్నందంచదు-
ఆనుదాన్ని. కలిగించదు--
మౌనంగా  ఉండే. ఆకాశం
ఎన్ని ఉరుములు  ఉపనదు-
ఎంత ఆహ్లాదాన్నందించదు
ఎంచ. వింతగా. తోచదు-
ఎంత వడ్డూరమనిపిుచదు-
మౌనాల సాగే గాలి
జోలపాడదూ
హాయినివ్వదూ
మౌనం. తెలుపలేనివేవీ లేవ్
ఏదీ లేదు
మౌనం. బంగారం
సైలెన్స్ ఈజ్. హోల్డ్
ఆయుత కవితా యజ్ఞం
  స. క. 836
రాజావాసిరెడ్డి మల్లీశ్వరి
కవిత సంఖ్య.  104
23-1-2016
శీర్షిక.  శరణమయ్యాను
కవిత
ఎదురుగా. సాగే. ప్రవాహం
ఎన్ని. ఒడిదుడుకులున్నా---
దానికో గమ్యముంది
మరి
ఈ అనంత జనవాహినికి----
ఎన్ని. గమ్యాలు---
         వైషమ్యాల
ఎన్ని.  యుద్ధాలు
         వైరుధ్యాలు
ఎదగ లేని.  ఆరాటంలో
ఉన్మాదమై----
కన్నీటి చుక్క తళతళల్లో
ఒంటరి గుండె.
ఊసుల్ని. విప్పాలని---
ఆకలి. బొజ్రనిమిరి
బువ్వపెట్రే అమ్మకోసం-------
అట్టలు కట్టిన జుట్టును
మునివేళ్ళతో. దువ్వే
అమ్మకోసం-----
నిబిడాంధకార
నిశిలో
నీకు నేనున్నాననే
అమ్మకోసం-----
ముల్లు గుచ్చి న.పాదాన్ని
ఒడిలో పెట్టుకుని
ముల్లుతీసే   అమ్మకోసం---
పసిగి. పాపం --
అనదు లోకం
ఆడది. అని. ఆశగా చూస్తుంది
అనాథ. మనసు అగ్నిగుుడమై---
విప్లవమై---
ఆరని కార్చిచ్చైతే--
ఆదరణ చూపదు లోకం
తన గమ్యం. తనకే
తెలియని       ----లోకం
  ఆలోచించాను
ఆవేశమ య్యాను
అవగాహనయ్యాను
అనంత విశ్వాన. జీవమిచ్ఛే
సూరీడొక్కడే
చందన. జ్యోత్స్నలనిచ్చే
చంద్రుడొక్కడే
అమావాస్య నిశిని
నేనొక్కతినే ---
గమ్యం లేని లోకానికి
గమ్యం చూపటానికి
బుద్ధతత్వమయ్యాను--
శరణమయ్యాను  




No comments:

Post a Comment